మా గురించి

అనగనగా పొద్దనగా..

“ఏమిటి మీ పొద్దు అంటే?” అని అడిగారొకాయన.
“తెలుగు వెబ్ పత్రికండి” అన్నాం.
“ఆహాఁ.. చాలా ఉన్నాయిగా వెబ్ పత్రికలు” అని స్వగతంలో అనుకున్నట్లు అనుకుని “ఏవిఁటి పొద్దు ప్రత్యేకత?” అని అడిగారు.
“లాభాపేక్ష లేని వెబ్ పత్రిక” అని అన్నాం.
“లాభ అపేక్ష లేని” యా లేక “లాభ అవకాశం లేని” యా అని అన్నారాయన, అవకాశాన్నొత్తి పలుకుతూ.
కాస్త సర్దుకుని, బెట్టుగా “లాభాపేక్ష లేనియే” అని అన్నాం.
“కానీ, వెబ్ పత్రికలన్నీ కూడా లాభాపేక్ష లేనివేగా.. పొద్దు ప్రత్యేకత ఏవిటని?” అని అడిగారు.
“ఇతర పత్రికల్లాగా నెలకోసారో రెణ్ణెల్లకోసారో రావడం కాదు, పొద్దు వారానికి ఒకసారో రెండు సార్లో ఉదయిస్తుంది”
“ఓహో, అదన్నమాట! బావుంది.” అనేసి, మళ్ళీ వెంటనే.. “కానీ బ్లాగులూ అలాంటివేగా, మరీ?” అని అడిగారు.
దొరికేసాడు లెమ్మనుకుని..
“బ్లాగులో సదరు బ్లాగరి ఒక్కరి ప్రతిభే కనబడుతుంది. పొద్దు అనేకుల ప్రతిభకు వేదిక కదా! అదన్నమాట తేడా” అన్నాం.
ఆయనూరుకోలేదు..
“అయితే కొందరు కలిసి రాసే ఉమ్మడి బ్లాగన్నమాట, పొద్దు!” అనేసి వెళ్ళిపోయారు.

————————

వ్యక్తుల ప్రతిభావేదికే గదా ఏ పత్రికైనా! పొద్దూ అంతే!
అనేకమంది నెజ్జనుల ప్రతిభా ప్రదర్శన వేదిక, పొద్దు!

బ్లాగులో టపాలుంటాయి, పొద్దులో వ్యాసాలుంటాయి.
బ్లాగులో బ్లాగరి తనకు నచ్చింది పెట్టుకోవచ్చు, పొద్దులో పాఠకులు మెచ్చతగినివే ఉంటాయి.
పొద్దుకొచ్చిన రచనలన్నీ సమీక్షించబడ్తాయి, చాలా వరకూ తిరస్కరించబడ్తాయి.

————————

పొద్దు సంపాదకులకు సొంత జెండాలు, ఎజెండాలు లేవు. సొంత వ్యాపారాలూ లేవు. అంచేత తెలుగు దినపత్రికల స్థాయి లేదు.
పొద్దులో బూతు బొమ్మలు ఉండవు. కాబట్టి ‘వార’పత్రికల స్థాయి లేదు.
పొద్దుకు ఛీఫ్ ఎడిటరు, రెసిడెంటు ఎడిటరు, ఫీచర్స్ ఎడిటరు వగైరాలు లేరు. కాబట్టి ఇంగ్లీషు పత్రికల స్థాయి లేదు.

పొద్దు అది కాదు, పొద్దు ఇది కాదు అన్నాం బానే ఉంది. మరదేంటి?

“ఆఁ.., వేళాపాళా లేకుండా ఉదయించే వెబ్ పత్రిక” అని అన్నారు. ఈ విశేషణం బావుందే అని అనుకున్నాం.

————————

అంతర్జాలంలో ఇప్పటికే కొన్ని పత్రికలున్నాయి. ఒక్కోదానికీ ఒక్కో ఒరవడి ఉంది. సాహిత్య ప్రధానమైనవి, సమకాలీన అంశాల ప్రధానమైనవీ ఇలా రకరకాలుగా ఉన్నాయి. చాలా పత్రికలు ఏదో ఒక వాదానికి చెందినవి. పొద్దు ఏ వర్గానికి, ఏ వాదానికి చెందుతుంది?

పొద్దు, పొద్దు వర్గానికే చెందుతుంది.
పొద్దు పాఠక వర్గానికి చెందుతుంది.
పొద్దు సృజనాత్మక రచనల వేదిక.

పొద్దులో గాంభీర్యత లేదు. పొద్దులో ఓ పద్ధతి లేదు. పొద్దులో మిలిటరీ క్రమశిక్షణ లేదు, చచ్చినా దాటగూడని లక్ష్మణరేఖలు లేవు.

