– కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రపంచమంతటా మనుషులు నమ్మే రకరకాల మతాలు ఎప్పటినుంచీ మొదలయాయో ఊహించాలే గాని ఖచ్చితంగా చెప్పలేము. సుమారు 5 లక్షల ఏళ్ళ క్రితం నుంచి పది, పన్నెండు వేల ఏళ్ళ క్రితం వరకూ పాతరాతియుగం కొనసాగింది. ఆ కాలపు అవశేషాలనూ, రాతి వస్తువులనూ, చెక్కడాలనూ బట్టి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. కొన్ని విశేషాలు ఇతరత్రా లభిస్తాయి. ఈనాటికీ నాగరికత సోకకుండా తమకు ప్రత్యేకమనిపించే తంతులు నిర్వహిస్తూ బతికే ఆదిమతెగలు ప్రపంచమంతటా కనిపిస్తారు. వారి ఆచారాలూ, నమ్మకాలూ మనకు విచిత్రంగా, అనాగరికంగా అనిపించినప్పటికీ ఆధునిక ముసుగులు తగిలించుకున్న నేటి మతవిశ్వాసాల పునాదులన్నీ వాటిలో కనిపిస్తాయి. వీటిలో కొన్ని వివరాలు కొందరికి జుగుప్సనూ, కొందరికి కోపాన్నీ కలిగించవచ్చు. అయినా కాస్త ఆలోచిస్తే మనుషులకు మొదటినుంచీ ఉన్న కొన్ని మానసిక బలహీనతలే ఈ విషయంలో పని చేశాయని స్పష్టమౌతుంది.
అనాగరికదశలో ఉన్నప్పుడు మనుషులకు ఒక అస్పష్టమైన తాత్వికచింతన ఏర్పడడానికి చావు అనేదే ముఖ్యకారణమని పాత అవశేషాలనుబట్టి తెలుస్తుంది. 5 లక్షల ఏళ్ళనాటి పీకింగ్ గుహల్లోనూ, 70 వేల సంవత్సరాలనాటి యూరప్ గుహల్లోనూ చనిపోయినవారి తలలను కోసి పాతిపెట్టడం, అంతకు ముందుగా చనిపోయినవారి జ్ఞాపకార్థమో, వారి శక్తిని పొందేందుకో ఆ తలల అంతర్భాగాలను తినడం వగైరా తంతులు అప్పటివారు జరిపినట్టు తెలుస్తోంది.
ఫ్రాన్స్‌లో దొరికిన కొన్ని అవశేషాల్లో అలాంటి పుర్రెలను పానపాత్రలుగా తయారుచేసి ఉపయో గించారని తెలిసింది. ఇవన్నీ జాగ్రత్తగా దాచిన వస్తువులు కనక వీటికి ఏవో ఆటవిక పూజాసామగ్రి వంటి ప్రాముఖ్యత ఉండేదని అనుకోవచ్చు. శవాలు పాతిన చోట్లలో తంతులు జరిగిన దాఖలాలు కనిపిస్తాయి. కొన్ని స్థలాల్లో కుంకుమవంటి ఎర్రని పొడి కనిపించింది. ఎర్రని పొడి వాడకం చాలా ప్రాచీనమైనది. మనవాళ్ళు పూజల్లో విరివిగా ఉపయోగించే కుంకుమ రక్తానికి ప్రత్యామ్నాయమైన సంకేతమని ఈనాడు చాలామందికి తెలియదు. బలులివ్వడం ఆచరణలో కష్టమౌతున్నకొద్దీ పురాతన ఆచారాలను సూచనప్రాయంగా ద్యోతకం చేసే సంకేతాలు మాత్రమే మిగిలాయి. సున్నమూ, పసుపూ కలిపితే సులువుగా, చవకలో తయారయే కుంకుమ ఇందుకు ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా కట్టిన ఇళ్ళ గుమ్మాలకు పుచ్చకాయను (అది అన్నిచోట్లా, ఎల్లకాలమూ దొరకదు కనక గుమ్మడి పండును) వేలాడగట్టడం, దానిమీద మనిషి ముఖంలా గీతలు గీయడం, నరబలికి సంకేతం. ఎర్రగా, రక్తం ఓడుతున్నట్టు కనబడే పుచ్చకాయ బలి అయినవాడి తలకు “న్యాయబద్ధమైన” సంకేతం అన్నమాట.
