Author Archives: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం
అతీంద్రియశక్తులకు సంబంధించిన నమ్మకాలు ఆటవికదశలో మానవుల్లో ఎలా రూపుదిద్దుకున్నాయో, అవి ఆ తర్వాత మతపరమైన తంతులు, తతంగాలకు ఎలా కారణమయ్యాయో డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం అనే వ్యాసంలో వివరిస్తున్నారు. Continue reading
అప్పుడూ ఇప్పుడూ
“వివిధ రంగాల్లో చెప్పుకోదగ్గ కృషి చేసిన మన పూర్వీకులను పూజించనక్కర్లేదుగాని సాంస్కృతిక విలువలు పెరగడానికీ, నిలదొక్కుకోవడానికీ వారేమేం చేశారో తెలుసుకుంటే ఒక జాతిగా మనం ఆ వారసత్వాన్ని మరింత బాగా కొనసాగించగలుగుతాం. ఎక్కణ్ణుంచి వచ్చామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో మరింత బాగా తెలుస్తుంది.” అంటున్నారు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ఈ వ్యాసంలో Continue reading
రాసినది చదవడం
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇప్పటి తెలుగు ఉచ్చరించే పద్ధతిలో ఫోనెటిక్‌గా ఉంటుంది కనక మనకు అంత ఇబ్బందిగా ఉండదు. అయినా మామ, చీమ, దోమ వగైరా పదాలను కోస్తావారిలాగా తక్కిన తెలుగువారు మాఁవ, చీఁవ, దోఁవ అనకపోవడం చూస్తూనే ఉంటాం. అక్షరాలకు ప్రాణం ఉండదు. అవి శబ్దాలకు కేవలం సూచకాలు మాత్రమే; ఉచ్చారణకు కొంతవరకే తోడ్పడతాయి … Continue reading
మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం
కొడవటిగంటి రోహిణీప్రసాదుగారు కాలంలో వెనక్కివెళ్ళి లిపి ఎలా పుట్టింది అనే సంగతిని వివరిస్తున్నారు. ఆశ్చర్యపరచే విషయమేంటంటే.. ఆ ప్రాచీన లిపులను నేరుగా రాసెయ్యొచ్చట, మన ఇన్‌స్క్రిప్టు లాగా! ముందు ఇంగ్లీషులో (రోమను లిపిలో) రాసి ఆపైన లిప్యంతరీకరణ చెయ్యనక్కరలేదు. మీరూ అవాక్కయ్యారా? కామూ మరి! ప్చ్, అవున్లెండి, పురాతన లిపులు కదా.. అంతగా అభివృద్ధి చెందినట్టు లేవు. Continue reading
అక్షరాస్యత
-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ అక్షరం అంటే నశించనిది అని అర్థం. ఒకసారి ఏదైనా రాసి ఉంచితే అది శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రాచీనులు భావించారు. రాతి మీద చెక్కినవైతే నిజంగా శిలాక్షరాలే. ఈ రోజుల్లో రాయడం, చదవడం అవసరమా, కాదా అనే ప్రశ్నే తలెత్తదు. ప్రస్తుతం మన జీవితాలు గడిచే పద్ధతిని బట్టి అక్షరాస్యత ఎంతో సహజమైనదిగా … Continue reading
మనుషులూ, మాటలూ
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ తక్కిన ప్రాణులను “నోరులేని జీవాలుగా” పరిగణించడం మనకు అలవాటు. భౌభౌలూ, కావుకావులూ మన వాక్పటిమకు సాటిరావు. కుక్కలనూ, పిల్లులనూ పెంచుతున్నవారు వాటితో మాట్లాడతారుగాని ఆ సంభాషణ అంతా ఏకపక్షమే. అందుకే తమకున్న రోగ లక్షలాణెటువంటివో వివరించలేనివారు పశువుల డాక్టర్‌వద్దకు వెళ్ళాలనేది ఒక జోక్. చిలక పలుకులు నిజమైన మాటలు కావు. మాటలంటే … Continue reading
