Monthly Archives: July 2010

కవికృతి – ౧౧

కవికృతి సమ్మేళనంలో సభ్యుల మధ్య చోటుచేసుకున్న కొన్నిసంభాణలు: స్వాతికుమారి: కవికృతి లో కొందరు కవులు తమ అనువాద కవితల్ని పంపారు. అసలు ఇతర భాషల కవితలను తెలుగులోకి అనువదించడం వల్ల కవులకు, పాఠకుడికి ఉపయోగాలేమిటని మీరు భావిస్తున్నారు? అనువాదాలు చేసేటప్పుడు తప్పక గుర్తుంచుకోవలసిన సూత్రాలు, నియమాలు ఏవైనా ఉన్నాయా? చావా కిరణ్, పెరుగు రామకృష్ణ గారు … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

నువ్వాదరిని… నేనీదరిని…

–కొల్లూరి సోమ శంకర్ కథ గురించి: కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నేపథ్యంలో సాగే “నువ్వా దరిని…… నేనీ దరిని” అనే ఈ కథ రెండు విభిన్న సమూహాల, రెండు రాష్ట్రాల, రెండు విభిన్న మతాల మధ్య సమైక్యతని చాటుతుంది. ఉత్తర దక్షిణ భారతదేశాల సాంస్కృతిక వైవిధ్యతని స్పృశించే ఈ కథ తనకంటూ ఏ రాష్ట్రమూ … Continue reading

Posted in కథ | 2 Comments

కవికృతి-౧౦

౧. -చావా కిరణ్: ఉదయాన్నే గుసగుసలు మనిద్దరం కలిసి పడవపై కేవలం మనిద్దరమే సుమా, అలా అనంత తీరానికి ఆనంద లోకానికి వెళ్తామని ఉదయాన్నే గుసగుసలు. —- అంతే లేని సముద్రంపై నీ నగుమోము చూస్తూ అలల్లా పూర్ణస్వేచ్చతో బంధనాలు లేని పదాలతో నా పాటలు పరవశిస్తాయి. —- ఇంకా ఆ ఘడియ రాలేదా ఇంకా … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

కవిత

-ఆత్రేయ కొండూరు తలపు తడుతూ నేల గంధం తలుపు తీస్తే, ఆకాశం కప్పుకున్న అస్థిరమయిన రూపాలు తేలిపోతూ, కరిగిపోతూ, అలజడిచేస్తూ, అక్షరాల జల్లు. నిలిచే సమయమేది ? పట్టే ఒడుపేది ? పల్లంలో దాగిన జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు. తడుపుదామనో కలిసి తరిద్దామనో! గుండె నిండేసరికి నిర్మలాకాశం వెచ్చగా మెరిసింది.

Posted in కవిత్వం | Tagged | 2 Comments

2010 ఏప్రిల్ గడి ఫలితాలు

ఏప్రిల్ 2010 గడి ఈసారి గడి పూరణలు అతి తక్కువగా వచ్చాయి. బహుశః గడికి వేసవి సెలవుల గాడ్పు తగిలినట్లుంది. గడిని ఉత్సాహంగా నింపి పంపినవారు ఆర్కేడి, కొడీహళ్లి మురళీమోహన్ , భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హనుమంత రావు, శుభ , విజయ జ్యోతి గార్లు. వీరిలో నాకు తెలిసి చాలామంది ఈమధ్య గడి పూరించడం … Continue reading

Posted in గడి | Tagged | 2 Comments

కవికృతి-౯

నో కాంప్రొమైజ్ ప్లీజ్ -స్వాతీ శ్రీపాద నేను రాజీ ఉరితీతకు సిద్దంగా లేను. కళ్లుమూసితెరిచేంత లిప్తలో ఉనికికీ ఊహకూ_ సజీవతకూ సమూల మరణానికీ ఉలిపిరి కాగితపు పరదా ఊగిసలాడుతున్న తైంతిక సుకుమార జీవనవనంలో విలువల గొంతునొక్కి కలల గుమ్మటానికి వేలాడేందుకు నేను సిద్దంగాలేను. నో కాంప్రొమైజ్ ప్లీజ్.. సువిశాలపు ఆకాశం పాల చెక్కిళ్ళపై పరుగులు పెడుతూ … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

మందు పాతరల జీవితం

-ద్వీపరాగ మందు పాతరల  జీవితం అడుగడుగునా పొంచి ఉన్న మందు పాతరలు.. ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందో! ఏ ప్రశాంతత ఎలా ముగిసిపోతుందో! ఊపిరి బిగబట్టి ఆచి తూచి వేసే అడుగులు. చావు లాంటి బ్రతుకు చావులోనే బ్రతుకు మళ్లీ మళ్లీ అలా చావకపోతేనేం? చస్తూ బ్రతక్కపోతేనేం? ఎవరో నాటి, మరెవరి స్పర్శకో పేలిన మందు పాతర నిన్ను ముక్కలు చేసి ఆకాశంలోకి విరజిమ్మితే.. అక్కడే అలా చుక్కల్లో మిగిలిపోక మళ్లీ భూమ్మీదకు జారి ఒక్కటవుతావేం? మరొక్కసారి ఛిద్రమయి ఎగసిపోయే అనుభవాన్ని సొంతం చేసుకోవడానికా? శిధిలమయింది బ్రతుకయితే ముక్కలయింది మనసయితే అతుకులేయగలిగే ఆశ ఏది? నువ్వంటే! మర్చిపోవాలన్న పట్టుదలలో మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాను. తరిమెయ్యాలన్న ప్రయత్నంలో అనుకోకుండానే ఆహ్వానిస్తుంటాను. నీ నుంచి దూరంగా పారిపోవాలన్న నా పరుగు తిరిగి తిరిగి నిన్నే చేరుకుంటుoది. జ్ఞాపకంతో పోరాటం, మనసుతో భీకర యుద్ధం, నా పై నేనే చేసుకునే విధ్వంస రచన. ఇదీ నువ్వంటే…

Posted in కవిత్వం | Tagged | Comments Off on మందు పాతరల జీవితం

రసమయం జగతి

-స్వాతికుమారి బండ్లమూడి ఎంతో ఇష్టమైన పాటని రింగ్‌టోన్‌గా పెట్టుకోవటం ఎంత బుద్ధితక్కువ పని! ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చి, ఏదో శత్రుత్వం ఉన్నట్టు వీలైనంత త్వరగా పాట ఆపెయ్యాలి. తడిచేతిని కర్చీఫ్‌తో తుడుచుకుని, ఫోన్‌ తీసి ‘విరించి’ అన్న పేరును చూస్తూ ‘హలో’ అన్నాను. అటువైపు అలికిడి లేదు. “మాట్లాడరే?” ఖాళీ అయిన లంచ్‌బాక్సును సర్దుతూ అన్నాను. … Continue reading

Posted in కథ | 14 Comments