శారదా విజయోల్లాసము – 1

శివున్ స్మరించ పాపముల్ నశించునా? యబద్ధమే

 

రవిశివుని స్మరిస్తే కష్టాలు, పాపాలు తొలగిపోతాయేమో ప్రయత్నిద్దాం.

రవి :  శివున్ స్మరించ పాపముల్ నశించునా? యబద్ధమే – మూర్తి గారూ చెప్పాలి!

గన్నవరపు వారు :

అవాంతరంబు నున్న విష్ణు వాదిదేవు డయ్యెడున్

భవాని లక్ష్మి గొల్చి భవ్యభాగ్యు గాన గృష్ణుడౌ

భవున్!హరిన్!పురాంతకున్!శుభంకరు న్!నృసింహునున్

శివున్ స్మరింప పాపముల్ నశించు  నాయబధ్ధమే !

ఆదిత్య  :

తలతిరిగెను చక్రము వలె

కలయో మాయయొ తెలియక కన్నులు చెదరెన్

పలుకులరాణికి సిగలో

కులికెడు చూడామణి యిది ధన్యుడనైతిన్

శంకరయ్య  : ఆదిత్య గారూ, చివరి పాదంలో యతి తప్పిందండీ!

గిరి : మూర్తిగారి చామరం ధాటికి ఆదిత్యగారికి మధ్యలో తలతిరిగిందా 🙂

రవి :  చక్రం లేటుగా తిరిగిందనుకుంటాను. 🙂

గన్నవరపు వారు :  ఆదిత్య గారు చక్కని పద్యము చెప్పారు. నాకిది తొలి పంచచామరము !

కామేశ్వర రావు :  మూర్తిగారు తమ సంతకంతో మరీ పూరించారు!

శంకరయ్య  : గనవరపు వారి పద్యం జవనాశ్వంలా ఉరికింది.

కామేశ్వర రావు :  “నృసింహునిన్” అని ఉండాలనుకుంటా

గన్నవరపు వారు :  ధన్యవాదములు ! సంతకము పెట్టక కుదర లేదు

రవి :  సంతకంలో పొఱబాటు 🙂

గన్నవరపు వారు :  సంతకములో చేయి వణికింది

కామేశ్వర రావు :  ఈ సమస్య చూసినప్పుడు “కిమస్తి మాలాం కిమ కౌస్తుభం వా” గుర్తుకువచ్చింది.శివుని ప్రసక్తి తెచ్చి విష్ణుపరంగా పూరించమన్నారు కదా!

రవి :  మీ పూరణ కూడా ఆ భావనేనా?

కామేశ్వర రావు :  ఇంచుమించుగా

శంకరయ్య  : ఆదిత్య గారూ, మీ పద్యం చివరి పాదాన్ని ‘తలపుల చూడామని నిడి ధన్యుడనైతిన్’ అంటే సరి!

ఆదిత్య  : బాగుంది ! ధన్యవాదాలు !

రవి :  ఆదిత్య గారికి “కుశలుడనైతిన్” – అని చెబుదామని మిన్నకున్నాను.

సవరించిన పద్యం :

తలతిరిగెను చక్రము వలె

కలయో మాయయొ తెలియక కన్నులు చెదరెన్

పలుకులరాణికి సిగలో

తలపుల చూడామణి నిడి ధన్యుడనైతిన్

కామేశ్వర రావు :  అయినా ఆ హరిహరనాథుని తిక్కన కీర్తించినట్టుగా ఇంకెవ్వరు కీర్తించ గలరు!

గన్నవరపు వారు : రెండవ పాదమును సవరించాను ఈ విధముగా చదువుకొండి  – భవాండ మెల్ల వ్యాప్తి నొంది  భక్తి యుక్తి సాధ్యుడౌ

సవరించిన పద్యం:-

అవాంతరంబు నున్న విష్ణు వాదిదేవు డయ్యెడున్

భవాండ మెల్ల వ్యాప్తి నొంది  భక్తి యుక్తి సాధ్యుడౌ

భవున్!హరిన్!పురాంతకున్!శుభంకరు న్!నృసింహునున్

శివున్ స్మరింప పాపముల్ నశించు  నాయబధ్ధమే !

రవి :  కామేశ్వరరావు గారూ..పరుగెత్తించండి గంగా ప్రవాహాన్ని

కామేశ్వర రావు :  అలాగే

కామేశ్వర రావు :

శివమ్మటన్న వేదమౌను శ్రీశుభప్రదాయియౌ

నవాంబుజాక్షు నా సహస్రనామవార్ధి గల్గదే

శివాయటన్న భవ్యనామశీకరమ్ము! విష్ణువౌ

శివున్ స్మరింప పాపముల్ నశించు, నాయబద్ధమే!

గిరి: నాయబధ్ధమే అంటే న్యాయబధ్ధమనేనా

కామేశ్వర రావు :  గిరిగారు, అవును

గన్నవరపు వారు :కామేశ్వర రావు గారూ చాలా బాగుంది !

గిరి: మీ పూరణ అద్భుతంగా లేదంటే నా అబధ్ధమే, ఉందంటే నాయబధ్ధమే

చదువరి  : ఈ ఛందం నడక దూకుతున్నట్లుగా భలే ఉంది. పద్యాలు పాడుకోడానికి అనువుగా ఉన్నాయి.

గిరి: చదువరి గారు, సరిగ్గా చెప్పారు.

రవి :  “శీకరము” – ఈ పదం కామేశ్వరరావు గారి పద్యాల్లో కొన్నిసార్లు చూశాను.

కామేశ్వర రావు :  గిరిగారు 🙂 రవీ, అవునా!

రవి :  ఇదివరకు సభలో “శీకరమై” అని లాగించారు

కామేశ్వర రావు :  రవీ, అవునండోయ్!

ఆదిత్య  : she కరమ్ము అన్నకి అంతిష్టమా 🙂

చదువరి  : ధిమిద్ధిమిత్తురంగ.. ఈ శివ స్తోత్రం ఇదే ఛందంలో ఉందా?

కామేశ్వర రావు :  రావణబ్రహ్మ శివస్తోత్రం ఇదే ఛందస్సు కదా!

గిరి: ఓహౌ – అదీ సంగతి

రవి :  ఓహో రావణబ్రహ్మ స్తుతి ఈ ఛందస్సేనాండి?

ఆదిత్య  : గీతాంజలి పాట లో అదే ఛందస్సు అని చెప్పినట్లు గుర్తు

రవి :  ఏ పాటండి?

ఆదిత్య  : అన్నా ??

గిరి : కామేశ్వరరావుగారు, పద్యం నడకని అలవాటు చేసుకోవడానికి మొన్న నడుస్తూ దరువువేసుకుంటూంటే – తెలిసిన నడకలా అనిపించింది. అదీ సంగతి.

కామేశ్వర రావు :  అవును. అయితే తెలుగుపలుకుల కన్నా సంస్కృతపదఘట్టనే ఈ ఛందస్సుకి అందాన్నిస్తుందని నాకనిపిస్తుంది.

కామేశ్వర రావు :  గీతాంజలి పాటా?

ఆదిత్య  : వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా  …??అదేనా

కామేశ్వర రావు :  ఆ అవును!

గిరి : ఆదిత్యా, అవునవును

గన్నవరపు వారు : తొలి లఘువు తర్వాత గురువు లఘువులు వరుసగా పడడము వలన లయ కుదురుతొంది

రవి :  ఎవరైనా తెలుగు కవులు విరివిగా ఈ ఛందస్సులో వ్రాశారాండి?

శంకరయ్య  : తమతమ కావ్యాల్లో అశ్వాసాంత పద్యాల్లో వ్రాసిన వారే ఎక్కువ.

గిరి : కామేశ్వరరావుగారు చెప్పినట్టు సంస్కృతపదాల కూర్పు ఈ ఛందస్సులో సులభం కూడా అనుకుంటా

రవి :  తెలుగులో కవులు ఎక్కువగా ఉపయోగించకపోవడం వల్ల అలా అనిపిస్తున్నదని నా అనుకోలు

రవి :  కవిరాజవిరాజితము (అయిగిరి నందిని) ఆ ఛందస్సు కూడా సంస్కృతంలో బావుంటుందని అనుకుంటూ ఉండేవాన్ని

రవి :  పెద్దన గారు, రాయలవారూ కవిరాజవిరాజితము ఛందస్సు వాడారు.

