Author Archives: డా. నాగసూరి వేణుగోపాల్

About డా. నాగసూరి వేణుగోపాల్

ప్రముఖ సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, డా నాగసూరి వేణుగోపాల్ గారు ఆల్ ఇండియా రేడియో, హైదరాబాద్ లో ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. ఫిసిక్స్ లో ఎం.ఎస్సి, ఎం.ఫిల్ చేసి అటుపై జర్నలిజం లో ఎం.ఎ, పి.హెచ్.డి ని చేశారు. వృత్తి రీత్యా తెలుగు సాహిత్యం పైన, సామాజిక అంశాలపైనా, విద్యావైజ్ఞానిక అంశాలపైనా కొన్ని వందల కార్యక్రమాలను నిర్వహించారు. విశేషించి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు వందకు పైగా రూపొందించారు.
ముప్ఫైకి పై చిలుకు పుస్తకాలను ఆయన వెలువరించారు. ఆ పుస్తకాలలో తెలుగు సాహిత్యం (విద్వాన్ విశ్వం, శ్రీపాద, నార్లబాట, సాహితీ వీక్షణం, వెలుగుజాడ మొ|| ). ప్రసార మాధ్యమాలు (ఛానెల్ హోరు – భాష తీరు, బుల్లి తెర విశ్వరూపం, వార్తామాధ్యమాలలో విశ్వసనీయత మొ|| ), పర్యావరణం (పర్యావరణం – సమాజం, ప్రకృతి – పర్యావరణం ), పాపులర్ సైన్స్ ( సైన్స్ దృక్పథం, శాస్త్రము- సమాజము, భారత వైజ్ఞానిక వైతాళికులు మొ|| ) , అనువాదాలు (అబ్దుల్ కలాం గారి ఇండియా 2020 మొ||) వంటి విభిన్న రంగాలను విస్తృతంగా శోధించారు. అనేక పత్రికలకు (ఎడిటర్లు ఏమంటున్నారు, విశాఖ ఉత్సవ్ మొ ||) సంపాదకులుగా కూడా వ్యవహరించారు.

డా|| నాగసూరి గారు ప్రముఖ దిన, వార, మాస పత్రికలకు తమ రచనలను అందిస్తున్నారు. ఈయన రచనలను, పుస్తకాలను పాఠ్యాంశాలుగా, పరిశోధనాంశాలుగా వివిధ విశ్వవిద్యాలయాలు ఉపయోగించుకుంటున్నాయి . అనేక జాతీయ అంతర్జాతీయ సభలలో పాల్గొని పరిశోధానత్మక వ్యాసాలను అందించారు. పలుచోట్ల ఉపన్యాసాలు ఇచ్చారు.

వీరి బ్లాగు SPECTRUM.

విద్వాన్‌ విశ్వం

దాశరధి గారికి తెలంగాణమంటే ప్రాణం లేచి వచ్చినట్టు విశ్వం గారికి రాయలసీమ అంటే పంచప్రాణాలు. భాష గురించి, వ్యక్తీకరణ గురించి, మాండలిక పద ప్రయోగం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన తప్పకుండా రాయలసీమ ప్రాంతపు పలుకుబడుల గురించి వివరిస్తారు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments