రవి: దాదాపుగా అందరూ వచ్చేశారు కాబట్టి రెండవ విడత సభ ఆరంభం చేద్దాం.
రవి: శ్రీకారంతో సభకు పునఃస్వాగతం -చింతా వారి మరొకపద్యం.
ఉ ||
ఙ్నాధు నుమాపతిన్ గొలిచి, నన్నయ , తిక్కన, యెఱ్ఱనాదులన్
సాధు సుపూజ్య సత్ కవుల, సద్గుణ గణ్యులనెల్ల కొల్చి, స
ద్బోధను గొల్పి యీ సభను పూర్ణ మనంబునఁ బ్రోవఁ గోరెదన్.
గన్నవరపు నరసింహమూర్తి: మనోహరముగా ఉంది
వసంత్ కిషోర్: చక్కగా వుంది !
కామేశ్వరరావు: చాలా బాగుంది. మధ్యలో వినాయకుడు వచ్చినా, పురుషోత్తమ, అంబుజభవ, శ్రీకంధరుల వరస మారలేదు!
రవి: వాఙ్నాధు నుమాపతిన్ – ఎంత అవలీలగా ప్రాస కూర్చారని ఆశ్చర్యంగా ఉంది
కామేశ్వరరావు: అదే వరసలో నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱనలు కూడా వచ్చారు
విశ్వామిత్ర: వాగ్దేవి లీల
గన్నవరపు నరసింహమూర్తి: వాజ్ఞాధు బాగుంది, సద్బోధ యింకా బాగుంది
గిరి: సభారంభము చేస్తే ఇలాంటి ప్రార్థనాపద్యంతోనే చేయాలి
గిరి: కామేశ్వరరావుగారు, మీ వ్యాఖ్యానం బావుంది
వసంత్ కిషోర్: మిస్సన్నమహాశయులకు స్వాగతం
కామేశ్వరరావు: మిస్సన్నగారు కూడా వచ్చేసారు. స్వాగతం
మిస్సన్న: కవి మిత్రులందరికీ నమస్కారాలు.
గన్నవరపు నరసింహమూర్తి: మిస్సన్నగారూ నమస్కారములు సుసంధ్యా సమయం
రవి: ఇక సమస్యల కెళ్దామంటారా? ఈ సారి రాఘవ గారిని వదిలేది లేదు.
కామేశ్వరరావు: అలాగే మొదలుపెడదాం.
రవి: అశ్వధాటి వృత్తంలో “హత్యా ప్రయత్నమున స్తుత్యుం డయెన్ దురితు డత్యుత్తముం డనఁబడెన్” సమస్యకు రాఘవ గారి పూరణను విందాం.
రవి: రాఘవార్యా! ఒకటవసారి..
కామేశ్వరరావు: రాఘవమౌనవ్రతానికి కారణమేమి?
గన్నవరపు నరసింహమూర్తి: అశ్వధాటిలో ప్రాస యతి కావడము వలన చాలా ప్రాసలు కావాలి
కామేశ్వరరావు: అవును. అది మామూలు అక్షరమైతే ఫరవాలేదు. ఇలాంటి సంయుక్తాక్షరాలైతే కష్టమే!
కామేశ్వరరావు: మూడు నాలుగులు పన్నెండు ప్రాసలు!
గిరి: గన్నవరపు గారు, ప్రాసనియమము లేకపోవడం వల్ల అన్ని పాదాల్లో అదే అక్షరము ఉండవలసిన అవసరము లేదు
వసంత్ కిషోర్: నేను వినిపించేదా
కామేశ్వరరావు: తప్పకుండా కిశోర్జీ
వసంత్ కిషోర్: “ఆత్మ హత్య మహా పాపం ” అని గదా నార్యోక్తి ! సత్యాగ్రహ మంటే ఆత్మ హత్యా ప్రయత్నమే గద !
వసంత్ కిషోర్: మరి అటువంటి పాపం చేసిన వారిని ” దురితుడ “న వచ్చును గద ! అనగూడ దనిన నన్ను క్షమింతురు గాక !కాబట్టి , ఆ దురితము చేసిన “మహాత్మా గాంధీ “గారి నుద్దేశించి ఈ ప్రయోగం !చందంలో సరిగ్గాబంధించానో లేదో నని నా భావా న్నిక్కడ పొందు పరుస్తున్నా !
గన్నవరపు నరసింహమూర్తి: ఓహో అలాగా అయితే వచ్చే సారి ప్రయత్నిస్తా
వసంత్ కిషోర్: భావము :సత్యమును నిత్యమూ నిష్టముగా నాచరించి సఫలీకృతు డాయెను !నిత్యాగ్నిహోత్ర సమానమైన సత్యాగ్రహమనే ఆయుధమును ప్రపంచమున కందించెను !సత్యాగ్రహం చేసే సమయాల్లో, మృత్యువుకు చేరువైనా ,జన హితమును విడువకుండా వారికి సేవలు చేసెను !అనగా స్వాతంత్ర్యం సంపాదించి పెట్టెను !
వసంత్ కిషోర్:
అశ్వధాటి వృత్తము:
సత్యాగ్రహంబనెడు నిత్యాగ్నిహోత్రమును నత్యంత ప్రీతి నిడెనే !
మృత్యోన్ముఖుండయిన పథ్యంబునే విడక భృత్యుండుగా మనెనులే !
హత్యాప్రయత్నమున స్తుత్యుండయెన్, దురితుడత్యుత్తముండనబడెన్ !
వసంత్ కిషోర్: పథ్యము = (జన )హితము; హత్య = ఆత్మ హత్య
రవి: కిషోర్జీ, మంచి ప్రయత్నం
మిస్సన్న: వసన్త మహోదయా అభినన్దనలు
గిరి: కిశోర్ గారు, మంచి ప్రయత్నమండీ
గన్నవరపు నరసింహమూర్తి: కిశోర్ జీ బాగుంది, యీ మధ్య చేస్తున్న సత్యాగ్రహాల మాటేమిటి ?
వసంత్ కిషోర్: మిత్రులకు ధన్యవాదములు !
శ్రీపతి: రాఘవగారు ఒక్క పది నిముషాల్లో ఉంటానని అన్నారు.. ఆల్సయానికి మన్నించాలన్నారు. ఒకట్రెండు ఆశువులు చెప్పమని అడిగి మన్నించేయమని అధ్యక్షులవారికి సిఫార్సులు.
కామేశ్వరరావు: గిరిగారు, దీనికి ప్రాస నియమం ఉందికదా?
గిరి: కామేశ్వరరావుగారు, లేదని చదివినట్లు గుర్తు
రవి: ప్రాసయతి నియతమని చింతావారు అన్నట్టు గుర్తండి
గిరి: అలా భావించే నేను పూరణ ప్రయత్నించాను
రవి: సారీ, ప్రాసనియమమన్నారా?
కామేశ్వరరావు: ఒహో. చూడాలైతే.
వసంత్ కిషోర్: ఔను ప్రాసయతే !అది పన్నెండు చోట్ల ఉంటేనే అందం
రవి: చింతావారి బ్లాగులోనూ, రాఘవగారి పూరణలోనూ ప్రాస కుదిర్చారు
శ్రీపతి: ప్రాసయతి నియమమని చింతావారు చెప్పారు, కాకపోతే ప్రాసలేదన్నది తెలియదు…
గిరి: అది నిజమే, ప్రాసకుదిరితే అంద మినుమడిస్తుంది
కామేశ్వరరావు: గిరిగారి పూరణ విందామా?
రవి: గిరిగారి పూరణ విందాం
గిరి: తెలుగు వృత్తాలలో ప్రాసనియమము తప్పని సరిగా ఉంటుంది కనుక నా అనుకోలు సరైనది కాకపోవచ్చును
రవి: ప్రాసనియమం ఉందనుకుంటానండి. చింతావారు ఏ పద్యంలోనూ ప్రాసనియమం తప్పలేదు.
రవి: సంస్కృతంలో ఎలానూ లేదు. తెలుగులో అశ్వధాటి ప్రయోగాలు ఏ కవులు చేశారో తెలియదు.
గిరి: అట్టైతే నా పూరణ నియమబధ్ధము కాదు
వసంత్ కిషోర్: దీనికి లేదనే చెప్పారు కాని ఉంటేనే అందం
గన్నవరపు నరసింహమూర్తి: లక్షణాలు ఏమిటి ?
రవి: ఆంధ్రామృతంలో రాఘవ గారుశ, స లకు ప్రాస కూరిస్తే దానిగురించి గురువుగారు గొప్ప చర్చే చేశారు
వసంత్ కిషోర్: నియమం లేదు గనుక చెప్పొచ్చు
మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్
రవి: సరే గిరిగారిని విడవకుండా తనతో మరో పూరణ చెప్పిద్దాం. మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్. – గిరి గారూ కానివ్వండి
గిరి: అలాగే
గిరి: నవోఢ వర్ణన
కం ||
గ్లా సందిన క్రొత్త పెండ్లి కన్నె పెదవిపై
భాసిల్లు పాల నురుగుల
మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్
వసంత్ కిషోర్: అద్భుతం ! కరతాళ ధ్వనులు !
రవి: మీరేమన్నన్ – ఏమంటామండి? అద్భుతమంటాం.
చదువరి: పాల మీసాలు – బావుంది.
మిస్సన్న: పూరణ చాలాబాగుందండీ
గన్నవరపు నరసింహమూర్తి: చాలా బాగుంది అంటాము
వసంత్ కిషోర్: పాలనురుగుల మీసాలు వ్వావ్ !
కామేశ్వరరావు: పాలనురుగుల మీసాలు, అదీ శోభనం పెళ్ళికూతురివి! అబ్బో ఆ సొగసు వర్ణించడం ఎవరి తరం!గిరిగారికి తప్ప!
మిస్సన్న: శృంగార రసాత్మకంగా ఉంది.
రవి: మొన్నామధ్య విలేజ్ లో వినాయకుడు అనే సినిమాలో ఓ దృశ్యం గుర్తొచ్చింది
కామేశ్వరరావు: రవీ! మీరు మరీ అంత అన్-రొమాంటిక్ అనుకోలేదు! 🙂
రవి: కామేష్ గారూ, ఇంకా నేననుకున్న సీన్ చెప్పందే? 🙂
గిరి: రవిగారు, చెప్పండి మరి
విశ్వామిత్ర: నరసింహ మూర్తి గారూ ఇది పాల గ్లాసే
గన్నవరపు నరసింహమూర్తి: ఏముందో లోపల ఎవరికి తెలుసు ?
రవి: ఆ సినిమాలో హీరోవిను గ్లాసులో పాలుత్రాగితే ఆ పాలతో మీసాలొస్తాయి.అది చూసి హీరో గారు తన నాలుకతో పెదవులు తుడుచుకుంటారు. (హీరోవినును కూడా అలానే తుడిచేసుకొమ్మని సూచిస్తూ)ఆమె,హీరో గారు మరో ఉద్దేశ్యంతో అలా అంటున్నారని భావించి సిగ్గులమొగ్గవుతుంది.
కామేశ్వరరావు: అదా, ఆ తర్వాత సీననుకున్నా 🙂
గిరి: అవునా, నేను చూడలేదండీ
విశ్వామిత్ర: 🙂 గిరిగారే చెప్పాలి ఏ ముందో లోపల
గన్నవరపు నరసింహమూర్తి: అమ్మాయి పాలు తాగుతే మనకి మత్తొచ్చిందే
కామేశ్వరరావు: మూర్తిగారు, అదే కదా గమ్మత్తు!
రాఘవ: సభ్యులారా ఆలస్యానికి మన్నించాలి
మిస్సన్న: మూర్తిగారూ మందు మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్…………….
రాఘవ: అశ్వధాటి గుఱించి… ప్రాసయతి కచ్చితంగా ఉండి తీరాలి. ప్రాసయతి ఉందంటే ప్రత్యేకంగా ప్రాస ఉండాలి అని చెప్పనక్కఱలేదు.
రవి: ఒక్కో పాదంలో ఒక్కొక్క ప్రాసయతి ఉండారాదాండి?
శ్రీపతి: ప్రాస యతి ఏ పాదానికి ఆపాదం చెల్లించవచ్చా? అంటే సీసం లో పాదం పాదానికీ అనుప్రాస వేరే చెల్లిస్తూంటారు కదా అలా చేయవచ్చా?
కామేశ్వరరావు: ఇంకా గిరిగారి పూరణ మత్తు నాకు దిగలేదు. ఈ యతిల గోల నాకు పట్టడం లేదు. 🙂
వసంత్ కిషోర్: ప్రాసయతి ఉన్నచోటల్లా ప్రాస అఖ్ఖరలేదు గదా
రాఘవ: ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క ప్రాసయతి అంటున్నారంటే, ప్రాస ఉండటం అత్యవసరమా అని అడుగుతున్నారు. అంతేనా?
రవి: అవును
గిరి: ప్రాసయతి, ప్రాస వేఱ్వేఱు
రాఘవ: ఆఁ … కవికులగురువైన కాళిదాసు కూడా పద్యం పద్యం మొత్తానికి ప్రాసయతి చెల్లించారు, అది కూడా ప్రాస యతులు తెలుగులో మనం పట్టించుకున్నట్టుగా పట్టించుకోని సంస్కృతంలో.
గిరి: కాకపోతే, అశ్వధాటిని తెలుగు వృత్తముగా పరిగణిస్తే ప్రాసనియమము ఉండవలసినదే
రాఘవ: దానిని బట్టి తేలేదేమిటంటే,కాళిదాసంతటివాడే సంస్కృతంలోనే పద్యం మొత్తానికీ ఒకే ప్రాసయతి వాడగా లేనిది, తెలుగులో మనం వాడకుండా ఉండగలమా? 🙂
గిరి: రాఘవగారు, నేను ఒప్పుకుంటున్నాను – అందుకే నా పూరణని వెనుదీసుకున్నాను
రవి: హ్మ్. అవును మీరన్నది ఔచిత్యంగానే ఉంది. అబ్జెక్షన్స్ అనీ కేన్సిల్డ్.
రాఘవ: సంస్కృతంలో కూడా అశ్వధాటిని ప్రత్యేక వృత్తంగా చెప్పినట్టున్నారు, ఒకసారి చూడాలి.
రాఘవ: గిరిగారూ, మీ పూరణ వెనుకకు తీసుకోకండి.
రాఘవ: నడక తెలిసి, తరువాత తరువాత నలుగురు వ్రాయటానికి పనికివస్తుంది.
కామేశ్వరరావు: రాఘవా, పైన గిరిగారి పద్యం ఒక్కసారి చదవండి. యతులు గితులు పక్కనపెట్టి వెంటనే ఒక చక్కనిచుక్కకు తాళిగట్టేస్తారు! 🙂
రాఘవ: ఆ పాలనురుగుల పద్యమేనా? 😀
గన్నవరపు నరసింహమూర్తి: గిరిగారూ చెప్పండి నష్టము లేదు. మళ్ళీ సవరిద్దురు గాని
రవి: రాఘవగారు కూడా ఏమంటారో వినాలని ఉంది.
రవి: మీసాలే స్త్రీకి సొబగు మీరేమన్నన్. – మీరేమంటారు రాఘవా?
విశ్వామిత్ర: వారు ఆ ప్రయత్నం లోనే సభకు ఆలస్యంగా వచ్చారని భోగట్టా
గిరి: చూస్తే అశ్వధాటిని లయగ్రాహి, లయవిభాతుల ప్రక్కన పెట్టవచ్చు – కవులని ప్రాసాక్షర వేటలో పంపే పద్యాల కోవలో
రాఘవ: గిరిగారూ, నిజం. దాదాపుగా అంతే.
కామేశ్వరరావు: విశ్వామిత్రులవారు దివ్యదృష్టితో చెపుతున్నారా? 🙂
రవి: గిరిగారూ, కాలాతీతమవుతున్నది
గిరి: అయ్యో రవిగారు, ముందుకు సాగండి
విశ్వామిత్ర: సవ్యదృష్టితో 🙂
రాఘవ: రవిగారూ, నాకు గిరి గారిలాగానో కామేశ్వరరావు గారిలాగానో అనుభవం లేదు కాబట్టి, ప్రస్తుతానికి నేను ఇలా పూరించాను ఈ మీసాల పద్యాన్ని…
రాఘవ:
కం ||
బ్రాసయతులు పద్యమునకు,బాలున కాటల్,
హాసము మొగమున,మగనికి
మీసాలే,స్త్రీకి సొబగు,మీరేమన్నన్
రాఘవ: తనరుట వీటికి అన్నిఁటికీ అన్వయించుకోవాలి.
విశ్వామిత్ర: చూశారా వారప్పుడే బాలునకాటల్ అంటున్నారు
గిరి: పాదాల్ని విరిచి మరీ అప్పగించారు
గన్నవరపు నరసింహమూర్తి: చాలా బాగుంది
కామేశ్వరరావు: రాఘవమంచి బాలుడు. ప్రాసయతులతో మాత్రమే ఆడుకుంటాడు 🙂
వసంత్ కిషోర్: చప్పట్లు !
