శారదా విజయోల్లాసము – 2

గిరి: సరే, ఇదిగో – నా వంతు, కాకపోతే నేను సుమనుణ్ణి చూడక పూర్వం వ్రాసిన పద్యమని గమనించగలరు

గిరి:

శా.

ఆహా ఏమిది యాంధ్రదేశ నటరత్నాంకాంకితుండన్ మదీ

యాహార్యంబుల జూచి కృష్ణుడన వేషాయత్తుడయ్యేను క

ట్టా హాస్యాస్పదరూపుడైన సుమనుండా వీడు పౌరాణికో

త్సాహంబున్ విడనాడి సాంఘికములన్ సాధింప బోడెందుకో

శంకరయ్య : అద్భుతంగా ఉంది.

గిరి:

తే.

కృష్ణురూప మే ధరియింప కృష్ణు డిలకు,

వచ్చినాడని హారతుల్ పట్టినారు

అయ్యేను ప్రయోగమొక్కటే పానకంలో పుడక.

పత్రి కాదుల చిత్రితంబైన చిత్ర, ఘట్టముల్ దెచ్చి పటములన్ గట్టినారు

తే.

కృష్ణువేష మితడువేయ కృష్ణకృష్ణ,

కావుమంచు బుల్లితెరల కట్టినారు

చిత్రముల నచ్చువేసిన పత్రిక లరు,

దట్టి వెదురైన ప్రక్కకు నెట్టినారు

తే.

కుడిచి కూర్చుని యుండకీ కోర్కులేల,

అందని ఫలసంపదలకై అఱ్ఱులేల

(వీడు పౌరాణికోత్సాహంబున్ విడనాడి సాంఘికములన్ సాధింప బోడెందుకో -> నాన్‌స్టాప్ అన్న చిత్రం చూసి తరియింతురు గాక!)

నెరనిలువ నోపలేక నీ పరువులేల,

మోజువీడు నటనల రామోజితనయ

రాఘవ : ప్రజలు కాకులలాగ ఎంత మలమల మాడిపోయి ఉంటారో… కావుమన్నారట! 🙂

నచకి : రామోజితనయ 🙂

రాఘవ : ఐనా, “సుమనుఁడు టీ.వి.లోక దితిసూనుఁడు వానికి భక్తులుందురే!”

గిరి: యాహార్యంబుల జూచి కృష్ణుడన వేషాయత్తుడై వచ్చె క – అని చదువుకోగలరు

కామేశ్వర రావు : నచకిగారు, మీరింకా వెనకబడి ఉన్నారు. అతని లేటెస్టు సినిమా “ట్విస్ట్” 🙂

శంకరయ్య : బాగుంది మీ సవరణ …

ఆదిత్య : @Kameswararao చాలా ఇంఫర్మేషనుందే !

రాఘవ : చెమటలుపోయు వాని యొక సీరియలున్ పొఱబాటునం గనన్

గిరి: కామేశ్వరరావుగారు, మీరు అందఱికన్నా ముందున్నారు

నచకి : ట్విస్ట్ టీవీలో మాత్రమే వచ్చినది కదా అని…

గిరి: శంకరయ్యగారు, ధన్యవాదాలు

కామేశ్వర రావు : అతని సినిమాలు నేను చూడను కాని, వాటి గురించి వివరించే బ్లాగులు చదివి ఆనందిస్తూ ఉంటాను 🙂

రవి : సభ్యులకు క్షమాపణలు. కాస్త ఇబ్బంది వచ్చి సభ మధ్యలో విరమిస్తున్నాను. సభను శిరీష్ గారు చూసుకుంటారు

గిరి: ఇంకా కదిలిస్తే మీరు ఆ బ్లాగుల వివరాలు కూడా పంచుకుంటారేమోనని భయంగా ఉంది

చదువరి : అధ్యక్షుల వారి ఆనతి..!

కామేశ్వర రావు : గిరిగారు, ఆ బ్లాగులు మాత్రం చదవడానికి చాలా బాగుంటాయండి, బోలెడంత నవ్వుకోవచ్చు

చదువరి : గిరీ, నా బ్లాగు మొదలెట్టిందే సుమనుతో!

కామేశ్వర రావు : రాఘవా, ఊఁ.. కనన్?