ఫలానా రోజుల్లోనే కొత్త రచనలు వెలుస్తాయని చెప్పే టైమ్ టేబులు లేదు. ఫలానా రోజున ఖచ్చితంగా కొత్త రచన వస్తుంది అని చెప్పే గ్యారంటీ కూడా లేదు.

కానీ..

పత్రికల కట్టుబాట్ల నుండి, సాంప్రదాయికంగా పాటిస్తూ ఉన్న పద్ధతుల నుండి విడివడి స్వేచ్ఛగా ప్రవర్తించే విశృంఖలత పొద్దులో ఉంది.

పొద్దుకో విలక్షణత ఉంది. ఓ విభిన్న వ్యక్తిత్వం ఉంది. తనదైన ఓ శైలి ఉంది, ఆత్మీయత అనే ఓ లేబులుంది. ఆశ్చర్యపరచే ఓ వైఖరుంది.

ఉదయం వేదోక్తంగా పూజచేసి, మధ్యాహ్నం న్యూక్లియర్ ఫిజిక్సు పాఠం చెప్పి, సాయంత్రం అష్టావధానంలో పృచ్ఛకుడిగా ప్రశ్నలడిగి, రాత్రికి స్నేహితులతో డిస్కోథెక్కు వెళ్ళే తెలుగువాడు ఎలా ఉంటాడో ఊహించండి..

అదీ పొద్దు!
అదే పొద్దుత్వం, పొద్దు తత్వం!!

నుడికారం గురించి పాఠాలు చెప్పే వ్యాసాలూ ప్రచురిస్తాం, పేరడీలు రాసి అల్లరీ చేస్తాం.
ఎక్కడా ఎవ్వరూ చెయ్యని గళ్ళ నుడికట్టు ప్రయోగం చెయ్యగలం.

హాస్యం మాకభిమానం! విమర్శ మాకిష్టం!!

———————

ఐదుగురు సభ్యుల సంపాదకవర్గం – సంపాదన లేని వర్గం – ఆధ్వర్యంలో పొద్దు నడుస్తూంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. నిరంకుశ నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ‘జరుగుతూ’ ఉంటాయి.

పొద్దు రథాశ్వాలు:
తుమ్మల శిరీష్ కుమార్
స్వాతి కుమారి
భారతి
కోడిహళ్ళి మురళీమోహన్
భైరవభట్ల విజయాదిత్య

———————

పొద్దులో ఎవరు రాయొచ్చు

అంతర్జాలంలో తెలుగు ప్రాచుర్యం పొందుతోంది. కంప్యూటర్లో తెలుగు అమలు చెయ్యడం సాంకేతికంగా చాలా సులభమైంది. ఇంకా సులభమౌతూ ఉంది. ఇంగ్లీషు తప్ప గత్యంతరం లేని అంతర్జాలంలో తెలుగులో రాయగలిగే సౌకర్యం రావడంతో తెలుగువారికి తమ ఆలోచనలను తమ భాషలోనే రాతలోపెట్టే అవకాశం దొరికింది.

ఇప్పటి నెజ్జనుల్లో ఎక్కువమంది ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నవాళ్ళే అయినప్పటికీ తెలుగులో రాయగల ప్రావీణ్యత లేనప్పటికీ రాయాలన్న తృష్ణ ఎక్కువగా ఉంది. తెలుగువారు తాము చాట్ చేసేటపుడు తెలుగులోనే – కాకపోతే రోమను లిపిలో – రాస్తారన్నది విదితమే!

అంతర్జాలంతో సన్నిహిత సంబంధం ఉన్న తెలుగు వారిలో ఎంతో రచనాశక్తి, సృజనాత్మకత, దాగి ఉన్నాయి. ఆ మాటకొస్తే ప్రతీవ్యక్తిలోనూ ఎంతోకొంత రాయగలిగే శక్తి ఉంటుంది. రాస్తూ ఉంటే రచనాశక్తి ఇనుమడిస్తుంది.

మంచి భావాలు చెయ్యితిరిగిన రచయితల సొత్తేం కాదు. ఉత్కృష్టమైన భావాలు అందరికీ ఉంటాయి. తమ భావాలను అందమైన భాషలో పెట్టగలవారు రచయితలవుతారు. మిగతావారు పాఠకులవుతారు. మంచి రచయితకు మంచి భావాలు, ఆలోచనలు, సృజనాత్మకత, భాషా వైదుష్యం ఉండాలి. సగటు నెజ్జనులలో ఇవన్నీ ఉంటాయి.. ఒక్క భాష తప్ప. ఇంగ్లీషు చదువుల ఉరవడిలో పడి, తెలుగు నుడి మర్చిపోయాం, మర్చిపోతున్నాం. ఈసంగతి పొద్దుకు ఎరుకే! అందుకే మీ తెలుగు బాగుండదని మీకు చింత వద్దు. మీకు వచ్చిన విధంగా, మీకు నచ్చిన విధంగా యూనికోడులో టైపించి పంపండి – తెలుగులో మాత్రమే సుమా! మేం దానికి సవరణలు సూచిస్తాం, సవరించాక ప్రచురిస్తాం. మాకు కావలసింది మీ భావాలూ సృజనాత్మకతే!

అంచేత..

రాయండి. ఆలోచనలు ఉన్న ప్రతివారూ రాయాలి.
చదవండి. ఇతరుల ఆలోచనలేంటో తెలుసుకోవాలి.

————————
పొద్దులో ఏమేం రాయొచ్చు?

-కథలు, కవితలు, సమీక్షలు, కబుర్లు ఏమైనా రాయవచ్చు. ఇంటర్వ్యూలు చెయ్యవచ్చు. గడిని కూర్చనూ వచ్చు.
-కొత్తగా మీరే ఏదైనా శీర్షికను మొదలుపెట్టి నిర్వహించవచ్చు కూడా.

మాకంటే మా రచయితలూ, పాఠకులూ తెలివైన వాళ్ళేననే సంగతి మాకు గుర్తుంది.. (ఆ సంగతి మేం ఎప్పటికీ మర్చిపోం.)

పొద్దు మనదే అని మా పాఠకులు అనుకుంటారు. అంచేత ఇది పాఠకుల పత్రిక!
మీ పత్రిక, e-పత్రిక

69 Responses to మా గురించి

  1. బావుంది. పొద్దు గురించి తెలియని విషయాలు చాలా తెలిసాయి.నాకు చదువరి గారు మాత్రమే తెలుసు .
    రానారె గారు, త్రివిక్రం గారు సంపాదక బృందంలో సభ్యులని తెలియదు.
    నా కథలని వాళ్ళు చదువుతున్నారో లేదో అనుకునేవాడిని.
    ఇప్పుడు అర్థమైంది – వాళ్ళు చదివే అవకాశం ఉందని.
    పొద్దు కి శుభాకాంక్షలు
    సోమ శంకర్

  2. Rohiniprasad says:

    మీ ఆశయాలూ, ఉద్దేశాలూ నెరవేర్చుకునే క్రమంలో మీరు వెబ్ పత్రికలకు ఉండే అదనపు సౌలభ్యాలను ఉపయోగించుకుంటే బాగుంటుంది. రచనల్లో బొమ్మలూ, ఆడియో, వీడియో లింకులూ మొదలైనవన్నీ ఉంటే అదొక ప్రత్యేక ఆకర్షణ. భారతి రోజుల్లోలాగా ఒకరు పెన్నుతో రాసినది మరొకరు ‘అచ్చు’ వెయ్యగా చదువుకుని ఆనందించడం మంచిదే కాని ఇతర సదుపాయాలను రచయితలూ, ఎడిటర్లూ వాడడం నేర్చుకోవాలి. పత్రికల్లో కలర్ ఇలస్ట్రేషన్స్ వెయ్యడం ఖర్చుతో కూడిన పనిగా ఉంటుంది. మీకటువంటి ఇబ్బందులు ఉండవుకదా.

  3. జాహ్నవి says:

    ప్రతి రోజు పొద్దు పొడుస్తుంది
    అలాగే
    ప్రతిరోజు వెబ్ పత్రిక పొద్దు పొడిచే రోజు వస్తుంది.

  4. chavakiran says:

    ఈమాటలోలా పాఠకుల అభిప్రాయాలకు లింకు ఉంటె బాగుంటుంది, అప్పుడు ఇటీవలి వ్యాఖ్యలు ఎత్తెయ్యవచ్చు.

  5. Reddy G says:

    patrika peru chala bagundi. Peru taggattu vyasalu kuda chala bagunnayi. mee readership enta untundi?

  6. kishore says:

    Anantapuram lo neellu, ee Anantaviswam lo telugu antharinchipoyayanna nirvedam lo nispruhatho unna naaku ee poddu ee e poddunu choodagaane, chaala rojula jvaram thaggina tharuvaatha chicken thiney avakasam vacchinantha aanandangaa anipinchindi… meeru paatisthunna samayapalana, prachuristhunna vasthuvulalo untunna nanyatha.. amogham… slaghaneeyam… podduku marintha daggaravvalani aakankshisthu…

    Prematho…
    Kishore

  7. lasya says:

    బాగుందండి మీ పొద్దు. నిజమే. మీరు చెప్పినట్టు చాలామందికి రాయాలని వుంటుంది. తన భావాలని అందరితోనూ పంచుకోవాలనీ వుంటుంది.కాని రాసి, కవర్లు కొని, స్టాంపులు అంటించి ఓ పత్రికని ఎంచుకుని దానికి తన రచనలు పంపి….ఈ కార్యక్రమమంతా తలచుకుంటెనే నీరసమొస్తుంది.
    నా వరకూ హఠాత్తుగా ఏ ప్రయాణంలో వున్నప్పుడో, వార్తా పత్రికలో ఏదైనా స్పందింప చేసే వార్త చదివినప్పుడో,నా కళ్ళా ముందు ఏదైన సంఘటన జరిగినప్పుడో నా భావాలు రాయాలనిపిస్తుంది.కాని నా బధ్ధకమే అనుకుంటానండి ఇప్పటిదాకా రాసినట్టు తెగ ఊహించేసుకొవడమే తప్ప ఏప్పుడూ రాయలేదు. కాని పొద్దు గురించి చదివాక నన్ను ఎవరో తెగ ప్రోత్సహించేసినట్టనిపించి మొదటిసారి రాయాలనిపించిన వెంటనే రాస్తున్నాను.
    చదువుతారో, చదవరో మీ ఇష్టం.
    పొద్దు మాత్రం చాల బాగుంది. తరచుగా రాయక పోయినా చదవడం మాత్రం మానను.

  8. లాస్య గారూ,
    మీ అభిమానానికి నెనరులు. మీ ఉత్తరమే కాదు, మీరు పంపే రచనలను కూడా సంతోషంగా చదువుతాం, ప్రచురిస్తాం.

  9. ఇంత మంది చందమామ అభిమానులున్నారు!
    ఒక్ఖరికి “చక్రపాణి” గుర్తు రాలేదా!
    మీరు ప్రత్యెక వ్యాసం లాంటిది ఏదేని వ్రాస్తే మీ పాఠకులకి కనిపించని చోట నక్కి దాక్కుందా?
    మీ సంపాదకులకి ఉత్తరాలు ఎక్కడ వ్రాయాలి?

  10. శరత్ says:

    “పత్రికల కట్టుబాట్ల నుండి, సాంప్రదాయికంగా పాటిస్తూ ఉన్న పద్ధతుల నుండి విడివడి స్వేచ్ఛగా ప్రవర్తించే విశృంఖలత పొద్దులో ఉంది”

    పైది నిజంగా పొద్దు నైజాల్లో ఒకటా?! ఆశ్చర్యమే! సరే. కూడలి లో నుండి గెంటివేయబడ్డాను కాబట్టి పొద్దులో వీలయినప్పుడు రాయాలనుకుంటున్నాను. నా రచనలు ప్రచురించడం అన్నది మీ విచక్షణ కి లోబడి వుంటుందన్నది తెలుసు. కూడలి నిర్వాహకులు కూడా సంపాదక వర్గం లో వున్నారు కాబట్టి మరి మీరు నా రచనలపైన అకారణంగా వేటు వేస్తారా లేక నిజాయితీ గా పరిశీలిస్తారా? ఒకసారి పొద్దు ని కూడా ఘాటుగా విమర్శించాను కాబట్టి ఆ కోపం మనసులో పెట్టుకొని నా (రచనల) తో ఆటాడుకుంటారేమో నన్న సంశయం వుంది.

    మీరు బ్యాలంస్డ్ గా వ్యవహరిస్తారని ఆశిస్తూ మీ పొద్దులో ప్రయత్నించి చూద్దామనుకుంటున్నాను. నా బ్లాగ్ లో శృంగారానికి సంబధించిన రచనలు, మీ దానిలో ఇతర రచనలు చేయాలని ప్రస్తుత ఆలోచన. చూద్దాం. మీ స్పందనని బట్టి వుంటుంది. ప్రోత్సహిస్తారో – లేదో!

    మామూలుగా అయితే మీ పొద్దు మీద ఎప్పుడూ దృష్టి కలగలేదనుకోండి కానీ ఇవాళ ఎందుకో – మీ గురించి – మీ పై వ్యాఖ్య చూసాను. సృజనాత్మకత ప్రోత్సహిస్తామన్నారు కదా – చూద్దాం అనుకుంటున్నాను. శృంగారం గురించి ఎక్కువ రాస్తానని చెప్పి అది కాకుండా వేరే ఏమీ రాయలేననుకోకండి. ఎన్నో రాయగలను – కాకపోతే దాని గురించి రాసేవారు ఎవరూ లేక దాని పైన ఎక్కువ శ్రద్ధ పెడుతుంటాను.

    మీరు రచనలని తిరస్కరించినప్పుడు బ్లాంక్ గా తిరస్కరిస్తారా లేక కొద్దిగా ఏమయినా వివరణ ఇస్తారా?
    కొన్ని సార్లు మీ దాంట్లో ప్రయత్నించి చూస్తాను – మీ ధోరణి నచ్చకపోతే మానివేస్తాను – వేరే చూసుకుంటాను. ఎలాగూ సంపాదకులు మీరే కాబట్టి నావి నచ్చకపోతే ఎలాగూ వేయరు కదా.

  11. కామేశ్వర రావు says:

    శరత్ గారి వ్యాఖ్య చదివి నవ్వొచ్చింది.
    మన భారతదేశం స్వతంత్ర దేశం, కాబట్టి నేను దిగంబరంగా రోడ్డు మీద తిరిగితే నన్నేమీ అనకూడదూ, లేదంటే ఇది స్వతంత్ర దేశం కాదన్నమాట అని ఎవరైనా అంటే ఎలా ఉంటుందో నాకలానే అనిపించింది.
    “పత్రికలు సాంప్రదాయికంగా పాటిస్తూన్న పద్ధతులు” అంటే ఏవిటో ఇందులో సంపాదకులు స్పష్టంగానే వివరించారు.
    “బూతు”బొమ్మలుండవు అని స్పష్టంగా చెప్పారు. అలా అయితే విశృంఖలత ఎక్కడిదీ అని నిలదీస్తే, ఏమిటి సమాధానం?
    పత్రికలో కాని సమాజంలో కాని స్వేఛ్చ అన్నప్పుడు దానికొక context ఉంటుంది. అంతే కానీ ఏ రకమైన సరిహద్దులూ లేకపోవడమే స్వేఛ్చ అని నాకు తెలిసీ ఎవరూ అనుకోరు.
    ఆ సరిహద్దులేవిటీ అన్నది, పత్రిక విషయంలో సంపాదకులదే నిర్ణయం. కొంతమంది దృష్టిలో అది సంకుచితం కావొచ్చు. కానీ కొంతమంది దృష్టిలో అదే ఉచితం.

  12. Kypu Audisesha Reddy says:

    పొద్దు ఈరోజే చూశాను. బాగుంది.త్వరలో నా రచనలు మెయిల్ చేస్తాను. చక్కటి కృషితో నిర్వహిస్తున్న సంపాదక వర్గానికి అభినందనలు.
    — కైపు ఆదిశేషా రెడ్డి.
    నెల్లూరు

  13. Sarath says:

    Mee nundi pratispandana raaledu paigaa maarina paristhitula valla aa naa vyaakhya asambaddangaa anipistondi kanuka daaninee, deeninee teesiveyagalaru.

  14. sreeram prasad marturi says:

    ee poddu patrika chala bagavundi,

  15. సప్తాశ్వరథ సమారూఢం
    జ్ఞాన దీప్తి ప్రపూరితం.
    అనేక విషయ సంయుక్తం
    పొద్దుం తం ప్రణమామ్యహం.
    పద్య కావ్యాలు, శతకాలు, ప్రాచీన కవుల చరిత్రలు,మీ పొద్దులో ఎక్కడ లభ్యమవుతాయి? తెలియజేయ గలరు.
    నమస్టే.
    చింతా రామ కృష్ణా రావు

    [ఈ వ్యాఖ్య RTS నుంచి తెలుగులోకి మార్చబడింది. -పొద్దు]

  16. సప్తాశ్వరథ శ్లోకంలో
    “స ” ఎక్కువపడింది..
    సవరిస్తే
    సప్తాశ్వ రథమారూఢం
    జ్ఞానదీప్తి సమన్వితం
    అనేక విషయ సంయుక్తం
    పొద్దుం తం ప్రణమామ్యహం.

    వాంఛితార్థ ఫల సిద్ధిరస్తు.
    చింతా రామ క్రిష్ణా రావు.

    [ఈ వ్యాఖ్య RTS నుంచి తెలుగులోకి మార్చబడింది. -పొద్దు]

  17. Ramesh K says:

    chala chala bagundi sir nizanga manasu hattukupoyela meru prachyristunna kavithalu kathalu okkatamiti anni chala bguntunnai chala chala kruthagnathalu

  18. Viswanath Kadiyala says:

    chaala bavundi

  19. tejasvi chollangi says:

    ee poddu chaala bagundhi….
    machhalunna chadruniki bayam poddu ante ..malinamga vunna lakaniki bayam ee poddu ante…..sarvejana sukunobavanthu

  20. mallikarjuna says:

    manchi kathalu..naajukaina maatalu..paravallu thokke panasathonalavanti kathanalu..anni unna navarasabharitha navaneetha khazaana!! poddu elaane saagipovalani aashinche.. … poddu abhimaani.

  21. mallikarjuna says:

    vikasinchi velige ..e poddu…. oka veyi rekula aravindam laaga ilaane virabooyayi.. poddu podiche poddu podiche o lacha gummadi…puthadi velugu kothaga merise o lacha gummadi…podu poddune O MUTHYALAMUGGU!

