Category Archives: ఇతరత్రా
సరదా ప్రశ్నలు
సరదా శీర్షికలో ఈసారి జ్యోతి గారు ఒక ఫోటోకు వ్యాఖ్య రాయమనడమే గాక మరి మూడు ప్రశ్నలు సంధించారు. వాటికి మీరెంత చమత్కారంగా సమాధానాలివ్వగలరో చూసుకోండి. -పొద్దు
ఉగాది శుభాకాంక్షలు
తెలుగువారందరికీ సర్వజిత్తు నామ సంవత్సర శుభాకాంక్షలు! కొత్త సంవత్సరంలో మీకందరికీ సుఖ సంతోషాలు, శుభ శాంతులు కలగాలని ఆశిస్తున్నాం!
అందచందాలు, శోధన
అందచందాల గురించి ఓ మంచి శీర్షిక పొద్దులో లేకపోవడం ఓ వెలితే! అది గ్రహించిన జ్యోతి తన సరదా శీర్షికలో అటువంటి కార్యక్రమమొకదాన్ని ప్రవేశపెట్టదలచారు. ఈ సారి పాఠకుల సందేహాలు కొన్నిటికి సమాధానాలు రాసారు. అలాంటి ప్రశ్నలు, సందేహాలు ఉన్నవారు పొద్దుకు రాస్తే జ్యోతి గారు సమాధానాలిస్తారని తెలియజేసుకుంటున్నాము. ప్రముఖ బ్లాగు, శోధన గురించిన సమీక్షను … Continue reading
తెలుగు ఫాంట్ల తయారీ పోటీ
ఉత్తమ తెలుగు ఫాంట్ల తయారీకై ప్రముఖ నెజ్జనుడు రవి వైజాసత్య నడుం కట్టారు. అత్యుత్తమ ఫాంటు తయారు చేసిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ప్రకటించారు. ఎంపికైన ఫాంటును అందరికీ అందుబాటులో ఉండేలా, సార్వజనికంగా (పబ్లిక్ డోమెయినులో) విడుదల చేస్తానని కూడా ప్రకటించారు. చరసాల ప్రసాదు ఆయనకు తోడుగా నిలిచి రెండో బహుమతిగా 5000 రూపాయలు … Continue reading
వివిధ -కొత్త శీర్షిక
చెప్పినట్లుగానే ఓ కొత్త శీర్షిక, ఓ కథ, ఓ సమీక్షతో మీ ముందుకొచ్చాం. నెట్లోనూ, బయటా వెలుగులోకి వచ్చే కొంగొత్త విషయాలను పొద్దులో ప్రచురించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ వివిధ అనే విభాగాన్ని మొదలు పెడుతున్నాం. ప్రముఖ నెజ్జనుడు సుధాకర్ ఈ శీర్షికను నిర్వహిస్తారు. స్వాతికుమారి కవయిత్రిగా సుపరిచితులు, సుప్రసిద్ధులు. మార్పుకోసం ఆమె ఈసారి కాలాన్ని … Continue reading
పొద్దుకు కొత్తరూపు
ఈసారి కూడా అతిథితో బాటు మరి రెండు రచనలు అందిస్తున్నాం. అవి: 1. రానారె రాసిన వ్యాసం (ఇది మీ అంచనాలకు ఒక మెట్టు పైనే ఉంటుందని హామీ ఇస్తున్నాం) 2. జ్యోతిగారి సరదా శీర్షికలో పాపం…ఆంధ్రాపోరడు ఇక ఈసారి మన అతిథి…వీవెన్ e-తెలుగు సంఘం గురించి వివరిస్తున్నారు. ఈ వారాంతంలో మరిన్ని మంచి రచనలు … Continue reading
ఫిబ్రవరి నెలలో:
అతిథి: PVSS శ్రీహర్ష (బ్లాగు) వ్యాసాలు: ప్రేమ…కథ -ఇస్మాయిల్ (బ్లాగు) స్త్రీహృదయ రహస్యోపనిషత్తు -పప్పు నాగరాజు (బ్లాగు) సరదా: -జ్యోతి (బ్లాగు) చిన్నితెర చిరునవ్వులు లవర్స్ లాఫింగ్ క్లబ్ నోరూరించే ఆహ్వానపత్రిక బ్లాగు: -చదువరి (బ్లాగు) 2006 ఉత్తమబ్లాగులపోటీ కబుర్లు: సినిమా: -సుగాత్రి (బ్లాగు) సినిమాలెలా తీస్తారు?-2 సమీక్ష: అతడు అడవిని జయించాడు … Continue reading
దాంపత్యోపనిషత్తు
గతవారం డాక్టరు గారు చెప్పిన ప్రేమ…కథ విన్నారు. ఆ ప్రేమాయణమంతా పెళ్ళి అనే అడంగుకు చేరడానికే కదా? పెద్దలు కూడా ‘పెళ్ళిచేసుకుని, ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖములు బడయాలోయ్‘ అనే కదా అన్నారు? ఆ సుఖములు బడసే మార్గం (ష్…మగవాళ్ళకు మాత్రమే) నాగరాజు గారు వివరిస్తున్నారు స్త్రీహృదయ రహస్యోపనిషత్తు లో… –పొద్దు
ఈ నెలలో వచ్చిన బ్లాగు సోదరుల పెళ్ళిరోజులు మరియు పెళ్ళిళ్ళ సందర్భంగా జ్యోతిగారి సరదా పెళ్ళిపత్రిక సరదా శీర్షికలోను, బ్లాగుల పోటీల సందర్భంగా 2006 ఉత్తమ బ్లాగుల పోటీ వ్యాసాన్ని బ్లాగు శీర్షికలోను చూడగలరు. –పొద్దు
పొద్దు పాఠకులకు మహాశివరాత్రి కానుకగా ప్రముఖ తెలుగు బ్లాగరి డాక్టర్ ఇస్మాయిల్ సుహేల్ పెనుగొండ (చింతు) చెప్తున్న ప్రేమ…కథ, దాంతోబాటే కబుర్లు అందిస్తున్నాం. ప్రేమ…కథ కబుర్లు –పొద్దు