గిరి: కామేశ్వరరావుగారు, నిజమే
రాఘవ: బాలునకాటలు అనటంలో అభ్యంతరమేమిటి విశ్వమిత్రులవారూ?
శ్రీపతి: ప్రస్తుతానికి మాత్రమే .. 😉
మిస్సన్న: సందర్భోచితమైన అందమైన పూరణ
గన్నవరపు నరసింహమూర్తి: విశ్వామిత్రుల వారు సవ్యదృష్టితో చెప్పారు
రవి: కామేష్ గారు, మగనికి మీసాలని కూడా రాఘవ అన్నారు
రవి: చివరగా స్త్రీకి సొబగు తనరు అని కూడా అన్నారు.
గన్నవరపు నరసింహమూర్తి: రాఘవగారు బాలునితో ఆడుకొంటారని వారి భావము
శ్రీపతి: అందుకే అన్నా… రాఘవ మంచి బాలుడు. ప్రాసయతులతో మాత్రమే ఆడుకుంటాడు, ప్రస్తుతానికి .. 😉
కామేశ్వరరావు: అదంతా అనుభవం లేని శ్రుతపాండిత్యమే అని తెలియడంలా 🙂
మురళీమోహన్: గిరిగారు ఇంకా తొలిరేయిలోనే ఉంటే రాఘవగారు సంసారం దాకా వెళ్ళారు.
విశ్వామిత్ర: వారేమో నన్ను బాలు(డి)ని చేసి ఆడుకుంటున్నారు 🙂
రవి: మురళి గారు :))
గిరి: మురళిమోహన్ గారు, నిజజీవితంలో అది తారుమారు
రాఘవ: మీరు “బాలుడు > మీసాలు > స్త్రీసొబగు” క్రమంలో అపార్థం చేసికొంటే నేనేం చేయలేను. అది అనుకోకుండా వచ్చింది.
రవి: అనుకోకుండా వచ్చింది కాబట్టి మరింత అనుమానాస్పదం
రవి: సరేనండి రాఘవ గారికి ఈ శిక్ష చాలించి ముచ్చటగా మూడవ పూరణకెళదాం
శ్రీపతి: అవును మరి బ్రహ్మచారి గారు మట్టలారేసుకోబోయి మనసు పారేసుకున్నారు అందుకే అందరూ ఆడెసుకుంటున్నారు..
రవి: మూడును మూడు మూడు మఱి మూడును మూడును మూడు మూడుగన్ – ఈ సమస్యకు అత్యధికమైన, విలక్షణమైన పూరణలు వచ్చాయి.
రవి: సదస్యులారా? పదండి ముందుకు, పదండి తోసుకు.సనత్ గారూ మీ సైన్సు పాఠం చెప్పండి ఆ పూరణకు
రాఘవ: అమ్మాయేమిటండీ? ఆవిడెవరు? ప్రస్తుతానికి ఏ విశేషమూ లేదు. విశేషమేమైనా ఉంటే మీ అందరికీ తప్పకుండా చెప్పిన తరువాతే ముందడుగు వేస్తాను. 🙂
శ్రీపతి:
ఉ||
వేడుక మీర” యంచు గురువే లిఖియింపదొడంగెను ! “శాస్త్ర భీతినిన్
వీడుడటంచు” ! నీ అణువు విఛ్ఛితి నొందెడి రీతి ! బోర్డుపై
మూఁడును మూఁడు మూఁడు మఱి మూఁడును మూఁడును మూఁడు మూఁడుగన్
రవి: అణువిచ్ఛిత్తి (న్యూక్లియర్ ఫిషన్) అన్నమాట!
వసంత్ కిషోర్: చక్కగా వుంది !
శ్రీపతి: న్యూక్లియర్ ఫిషన్ లో అణువు ఒకటి మూడుగా ఆ మూడు తొమ్మిదిగా ఆ తొమ్మిది ఇరవైయ్యేడుగా ఇల్లా …విఛ్ఛిన్నం అవుతూంటుంది అని సోదాహరణంగా అధ్యాపకుడు పిల్లలకు బోర్డుపై గీసి చూపుతున్నాడు.
రవి: ఇలా పాఠం చెప్పి ఉంటే నూటికి మున్నూరు మార్కులు వచ్చి ఉండేవేమో!
శ్రీపతి: 🙂
గిరి: బావుంది
గన్నవరపు నరసింహమూర్తి: సనత్ గారూ బాగుంది
రాఘవ: సనత్ గారూ, నిజం చెప్పండి. మీరు ఈ పూరణ జపాన్ ఉదంతానికి ముందు వ్రాసారా తరువాత వ్రాసారా?
శ్రీపతి: ముందే రాశానండీ…
రవి: సనత్ శ్రీపతి గారు త్రికాలజ్ఞులు
శ్రీపతి: అయినా భగవంతుడి దయవల్ల జపాన్ లో ఈ మూఁడును మూఁడు జేరలేదుగద…
మిస్సన్న: శ్రీపతిగారూ అభినందనలు
రాఘవ: ఐతే, పూరణ బాగున్నందుకు మూడూ ముందే వ్రాసినందుకు మఱో మూడూ కలిపి నవనవోన్మేషంగా సాగిందని నా అభిప్రాయం వెలిబుచ్చుతున్నాను. అభినందనలు.
కామేశ్వరరావు: బాగుందండి. ఇది అసలు సిసలైన చిత్రకవిత్వం. చిత్రం లేకుండా అర్థమవ్వదు 🙂
రాఘవ: కామేశ్వరరావుగారూ, మఱేఁ! నిజమేనండోయ్.
రవి: కవిత్వచిత్రం కూడానండి
రాఘవ: ముఖ్యంగా అణుశాస్త్రం చదువుకోనివారికి చిత్రం లేకుండా అర్థమవ్వటం కష్టం.
