Author Archives: ఆలూరి పార్థసారధి

About ఆలూరి పార్థసారధి

పుట్టింది రాయ్‍పూర్‍లో (ప్రస్తుత ఛత్తిస్‍గఢ్‍ రాజధాని). పన్నెండేళ్ల చదువు విజయనగరంలో. ఆవూరు, పరిసరాలు, సంగీత సాహిత్య సంస్కృతీ సౌరభాల మధ్య ఎదిగే సౌభాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను.

మిగిలిన రమారమి 40 సంవత్సరాలు గడిపింది గోతిలో కప్పలా రాయ్‍పూర్‍ చుట్టుపక్కలే.

మాది ఉమ్మడికుటుంబం, పెద్ద కుటుంబం కావడమే నాకు పెద్ద ప్లస్‍ పాయింటు. ఇంటి గురించి నేను పెద్దగా పట్టించుకోకపోయినా సరిపోయేది. అలా ఆడుతూపాడుతూ ఉద్యోగం చేస్తూ బి.కాం., ఎం.ఏ.(సమాజశాస్త్రం) ప్రయివేటుగా చెయ్యగలిగాను. ఆఫీసు తర్వాత ఇంట్లోనే కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం సరదాగా గడచిపోయేది. అప్పుడే రకరకాల మనుషులు, మనస్తత్వాలు, రాగద్వేషాలు, ఆదర్శాలు, అనుభవాలు, రాజకీయాలు వగైరా వగైరా మామధ్య చర్చకువచ్చేవి. ఇవన్నీ నాకు రాయటానికి ప్రోత్సాహాన్నిచ్చాయి అనుకుంటాను.

గత నాలుగు సంవత్సరాలై పదవీ విరమణ చేసి పిల్లల దగ్గర చెన్నైలో మకాం. అప్పట్నుంచే రాయటం సాధన మొదలెట్టింది. ఆర్నెల్లకో ఏడాదికో ఒకటీ అరా.

స్వంత డబ్బా : ప్రప్రధమ రచనలన్నీ ప్రచురించబడ్డాయి/బహుమతులందించాయి. తరవాతివన్నీ తిరిగొచ్చాయి! ఉదా.

2008 ‘స్వాతి’ సాధారణ కథల పోటీలో ‘మంత్రాలకు చింతకాయలు రాలునా!’కి బహుమతి
2009 ‘స్వాతి’ సరసమైన కథల పోటీలో ‘ప్రియంవదమనం’కి బహుమతి
2009 ‘స్వాతి’ అనిల్‍ అవార్డులో ప్రప్రధమ నవల ‘ఒకసుగుణం’
2010 ‘స్వప్న’ హాస్య/వ్యంగ్య కథల పోటీలో ‘బాబాయ్ బాబోయ్!!’
2010 ‘సాహితీకిరణం’ మాసపత్రిక సాయిప్రియ హోమ్స్ కథల పోటీలో ‘ఒరవడి’కి ద్వితీయ పురస్కారం
2010 ‘ఆంధ్రభూమి’ స్వర్ణోత్సవ పోటీలో ‘ఆఫీస్ గీఫీస్‍!!’ కథ
2011 ‘ఆంధ్రభూమి’ కథల పోటీలో ‘బంగారి గాజులు’ కథ
2011 ‘నవ్య’ ఉగాది కథల పోటీలో సాధారణ ప్రచురణకు ‘మా కళ్లతో చూడు!’ స్వీకృతి.
2011 ‘సాహితీకిరణం’ మాసపత్రిక కార్తికా డెవలెపర్స్ కథల పోటీలో సాధారణ ప్రచురణకి ‘జీవనమాధురి డాట్ కామ్‍’ కథ స్వీకృతి.
ఏప్రిల్‍ 2011 ‘విపుల’ ‘ఈకథ మీదే’ పోటీలో విజేత-1గా ‘నిశ్చితార్ధం’ కథకు బహుమతి.
‘విశాల భారతి’ మాసపత్రిక ఏప్రిల్‍, మే 2011 సంచికల్లో ‘ఈజన్మ నాకొద్దు!’ కథ,
ఇవికాక అడపాదడపా ‘స్వప్న’లో అరనిముషం కథలు.

శివాజ్ఞ …

సరిగ్గా అప్పుడే ఆయింట్లోని హాల్లో గడియారంలోంచి బయటకొచ్చిన చిలకబొమ్మ ఆరుసార్లు అరిచి మళ్ళీ లోపలికి దూరింది. డైనింగ్‍టేబుల్‍ దగ్గర నిలబడి పరాంకుశం గారు బ్రెడ్‍ముక్కకి వెన్న రాశారు. – ఆలూరి పార్థసారధి గారు చెబుతున్న కథ వినండి.. Continue reading

Posted in కథ | Tagged , | 4 Comments