Yearly Archives: 2011
వసంతసుమశేఖరము – 2
ఉగాది కవిసమ్మేళనం వసంతసుమశేఖరము లో రెండవ అంకం చదవండి. Continue reading
తుది విన్నపం
కలసివచ్చిన ఇల్లు
శ్రీఖర నామ ఉగాది కథలపోటీలో "మూడవ బహుమతి" పొందిన కథ.
——————————————————————————
కథావసంతం 2011 – ఉగాది కథలపోటీ ఫలితాలు
పొద్దు పత్రిక అంతర్జాలంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలో కథలకు సంబంధించి పోటీని నిర్వహించడం ఇదే మొదటిసారి. తెలిసిన రచయితలను అడిగి రాయించుకోవడమూ, అభిమానంతో మరికొందరు తామే పంపడమూ మాత్రమే ఇప్పటిదాకా అలవాటు. మరి పోటీ ఎందుకు? తెలిసినవాళ్లందరికీ ఉగాది కథలకోసం ఆహ్వానాలు పంపితే సరిపోతుందిగా అనుకున్నాం మొదట్లో. ’తెలియని రచయితల్ని తెలుసుకోవచ్చుగా!’ అన్నారొకరు; ’నిజమే కొత్తవారితో పరిచయమూ, జాలం బయటి జనంతో అనుబంధమూ’ కలిసొస్తాయనిపించింది.
చైత్రము కవితాంజలి -1
శ్రీఖరనామ సంవత్సర ఉగాది సందర్భంగా కొంతసేపు వచన కవిత్వం చుట్టూ కొందరు కవిమిత్రుల మధ్య జరిగిన కబుర్లూ, కవిత్వమూ…
విటప భంగము
2011 మార్చి 10న తెలుగువారి రాజధాని నడిబొడ్డున సాంస్కృతిక విధ్వంసం జరిగింది. జాతికి స్ఫూర్తిదాతలైన తెలుగువెలుగుల స్మృతి చిహ్నాలను ముష్కరులు ధ్వంసం చేసారు. ఈ సంఘటనపై కవి స్పందన, ఛందోబద్ధ పద్యాల్లో..
వసంతసుమశేఖరము
శ్రీఖర నామ ఉగాది సందర్భంగా పొద్ద్దు నిర్వహించిన పద్య కవి సమ్మేళన వ్యాసాల వరుసలో మొదటి భాగాన్ని ఆస్వాదించండి.
ఉగాది కవిసమ్మేళనాలు
శ్రీఖర నామ సంవత్సర ఉగాది సందర్భంగా పొద్దు తరఫున కవిసమ్మేళనాలను నిర్వహించాం. ఆనవాయితీకి అనుగుణంగా పద్యకవుల, వచనకవుల సమ్మేళనాలు విడివిడిగా రవి, పొద్దు సంవర్గ సభ్యురాలైన స్వాతికుమారిల ఆధ్వర్యంలో జరిగాయి. జాలంలో ప్రసిద్ధులైన కవులెందరో ఈ సభలు జయప్ర్రదం కావడంలో తోడ్పడ్డారు.
ఈ యుగాది శుభ దినాన …
వాసంతుడు ఒళ్ళు విరిచి వ్యాహ్యాళికి చను దెంచెను
శైత్య మంత చాప చుట్టి చల్లంగా జారుకొనెను
ప్రకృతి నూత్న శోభలతో పరవశించి హసియించెను
పల్లె పట్లు పట్టణాలు తిలకించుచు పులకించెను