రవి: వసంత్ కిషోర్ గారూ ఇక మీ వంతు
శ్రీపతి: త్రికాలజ్ఞులమా??? అవును ఆమాట నిజమే సాప్ట్వేర్ ప్రాజెక్టుమేనజరులైతే త్రికాలాల్లోనూ సంధ్యవార్చకపోయినా పని మాత్రం మూడు షిఫ్టుల్లో చేస్తూనే ఉంటాం…
వసంత్ కిషోర్: అలాగే ! అవధరించండి !
ఉ ||
మూడును, మూడు మూడులను – మొత్తము కింకొక మూడు గల్పగన్
ఏడును దాని పక్క నొక – ఏనును; ఏకము డెబ్బ దైదగున్ !
మూడును మూడు మూడు మఱి – మూడును మూడును మూడు మూడుగన్!
రాఘవ: భలే.
గన్నవరపు నరసింహమూర్తి: కిశో ర్ జీ చాలా బాగుంది మీ లెక్కల పాఠం
రవి: కిషోర్ గారు, మీ పద్య పాఠాన్ని సమీకరణ రూపంలో తెల్పండి! (ఐదు మార్కులు).
మిస్సన్న: కిశోర్ మహోదయా చాలా అద్భుతమైన పూరణ
రాఘవ: మీ ఆలోచన చాలా బాగుందండీ. దీనిని మీకు లెక్కలు చెప్పిన ఒజ్జగారికి కూడా చూపించండి. చాలా చాలా సంతోషిస్తారు.
వసంత్ కిషోర్: 33+3+33+3=75
రవి: ఇది సమీకరణకవిత్వం అని విన్నవించుకుంటున్నాను(చంద్రబాబు స్వరంలో)
వసంత్ కిషోర్: మిత్రులకు ధన్యవాదములు !
రాఘవ: సమీకరణకవిత్వమా… అలా చెప్పండి. ఎక్కణ్ణించి వీస్తోందా ఈ గాలి అని చూస్తున్నా! 🙂
మిస్సన్న: గణిత కవిత్వమ్ కూడా
కామేశ్వరరావు: అది చిత్రకవిత్వమైతే ఇది విచిత్రకవిత్వం 🙂 చాలా బాగుంది.
శ్రీపతి: అబ్జెక్షన్ అధ్యక్షా 75 రాలేదు… 😉 సమీకరణంలో తప్పున్నదోచ్
రాఘవ: సమీరుడి ధాటికి మఱొక అంకె ఎగిరిపోయిందండీ.
శ్రీపతి: ఒకమూడెక్కడో జారిపోయింది..
కామేశ్వరరావు: సమీకరణం చివరిలో ఒక మూడు మిస్సయ్యిందండి. పద్యపు లెక్క మాత్రం పర్ఫెక్టు!
శ్రీపతి: అవును మరి అన్ని మూళ్ళుంటే లెక్కసరిపోయేనా.. 😉
వసంత్ కిషోర్: 3+33+3+33+3=75
కామేశ్వరరావు: ఇలా సమస్యాపూరణలతో ఫిసిక్సు, లెక్కలు బోధించవచ్చని ఇంతవరకూ ఎవరూ ఊహించుండరు!
రవి: వసంత్ కిషోర్గారు ఆర్ట్స్ – అని ఆయన పేరు సూచిస్తున్నది. ఆయనను సనత్ గారు మేథ్స్ లోకి లాగారు.
శ్రీపతి: పాద భ్రమకము, పద్య భ్రమకము అంటారు కదా, అలా ఇది సమీకరణ భ్రమకము కూడా… 3+33+3+33+3
రాఘవ: కామేశ్వరరావుగారూ, నేనైతే ఈ రెండు పూరణలూ చూచి చాలా అబ్బురపడ్డాను, సంతోషించాను.
శ్రీపతి: ఎట్నుంచి లెక్కపెట్టినా ఒకలానే ఉంటుంది… 🙂
రాఘవ: 🙂
రవి: ఇప్పుడు రాఘవ గారోచ్! రాఘవ గారూ మీ పూరణ మొదలెట్టండి
గన్నవరపు నరసింహమూర్తి: ఆయనది లెక్కలే, ఇంజినీరు ఆయన
రవి: మూర్తి గారు, సరదాకండి, తూచ్! 🙂
రాఘవ:నేను మూఁడు అన్న శబ్దానికి ఉన్న మూడు అర్థాలలోనూ వాడాను. మూఁడు అనే సంఖ్య, మూఁడటమంటే ముగియటం, మూఁడటమంటే కలగటం.
ఉ||
మూఁడును మూఁడులోకములు మూఁడును నిద్ర విధాతకుం దుదిన్
మూఁడినపిమ్మటన్ మరల మూఁడుగ సర్వము మాఱుఁ జూడగన్
మూఁడును మూఁడు మూఁడు మఱి మూఁడును మూఁడును మూఁడు మూఁడుగన్
వసంత్ కిషోర్:: చాలా బావుంది !
గిరి: చక్కటి పద్యము
గన్నవరపు నరసింహమూర్తి: అద్భుతంగా ఉంది
కామేశ్వరరావు: ఫిజిక్సు లెక్కలు కాదని ఏకంగా తత్త్వంలోకి వెళ్ళిపోయారు రాఘవ!
మిస్సన్న: రాఘవ గారూ, సృష్టి క్రమాన్ని చక్కగా వివరించారు.
వసంత్ కిషోర్: సృష్టి మూడడం మరలా కూడడం
రాఘవ: ఔనండీ.
కామేశ్వరరావు: “మూడును కాలముల్” అని చదివగానే “కాలాలు మూడు” అని అర్థం చేసుకున్నాను నేను
రాఘవ: 🙂
మురళీమోహన్: కామేశ్వరరావుగారూ, నేనైతే ఈ ‘మూడు’ పూరణలూ చూచి చాలా అబ్బురపడ్డాను, సంతోషించాను.
కామేశ్వరరావు: మొత్తానికి అందరికీ మూడు బాగా కుదిరింది 🙂
రాఘవ: కామేశ్వరరావుగారూ, 🙂
రాఘవ: మురళీమోహన్గారూ, బొత్తిగా వ్యాఖ్యనే ఇలా కాపీ చేసారేమిటి? 😉
కామేశ్వరరావు: అధ్యక్షా ముందుకి సాగుదామా?
మిస్సన్న: నిజంగా మూడింటికి మూడూ వైవిధ్య భరితమైన అద్భుతమైనవి
రవి: మురళి గారూ, మరొకటి కూడా చూద్దాం. మిస్సన్న గారూ, మీ కీ బోర్డు ఝళిపించండి
రవి: మిస్సన్నగారి పూరణ ఇక!
మిస్సన్న: సంతోషంగానండీ
ఉ ||
మూడు ముడుల్ వివాహమున, మూడు గుణంబులు, మూడు లోకముల్,
మూడడుగుల్ భరించె బలి, మూడగు మూర్తుల జూడ కున్నచో-
మూడును! మూడు మూడు మఱి మూడును మూడును మూడు మూడుగన్
గన్నవరపు నరసింహమూర్తి: మిస్సన్నగారి పూరణ చాలా బాగుంది
రాఘవ: మూడు ముడుల్ వేసిన తరువాత మూడు (mood) మూడును (ముగియును) అని మీరు ఇంత స్పష్టంగా చెప్పటం నాకు చాలా నచ్చిందండీ 😀
వసంత్ కిషోర్: చక్కగా వుంది !
రాఘవ: చప్పట్లు కొట్టండి, కొట్టి ముందుకు సాగండి.
మిస్సన్న: ధన్యవాదాలండీ
రవి: మూడు వేళలు మాకు నచ్చియున్నది. (మూడుపూటల భోజనము ఉండును కావున)
వసంత్ కిషోర్: కరతాళ ధ్వనులు !
కామేశ్వరరావు: “త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం” గుర్తుకు వచ్చింది!
రాఘవ: ఏకబిల్వం ఖరార్పణం
రవి: రాఘవా 🙂
రాఘవ: కాదు కాదు, ఏతత్పద్యం ఖరార్పణమ్
కామేశ్వరరావు: 🙂
రాఘవ: 🙂
రవి: ఖరకరార్పణం
మురళీమోహన్: మిస్సన్నగారిపద్యం లెస్సగా ఉంది.
రాఘవ: తరువాతి అంశమేమిటి? ఖరకర! రవి! తెలుపవలయుఁ గవులందరికిన్.
మిస్సన్న: ధన్యవాదాలు మురళిగారూ
రవి: గిరిగారికి కాస్త పనిపెడదాం
రవి: ఓ దత్తపది: గోలకొండ, పూలదండ, కందిగుండ, కొత్తకుండ – రామాయణార్థంలో
రాఘవ: గిరి… గిరి… గిరి… గిరి
రాఘవ: గిరియని అరిచి పిలచి తెలిసికొనెద నతఁడేమనునో!
రవి: ఒక్క గిరే కదండి? గోల”కొండ”
గిరి: పూలదండ చూడంగనె వాలి సుగ్రీవులు మనసులో మెదిలారు
రాఘవ: పూలదండ చూచి మీకు పెళ్లి కూతురు కదా గుర్తు రావలసినది?
గిరి: 🙂
గిరి: అవధరించండి
శా||
స్సీ తమ్ముండొగి పూలదండ మెడదాల్చెన్ దైవసాయుజ్యమె
ట్లో తోడై తన కంది, గుండబలె నిష్ఠ్యూతాంత్య నిర్భాగ్యునిన్
పాతాళంబున కొత్తకుండ విడువన్ వానిన్ ఘనోగ్రోద్గతిన్
గన్నవరపు నరసింహమూర్తి: ఈ దత్తపది ఇంకా ఎవరూ పూరించలేదని చూస్తుంటే గిరి గారు మంచి పూరణ చేసారు
మిస్సన్న: అపురూపమైన పూరణ
శ్రీపతి: నిష్ఠ్యూతాంత్య నిర్భాగ్యునిన్ – చప్పట్లు
వసంత్ కిషోర్: అద్భుతం ! కరతాళ ధ్వనులు !
రవి: కేక పెట్టించారు
గన్నవరపు నరసింహమూర్తి: కందిగుండని భలే అమర్చారు
కామేశ్వరరావు: చాలాబాగుంది.
గిరి: ధన్యవాదాలందరికీ
రవి: పుష్యంగారికి పునఃస్వాగతం
రాఘవ: 🙂
రాఘవ: సరిగా గమనించారా? గిరిగారు వసనుఁ గలిపిరి కృతపద్యములో!
పుష్యం:శుభోదయం
మురళీమోహన్: పాతాళంబున కొత్త్తకుండ విడువన్ 🙂 పాతకుండను ఎందుకు విడువలేదో?
మిస్సన్న: శుభోదయం సార్.
రాఘవ: గిరిగారూ, మంచి పూరణ. కొత్తకుండను ఒత్తకుండన్ గా మార్చటం భలే.
కామేశ్వరరావు: “హా! తారా!” అన్న ఎత్తిగడతోనే సగం మార్కులు కొట్టేసారు!
