ఏప్రిల్ గడిపై మీ మాట

ఏప్రిల్ గడి గురించి మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. మార్చి గడి, సమాధానాలు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

29 Responses to ఏప్రిల్ గడిపై మీ మాట

  1. అబ్బో!
    ఇంచుమించు ఓ అవధానికి తెలిసినన్ని విషయాలు తెలియాలి ఈ గడి పూరించాలంటే! “రసిక రాజ..” అన్నప్పుడే ఇదేదో మనది కాదు లెమ్మని వుసూరుమన్నా!
    వ్యాకరణ విషయాల నుండీ, పెద్దన కావ్యాల నుండీ, రాయల ఆస్థాన విషయల నుండీ, సినిమా, నాటకాల చరిత్రల నుండీ, ఇప్పటి వికీపీడియా వరకు తెలిసివుండటమంటే మాటలా మళ్ళీ అందులో చతురత!
    కూర్చిన వాళ్ళకు, పూరించిన వాళ్ళకు వేయిన్నొక్క దండాలు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  2. మార్చి గడే కష్ఠమనుకుంటే ఇది దాని తాతలాగుంది. అప్పుడే నయం ఒక ఐదారు పదాలన్నా పూర్తిచేయగలిగాను. ఇప్పుడు దీన్ని చూస్తుంటే ఒక్కటికూడా పూర్తిచేయగలననిపించడంలేదు.

  3. త్రివిక్రమా! అరగంట బుర్ర బద్దలు కొట్టుకున్న తరవాత 9 అడ్డం ఇప్పుడే నింపాను. ఎదురుగా ఉండి వుంటే తక్షణం నీకో వీరతాడు వేసి వుండేవాణ్ణి. ఆధారాల్లో చమత్కారం చూస్తుంటే పరవశం కలుగుతోంది. మొదటి గడిని మీంచి ఉన్నాయి. అందుకో అభినందనలు.

  4. క్షమించాలి, పరవశంలో చూసుకోలేదు, పై వ్యాఖ్యలో ఏకవచన ప్రయోగం అనాలోచితంగా దొర్లింది.

  5. కొత్తపాళీ గారూ!

    మీ లాంటి పెద్దలు ఏకవచనంతో పిలవడమే నాకు ఆనందం. దయచేసి అదే కొనసాగించండి.

    ఇకపోతే ఈ నెల గడి కూర్పరిని నేను కాదు. సిముర్గ్. మీ అభినందనలు, వీరతాళ్ళు వారికే చెందుతాయి.

    గడి కూర్చమని వారిని నేనే అడిగాను. అందుకు మాత్రం మీరు నన్ను అభినందించాల్సిందే! 🙂

  6. కొన్ని నింపి మిగిలినవి రేపంటే వినట్లేదు. మరురోజు మళ్ళీ వ్రాయి అని ఇంపోజిషన్ వ్రాయిస్తోంది. గడి పళంగా దాచుకొని రొజూ కొద్దికొద్దిగా మేసే ఏర్పాటు ఉంటే బాగుండును. ఏమిటీ? ఓ గడ్డి పరకేస్తే, మోపే అడుగుతున్నానను కొంటున్నారా? మేతేసే అమ్మనే కదా గడ్డి అడగమన్నారు.

    నేను ఏప్రిల్ నెల పజిల్ పంపేసా- ఒక గడి వదిలేసా- మళ్ళీ పంపిచ్చన్నారు కాదా అని. మొదటి పక్షికి ఏమైనా ప్రత్యేక ప్రశంశ ఉందా?
    సిముర్గ్ గారిని పరిచయమ్ చేయరా?

  7. మహానుభావులారా నా వల్ల కాలేదు కాక కాలేదు. ఇలా కాదు కానీ కొన్ని సంవత్సరాలు ఎక్కడైనా తపస్సు చేసి అప్పుడు ప్రయత్నిస్తా.
    రాసింది పంపుదామంటే ఒకదానికి ఒకటి పొంతన లేదు. చదివిన వాళ్ళకి పిచ్చి గా ఉంటుంది వద్దులే. ఒక్కటి కూడా సరిగ్గా రాసుండను.

  8. సిముర్గ్ ఎవరు?
    వారి బ్లాగెక్కడ??

