మనసుకు చూపుంటే…

–స్వాతీ శ్రీపాద

నిశ్శబ్ద సమరానికి సమాయత్త మవుతూ
భావాల బూజు దులిపి
అనుభవాల ఆక్రందనాలను
అక్షరాల్లోకి అనువదించే
మనసుకు చూపుంటే …

మాసిపోయిన మందహాసాల వెనక
జీవితం ఉరి కంబం మీద
బిక్కు బిక్కు మంటూ దిక్కులు చూసే
మధ్య తరగతి మరణ శాసనాలకు
నిలువెత్తు అద్దం పట్టే
ఆధునిక హింసా చిత్ర మయేది

గాజుగోడల సౌకుమార్యం మధ్య
అలమటించే సముద్ర ఘోష
అలలై ఎగసి పడే తామస ద్వేషాలు
నీ ఉనికిని శాసించే వేళ
ఊపిరందక ఉక్కిరి బిక్కిరయే
ఊహా గానమయేది

మొలవని రెక్కల్ను విదుల్చుకు
విహాయసంగా సుదూర తీరాలకు
వలస పోవాలని స్వప్న బాలికలు
నిర్మించే సైకత సౌధాలు

ఇంకా పుర్తిగా రూపం రాని కళ్ళ రెప్పలను చిదిమి
పదాల పెదవుల కతికించాలని
ఉబలాట పడే నిట్టూర్పులూ

తీరాన్ని మింగేసి అలలను ఆరబెట్టుకునే
సప్త సముద్రాల క్రౌర్యం

మనసుకు చూపుంటే
చరిత్ర కరపత్రాలయేవి

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

12 Responses to మనసుకు చూపుంటే…

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    baguMdi
    baaguMdi
    abhinaMdanalu

  2. radhika says:

    బాగుందండి. మంచి కవిత అందించినందుకు మీకు, చదివించినందుకు పొద్దువారికి నెనర్లు.

  3. మీ భావనా శక్తిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కవిత్వం కదిలించేది. నేనన్న మాటలు కాదండోయ్. శ్రీ శ్రీ గారివి. ఆ కదలించే గుణం మనసు చూసే చూపును బట్టి ఉంటుంది. అనుభవాల ఆక్రందనలను అక్షరాల్లోకి అనువదించడానికి మనసుకు చూపుండాలని – కవిత్వానికి నిర్వచన్మ్ ఇచ్చారు. మంచి కవిత. ధన్యవాదాలు.
    స్వరూప్

  4. ఏ౦ చెప్పాలో తెలియట్లేదు కానీ ఒకటి మాత్ర౦ చెప్పగలను.

    మనసుకు చూపుంటే
    చరిత్ర కరపత్రాలయేవి
    కవితకి నోరు౦టే
    నిజ౦గా మీకవితలా ఉప్పెనయ్యేది.

  5. swatee says:

    john garu,
    thank you
    swatee

  6. swatee says:

    radhika garu
    krythajnathalu
    chadivevallu dorakatam maa adrushtam
    swatee

  7. swatee says:

    raadhika gaaru
    chadive variki maa thanks
    swatee

  8. పది సార్లకు పైగా చదివినా నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ పది సార్లు చదివంచగల ఏదో ఆకర్షణ వుంది పద్యంలో. cadavre exquis కళాఖండంలా.
    మీ ఆలోచనాఖాతంలోనికి ఒక కిటికీ తెరిస్తే అందులోనుంచి ఆ అంతులేని లోతుల్లోనికి చూచేవారికి ఏదో కనబడుతుందే గానీ ఆ కనబడే నీడలు ఏమిటో తెలియనట్లు – ఈ కవిత కూడా సంధ్యాక్రాంతిలో ఒక మసగ లోయలోనికి తెఱచుకున్న కిటికీలా వుంది .

  9. swatee says:

    anandam garu
    cadavre exquis -ante teleedu naaku
    aalochanaakhaatame telidu chalamamdiki
    manasuku chupunte chikatlonu chudgalaru
    thank you
    swatee

  10. swatee says:

    swarup krishna garu
    thanks for your compliments
    swatee

  11. Hmm…. బాగుందండీ. కానీ, నేనింకో రెండు మూడు సార్లన్నా చదవాలేమో పూర్తిగా అర్థం చేసుకోడానికి.

  12. swathi, namaste. manasuku chupunte bagundi. chupu ante manase. gaaju kallu kavu.. bhavani devi.c.

Comments are closed.