ఈ ఎర్రని రంగుపొడి ప్రపంచంలో అనేకచోట్ల మానవులు నివసించిన అతిప్రాచీనమైన గుహల్లో శవాలను పాతిపెట్టిన చోట కనబడింది. ఆస్ట్రియాలోని ఒక గుహలో 5 మీటర్ల లోతున పాతిన ఇద్దరు కవల శిశువుల అవశేషాలు దొరికాయి. 27 వేల ఏళ్ళనాటి ఈ పిల్లలను జాగ్రత్తగా చర్మంలో చుట్టి, మేమత్ ఏనుగు దంతాల చాటున ఖననం చేశారు. వారి శరీరాలకు ఎర్రనిపొడి పూశారు. ఏదో పెద్ద తంతు జరిపి ఉంటారని ఈ ఏర్పాటునుబట్టి తెలుస్తోంది. రక్తం అనేది జీవానికీ, ప్రాణానికీ ప్రతీక. ఋతుస్రావం జరగడం స్త్రీల సంతానోత్పత్తికి సంకేతం. ఇటువంటి విషయాలు ఆదిమానవుల మేధస్సును చాలా ప్రభావితం చేసి ఉంటాయి కనకనే ఇప్పటికీ మన పూజల్లో కుంకుమ లేకుండా జరగదు. బలి ఇచ్చిన మేక రక్తాన్ని ముఖానికి ‘రక్ష’గా పూసుకునే అలవాటు పశ్చిమాసియా తెగల్లో ఉందట. మన దేశంలో జంతువు (లేదా మనిషి) రక్తాన్ని ముఖానికో, నుదుటికో పూసుకునే అలవాటు కొనసాగి ప్రస్తుతం ఎర్రని తిలకాలూ, బొట్లూ మిగిలాయి. దీనికి మరేదో వివరణ ఇవ్వడానికి అష్టవంకర్లు తిరగనవసరంలేదు. ఇప్పుడు మనకేలా అనిపించినా ప్రాచీనుల తంతులన్నీ సమాజశ్రేయస్సు కోసం ఏర్పాటైనవే అని గుర్తుంచుకోవాలి.
ప్రాచీనులు శవాలను పాతిపెట్టడంలో పద్ధతి ఉండేది. కొన్నిచోట్ల పడమటి దిక్కుకేసి అమర్చిన 27 పుర్రెలు కనబడ్డాయి. ఈ తలలన్నీ శరీరాలనుంచి నరకబడ్డాయి. ఫ్రాన్స్‌లోని ఒక స్థలంలో ఒక యువకుడి శవాన్ని కుడివేపుకు తిప్పి, మోచేతిని తలకింద అమర్చి పాతారు. దగ్గరలోనే రాతి ఆయుధాలు ఉంచారు. ఆ పక్కనే ఆ కాలపు ఎద్దును కాల్చిన అవశేషాలున్నాయి. అంటే ఏదో విందు కూడా జరిగిందన్నమాట. మరొకచోట ఒక నియాండర్తాల్ మానవుడి శవాన్ని ఇలాగే పడమటివేపుకు తిప్పి, రాతి పనిముట్లతో సహా జాగ్రత్తగా బండల మధ్యన పాతిపెట్టారు. కొన్నిచోట్ల శవం తలచుట్టూ వలయాకారంలో అమర్చిన రాళ్ళు కనిపిస్తాయి. ఇవన్నీ మనం ప్రాచీనం అనుకునే ఈజిప్ట్ నాగరికత వగైరాలకన్న ఎంతో పాత సంఘటనలు. ఏది ఏమైనా అంతటి ప్రాచీనయుగంలోనే మనుషులు చనిపోయిన సాటివారి గురించీ, చావును గురించీ ఎంతో ఆలోచించేవారని స్పష్టంగా తెలుస్తోంది.
చచ్చిపోవడమనేది తప్పనిసరి అని తెలిశాక ప్రాచీనులు చావును గురించి ఎంతగా బెదిరి ఉంటారో మనకు తెలియదు. కష్టాలమయంగా గడిచిన అప్పటి కాలంలో ప్రాణానికి ఇప్పటికన్నా చాలా ఎక్కువ విలువ ఉండేదని ఊహించవచ్చు. అసలే సగటు ఆయుఃప్రమాణం చాలా తక్కువగా ఉండి, రోగాలూ, గాయాలూ, ప్రమాదాలూ బలి తీసుకున్నప్పుడల్లా అప్పటి జనాభా తగ్గుతూ ఉండేది. నలుగురూ కలిసి ఐకమత్యంతో బతికితేగాని పూట గడవని ఆ కాలంలో చావు అనేది చాలా అవాంఛనీయం అనిపించి ఉండాలి. ఈ కారణలవల్ల చావు అనేది ఎంతో తాత్వికచింతనకూ, తొలి మతపరమైన తంతులకూ దారితీసి ఉండాలి. చనిపోయిన తరవాత ఏమవుతుందోననే అనుమానాలూ, అపోహలూ, చనిపోయినవారి శక్తిని నిలిపి ఉంచే ప్రయత్నాలూ, వేరే రూపంలో వారు కొనసాగుతారేమోననే ఆశతో రకరకాల సంకేతాల అన్వేషణలూ, ఇలా ఆలోచించడం కేవలం పొట్ట పోసుకునేందుకు పాటుపడే జీవితాలకు సంబంధించని దిశలో మనుషుల మానసికజీవితాన్ని మలుపు తిప్పి ఉంటుంది. ఇప్పటికీ ‘పరలోకం’ గురించి ఆలోచించడానికి మనని పురికొల్పడంలో దేవుడికన్నా మరణం గురించిన ఆలోచనలే బలంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.