    పోయిన్నెల తను నింపిన గడిని రానారె ఎలాగో గడి పళంగా తన బ్లాగులో పెట్టాడు.
    ఆ రహస్యమేవిటో చెబితే కొత్త గడిని గురించి కాస్త పబ్లిగ్గా అందరూ చర్చించుకోవడానికి బావుంటుంది.
    బొత్తిగా ఖాళీ గడిని చూసి చేతులెత్తేసి అస్త్రసన్యాసం చేసే వీరులకి పాక్షికంగా నింపిన గడిని చూస్తే కొంచెం ఉత్సాహం రావచ్చు.
    ఈ గడి నిర్వహణ ఉద్దేశం అందరికీ ఆసక్తి రేకిత్తించాలనే కానీ జనాల్ని భయపెట్టి పారదోలటమో, లేక ఏ కొద్ది మంది మాత్రమే నింపేసి బ్రహ్మాండమైన బహుమతులు కొట్టేయ్యటమో కాదుగదా.
    ఏదో, నాకు తోచిన అవిడియా ఇది. మీ ఇష్టం.

  9. సత్యసాయి గారూ!

    రమణ అన్నట్లు మార్చి గడి తాతలా ఉన్న ఈ గడిని మేం ప్రకటించిన కొన్ని గంటల్లోనే మీరు పూరించడం నిజంగా అద్భుతం! అందుకోండి అభినందనలు. త్వరలోనే మీరు గడిని ఖాళీల్లేకుండా పూరించి పంపగలరని ఆశిస్తున్నాం.
    సిముర్గ్ గారు మనకు తెలియని వారు కాదు. కానీ తానెవరన్నది వారు బయటపెట్టొద్దన్నారు.

    కొత్తపాళీ గారూ!

    “ఈ గడి నిర్వహణ ఉద్దేశం అందరికీ ఆసక్తి రేకిత్తించాలనే కానీ జనాల్ని భయపెట్టి పారదోలటమో, లేక ఏ కొద్ది మంది మాత్రమే నింపేసి బ్రహ్మాండమైన బహుమతులు కొట్టేయ్యటమో కాదుగదా.”

    అయ్యో! లేదండీ. వీలైనంత ఎక్కువ మంది పాఠకులు ఉత్సాహంగా నింపి పంపాలనే పొద్దు ఉద్దేశ్యం కూడా. అందుకే గడి పూరణ ఎలా చెయ్యాలో వివరణ కూడా ఇచ్చాం. గడి ఇంకా తమకు కొరుకుడు పడడం లేదంటున్న వారికి మీలాంటి వారి తెలుగు బ్లాగులు దారి చూపితే మాకు సంతోషమే కానీ అభ్యంతరకరం కాదు.
    గడిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.

  10. నేను చేసింది అదే. స్క్రీన్ షాటు. నేను పూరించినంత మేర ఈమారు బయటపెడదామా అనుకొంటున్నా. ఇది సరైనపని కాదేమో కదా?

  11. కామేష్ says:

    ఏప్రిల్ గడి, మార్చి గడికి ముత్తాత లా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. అందుకు సిముర్గ్ గారు నిజంగా అభినందనీయులు. ఐడెంటిటీని దాచుకోవడం మాత్రం నాకు నచ్చలే. బాగా తెలిసిన వారైనా, క్రొత్తవారైనా అందుకోండి వీరతాళ్ళు. ఇక సత్యసాయిగారు కూడా నిజంగా అభినందనీయులు మొట్టమొదటిగా ఈ గడిని పూరించినందుకు. ఏది ఏమైనా పొద్దులో నాకు బాగా నచ్చిన అంశం మాత్రం గడి మాత్రమే. మిగతావి బాగోలేదని కాదు. ఖచ్చితంగా అవీ బాగున్నాయి, కానీ గడి చాలా చాలా చాలా ……. బాగుంది.

  12. Sriram says:

    చాలా రోజుల తరువాత ఒక నాణ్యమైన గడి తెలుగులో చూస్తున్నాను. మీకు అభినందనలు.

    పది అడ్డం ఆధారంలో తప్పు దొల్లిందేమో అని నాకు అనిపిస్తోంది. ఇక్కడ వివరించి జవాబు ఇచ్చేసి రసభంగం చెయ్యడం నాకు ఇస్టంలేనప్పటికీ తప్పడం లేదు.

    కానీ “లావిక” అనీ “లాతిక” కాదు అనీ మాత్రమే చెప్పి వదిలేస్తున్నాను. త్రివిక్రం గారూ ఒక్కసారి అలోచించండి. నాది తప్పయితే మన్నించండి.

  13. 10 అడ్డం – అర్ధం పరంగా తప్పే కాని, అక్కడ ఇచ్చిన ఆధారం పరంగా తప్పు కాదను కొంటా. చెప్పారు కదా హిందూ లో మాదిరి గడని.

  14. మొదటి విషయం – పైన శ్రీరాం, సత్యసాయి గార్లు మాట్లాడుతున్నది 10 నిలువు, అడ్డం కాదు.
    ఇది నన్ను కూడా కొంచెం తికమక పెట్టింది. మొత్తం సమాధానాలు “లీక్” చెయ్యట్లేదు కాబట్టి గడిలో ఈ భాగం గురించి ఇక్కడ కొద్దిగా చర్చించటం అసందర్భం కాదనుకుంటాను.
    నా ఆలోచనా స్రవంతి ఇలా నడిచింది.
    అ. 9 అడ్డం ఖచ్చితంగా తెలుసు. అంచేత 10 నిలువు “పు” తో మొదలవుతుంది.
    ఆ. 10 నిలువు ఆధారం చూడగానే పుష్పలావిక అనుకున్నాను ఆటోమేటిగ్గా.
    ఇ. 15 నిలువు కుడా ఖచ్చితంగా తెలుసు. దాంతో 18వ గళ్ళో అక్షరం “ప”.
    ఈ. 18 అడ్డం చూస్తే “పతి” అని గట్టిగా అనిపిస్తోంది. అంటే 10 నిలువు పుష్పలాతిక అవుతుంది. ఈ మాటకి అర్థం లేదు. ఐతే పుష్ప లతిక అన్నా అవ్వాలి, లేక పుష్పలావిక ఐనా అవ్వాలి.
    ఉ. నా ఖర్మ కాలి 15 అడ్డం, 24 అడ్డం – ఏదో సందర్భోచితంగా పూరించుకోవాల్సిందే తప్ప ఇతమిత్ధంగా తేలట్లేదు.
    ఊ. 10 నిలువు పుష్పలావికే అనుకుంటే 18 అడ్డం “పవి” అవుతుంది. శ్రీశ్రీ రాశాడు – “కళారవీ, పవీ, కవీ” అని. ఈ మాటకి సరైన అర్థం ఏంటో తెలీదు గానీ, దాంపత్యంలో దాక్కున్న మొగుడిలాగా మాత్రం అనిపించడం లేదు. 🙂

    అయ్యా, సూక్ష్మంగా అదీ డైలమా.
    పనిలో పనిగా 17 నిలువు ఆధారం కూడా పరిశీలించండి – కొంచెం తప్పుదారి పట్టిస్తోందేమో. గడిలో ఉండాల్సిన మాట (ఒక పేరుమోసిన చక్రవర్తి పేరు) నాకు స్ఫ్రించింది కానీ ఇచ్చిన ఆధారం ఆ మనిషిగురించి కాదేమోనని నా అనుమానం.

    ఇదంతా ఇలా ఉండగా – ఒక్క మాట గట్టిగా మళ్ళీ చెప్పాలనుకుంటున్నా.
    ఆధారాల్లో చమత్కారం – simply fantastic!

  15. Sriram says:

    కొత్తపాళీ గారితో నేనేకీభవిస్తా…ఆధారాలు అద్భుతంగా ఉన్నాయి.

    పుష్ప లతిక అన్న మాటకి పువ్వుల వ్యాపారానికీ సంబంధం లేదు కనక అది కాదనుకుంటా.

    పవి అన్నమాటకి బ్రౌణ్యం ప్రకారం పిడుగు అని అర్ధం. మరి దాంపత్యంలో ఇరుక్కున్న మొగుడు ఎంతవరకూ పిడుగో అనుభవజ్ఞులు చెప్తే తెలుసుకోవలసిందే 🙂

    నాకు ఇంకొక డైలమా కూడా ఉంది రుద్దుడా లేక రుద్ధుడా అని!

  16. కామేష్ says:

    ఆబ్బ. గడులను పూరించడానికి ఇంతింత అభ్యాసం, విశ్లేషణా? నేను మాత్రం నాకొచ్చినవి ముందుగా రాసేసుకుని, రానివి మాత్రం ఎక్కడైనా ఖాళీ గడులుంటే నో
    టికొచ్చినవాటితో నింపేస్తున్నా. అలా జరిగిందే 1 అడ్డం, 1 నిలువు, 9 అడ్డం, 29 నిలువు. ఏది ఏమైనా ఏప్రిల్ గడి కూర్పు మాత్రం సింప్లీ సుపర్బ్.

  17. గడి గురించి:

    కూర్పరి 15 అడ్డం ఆధారాన్ని కావాలనే అలా వదిలేశారు. ఆశించిన ప్రయోజనం నెరవేరింది.
    17 నిలువు ఆధారం స్పష్టంగానే ఉంది. అంత స్పష్టంగా లేకపోయినా 44 అడ్డం కూడా సరిగానే ఉంది.

    ఐతే 10 నిలువుకు సరిపోయే విధంగా 18 అడ్డం కూర్చేటప్పుడు పొరబాటు జరిగినమాట మాత్రం నిజం! దీని వల్ల పాఠకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఆల్ కరెక్టుగా పూరించినవారి పేర్లను ప్రకటించేటప్పుడు ఈ పొరబాటును దృష్టిలో ఉంచుకుంటాం. ఈ ఆధారానికి సంబంధించిన పూర్తి వివరాలు గడి పరిష్కారాన్ని ప్రకటించేటప్పుడు ఇవ్వగలం. పొరబాటును ఎత్తిచూపిన శ్రీరామ్ గారికి, అర్థం చేసుకున్న సత్యసాయి గారికి, విపులంగా వివరించిన కొత్తపాళీగారికి ధన్యవాదాలు!

  18. కామేష్ says:

    కొత్తపాళీగారూ, మీకొచ్చిన సంశయాలు కరక్టే. కానీ ఆధారాలు కూడా అంతే కరెక్టు. కాకపోతే కొంచెం పక్కదారి పట్టించేలా ఉన్నాయి. మరి గడులను పూరించడానికి ఆమాత్రం శ్రమ ఉండాలి కదా. ఇకపోతే మీకు స్ఫురించిన చక్రవర్తీ కరెక్టే. ఆధారమూ కరక్టే. మెదటిసారిగా చూచినప్పుడు నాకు కూడా మీలాగానే అనిపించింది. కానీ కొంచెం బుర్రకు పని చెప్పగానే చిక్కుముడి వీడింది. కానీ 29 నిలుపు, 42 అడ్డం మాత్రం కొరకరాని కొయ్యలాగానే ఉన్నాయి. నాకు అస్సలు పురాణజ్ఞానం లేదాయే.

  19. కామేష్ గారూ,
    రానివి మాత్రం ఎక్కడైనా ఖాళీ గడులుంటే నోటికొచ్చినవాటితో నింపేస్తున్నా.
    🙂
    గడి నింపటంలో ఇది కూడా ఒక పనికొచ్చే పద్ధతే నండోయ్!
    ఔన్నిజవేఁ – తెలుగు గళ్ళ చరిత్రలో ఏ గడి గురించీ ఇంతపొడుగు చర్చ జరిగుండదేమో. ఇక్కడి చర్చ కాక సమాంతరంగా నా బ్లాగులో ఇంకో ఇరవైదాకా వ్యాఖ్యలున్నై.

    29 నిలువు – గడి మొత్తం నింపేశాక ఇదొక్కటే మిగిలింది – ఒక రోజుకు పైన తిప్పలు పెట్టింది. తట్టినాక మాత్రం కూర్పరి నేర్పరితనానికి సలాం చేశాను.
    42 అడ్డం – కామేష్ గారూ, 42 నిలువు తెలిస్తే 42 అడ్డం ఆటోమేటిగ్గా ఐపోతుంది కదండీ.

    @ శ్రీరాం – 44 అడ్డం – ఆధారాన్ని 42 నిలువుతో కలుపుకుంటే నీ డైలమా తీరుతుంది.