  22. devara says:

    ఇవాళనే పొద్దు పొడిచింది మా యింట
    జాల వీక్షణంలో….
    తెలిసాయి కబుర్లు ఎన్నో…
    మిత్రులందరికీ స్వాగతం…
    అభిప్రాయ సుమ మాలికలు
    తెలిపాయి వాటి మనోభావాలు
    రాయమన్నాయి నా ఊహాక్షరాలు
    పొద్దుపొడుపులో చూడమన్నాయి
    అక్షర కదంబాలు ముందు ముందు
    కొత్తకలాలకు స్వాగతమంటున్న
    పొద్దు ఈ-పత్రికకు
    అభినందనాలు… అభివందవాలు..

  23. Koneru Nagendrfa Prasad says:

    telugu bahanu ee vidhaga vadukone vidanga cheyadam chalaa baagundi. mee abhiruchi ki, srujanaatmakataku mariyu telugu baasha seevaku dhnyavaadalu.

  24. venu says:

    it is very good
    telugu poetries are very very good

  25. dhanvantari says:

    నమస్తే, మీ – మన పొద్దు బాగుంది … ఇంటర్నెట్లో తెలుగు ఉందన్న సంగతి నిన్ననే తెలిసింది. మరీ పల్లెటూరి వాడనుకున్నా – కొంచం నిజమే- ఈ విషయంలో. ముందుగ చదివింది ” పొద్దు”. బాగుందీ పొద్దు … శుభారంబం.
    పొద్దు చదవ కుండా పొద్దు గడవదన్నంతగా నచ్చింది
    రాసే సరదా ఉన్నా అంతగా శక్తి లేని వాడిని. కాబట్టి చదవుతూ ఉంటాను.

  26. varaganti nagesh says:

    namaste
    andhrajtothi 18.01.2009 daily paper lo vachina article chadivi mee site open chesa.chala santhosam.nenu na abhiprayalanu teliyacheyyadaniki ,rachanalanu pampadaniki eee vedikani upayoginchukontanu

    nagesh

  27. premkumar says:

    poddu eeroju choosanu.baagaa nachchindi,ikapai neenu kooda podduloo aarticals raayalani anukuntunnanu. ela pampaloo teliyajeeyagalaru.

  28. kalyani says:

    poddu eeroje chusanu. chalaa santhosham kaligindi..
    rachana levaina pampalani aasaga undi.

  29. ఎచ్చోట నెమ్మనము భయము శంకలు వీడి, మానవుడు స్వేచ్ఛగా శిరమెత్తి నడుచునో
    ఏదేశమున జ్ఞాన వాహినుల్ పారునో
    ఏజగము సంకుచిత భేదాలనలయించి విశ్వ బాంధవ్యంబు విషదీకరించునో
    సత్కర్మ ఏవసుధ సత్ఫలము పొందునో ……
    అచ్చోటికేగుదము అచటనే నిలిచెదము
    అన్న ఠాగూర్ వాక్యాలు చదివాక అది సాధ్యం అవదేమో అనిపించింది.
    కానీ ఈరోజు పొద్దు ఆశయాలు చదివాను. నాలో ఆశ చిగురించింది. నవయుగం సాధ్యమనిపించింది. నిజంగా ఇది ఒక విప్లవమే అని తోచింది. దీన్ని విజయం వైపు తీసుకెళ్లడం బాధ్యతగ నావంతు కృషి చేయాలనిపించింది. ఈ వెబ్ పత్రిక స్థాపించిన సజ్జనులకు, నిర్వహిస్తున్న సంపాదక వర్గానికి నా జోహార్లు, మరియు వారికి తమ రచనలతో చేయూత నిస్తున్న మిత్రులందరికీ నా కృతజ్ఞతలు.
    ఇట్లు
    మొలుగు త్రివిక్రమరావు

  30. m.s.bhairi says:

    poddu cadivAnu poddulo oka kavitha rAsa elApampaalo teliyaledu

  31. Tikamaka says:

    adagaka ichina manase muddu..andhee andani andame muddu “annodo Athreya.. mari haddhu poddhu lekunda pothunna ee manushula buddulu maare poddu eppudu podusthundo.. kaani, ande nijamaina andamaina Muddu…kaadantava cheppu O Poddu!

  32. M.S.P.Rao says:

    మొదటి సారిగ మీ వెబ్ పత్రిక చూసాను. మీ ప్రయత్నం చక్కగ సాగాలని ఆసిస్తున్నాను .ఇప్పుడిప్పుడే నెట్లో రాయడానికి ప్రయత్నిస్తున్నాను. రోజు చూసే పేపర్లు, పత్రికలతో విసుగొచ్చేసింది. వీటి వల్ల సమాజం “ముందుకు” పొయే ఆశ కనపడక Alternate Media మీద పని చేస్తున్నాను. print media కి నకలుగానే పోయ్ట్టైతే వెబ్ పత్రికల వల్ల ఏమి లాభం ఉందదని నా అభిప్రాయం.

  33. siriishasri says:

    maMchi patrika.
    nEnu tarachuu mii altrika (web=
    aliika+patrika)nu chaduvutUMMDE aBimaanini.