మనిషి ఏనాడైనా తనకు తెలిసిన విషయాలను గురించి నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తాడు. తెలియనివే కలవరపెట్టి బాధిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది చావు. తెలియని వాటి గురించే బాధంతా. జబ్బు చేస్తే మందులు తీసుకుంటాం కాని పూర్తి నమ్మకం ఉండదు. చావు భయంతో మొక్కుకోవడం, జ్యోతిష్కులదగ్గరికి వెళ్ళడం వగైరాలు చూస్తాం. మనస్సు బలహీన పడినప్పుడల్లా మతాలు కావలసివస్తాయి. అయితే ఒకసారి వచ్చి తిష్ఠ వేసిన మతాలు మనను వదిలి పెట్టకుండా బాధిస్తూ, అప్పుడప్పుడూ రక్తపాతానికీ, హింసకూ కూడా కారణమవుతూ ఉంటాయి.
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. ఇవన్నీ అలా ఉంచి వృత్తిరీత్యా ఆయన అణుధార్మిక శాస్త్రవేత్త! చాన్నాళ్ళ కిందటే తెలుగులో బ్లాగులు (http://rohiniprasadk.blogspot.com, http://rohiniprasadkscience.blogspot.com) రాయడం మొదలుపెట్టారు.
దీన్ని బట్టి నాకు తెలుస్తున్నవి మూడు:
1. మన వాళ్ళు ఏ తవ్వకాలూ, అవశేషాలు ఇండియాలో కనుక్కోలేదు;
2. ఆస్ట్రియాలోనో, ఫ్రాన్స్లోనో దొరికిన అవశేషలతో,ఆలోచించుక్కున్న “ఆలోచనలని” , మనదగ్గరకూడా సరిపోయాతని మనకి అన్వయించారు.
3.మన దగ్గర ఇటువంటి శాస్త్ర పరిశోధన జరగటం లేదు; ఆ దృక్పదంలో వెదికితే, మనకీ ఇలాంటి అవశేషాలు దొరకవచ్చు; ఒక వేళ అలాంటి ఎవిడేన్స్ – అవశేషలూ దొరకకపోతే, ఇక్కడేదో వేరే ఫినామినా జరిగి ఉండవచ్చు; ఒక వేళ దొరికితే, ఇక్కడ ఏం జరిగిందనేది, మళ్ళీ ఓపిగ్గా ఆలోచించుకోవాలి;
తేలియ జేసినందుకు దన్యావాదాలు
పొద్దు పత్రిక శాస్త్రీయ ఆలోచనల పేరుతో నాస్తిక రచనలకి వేదికగా మారడం పట్ల నా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాను. ఇలాగే కొనసాగితే నేనీ పత్రికని బహిష్కరిస్తాను.
>>5 లక్షల ఏళ్ళనాటి పీకింగ్ గుహల్లోనూ, 70 వేల సంవత్సరాలనాటి యూరప్ గుహల్లోనూ…..
ఇలాంటివి నమ్మటానికి శాస్త్రవేత్తలకి పాపం ఏ అభ్యంతరం ఉండదు. ఏ శాస్త్రం ఖచ్చితంగా నిరూపిస్తుంది ఆ గుహ అయిదు లక్షల ఏళ్ళది అని లేదా ఆ శవాలు వేల ఏళ్ళ వని. ఓ శాస్త్రవేత్తలు కొన్నాళ్ళు కష్టపడి ఏదో ఓ సంఖ్య వాళ్ళ అంచనా బట్టి చెపితే సైన్స్ చెప్పింది అంటూ నమ్ముతారా? అదే దృష్టి సనాతన సంప్రదాయాలు, నమ్మకాలపైన ఉండదే?
ఉదాహరణకి కనీసం బెనెఫిట్ ఆఫ్ డౌట్ కోసమైనా,
రామసేతు ఉంది. ఓ అయిదారేళ్ళ కిందట ఓ ఉపగ్రహం తీసిన ఫోటో ప్రకారం అక్కడో వంతెన లాంటిదేదో ఉంది అని తేల్చింది. అది నిజంగానే రామసేతు అని నమ్మకపోయినా, కనీసం అయుండొచ్చా అన్న ప్రశ్న కూడా రానీయరు.
అదే పరిస్థితి ద్వారకదీను. అక్కడ సముద్రంలో పట్టణం ఉందని ఖచ్చితంగా కనుగొన్నది ఇటీవలనే. కానీ ద్వారక మునిగిందని వేల ఏళ్ళ ముందునుంచే మొత్తుకుంటున్నాయి గ్రంధాలు.
ఈ ద్వంద్వ ప్రవృత్తి ఎవరికీ మంచిది కాదు.
ఇలాంటి వ్యాసాలు మరిన్ని ఉదాహరణలతో, సోదాహరణంగా ఉండాలి అని అనుకుంటున్నాను. ఊరికే అలా చదివి వదిలేయదగ్గవి కావు ఈ వ్యాసాలు.
ఏదేమైనా చక్కటి వ్యాసం. పొద్దుకు ధన్యవాదాలు.
సర్ ! మీ వివరణ వాస్తవానికి దగ్గరగానే అనిపిస్తుంది …”ఇప్పటికీ ‘పరలోకం’ గురించి ఆలోచించడానికి మనని పురికొల్పడంలో దేవుడికన్నా మరణం గురించిన ఆలోచనలే బలంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.”కాని ఎంతమంది ఈ విషయంలో ఏకీభవిస్తారు ?
ఆస్ట్రియాలోని ఒక గుహలో 5 మీటర్ల లోతున పాతిన ఇద్దరు కవల శిశువుల అవశేషాలు దొరికాయి. 27 వేల ఏళ్ళనాటి ఈ పిల్లలను జాగ్రత్తగా చర్మంలో చుట్టి, మేమత్ ఏనుగు దంతాల చాటున ఖననం చేశారు. వారి శరీరాలకు ఎర్రనిపొడి పూశారు.
___________________________________________________________________________________________
Do they still use Red Powder in Austria? If not, why is the red powder found only in India and nowhere else?
అసలే సగటు ఆయుఃప్రమాణం చాలా తక్కువగా ఉండి, రోగాలూ, గాయాలూ, ప్రమాదాలూ బలి తీసుకున్నప్పుడల్లా అప్పటి జనాభా తగ్గుతూ ఉండేది. నలుగురూ కలిసి ఐకమత్యంతో బతికితేగాని పూట గడవని ఆ కాలంలో చావు అనేది చాలా అవాంఛనీయం అనిపించి ఉండాలి. ఈ కారణలవల్ల చావు అనేది ఎంతో తాత్వికచింతనకూ, తొలి మతపరమైన తంతులకూ దారితీసి ఉండాలి.
____________________________________________________________________________________________
Any Data to support this?
మతపరమైన సమాజాలు మాత్రమే ఎందుకు చరిత్రలో మిగిలాయి?
నా అభిప్రాయాలు ఇక్కడ
A question has been asked:
“Do they still use Red Powder in Austria? If not, why is the red powder found only in India and nowhere else?”
I don’t belong to Austria and anyone is free to find out the answer for the first part of the question. The second part perhaps deals with the persistence of out-dated beliefs in the Indian culture. We never throw out ANYTHING from the past. The ancient Babylonians ascribed powers to a god caled who made rains help grow seedlings sown in the earth. The ancient Greeks accepted the scientific principle but threw our Marduk’s role. Our ancients never did such things.
భౌతికవాదిగా నాకు ఆసక్తికరం అనిపించిన చారిత్రక, పూర్వచారిత్రక సమాచారాన్ని తెలుగులో మరెవరూ రాస్తున్నట్టు కనబడకపోవడంతో నేను వ్యాసాలుగా రాస్తున్నాను. ఇదంతా తప్పనీ, భారతదేశంవంటి పుణ్యభూమికి వేరే ఏదో చరిత్ర ఉందనీ తెలిసినవాళ్ళు ఏవైనా సాక్ష్యాలూ, ఆధారాలతో వ్యాసం రాసి పంపితే పొద్దు సంపాదకులు వేసుకుంటారేమో ప్రయత్నించవచ్చు.
ఏయే గుహలు ఎన్నేళ్ళనాటివో ఎలా తెలుస్తుంది అని నన్ను సవాలు చేసే బదులుగా ఆసక్తి ఉన్నవారు అలాంటి విషయాలకు ఎటువంటి వైజ్ఞానిక పద్ధతులు వాడుతున్నారో తెలుసుకుంటే బావుంటుంది.
సైన్సును ఈసడించుకునే ముందుగా అలా చేసేవాళ్ళు సైన్సు సహాయం కనక లేకపోతే జన్మించే ఉండేవారు కారని గుర్తుంచుకోవాలి. నేను ముందుగా కృతజ్ఞతాభావంతో తలుచుకునేది నేను పుట్టిన ఆస్పత్రిలో పనిచేసిన మెటర్నిటీ వైద్యులనే! మా అమ్మానాన్నా ఏ దేవుణ్ణీ నమ్మలేదు కనక నేను పుట్టడానికి దోహదపడినది వైద్యులే.
Correction: The ancient Babylonians ascribed powers to a god called Marduk who made rains help grow seedlings sown in the earth.
No one knows the prehistoric world’s population figures but scientists estimate it to me about 5 million around 8000 BC.