  20. Sriram says:

    “ఆబ్బ. గడులను పూరించడానికి ఇంతింత అభ్యాసం, విశ్లేషణా?”
    కామేష్ గారూ…ఇచ్చిన గడి నాణ్యతలాంటిది మరి!

    వివరణనిచ్చిన పొద్దుగారికి ధన్యవాదాలు. నా సందేహం తీర్చుకుందామనే కానీ, ఎత్తి చూపుదామని కాదు. మీరు సహృదయతతో అర్ధం చేసుకుంటారని భావిస్తాను.

    కొత్తపాళీ గారూ…అసలు ఆ 42 నిలువు వల్లే నా డైలమా. నిలువులో లేని వత్తు అడ్డంలో ధుమధుమలాడుతూ అడ్డొస్తోంది 🙁

  21. సిముర్గ్ says:

    “…నిలువులో లేని వత్తు అడ్డంలో ధుమధుమలాడుతూ అడ్డొస్తోంది”
    వత్తు పీకేసినందుకే ఉష కూడా ధుమధుమలాడుతోంది..

  22. Sriram says:

    ముసుగులో ఉన్నా, నా బాధపడలేక ముందుకొచ్చి సందేహం తీర్చిన సిముర్గ్ గారికి కృతజ్ఞతలు. ఈ గడి అద్భుతంగా కూర్చారు మీరు. అందుకోండి అభినందనలు.

  23. నేనెందుకో ఒప్పుకోలేకపోతున్నా!
    “ఈ రుద్ధుడువద్దంటే” అని అధారం లో నే వత్తు ఉంటే గడి నింపేప్పుడు వత్తు వద్దని అర్ధం స్ఫురించి ఉండేది.
    ఇప్పుడు ఉన్న అధారం లో అటువంటి సూచన ఏమీ లేదని నా అభిప్రాయం.
    పోనీ నిలువు ఆధారం లో ఐనా వత్తు గురించి ఏదైనా సూచన ఉంటే పని జరిగేది.
    సిముర్గ్ గారూ! ఏమంటారు?

  24. సిముర్గ్ says:

    @శ్రీరామ్
    మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది. మీ బాధపడలేక కాదు, మీ బాధ చూడలేక. ముసుగు కాదులెండి – మేలిముసుగే.

  25. Sriram says:

    సిముర్గ్ గారూ-ధన్యోస్మి. నాకూ అనిపిస్తోంది ఇప్పుడిప్పుడే, ఈ ముసుగు అంత దట్టమైనది కాదు అని.

  26. స్వాతిగారు, 42 నిలువు వొత్తు వొదగదని స్పష్టంగానే చెబుతోంది.

  27. అవునండీ, దాన్లో వత్తు కుదరదు కాబట్టే, అడ్డం లో కూడా తీసేయవల్సొచ్చింది.
    ఏదేమైనా..చిన్న విషయమే లెండి.. కానీ నా సందేహం తీర్చుకుందుకు.

  28. కామేష్ says:

    అమ్మయ్య, 29 నిలువు కూడా తట్టింది. బాగా ఇబ్బంది పెట్టిందిదే. కూర్పరి నేర్పరితనానికి ఇది నిస్సందేహంగా మేలిమచ్చుతునక.

  29. చర్చ మంచి రసపట్టులో ఉన్నట్లుంది. కొత్తపాళీగారూ, 10 అడ్డం అని కోరస్ గా తికమక పెట్టినందుకు క్షమించండి. గడి ఆధారాల్లో తికమకలు ఓమూడో, పదో చెరువుల నీళ్ళు తాగించాయనడంలో సందేహం లేదు. నేను ఆధారాల్లో వ్యాకరణం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కొన్ని తేలిగ్గా లాగించానని అర్ధం అయింది. ఒక మూడింటికి గూగుళ్లు మేయాల్సి (browsing) వచ్చింది. 29 నిలువు నిజంగా గొప్పగా ఉంది. ఆధారాన్ని బట్టి ఆపదం వ్రాసేసాను, కానీ నిర్ధారించుకోడానికి చాలా గడ్డి తినాల్సి వచ్చింది (browsing). భలే బాగుంది గడి.

Comments are closed.