రవి: ఓహో అదా అంతరార్థం ..కుండ బద్దలు కొట్టారు
రాఘవ: నాకు మీరు హా తారా అని మొదలు పెడితే నిరుడు వచ్చిన సీతా రామునకిట్లొనర్చితివె యిస్సీ ద్రోహమిల్లాలివై సమస్య, దానికి తాడేపల్లివారిది అనుకుంటాను పూరణ రెండూ గుర్తొచ్చాయి
రాఘవ: అధ్యక్షా, మీరు కొత్తకుండ అనటం వలన ఒక మంచి పూరణ వచ్చింది. మీరు క్రొత్త కుండ అని ఇచ్చి ఉంటే ఈ పూరణ వచ్చేదా? కాబట్టి మీ తప్పును ప్రస్తుతానికి క్షమించేస్తున్నాం 😉 😛
గిరి: రాఘవా, నాకూ ఆ పూరణ మదిలో మెదిలింది
గిరి: నిజమే, క్రొత్తకుండ అని ఉంటే కందిగుండతో పడ్డ కష్టాలు పడవలసి వచ్చేది
రాఘవ: గిరిగారూ, మీరు హా తారా అనగానే నాకు ఆ పూరణే గుర్తొచ్చింది. అది చాలదన్నట్టు మీరు ఇస్సీ తమ్ముండొగి అని సీతనూ చొప్పించేసారు.
రవి: ఇక ముందుకు వెళుతున్నాను.
కామేశ్వరరావు: అలాగే
గిరి: కవివర్యులారా, ఇక నేను సెలవు తీసుకుంటాను
రవి: గిరిగారూ ధన్యవాదాలు
గిరి: అందరికీ ధన్యవాదాలు, మళ్ళీ త్వరలోనే కలుసుకుందాము
కామేశ్వరరావు: అయ్యో మీ ఫస్ట్ క్లాసైన మీ పూరణలింకా విందామనుకున్నానే 🙂
రాఘవ: గిరిగారూ, శుభం. మీ కుమార్తెకు మళ్లీ శుభాశీస్సులు తెలియజేయండి. సెలవు.
రవి: రామాయణం నుంచి జనజీవన స్రవంతి లోకి..
ఒక నడివయస్కుడు సినిమా టిక్కెట్ల క్యూలో నించుని ఉండగా ఒక నిండు జవ్వని రెండు టిక్కెట్లు కావాలని అడిగింది. ఆయన తబ్బిబ్బు పడి తన డబ్బుతోనే కొనిపెట్టాడు. చివరికి ఆ పిల్ల “థేంక్యూ అంకుల్” అని తన బాయ్ ఫ్రెండుతో లోపలికెళ్ళిపోయింది.
పుష్యం:నిన్న శ్రీపతిగారు ఆ అమ్మాయికి రెండు టిక్కెట్లు కొనేసారు గదా 🙂 సినిమా నచ్చినంట్లుంది, రెండవసారి చూస్తోందా?
రవి: పై కథాశ్రవణంబు శ్రీపతుల వారి కీబోర్డు ద్వారా విందాం
శ్రీపతి: అయ్యయ్యొ… మళ్ళీ నేనేనా …సరే అయితే
ఉ ||
మేనక వంటి రూపవతి! “మీరొక రెండు టికెట్లు తీసినన్
నేనును మీదయన్ గనెద ! నిక్కమనెన్” ! మది రెక్క విప్పగా
లైనున దూకితిన్నహహ ! లక్కది నక్కను తొక్కెనట్లయెన్!
సీ ||
హాల్లోన చిలిపిగా అరచేయి తాకించి గాల్లోన తేలనా కాంక్ష మీర !
కూల్డ్రింకు తాగుతూ కోరుండి బాటిళ్ళు మార్తునా అధరాల మధువు దెలియ !
ఐస్క్రీము చెరిసగం అని కొంటె సైగతో సరసాలు పోదునా సాహసముగ !
ఆ.వె ||
ఇంతి కొరకు జూస్తి నింతలోన
ప్రియుని గూడి వచ్చి ప్రియమార “థాంక్సంకు”
లనుచు పడతి వెడలె హాలులోకి !
ఉ ||
ప్లానుల నూహచేసితిని ! పాటలు పాడి రొమాన్సు చేసితిన్
కాని అదంతయున్ కరిగి కా’లవ’లయ్యె క్షణాలలోన లవ్ !
ఫో ! నను మోసగించెనిటు ! ఫూలును జేసెను ! కోమలాంగిరో !!
వసంత్ కిషోర్: భళి భళీ !
రవి: విశ్వామిత్రా! విశ్వామిత్రా! మీ మేనకకు ఇక్కడ ఎసరు పెడుతున్నారు!
కామేశ్వరరావు: శ్రీపతిగారు, మీరింట్లోనే ఉన్నారు కాబట్టి మీ శ్రీమతిగారిని ఒక్కసారి వచ్చి వారికిది చూపించమని మనవి 🙂
రాఘవ: ఊఁ
పుష్యం:మంచి ధార ఉందండీ!! చాల బాగుంది.
గన్నవరపు నరసింహమూర్తి: శనత్ మీరు టిక్కట్లడుగుతే యింకా చాలా డబ్బులు వృధా చేసారు. కధ రంజుగా ఉంది.
శ్రీపతి: అయ్యా.. కామేశ్వరరావు గారూ, పూర్వాశ్రమంలో నారదులని మీకేమైనా పేరా ?
రవి: కామేశ్వరుల వారూ, మీకు నారదులావహించారాండి?
గన్నవరపు నరసింహమూర్తి: శ్రీధర్ కి చూపిస్తా
కామేశ్వరరావు: ఏదో లోకకల్యాణార్థం అలా 🙂
రవి: లోకకల్యాణం – ఇంట కల్యాణభంగం!
శ్రీపతి: లోక కళ్యాణమా? ఇక్కడ తిరుపతి కళ్యాణమౌతూంటే…
శ్రీపతి: డబ్బు వృధా చేసేసుకుందామనే ఆత్రమే గానీ అవకాశం ఏది???
వసంత్ కిషోర్: మూర్తిగారూ సినిమా చూస్తారా ఏమిటి ?
పుష్యం:శ్రీపతిగారి స్వానుభవమని అనుమానం..
మిస్సన్న: పెద్దాయన సంగతేమో గానీ అమ్మాయి మాత్రం నక్కను తొక్కి వచ్చింది.