శంకరయ్య  : ఒక నగణం, వరుసగా ఆరు జగణాలు చివర ఒక గురువు … ఇది కవిరాజవిరాజిత గణాలు.

కొత్తపాళి : దీన్ని గురించి నేను లోగడ ఒక టపా చేశాను

కొత్తపాళి : ఆముక్తమాల్యదలో ఆశ్వాసాంత పద్యాల్లో రాయలవారు వాడారు ఒక్కసారే

రవి :  అవును. మనుచరిత్రలోనూ అదేపద్యం కాస్త తేడాతో ఉన్నది

కామేశ్వర రావు :  రవీ, మీరన్న రాయల/పెద్దన పద్యం పూర్తిగా సంస్కృతమే కదా!

రవి :  కామేశ్వరరావు గారు నిజమేనండి. న్యాయబద్దమే.

కొత్తపాళి : జ గణాలు వరస్సగా రావడంలో ఒక మంచి తూగు వస్తుంది

శంకరయ్య  : దీని యతిస్థానం విషయంలో లాక్షణికులలో అభిప్రాయభేదాలున్నాయి.

కొత్తపాళి : అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా

గిరి : శంకరయ్యగారు, అవునా – వివరాలు తెలుపండి

కొత్తపాళి : ఇది అలైపాయుదే అనే తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగ్‌లో (సఖీ అనుకుంటా)

కొత్తపాళి : వేటూరి రాశారు

గిరి : వేటూరి

రవి :  కొత్తపాళి గారు ఆ తమిళమాతృక కర్ణాటక సంగీత కీర్తన అనుకుంటాను.కరెక్టాండి?

గిరి: అలైపాయుదే కణ్ణా అయితే ఊత్తుకాడు వేంకటసుబ్బయర్ గారి కృతి

కొత్తపాళి : ఒక చిన్న తమాషా కని పెట్టాను నేను

శంకరయ్య  : సినిమా పాట విషయం నాకు తెలియదు.

రవి :  చెప్పండి కొత్తపాళి గారు

కొత్తపాళి : శంకరయ్య గారూ, కవిరాజ విరాజితం యతి విశేషాలు ముందు మీరు చెప్పండి

ఆదిత్య  : ముదంబులరంగ పదాబ్జములందు

కామేశ్వర రావు :  అయితే నేను చదివిన పద్యాలకి ఎక్కువగా “తననన తానన తానన తానన … నా” అనే నడకే ఉంది.

కొత్తపాళి : పాట సంగతి నేను తరవాత చెబుతాను సమయం ఉంటే

ఆదిత్య  : ఇది “సాంబశివా యనవే “అనే స్వరజతిలో వస్తుంది

కొత్తపాళి : కామేశ్వర్రావుగారు మంచి అబ్సర్వేషను!!

శంకరయ్య  :

అ) 14వ అక్షారానికి మాత్రమే యతి కూర్చడం….

ఆ) 14-20 లకు యతి కూర్చడం ….

ఇ) 8-14-20 లకు యతి కూర్చడం. ….

శంకరయ్య  : ఇలా మూడు అభిప్రాయాలున్నాయి.

కొత్తపాళి : ఆహా – పాదం పొడుగయింది గనక

కొత్తపాళి : సంస్కృత యతి అయితే బాగానే ఉంటుంది, అక్కడ కాస్త శ్వాసతీసుకోవడానికి

కొత్తపాళి : తెలుగు యతి అయేటప్పటికి కవికి మరి కొన్ని అదనపు సంకెళ్ళూ 🙂

శంకరయ్య  : సంస్కృత పద్యాల్లో (శ్లోకాల్లో) యతిమైత్రి నియమం లేదు కదా!

రవి :  పెద్దన గారి పద్యం మొదటిపాదం ఇది – జయజయ దానవదారణకారణశార్ఞ్గరథాంగగధాసిధరా

శంకరయ్య  : పెద్దన గారు కేవలం 14వ అక్షరానికి మాత్రమే యతి వేసారు.