కామేశ్వర రావు : చదువరిగారు, అవును బహుశా మీరే దానికి మొదలనుకుంటాను కూడా

చదువరి : ఔను. కానీ ఇతర బ్ల్కాగరులు దాన్ని బాగా ముందుకు తీసుకుపోయారు. 🙂

నచకి : సుమను”జాల” చరిత్ర అని పుస్తకం వ్రాస్తున్నారా, కామేశ్వరా? 😀

గిరి: అవునా చదువరిగారు

చదువరి : నుమ’నిజాల’ చరిత్ర

కామేశ్వర రావు : 🙂

చదువరి : సుమ’నిజాల’

గిరి: చదువరిగారు, ఈలలు

చదువరి :గిరి:)

శంకరయ్య :

సుమనుని కృష్ణుగ జూచిన

సుమనోహరుడైన అన్న “చూచెద నరలో

కము వీడి యిటకు వచ్చిన

సమయమ్మున తాటదీయజాలుదు” ననెరా!

చదువరి : బాగుంది సార్.

కామేశ్వర రావు : రాజకీయములను రవ్వంత పాపము

రాఘవ : ఎందువలననో మా కనెక్షను సరిగా లేదు. మన్నించాలి. మాటిమాటికీ కనెక్షను పోతోంది.

కామేశ్వర రావు : చేసితేమొ నాకు శిక్షకాగ

నచకి : తాటదీయజాలుదు 🙂

చదువరి : సుమనున్నచోటు నరలోకము కాదు నరకలోకం.

శంకరయ్య : ఏదో ఇప్పటి కిప్పుడు తోచింది ఆశువుగా …

కామేశ్వర రావు : సుమను కృష్ణు సినిమ చూపించ తగునయా

రాఘవ : ఇందాక చెబుతున్న ఆశువునకు కొనసాగింపు… ఏ నిముషము పారిపోవుదునొ నిల్పుకొనంగ మదీయప్రాణముల్

కామేశ్వర రావు : యమ! యిదేమి నరకమయ్యబాబో!

1చదువరి : కామేశ్వరరావు గారూ 🙂

రాఘవ : ఆఖరి పాదం భలే కుదిరింది కామేశ్వరరావుగారూ

రాఘవ : 🙂

చదువరి : రవ్వంత పాపానికి అంత శిక్ష వేసినవాణ్ణి సమవర్తి అనడం ఏం సబబూ..!

కామేశ్వర రావు : ఇప్పుడే అన్నగారు ఆశువుగా నా చెవిలో ఊదిన పద్యమిది

రాఘవ :

అన్నగారు వచ్చి ఆశువు ఊదిరా

సుమనుగూర్చి యిటుల శ్రోత్రమందు

తపము జేసిరేమొ తమరు సుమనునకై

ఎవరికెరుక స్వామి ఎవరికెరుక?

రాఘవ : 🙂

కామేశ్వర రావు : రాఘవా! ఇది చాలా అన్యాయం సుమా!

రాఘవ : లేదండీ, ఇన్ని అనుభవైకవేద్యమైన విషయాలు మీకే ఎలా తెలిసాయీ అని నా అనుమానం 😀

చదువరి : ఇక ముందుకు పోదామా..

రాఘవ : —

గిరి: కామేశ్వరరావుగారు, సుమన ప్రహేళిక అని సరదాగా చిన్న ప్రశ్నలపరంపర సంధిస్తే అనుమానం లేకుండా మీరే నెగ్గుతారు

కామేశ్వర రావు : పోవడమేమిటి, పరిగెత్తుదాం పదండి!

నచకి : తపము జేసిరేమొ తమరు సుమనునకై :))

కామేశ్వర రావు : ఇక్కడందరూ కలిసి నా మీదేదో కుట్రపన్నుతున్నట్టున్నారు…

చదువరి : భువనవిజేతలీ భువనపూర్ణ విజేతలు జాల సత్కవుల్..

గిరి: చదువరిగారు, ఇక్కడ ఉదయం రెండు గంటలు – నేను ఓ పది నిముషాలు ఉండి నిష్క్రమిస్తాను

చదువరి : ..గిరి గారూ, మీ పద్యం చెప్పండి.

చదువరి : గిరీ మీవేనండి పద్యాలు.. ఇది కాక మరొకటుంది.

గిరి: సరేనండీ

కామేశ్వర రావు : గిరిగారు, కించిత్కాలమోపిక పట్టుడు అందరమూ పోవచ్చును 🙂 పది నిమిషాల్లో సభ ముగించేద్దాం

గిరి:

చ.

కవన వనమ్ములోన్ వికచకైరవసౌరభసీమధాములౌ

కవన సుమమ్ములోన్ భ్రమరకామ్య సుధామృతపూరబిందులౌ

కవనసరమ్ములోన్ రుచిరకాంచన మౌక్తిక వజ్రకాంతులౌ

భువనవిజేతలీ భువనపూర్ణ విజేతలు జాల సత్కవుల్

గిరి: అదండీ సంగతి

శంకరయ్య : కవన సుమమ్ము అంటే ఇంకా సుమనే గుర్తుకు వస్తున్నాడు…

గిరి: హా హా

చదువరి : 🙂

నచకి : 😀

కామేశ్వర రావు : బాగుందండీ! కవన వనము, కవన సుమము, కవన సుమన… బోబోయ్ నాకీ రోజు నిద్దరుండేట్టు లేదు! 🙂 కవన సరము, చాలా బాగున్నాయి.

