About గరిమెళ్ళ నారాయణ
ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ , ఆత్మీయులతో కబుర్లు కలబోసుకునే అమూల్యమైన సందర్బాలను పరవశిస్తున్నంత లోనే వర్తమాన సమాజం, దాని పోకడలు, వైరుధ్యాలు, సమస్యలూ కొరడాతో కొట్టినట్టవుతూ ఉంటే ప్రశ్నించు(కో)కుండా ఉండలేనితనమే నా రచనలకు డ్రైవింగ్ ఫోర్సెస్(చోదక శక్తులు) అని గరిమెళ్ళ నారాయణ గారు అంటారు.
నారాయణ గారి మొట్ట మొదటి కధ 1991 లో ఆంధ్రజ్యోతి-న్యూ జెర్సీ రాజాలక్ష్మీ వారి కధల పోటీలో బహుమతిని పొందింది. ఆ తరువాత ఆంధ్రజ్యోతి, రచన, అమృత్ కిరణ్, కోకిల, అమెరికా తెలుగు కధానిక లలో పది వరకూ కధలు ప్రచురితమయ్యాయి. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం లో ప్రసారంతో పాటు ’రచన’ లాంటి పత్రికలలో, కౌముది, ఈమాట, సుజనరంజని లాంటి ఆన్లైన్ పత్రికలలో ఇరవై వరకూ నారాయణ గారి కవితలు ప్రచురితమయ్యాయి.
కధలూ, కవితలతో పాటు, పాటలు వ్రాయడం/పాడటం, స్టేజి షోలు చేయడం నారాయణ గారి సాహిత్య/సాంస్కృతిక హాబీలు. వీరు రెస్టన్, వర్జీనియాలో నివాసముంటూ, బాల్టీమోర్ లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్ గా ఉద్యోగం చేస్తున్నారు.
విధ్వంసకర విద్రోహాల్ని లెక్కచెయ్యక నిరంతరంగా రూపుదిద్దుకునే నిర్మాణాత్మక వ్యూహాల్ని గరిమెళ్ళ నారయణ గారి ఈ కవితలో చదవండి.
Continue reading →