గన్నవరపు వారు : తాళపత్రములపై వ్రాసే వారు. ఆ పత్రాలు పొడవుగా ఉంటాయి వ్రాసుకు పోవడానికి !

కొత్తపాళి : అదే అంటున్నా – అక్కడ యతి అంటే విరామమే గదా

కామేశ్వర రావు :  తెలుగు యతిపై ఈ అభియోగం చాలామంది దగ్గర విన్నాను, కానీ…

కొత్తపాళి : @gannavarapu – నజమే. అందుకే పాదాల విరుపు సూచించడానికి నిలువుగీత వాడేవారు

కొత్తపాళి : @Kameswararao చెప్పంది

శంకరయ్య  : ఏమిటా అభియోగం ..?

కొత్తపాళి : జయ జయ చంద్ర దినేంద్ర శతాయుతసాంద్ర శరీర మహా ప్రసరా ..

కామేశ్వర రావు :  నా మటుక్కు అది సంకెల కాదు. కొత్త ఊహలకి ద్వారాలు తెరిచే ఒక సాధనం. నేనిందాక చెప్పిన పూరణే దానికొక సాక్ష్యం!

కొత్తపాళి : ఇది రాయలవారి విరాజితం

కొత్తపాళి : @ బాబూ కామేశ్వర్రావుగారు, అదేదో మాయాబజారులో డయలాగులా – ఇవన్నీ మీవంటి అసాధారణ ప్రతిభావంతుల గురించి కాదు 🙂

గిరి : రవి గారు, ముందుకు సాగుదామా

కొత్తపాళి : ఐతే ఇక్కడ ఒక చిన్న తమాషా ఉన్నది లయలో

రవి :  చెప్పండి

గిరి: సింగపూరులో ఆవులింతల పర్వం మొదలయ్యింది

కొత్తపాళి : III IUI IUI IUI అని ఉండాల్సినది IIII UII UII UII అయిపోతున్నది

రవి :  పాడుకునేప్పుడు శ్రవణసుభగత్వం రెండవ దానిలో ఎక్కువ

కామేశ్వర రావు :  కొత్తపాళీగారు, ఆ పద్యం అసలు నడక అదే. ఆ విషయం దాని యతి స్పష్టంగా చెపుతున్నది.

శంకరయ్య  : అవును …

కొత్తపాళి : అచ్చంగా జగణంతో వచ్చే లయని వేటూరి తనపాటలో సాధించాడు – అది నాకు చాలా గొప్పగా అనిపించింది. అఫ్కోర్సు, ఆ పాదాల్లో అర్ధం పెద్దగా లేదు అని తెలిసిన మిత్రులు కొందరు విమర్శ

ఆదిత్య  : ఇప్పటిదాకా మెషీన్ లాంగ్వేజే అనుకున్నా బైనరీ లోకీ దిగారా

కొత్తపాళి : @Aditya 🙂

రవి :  :))

చదువరి  : 🙂 🙂

కామేశ్వర రావు :  మూడేసి గణాలుగా విభజించుకోవడం కేవలం ఛందస్సు గుర్తుపెట్టుకోడానికి ఒక పద్ధతే తప్ప అది దాని నడకని చెప్పదు.

కొత్తపాళి : @Aditya -రవిగాననిచో కవి కాంచునేగదా!

కొత్తపాళి : @Kameswararao – absolutely right

రవి :  సరే జనజీవనస్రవంతిలోకి వద్దామండి.

కామేశ్వర రావు :  సరే గిరిగారికి ఆవులింతలింతితై వచ్చుచున్నట్టున్నవి. ఇక మనం ముందుకు సాగుదాం!@

గిరి: కామేశ్వరరావుగారు, సంపత్కుమార గారిని గుర్తుకు తెచ్చారు

శంకరయ్య  : రవే కవి అయితే ..?

కొత్తపాళి : సరే – నా పిట్ట కథ ఫుర్తయింది. సభవారు ముందుకు సాగితే మంచిది. పాపం గిరికి ఆవలింతలొస్తున్నాయి

 

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.