The discovery of 35,000 year old fertility figurines clearly indicates that life and reproduction were celebrated in ancient times.
http://news.aol.com/article/oldest-erotic-sculpture/480872
Our own phallic symbol Shiva lingam worshipped since old days is indicative of that.
అంత లోతుగా తెలుసుకోటానికి అసలు ఆ లెక్కలు ఖచ్చితమైతే గదండీ? అన్నీ ఎప్పటికప్పుడు మారిపోయే ఉజ్జాయింపు లెక్కలు. రాకాసిబల్లులు ఎంత పురాతనమైనవి అన్న లెక్కలు ఎన్ని సార్లు మార్చారు? భూమి వయసు లెక్కలెన్ని సార్లు మార్చారు? కానీ ఓ శాస్త్రవేత్త చెప్పాడన్న ఒకే ఒక్క కారణంతో అదే సత్యం అని నమ్మి, ఇతర శాస్త్రాలు పనికిరావనటంలోనే ఉంది అజ్ణానం అంతా.
మీ నమ్మకాన్ని కాదనను గానీ, ఇతరుల నమ్మకాల్ని పలుచన చేయకండి.
చంద్రలోకానికి మనిషిని పంపబోతున్న మాధవన్ నాయర్ గారికి వేంకటేశ్వరుడు ఎందుకంటే ఎలా ఉంటుంది? ఎవరి నమ్మకాలు వారివి.
>> సైన్సును ఈసడించుకునే ముందుగా అలా చేసేవాళ్ళు సైన్సు సహాయం కనక లేకపోతే జన్మించే ఉండేవారు కారని గుర్తుంచుకోవాలి
సృష్టిలో అసలు జీవం యొక్క ఆవిర్భావానికి సైన్స్ సమాధానం చెప్పగలిగిన రోజున, మీ లాంటి భౌతికవాదులకి, నాస్తిక వాదులకి సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తాను. అది సైన్స్ చెప్పలేనంత వరకు దేవుడి ఉనికిని ప్రశ్నించే హక్కు సైన్సుకు లేదు. అది సైన్సు సెన్స్ కందనిదని అందరికీ తెలుసు 🙂
సవరణ:
దండ ప్రమాణాలు = దండ ప్రణామాలు
Science has already explained the evolution of life.
One news item:
http://www.wired.com/wiredscience/2009/05/ribonucleotides/
సైన్సు తన నమ్మకాలని పట్టుకుని వేళ్ళాడదు. కొత్త సాక్ష్యాలు లభించినప్పుడల్లా తన ప్రతిపాదనలను సవరించుకుంటుంది.
నమ్మకాలనూ, సంప్రదాయాలనూ పట్టుకు వేళ్ళాడదలుచుకున్నవారికి సైన్సు విషయాలు అనవసరమేమో. వాటిని ఉపేక్షించి ఊరుకోవడం ఉత్తమం.
Dr Prasad,
The second part perhaps deals with the persistence of out-dated beliefs in the Indian culture
_____________________________________________________________________________________________
I will take your point if you can present the Data that proves that the world ( or at least the region between India and Austria) used Blood and Red powder in the way you have mentioned and the other civilizations rejected its usage afterwards. Otherwise, the sporadic coincidence of the usage of the red powder in two different regions of the world does not lead to any conclusions!
భౌతికవాదిగా నాకు ఆసక్తికరం అనిపించిన చారిత్రక, పూర్వచారిత్రక సమాచారాన్ని తెలుగులో మరెవరూ రాస్తున్నట్టు కనబడకపోవడంతో నేను వ్యాసాలుగా రాస్తున్నాను. ఇదంతా తప్పనీ, భారతదేశంవంటి పుణ్యభూమికి వేరే ఏదో చరిత్ర ఉందనీ తెలిసినవాళ్ళు ఏవైనా సాక్ష్యాలూ, ఆధారాలతో వ్యాసం రాసి పంపితే పొద్దు సంపాదకులు వేసుకుంటారేమో ప్రయత్నించవచ్చు.
___________________________________________________________________________________________
Well you presented your Hypothesis and I asked for the Data supporting it. As you are a genuine “భౌతికవాది” (and a mature writer unlike some rhetoric-oriented self styled intellectuals) I would definitely expect some Data that supports your opinion.
For instance, nobody should have any problems with this:
“27 వేల ఏళ్ళనాటి ఈ పిల్లలను జాగ్రత్తగా చర్మంలో చుట్టి, మేమత్ ఏనుగు దంతాల చాటున ఖననం చేశారు. వారి శరీరాలకు ఎర్రనిపొడి పూశారు. ఏదో పెద్ద తంతు జరిపి ఉంటారని ఈ ఏర్పాటునుబట్టి తెలుస్తోంది. రక్తం అనేది జీవానికీ, ప్రాణానికీ ప్రతీక. ఋతుస్రావం జరగడం స్త్రీల సంతానోత్పత్తికి సంకేతం”
But the next sentence:
ఇటువంటి విషయాలు ఆదిమానవుల మేధస్సును చాలా ప్రభావితం చేసి ఉంటాయి కనకనే ఇప్పటికీ మన పూజల్లో కుంకుమ లేకుండా జరగదు. బలి ఇచ్చిన మేక రక్తాన్ని ముఖానికి ‘రక్ష’గా పూసుకునే అలవాటు పశ్చిమాసియా తెగల్లో ఉందట. మన దేశంలో జంతువు (లేదా మనిషి) రక్తాన్ని ముఖానికో, నుదుటికో పూసుకునే అలవాటు కొనసాగి ప్రస్తుతం ఎర్రని తిలకాలూ, బొట్లూ మిగిలాయి.
concludes something drastic ( I do take your point that you are not criticizing it ) and since it is a radical shift in thought, I would expect some proof to support your argument.
I would’t have bothered much had you said “కనకనే ఇప్పటికీ మన పూజల్లో కుంకుమ లేకుండా జరగదేమో అని నా ఉద్దేశ్యం” or “ఎర్రని తిలకాలూ, బొట్లూ మిగిలి ఉండవచ్చు”.
If some Malakpet Rowdy blabbers something, not even 10 people take it seriously but if some established and well respected writer like you says something then scores of people pay attention to it and many will start believing it – They take it for a fact instead of an opinion.
Use of red powder as an alternative to the quickly decaying blood may not be a great matter for debate.
There are some links here. Others can also be serached:
http://www.waterdragoninc.com/RedOchre.pdf
http://books.google.com/books?id=GTv50UPAPvsC&pg=PA60&lpg=PA60&dq=prehistory+use+of+red+powder&source=bl&ots=8cF0QOcZVq&sig=T4mLL4lojS5i59Q4jDkDvKSpXWg&hl=en&ei=dQAPSuv5HZOktwfcrr2RCA&sa=X&oi=book_result&ct=result&resnum=9
30, 40 వేల ఏళ్ళ క్రితం మనుషులు ఎలాంటి జీవితాలు గడిపారో, వారికి జీవితపు కష్టసుఖాలను గురించి ఎటువంటి భావనలుండేవో మనమిప్పుడు ఊహించవలసిందే. వారి అపోహలనూ, నమ్మకాలనూ మనమిప్పుడు వెక్కిరించవలసిన పనిలేదు.
ఈనాటికీ ఆదిమతెగలలో తెల్లపక్షి కూతలకూ, జంతువుల అరుపులకూ సంకేతరూపకమైన అర్థాలుంటాయనే నమ్మకం కనబడుతుంది. అందుకు వారిని తప్పుపట్టడం కష్టం. అయితే చదువుకున్నవారుకూడా తాము ఏదైనా అనగానే గంట మోగిందనో, దేవుడి కోసమని పెట్టిన పువ్వు బాలెన్స్ తప్పి కిందికి రాలిందనో విపరీతార్థాలు తియ్యడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
I don’t want to start a cult nor expect any blind following. People can get interested after reading my articles and probe further on their own if they want. Tapi Dharma Rao’s books provoked such interest and led people to go much further. My role will be much much humbler.
సృష్టి ఆవిర్భావానికి మీరిచ్చిన లింక్ వ్యాసం మీరు పూర్తిగా చదివినట్లు లేదు. అలానే కిందున్న కామెంట్లు చదవండి. జీవమున్న ప్రాణుల్లో ఉన్న RNA సింథసైజ్ చేసామన్నారే గానీ జీవాన్ని కాదు(ఈ RNA కూడా ప్రామాణికం ఎంతవరకో అనుమానమే, Wired లాంటి వెబ్ సైట్లలో వ్యాసాలు నూరు శాతం నిజాలు కావు, అవి కేవలం ఫలానా కృషి జరుగుతోంది అన్న సమాచారం ఇచ్చే ప్రదేశం, అంతే).
రంగారావుగారూ, సైన్సును వదిలేసి, జీవం అంటే ఏమిటో, అది ఎలా తయారవుతుందో మీరు తెలుసుకుని మాకుకూడా చెప్పండి. దాన్ని కృత్రిమంగా తయారుచెయ్యడం ఎందుకు వీలవదో కూడా చెప్పండి. దైవసృష్టి గురించి సాక్ష్యాలేవైనా ఉంటే ఇవ్వండి. నమ్మకాలను ప్రస్తావించవద్దు.
I don’t want to start a cult nor expect any blind following.
____________________________________________________________
You can’t stop people from following you – Can you? Those who like your articles, keep reading them and more importantly WILL HAVE expectations. I may disagree with you on some fronts (In fact I did, on Telugupeople.com), but then if I come across an article that bears your name – I wouldn’t miss it for more often than not, I get to know something new!