విశ్వంలో మనిషి స్థానం
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ మనిషిని ప్రపంచంలో అత్యున్నతజాతికి చెందిన ప్రాణిగా భావిస్తారు. తక్కిన ప్రాణుల్లో కొన్ని “ఉన్నతమైనవీ”, కొన్ని తక్కువజాతివీ అనే భావన ఉంది. నిజానికి ఈ హెచ్చుతగ్గులకు ఆధారా లున్నాయని చెప్పలేము. ఎందుకంటే పోల్చటానికి మన భూగ్రహంమీద తప్ప మరెక్కడా ప్రాణులున్న దాఖలాలే లేవు. తాత్వికధోరణిని అవలంబిస్తామనుకునేవాళ్ళు సామాన్యంగా ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఏ … Continue reading
రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం
రవాణా సౌకర్యాలు లేని యుగంలో ప్రయాణాలకు పనికొచ్చిన నడక శారీరకంగా ఇప్పటికీ మనకెంతో సహజమైనది. నడక అనేది ఒకప్పుడు మనుగడకు పనికొచ్చిన చర్య. రోజువారీ జీవితాల్లో అదొక భాగంగా ఉండేది. ఈ రోజుల్లో అది తగ్గిపోయి మనుషులు కదలనవసరం లేని జీవితాలకు అలవాటు పడుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనం నడుస్తున్నప్పుడు మెదడుకు ప్రాణవాయువును అందిస్తాం. ఊపిరి తీసే ప్రక్రియ మెరుగవుతుంది. గుండె వేగం హెచ్చుతుంది; మెదడులోని రక్తనాళాలు పెద్దవవుతాయి. శక్తి పెరిగి, వ్యర్థాలు ఎక్కువగా విసర్జించబడతాయి. ఈ రోజుల్లో మనుష్యుల ఆరోగ్యం అవగాహన బాగా మెరుగుపడింది. టెస్ట్‌ట్యూబుల్లో శిశువులు రూపొందే రోజులొచ్చాయి. మనిషి శరీరనిర్మాణం మాత్రం ఆనాటి ప్రత్యేక పరిస్థితుల్లో రూపుదిద్దుకుందనేది మరిచిపోరాదు. Continue reading
కుటుంబరావు కథలు – సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం
-కోడూరి శ్రీరామమూర్తి “ఒక కథకుడికి రచనాసామర్థ్యం లేకపోయినా సరిచెయ్యవచ్చును గాని, జీవితం తెలియకపోతే సరిచెయ్యడం ఎవరివల్లా కాదు. శిల్పం, భాష, రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అవి కథారచనకు మూలపరికరాలు. ముడిపదార్థం జీవితం.” -ఈ వాక్యాలను రాసింది మానవజీవితాన్ని బహుముఖంగా పరిశీలించి ఆ ముడిపదార్థంతో ఎన్నో అద్భుతమైన కథలను, నవలలను, నాటికలను, … Continue reading
కొడవటిగంటి కుటుంబరావు – జీవితపు వరవళ్ళు
మాధవపెద్ది గోఖలే కుటుంబరావు కక్కయ్య మనకు, సాహిత్యలోకానికి భౌతికంగా అందకుండా దూరమైపోయినాడు. కాని మనలోను, సాహిత్యలోకంలోను, సమాజంలోనూ శాశ్వతంగా వుండిపోయింది ఆయన ప్రతిపాదించిన సాహిత్య శాస్త్రవిజ్ఞానం. ఆయన మన ఊహకందని ఒక నూతన పంథా మహారచయితగా తను బతికుండగానే అయినాడు. కనుక గతించినాక ఆయనకు ముట్టచెప్పవలసిందేం వుండదు. మా అమ్మకు మేనత్త కొడుకు అవటంవల్ల ఆయన … Continue reading