గిరి: శంకరయ్యగారు, మరీ గట్టిగా నవ్వితే పడుకున్న వాళ్ళు నిద్రలేస్తారని నొక్కిపెట్టి నవ్వుకుంటున్నాను

చదువరి : కలల సుము

శంకరయ్య :గిరిగారూ, బాగుందండి మీ పూరణ. అభినందనలు…

చదువరి : కలల సుమను

రాఘవ : గిరిగారూ, చాలా రమణీయంగా ఉందండీ పద్యం

చదువరి : ఇప్పుడు..

చదువరి : వైరిఁ గీర్తించె పతిమెచ్చ వారిజాక్షి

చదువరి : నచకి గారూ మీ పూరణ

నచకి : అవధరించండి

నచకి :

“ఉదరమున జగముల గాచు యో మురారి!

దైవమన్న నీవె యగు ఓ దనుజహారి!

అన్యథా శరణం నాస్తి!” యనుచు నసుర

వైరిఁ గీర్తించె పతి మెచ్చ వారిజాక్షి.

శంకరయ్య : బాగు … బాగు!

కామేశ్వర రావు : బాగుందండి. మణిప్రవాళ రచన!

గిరి: బావుంది – ఇంతకీ ఎవరు

నచకి : “ఉఱికిననోర్వక యుదరంబు లోపల జగముల వ్రేగున జగతిఁ గదుల” అన్న పాదం స్ఫూర్తితో మొదటి పాదము…

రాఘవ : 🙂

నచకి : ఎవఱైనా కావచ్చు. ఆ పతి సుమన్ అనుకోండి పోనీ! 😀

చదువరి : 🙂

గిరి: అనుకున్నాను – పెద్దగా నవ్వుకున్నాను కూడా

శంకరయ్య : 🙁

నచకి : “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణమ్ వ్రజ” అన్న గీతాకారుని వాక్య స్ఫూర్తితో తక్కిన రెండు పాదాలు వ్రాసాను.

ఆదిత్య : మా చెవుల రింగుమని మారుమ్రోగుతోంది

రాఘవ : ఏమండోయ్… ఇది వసంతసుమ(న్)శేఖరం కాదు, శారదావిజయోల్లాసం.

రాఘవ : మనం సుమన్ నామ జపం అధికంగా చేస్తున్నామేమో

నచకి : మురారి, దనుజహారి, అసురవైరి అని మూడు రకాలుగా విష్ణువును “అరి”గానే స్తుతించే ప్రయత్నం కూడా…

చదువరి : కామేశ్వరరావు గారూ, ఇంకా ఏమైనా ఉన్నాయా, ముగించవచ్చా?

కామేశ్వర రావు : సంస్కృత వాక్యాలని ఇలా తెలుగు పద్యాల్లో పొదగడం పోతన, రాయలే అనుకుంటా చేసింది

నచకి : అయ్యబాబోయ్! నాకు తెలియకుండానే ఆ సాహసానికి ఒడి గట్టాను! 😀

రాఘవ : ఔనండీ, నాకూ అన్యులు ఈ విధమైన ప్రయోగాలు చేయగా చదివిన గుర్తు లేదు. 🙂

గిరి: కామేశ్వరరావుగారు, కుక్కుటం గురించి మనమో పద్యం మాట్లాడాము కొద్దిరోజుల క్రితం – అది ఇలాంటిదే

కామేశ్వర రావు : చదువరిగారు, ఇక మంగళం పాడెయ్య వచ్చును. ఇప్పటికే చాలా సేపయ్యింది.

గిరి: సమయాభిజ్ఞత కుక్కుటంబు

నచకి : గతంలోనూ తెలుగు, ఆంగ్ల పదాలతో శార్దూలం వ్రాసినప్పుడు క్రొత్తపాళీ గారు అన్నారు… మాడుగుల వారు కూడా “శార్దూలానికి శాకాహారం నప్ప”దని చెప్పి దాటేసారని… “తెలిస్తే వ్రా

గిరి: ప్రభావతీ ప్రద్యుమ్నంలోది – పింగళిసూరన

కామేశ్వర రావు : గిరిగారు, అవును గుర్తుకు వచ్చింది!

కామేశ్వర రావు : పింగళిసూరన కూడా చేసాడు

చదువరి : శార్దూలానికి శాకాహారం నప్ప – 🙂

చదువరి : సరే మరి మంగళం పాడి ముగిద్దామా?

కామేశ్వర రావు : ఈ సారి సభలో జనం కొంచెం పల్చగా ఉన్నా, సభ రసవత్తరంగానే సాగింది!

చదువరి : ఔనండి.

శంకరయ్య : శాకాహారమ్ము మెచ్చె శార్దూలంబే.

శంకరయ్య : నాకు ఒక సమస్య దొరికింది.

గిరి: కామేశ్వరరావుగారు, మీ పరిశోధన ఈ విషయంలో చాలవఱకూ సహకరించిందని నా నమ్మకం – ఏ విషయంలో అని అడగకండి

చదువరి : నచకి గారు ఆలస్యం కావడం నిరాశ కలిగించింది.

కామేశ్వర రావు : రెండురోజులూ సభలో పాల్గొన్న గిరిగారికి, ఇంత ఆలస్యమైనా ఓపికతో ఉన్న శంకరయ్యగారికి ప్రత్యేకంగా అభివందనాలు.

శంకరయ్య : రేపు నా బ్లాగులో ఇదే ఇస్తాను.

చదువరి : అసలు రావడం సంతోషం కలిగించిదనుకోండి.

చదువరి : “రెండురోజులూ సభలో పాల్గొన్న గిరిగారికి” -:)

కామేశ్వర రావు : గిరిగారు, ఏ విషయంలో?

శంకరయ్య : రెండు రోజులా ? సభ జరిగించి ఈ ఒక్కరోజే

గిరి: అడిగారు కనుక చెపుతున్నాను – సుమను విషయంలో

శంకరయ్య : రోజే కదా?

చదువరి : ఆయనకు ’రేపు’ వచ్చేసిందండి.

కామేశ్వర రావు : గిరిగారు, అనుకుంటూనే అడుసు తొక్కాను 🙂

గిరి: శంకరయ్యగారు, నేను నిజానికి సభలో పాల్గొనడం ప్రారంభించింది నిన్న – ఇప్పుడు ఇక్కడ ఉదయం రెండయ్యింది

శంకరయ్య : అలాగా? సంతోషం.

గిరి: మిత్రులందఱికీ ధన్యవాదాలు

రాఘవ : మన్నించాలి, మళ్లీ నాకు విద్యుద్భంగమయ్యింది. ఇంతకూ మంగళం పాడేసారా? లేదా ముత్తయిదువలను వెదుకుతున్నారా?

చదువరి : కామేశ్వరరావు గారూ, చర్చ అంతా బాగానే సేవయిందండి.

నచకి : పని వత్తిడి వలన సభలోనే కాదండీ, హోమ్‌వర్క్ కూడా పూర్తి చెయ్యలేదు సరిగా! 🙁

చదువరి : 🙂

కామేశ్వర రావు : అందరికీ ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు

నచకి : నిజానికి నేను రావటానికి కారణం మీరే, చదువరి గారూ! మీ వేగు చూసి “ఓహ్, ఇంకా అవుతోందా!” అనుకుని చేఱిపోయాను.

చదువరి : అధ్యక్షా.. ముగింపు మీరే పలకండి.

చదువరి : నచకి గారూ, నెనరులు.

చదువరి : 🙂

కామేశ్వర రావు : రాఘవా, మీరు పాడతానంటే వినడానికి మేము సిద్ధమే

రాఘవ : పాడి పంపుతాను 🙂

గిరి: రాఘవ ముత్తయిదువలని ప్రవేశపెట్టాలని ఉబలాట పడుతున్నాడు

చదువరి : 🙂

శంకరయ్య : మంచిది… కొందరికి శుభరాత్రి … కొందరికి శుభోదయం…! ఉంటాను. సెలవు.

రాఘవ :

సభకు మంగళంబు నిభ వక్త్రుఁ డిడుఁగాత

గౌరి లక్ష్మి వాణి కలిమినిడుత

రామభద్రుఁడిడుత రమణీయత్వంబును

సర్వులకు శుభంబు శర్వుఁడిడుత

చదువరి : అందరికీ సెలవు.

గిరి: అందఱికీ సెలవు

కామేశ్వర రావు : శుభం!

రాఘవ :

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః

గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్సమస్తాః సుఖినో భవన్తు

ఆదిత్య : స్వస్తి

చదువరి : అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

2 Responses to శారదా విజయోల్లాసము – 2

  1. సూర్యుడు says:

    చర్చ బాగుంది, పద్యాలు కూడా.

    ~సూర్యుడు

  2. padmarpita says:

    :)భలేగుందండి…

Comments are closed.