ఇదేదొ బాగుందే. “రంగారావు గారూ, మీ సాక్షాలెక్కడా?” అని రోహిణీ ప్రసాదుగారు, “రోహిణీప్రసాదుగారూ! మీ సాక్షాలెక్కడా?” అని మలక్పేట రౌడీగారు ఒకరివెంట ఒకరు బాగానే పడుతున్నారు
“if I come across an article that bears your name – I wouldn’t miss it for more often than not, I get to know something new!”
Thanks for the trust but surely even Bertrand Russell doesn’t have to be followed in blind faith.
My point is that as time goes by, we should look at the past more dispassionately and assess things for what they are. Sankaracharya of 8th century AD and Karl Marx of the 19th century have all recorded what they believed in to be the guiding principles. Had they been satisfied with what was said earlier and followed it blindly we wouldn’t remember them now.
We now have the advantages of having a Hubble telescope and a multi-disciplinary approach to investigate nature and history. My modest effort is only to bring to light some of the interesting points which we can understand as lay persons. Nothing more. f anyone wants to believe in the contrary, how can I stop them?
Okay,
By the way I didn’t know you had a blog too – just going thru that. Are you an OP Nayyar fan too? (Sorry for digressing from main topic of this discussion though)
“OP Nayyar fan”
The editors of eemaata had requested me to write on OPN since he had just passed away. Of course he was a capable composer…
సరిసరి. ఇది మరీ బాగుంది. ఏదో సైన్స్ అన్న పేరు చెప్పి గుహలు, శవాలు అంటూ మతమూ, విశ్వాసాలు పనికిరావంటూ రాసింది మీరు. మరయితే మీ సైన్సుకు అంత నిక్కచ్చిగా ఇవన్నీ ఎలా తెలుసు అని ప్రశ్నిస్తే, తగ్గ సమాధానం ఇవ్వలేగానీ, ఎదుటివారిని ఎదురుప్రశ్నలు వేసి మీరు తప్పించుకుంటే ఎలా?
నాకు మత సంబంధ విశ్వాసాలున్నాయి, అలాగని గుడ్డిగా సైన్సుని వ్యతిరేకించను. రెంటినీ గౌరవిస్తూ పోవటమే మంచిదంటున్నా. కానీ మీ దారి వేరేలా ఉంది.
యోగా, ప్రాణాయామం ఆరోగ్యాన్ని పెంచుతాయి అన్న మాటని మొదట్లో ఎద్దేవా చేసి చివరికి తప్పయింది అది నిజమే అని సైన్స్ లెంపలేసుకుని ఒప్పుకున్న కాలం ఇది. ఇదొక్కటి చాలు రెండూ వేటికవే సాటి అని చెప్పటానికి.
యోగా, ప్రాణాయామం ఆరోగ్యాన్ని పెంచుతాయి అన్న మాటని మొదట్లో ఎద్దేవా చేసి చివరికి తప్పయింది అది నిజమే అని
_________________________________________________________________________
రంగారావుగారూ,
ఆ ఎద్దేవా చేసింది కమ్యూనిష్టులు గానీ సైంటిస్టులు కాదేమో? కమ్యూనిష్టులు కాబట్టీ తప్పు తెలిసినా చెంపలేసుకోరు – అది వారి ప్రత్యేకత మరి – కావాలంటే బృందా కారత్ ని అడగండి :))
మతవిశ్వాసాలు ఎందుకు, ఎప్పుడు, ఎలా మొదలయాయో, మానవచరిత్రలో వాటి పాత్ర ఏమిటో, అవెందుకు నేటికీ కొనసాగుతున్నాయో తెలుసుకోవటం కష్టంకాదు. నాకు తెలిసిన కొన్ని వివరాలు ఇతర వ్యాసాల్లో ప్రస్తావిస్తాను.
సైన్సును “నిరూపించటానికి” ప్రత్యేకమైన సాక్ష్యాలు అక్కర్లేదు. ఒకప్పుడు నిప్పు చెయ్యడం కూడా మనిషి సాధించిన సైన్సే. ఈ విషయాల గురించి నేను వందలకొద్దీ వ్యాసాలు రాశాను, రాస్తున్నాను. ఇక్కడ వాటి చర్చ అనవసరం.
మంచి చర్చ.
rohiniprasad garu,
thanks a lot for publishing good and interesting articles.
I request you to continue the same way without getting disappointed or deviated from your stand for any reason.
I also believe in science and search constantly for the truth and strongly believe science only can give that truth with evidence.
Br
Vijay.
Rohini Prasad gaaru, Anu sastravetha aina mee comments cheap gaa vundatam bagaa ledu. Science valle meeru putti perigaaru bagaane vundi. Prapanchamloni 600 Kotla prajalu science dwarane puduthunaara?.
Doctor vaddaku vellakunda 90 years brathikinavaaru naaku telusu. vaariki science to pani ledu.
Mana body lo immune system vundi. science vunna lekapoyina adi daani pani chestune vuntundi. science daanini telusukuntundi. Ante.
Adavi loni jinka pillalu doctor avasaram lekane pulula madhya putti perugutunnayi. Vaatiki evaru rakshana kalpistunnaru?
Oka simple question:
Rohini PRasad Evaru?
Ee prasna simple kaani nijayiteega aalochiste answer chala kastam. Idi teliste viswame artham avutundi.
Science dwara anni prayogaalu chestunnarukatha mari yogam meeda kooda parishodana chesi adi tappu ani cheppandi.
Mr. Shyam,
Before you start correcting me, you must clearly understand what the real meaning of science is. Science is not merely what is being taught or practised in laboratories today.
You must also know the fundamentals of nature, flora and fauna. You can get very interesting information if only you don’t begin with a preconceived set of notions. I myself wrote several dozens of articles on the topics you mentioned.
Pl rest assured I have given enough thought to all these and many more problems.
You need not agree with what I write but I will continue to expand on this theme until those who are interested obtain the complete perspective.
Prasad gaaru,
I agree with you, this world is of very interesting things. Also I know what is science? You ( or science) are knowing only what it is or how to make use of it but please understand you are not creating any thing. Yet you are not recognizing the creator and thinking science is great. You can see the whole world with your eyes. but can you see your own eyes? Similarly you can see the creation but not creator. It doesn’t mean he is not there. As a scientist practise yoga for one year then assess your results.
అనాగరిక దశలోనే కాదు, నాగరిక దశలో కూడా, ప్రాచీన మత విశ్వాసాల పరిణామంలో, రూపు కొంతమార్చుకుని పుట్టిన కొత్త మతాల అవిర్బావంలో కూడా చావు ప్రముఖ పాత్రను కాదు, కీలకవైన పాత్రను పోషిస్తుంది. అన్ని మతాలకి, చావు తర్వాత దశమీద ఆశ, లేకపోతే మరో జన్మ లేని దశ మీద (అదికూడా చావు తర్వాతే కదా) ఆశ, లేకపోతే ఆ మరో జన్మ మీద ఆశ అనేవే పునాదులుగా వున్నాయి కదా.
మొట్ట మొదట చూసిన కుందేటికి మూడు కాళ్ళున్నా, కుందేలుకి నాలుగు కాళ్ళు వుండాలని తన జీవ శాస్త్ర పరిజ్జానం, అనుభవం, వాటి పునాదిగా వున్న రేషనల్ లాజిక్ వలన శాస్త్రవేత్త కుందేటికి నాలుగు కాళ్ళుంటాయని ఊహించగలుగుతాడు, ఆ తర్వాత దాన్ని నిరూపణ చేసుకుంటాడు. ఒక వేళ ఆ నిరూపణలో ఫెయిలయితే, తన మొత్తం లాజికల్ బేస్ నే సవరించుకునే దానికి వెనుకాడడు.
మతానికి, శాస్త్రానికి (మంత్రాలు, వేదాలు కాదు) మధ్య వున్న పెద్ద అగాధవిదే. మతంలో నమ్మకం, నమ్మకవొక్కటే ముఖ్యం. శాస్త్రంలో తర్కాం మీద ఆధారపడిన, విష్లేషించదగిన, నిరూపించదగిన వాస్తవవే ముఖ్యం. దీనర్దం శాస్త్రంలో తప్పులుండవని, తప్పులు జరగవని కాదు, అవి తప్పులుగా తెలిసినప్పుడు, సవరణలుంటాయి. మతంలో నమ్మకాలు మాత్రవే వుంటాయి. సవరణలొచ్చి (ఆ సవరణలు కూడా ఋజువుకాబడిన తర్క విష్లేషణాలు కావు, లాజిక్తో సంభందంలేని మరో నమ్మకం అంతే) మరో శాఖో, మతవో వస్తే అక్కడ కూడా మళ్ళీ నమ్మకాలే వుంటాయి. అన్ క్వశ్చన్డ్ లాయల్టీ అక్కడ ముఖ్యం. తర్కం తో మతానికంత సఖ్యతలేదు.
రోహిణీ ప్రసాదు గారు, మీ వ్యాసం బాగుంది గానీ, మరింత విస్రుతంగా ఉండాలని నాకనిపించింది. ఆ కుదింపు వలన సరి అయిన లాజికల్ చర్చ వ్యాసంలో జరగలేదేవోనని నా అనుమానం.
ayya! eee science tho vachhina chavu entante tirigi tanu oka kotta maata cheppe
daaka intaku mundu tanu cheppinadanta parama satyam antundi.kootiki kooda
badha padevallu(desamlo valle ekkuva kadaa) danito confuse
i potaaru.vastavaniki sivuni medalo nunnadi paamu swarupam matrame kaadu.adi human gene ki sanketamaina A C T G lu gaa gamaninchu kovali.gudi lo hechharika(naaga pratimalu) kuudaa aa DNA sanketame.nee arogyam nee IQ poorvula ninchi vachhinave kadaa.mata viswasam mariyu science kavalalu.okati leka rendavadi ledu.