  34. bendalam krishna rao says:

    poddu prathiroju podavali….aathmeeyathaa kiranalathoo palukarinchali

  35. kalidas.e says:

    bendalam krishnarao garu mee yarnagula sudhakararao bavunaraa> ayana eemaadya neti charithralo korithechuukunna kotha partikalu chala bagarasaru.
    vijaya bhasakar ex eenadu reporter chennai

  36. first time i have gone through this. Sincere introduction and good attempt.congrats.

  37. bvr babu says:

    really it is nice. A very good efffort. All the best.

  38. munnaswamy says:

    పొద్దు చాలా బాగుంది ఇందులొ రచనలు చేయాలని కొరికగా ఉన్నది

  39. anusha says:

    జూన్ నెల గడి ఏదండి?
    నెల పూర్తి కావొస్తున్నా ఇంకా కనిపించడం లేదు?

  40. Nagesh says:

    Came to Poddu from Koodali. Been hooked to it – especially Gadi. Very nice job – one of the best Telugu cross word puzzles I saw – both on-line and on paper!
    One request – I get an error when I try to access previous Gadis. It’d be great if you can fix it.

  41. Marthanda says:

    ఈ జులై నెలలో పొద్దులో రచనలు బాగా తగ్గినట్టు ఉన్నాయి.

  42. geethanjali says:

    ee roju modati sariga poddu chusanu ..bagundi ika regularga chaduvuthu abhprayalu chebuthanu..abhinandanalu,,geethanjali writer,,virasam member hyderabad.phone,,9849770409

  43. sathi veerreddy says:

    naaku chalaaa baaga nachind

  44. subhash says:

    Dear Sir,

    Excellent effort!

    I think there is a meet on 8th or 14th in Hyderabad, where is the exact location. Please let me know.

    Please visit our website:upamakabalaji.com

  45. srinath says:

    Naku me blog chala baga nachindi, chala kotha vishyalu thelusukuna nenu ..

  46. పొద్దు….చాలా బాగుంది…….

  47. raagamanjeera says:

    mee poddu chalaaaa bavundandi!gadi aite inka logical ga undi!entante october gadi results kosam rojuu wait chesenta! november poddukai veyi kallato vechi chusenta!!!!!!!!

  48. టి.యస్.కళాధర్ శర్మ says:

    గడి మాకు చాలా చాలా నచ్హింది. పొద్దు మాకు చాలా ఇష్టమయిన ఈ పత్రిక. చాలా బాగుంది.

  49. ఆంజనేయకుమార్‌ says:

    ఓ పొద్దు పొడిచినట్లుంది.. మీ పొద్దు.. మొదటిసారిగా మీ వెబ్‌సైట్‌ చూస్తున్నాను. మీ ‘పొద్దు’లో రచనలు చాలా బాగున్నాయి. నేనూ పత్రికల వాణ్నే అయినా.. వాటిని చూస్తే రోటీనే.. కానీ మీ ‘పొద్దు’ మాత్రం ఎందుకో చూడముచ్చటగా ఉంది… చూడముచ్చటగా అంటే అందులో వ్యాసాలు, వివరాలు, రచనలు అని నా అర్ధమండోయ్‌!…నేను మీ అంతకాకపోయినా ఎదో కొద్దో గొప్పో చిన్నపాటి రచనలు చేస్తుంటాను లేండి! కానీ నాకు అప్పుడప్పుడు ఎవైనా వ్యాసాలు రాయాల్సి వచ్చినపుడు… ఎవరైనా తాను రాసినవి అందరూ చూడాలని కోరుకుంటారు కదండి.. నేనూ అలాగే నా వ్యాసాలను కూడా అందరికీ తెలిస్తే బావుణ్ణు అనుకుంటాననమాట!.. అడుగుతున్నానని కాదు.. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి బ్లాగు ఎలా క్రియేట్‌ చేసుకోవాలే చేబితే కొద్దిగా పుణ్యముంటుది!…. తప్పుకా అనుకోండి సుమీ!!!!!!!!!!

  50. Sekhar Kola says:

    Bagundi. Nenu kooda naa racanalu pamputha. kaani okkate chiku. adentante unikodlo type chesi pampatam. adi naku kastam. ade ANU FONTS aite chaala suluvu. Mana e-patrika aa thayiki ravaalani koru kuntunnanu.

  51. పొద్దు చాలా బాగుంది. పొధ్దు గురించికూడా చాలా బాగుంది.

  52. cHALA BAGUNDI. tAPPAKUNDA chaduvuta.
    Telugumeeda mee abimanamu mechukovali.
    Tenulure telugu anubhavistegani teliyadu.

    subham kalugu gaka.