కామేశ్వరరావు: మిస్సన్నగారు 🙂
గన్నవరపు నరసింహమూర్తి: సినిమాలు చూసి చాలా యేళ్ళు అయ్యాయి కిశొర్ జీ
కామేశ్వరరావు: పైగా “మేనకవంటి రూపవతి”, అంటే మేనక ఎలా ఉంటుందో ఈయనకి తెలుసన్న మాట!
రవి: 🙂
మిస్సన్న: వామ్మోవ్!
కామేశ్వరరావు: మీ ఇంటికి ఆహ్వానించారు కదా, వచ్చినప్పుడు మరిచిపోకుండా ఈ పద్యం ప్రింటు చేసి పట్టుకువస్తా 🙂
రవి: శ్రీపతికి వాళ్ళావిడతో ఈ రోజే డైవోర్సు ఇప్పించేటట్టున్నారు
మిస్సన్న: అమంగళమ్ శాంతించు గాక
రవి: వసంతసుమశేఖరం – నా పాలిట ఖరమయిందని శ్రీపతి గారు వాపోగలరు.
గన్నవరపు నరసింహమూర్తి: ఆ వచ్చి తీసుకువెళ్ళింది విశ్వామిత్రులే
కామేశ్వరరావు: మూర్తిగారు 🙂
కామేశ్వరరావు: ఏదైనా ఈ వర్ణన చాలామందిని ఊహల్లోకి లాక్కెళ్ళింది!
రవి: ఒక్కరినీ వదిలేది లేదు. మూర్తి గారూ మీ వంతు
కామేశ్వరరావు: నాలాంటి బుద్ధిమంతులని దక్క 🙂
గన్నవరపు నరసింహమూర్తి: అలాగే
గన్నవరపు నరసింహమూర్తి:
ఉ ||
వెక్కస మయ్యె పంక్తి వెను వెన్కను నిల్చిన సుందరాంగియున్
ఒక్కతె నన్ను జేరి కను లూపుచుఁ గోరెను జూడ ముచ్చటౌ
చక్కని నవ్వు చింద ముఖ చంద్రుని బింబము రెండు టిక్కటుల్
కం ||
వేచితి నే నిన్ని నాళ్ళు , వేడెద నిపుడున్
యాచించెద టిక్కట్లను
ఈ చిత్రము గాంచ నిపుడు నీప్సిత మయ్యెన్
ఉ ||
చిత్రము గాదె యిప్పుడును చెన్నుగ నిల్చిన పంకజాస్యయున్
మిత్రుడిగా తలంచి నను మెల్లగ చేరగ ప్రేమ భావమున్
శత్రువు పుష్పధన్వి తన చాపము నెక్కెనె కర్కశంబునున్ !
వ || టిక్కట్లను కొని, పెక్కు మధుర ఊహలలో విహరిస్తుండగా …
ఉ ||
వెంగలి నవ్వు నవ్వి తన ప్రేయసి గైకొనె , రెండు టిక్కటుల్ !
ఖంగు దినంగ నేను కల్మష ముంచక చిత్తమందుటన్
భంగము జెంది సాగితిని బంగరు బొమ్మలె ప్రౌఢులందుటన్ !
కామేశ్వరరావు: మూర్తిగారు మీరుకూడా ఏమీ తక్కువ తినలేదు! ఆ ప్రియుడి మీద కసినంతా భలే చూపించారు పద్యంలో!
జ్యోతి: అందరికి నమస్కారం..
వసంత్ కిషోర్: భళీ ! మూర్తీజీ !
కామేశ్వరరావు: జ్యోతిగారు నమస్కారం. స్వాగతం. సభ మంచి రసకందాయంలో ఉండి మిమ్మల్ని వెంటనే స్వాగతించలేదు.
నచకి: అందఱికీ నమస్కారం! చివఱి అరగంటకైనా అందుకున్నాను..
రవి: జ్యోతిగారికి, నచకిగారికీ స్వాగతం
మిస్సన్న: చింపిఱి జుట్టుల సోకుగాడు, వెంగలి నవ్వు చాలా బాగున్ది మూర్తి మిత్రమా
పుష్యం:చూచితి మిమ్మునెక్కడనొ’ human psycology బాగా పట్టారు
కామేశ్వరరావు: నచకిగారు, నా మాట మన్నించి మళ్ళి వచ్చినండుకు కృతజ్ఞ్తలు. పునస్స్వాగతం
రవి: జ్యోతిగారూ సినిమాటికెట్ల వ్యవహారం నడుస్తూంది.
నచకి: నెనర్లు, కామేశ్వరరావుగారూ!
రవి: టికెట్ కొనిస్తే అంకుల్ థాంక్స్ అందట. అందరూ తమ తమ అనుభవాలు చెబుతున్నారు. 🙂
జ్యోతి: హాహా.. మంచి రసపట్టులో ఉన్నట్టుంది ఐతే.. కానివ్వండి..
గన్నవరపు నరసింహమూర్తి: నడి వయస్కుడు అంటే మేమూ పరిగణలోనికి వస్తామని తలచాము
రవి: మూర్తి గారూ, ఎంత కుట్ర?
జ్యోతి: అందమైన అమ్మాయి అంకుల్ అంటే ఉక్రోషమా?? 🙂
జ్యోతి: పాపం…
శ్రీపతి: పడే వాడికి తెలుస్తుందండీ ఆ బాధ ఏమిటో…
కామేశ్వరరావు: అదీను తాత వయసువాళ్ళకి 🙂
గన్నవరపు నరసింహమూర్తి: అంకుల్ అంటే ఫర్వా లేదండీ, తాత అనక పోతే చాలు
కామేశ్వరరావు: “పాత వలపు తలచి తలచి తాత ఊగెను కైపులో”
జ్యోతి: కదా బాగా చెప్పారు.
నచకి: 🙂