  53. subbu says:

    bhale bhale……

  54. mee poddu eee roje maa inta podichindi. naa blog ni kooda poddu podipinchandi. mee lakshyam baagundi, mee aakaankshalu teeraalani manasaaraa korukuntoo

    – malladi lakshman kumar

  55. naa blog http://bantipoolu.blogspot.com
    chaduvarulandaroo grahinchagalaru mariyu anubhavinchagalaru, mana telugu loni maadhuryam

  56. padmakala says:

    పొద్దు పేరు విన్నాను కానీ ఇంతకాలం ఈ చక్కని అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదా ? అని అనిపిస్తోంది. సరే ! better late than never !
    కదా ! ఇకపై చూద్దాం ! ఎంత వరకు నేను చెయ్యగలనో .
    ప్రయత్నిస్తాను.
    నా చదువు, జ్ఞానం , ఆలోచనలు రాబోయే తరానికి ఉపయోగించాలన్నది నాఆశ. కాబట్టి నాకు అనుమతి ఇస్తే పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక శీర్షిక అందించాలని ఆశిస్తున్నాను.

  57. Sowmya V.B. says:

    బాగున్నాయ్ మీగురించిన సంగతులు 🙂

  58. రవి వీరెల్లి says:

    పోద్దోక్కమారన్న పొద్దు సదవక పోతె
    పొద్దు గడవదే ఓ ప్రియమైన పద్దూ…
    పొద్దు పోద్దంటావు పొద్దు పొడవనీయవు
    పద్దెట్ట వస్తదే పొద్దంతా పొద్దే సదివితే!

    పొద్దు చాల చాల నచ్చింది. Keep up the good work!

  59. శర్వాణి says:

    పొద్దు పోయిన వేళ ( నేను browse చేసింది అప్పుడే మరి !) ఈ ‘పొద్దు’ గురించి తెలియడం చాలా సంతోషం గా వుంది. తెలుగు మీది మమకారం తో బ్లాగ్ మొదలు పెట్టిన నాకు ఈ ‘పొద్దు’ కొంగొత్త ఆశల పద్దు తెరుస్తుందని ఉత్సుకత గా వుంది.

  60. sjohn says:

    raayadam, raayandi badulu vraayadam, vraayandi ane padaalu vaadithe bagutundi emo?

    vraayadam ane padamu thappu ayithe savarincha galaru

  61. saiswamy says:

    veerry good. thanks for thelugu brothers and sisters.

  62. velcheru nageswara rao says:

    మొదటి సారిగ మీ వెబ్ పత్రిక చూసాను. మీ ప్రయత్నం చక్కగ సాగాలని ఆసిస్తున్నాను . mee prayatnam sajavuga sagalani aasistu

    Nageswara Rao Velcheru
    Vizianagaram

  63. కౌండిన్యతిలక్ కుంతీపుర says:

    మీరు చెప్పింది బాగుంది.మే ము కూడా భాగస్వాములవ్వాలంటే వెబ్ లో తెలుగు టైప్ లో రచనలు పంపడం కష్టంగా ఉంది మార్గమ్ చెప్పండి

  64. surya prakash says:

    nenu modatisariga me patrika chusanu. chaala bagundi. me aasayam neraveralani korukunta

  65. kayala nagendra says:

    పొద్దు సంపాదకులకు నమస్కారం!

    పొద్దు వెబ్ చూశాను. పొద్దులోని అన్ని శీర్షకలు బాగున్నాయి. ఇంత మంచి వెబ్ పత్రికను మాకు అందిస్తున్న
    మీకు అభినందనలు.

  66. సోమ రాజేష్. says:

    మీ పొద్దు పత్రిక చాలా బాగుంది. కవిత్వం, కథ, వ్యాసం, సంపాదకీయం లాంటి ప్రక్రియలతో సాహిత్యాన్ని అందరికి తెలియచేస్తున్నందుకూ పొద్దు పత్రిక సంపాదకీయ వర్గానికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియ పరుస్తున్నాను.

    పొద్దు పత్రిక చూసిన తర్వాత నాకు కూడా రచనలు చేయాలని కోరిక కలిగిన్ది. నా రచనలు కూడా మెయిల్ చేస్తాను.

    సోమ రాజేష్.

  67. లాస్య గారు నమస్కారములు…
    మీ యొక్క ప్రయత్నానికి నమస్సుమాంజలులు…. మీ లాంటి వారి ప్రోద్భలముతో పాఠకుల మదిలో దాగిన సాహితీ మకరందాలు వీక్షకుల కనులకు అందించే తేనెతీగలా…. మీ కృషి చాలా అద్భుతమైనది. మీ ప్రయత్నము ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ పాథకుడు…..
    కొర్రపాటి సైదులు
    అమ్రాబాద్ మండలము
    మహబుబ్ నగర్ జిల్లా -509201
    తెలంగాణ రాష్ట్రము

Leave a Reply to mallikarjuna Cancel reply

Your email address will not be published. Required fields are marked *