శ్రీపతి: విశ్వామిత్రా మీ మేనకపై అందరూ కన్నేశారని అలిగారా?
విశ్వామిత్ర: లేదు కన్నేశారని మేనక అలిగితే తీర్చి వస్తున్నాను
గన్నవరపు నరసింహమూర్తి: విశ్వామిత్రా, సినిమా ఎలా వుంది
రవి: మీ మేనక ఇక్కడుంటే ఇంకో మేనక అంటున్నారు. విశ్వామిత్రా ఎంతమంది మేనకలు?
శ్రీపతి: ఆయన సినిమాకెళ్ళారే కానీ సిన్మానెక్కడ చూశారు?
గన్నవరపు నరసింహమూర్తి: విశ్వామిత్రుల వలె మేనకలు కూడా చాలా మందే సినిమాలకి
జ్యోతి: ఐనా తాతతో కూడా సరసాలు ఆడే మనవరాళ్లు ఉంటారు. సురక్షితం కూడా తాతలా కనిపించే అంకుల్స్ కి.. ఏమంటారు??
గన్నవరపు నరసింహమూర్తి: ధన్యవాదాలు, మా ఆవిడకి కూడా చూపించా, కుట్ర లేదు
శ్రీపతి: ఉన్నట్టుండి మౌనం వహించారు?
రవి: మిస్సన్నగారూ, వసంత్ కిషోర్గారూ, నచకిగారూ క్యూలో నిలబడండి. మిస్సన్న గారూ మీ వంతు.
కామేశ్వరరావు: శ్రీపతిగారు, లేదండి. హాయిగా మీరుకొనిచ్చిన టికెట్టుతో సినిమా చూసింది ఆయనేగా! 🙂
పుష్యం:ఎంతవారు గాని, వేదాంతులైనగాని.. పాటలా ఉంది.
రాఘవ: ఊఁ
శ్రీపతి: ఎంత కుట్ర…. అన్యాయం… అక్రమం…
మిస్సన్న: ఇందాక నేను పొరబాటు బడ్డాను ఇప్పుడు చిత్తగించండి
కం ||
యింకో టిక్కెట్టు తీసి యీరే మనకున్ "
పంకజ ముఖి నవ్వుచు నన
చంకల నెగరేసి మామ చప్పున కొనియెన్.
ఉ ||
విందొనరించి యుందు! తన వేడ్కను దీర్చుట పాడి యౌనులే,
సుందరి తోడ చిత్రమును చూచెద నేడిక! యెన్ని నాళ్ల కీ
విందు లభించె నాకిక" ని వేచెను జవ్వని రాక కోసమై.
ఉ ||
"అల్లదె వచ్చుచుండినది యా ప్రియ భామిని నవ్వు రువ్వుచున్!
ఝల్లను గుండె నాకు! భళి! " ???? సన్నటి వాడెవడమ్మ ప్రక్కనన్?
మెల్లగ వచ్చి పల్కినది " మీకు శ్రమిచ్చితి తాత గారు! బై! "
చల్ల బడంగ తాత! జనె సన్నటి వానిని గూడి నాతియున్!
రాఘవ::D
నచకి: ఏకంగా "తాతగా"రే?
రాఘవ:అంకులు కాస్తా తాతగా మారి కూలిపోయి ఉంటాడండీ.
వసంత్ కిషోర్:: చంకల నెగరేసి మామ – చాలా బావుంది !
కామేశ్వరరావు: "చంకల నెగరేసి మామ చప్పున కొనియెన్" – హహహ…
రవి: సన్నటి వాడు – సిక్స్ పేక్ వాడాండి? వాడి మొహం మండా!
కామేశ్వరరావు: రవీ, మీకెందుకంత ఆగ్రహం!
రవి: : నాకు ఉన్నది ఒక్క పేక్ కాబట్టండి
రాఘవ:ఫ్యామిలీ ప్యాక్ కానంతవఱకూ ఇబ్బంది లేదు.
రాఘవ::)
నచకి: )
కామేశ్వరరావు: నాకున్నది పేకులు కాదు టైర్లు, మరి నేనేమనుకోవలి 🙂
రాఘవ:ఎమ్మారెఫ్ టైర్ ఐతే సచిన్ బ్యాటింగ్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ
విశ్వామిత్ర: ఫ్యామిలీ "Pack up"అననంతవరకూ కూడ ఇబ్బంది లేదు, నా లగా Family Pack ఐనా కూడా
రాఘవ:సరే.
జ్యోతి: మరే.. ఆ తర్వాత తాతగారి సం"గతి" ఏమైనట్టు??
గన్నవరపు నరసింహమూర్తి: మిస్సన్నగారూ బాగుంది, కామేశ్వర రావు గారికి చెప్పా, నా ఆఖరి తెలుగు సినిమా ఇంటింటి కాపురము. అలా జరిగాకా సినిమాలు మనేసాను
రాఘవ:ఔనండీ, దీనిపై వేఱే పూరణలున్నాయా? లేకపోతే, నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఒకటుంది… ఈ పూరణను ఎవ్వరూ ఇంకొక విధంగా పూరించవచ్చునని ఆలోచించకపోవటం.
మిస్సన్న: జ్యొతి గారూ చల్లబడి పొయారు గా
రాఘవ:జ్యోతిగారూ, ఆ తాత తరువాత నిజంగానే తాతగా మారి తాతలలో కలిసిపోయాడు.:)
నచకి: వేఱే విధంగా అంటే, అధ్యక్షా?
రాఘవ:వేఱే విధంగా అంటే… అధ్యక్షులవారు సెలవిస్తే విన్నవిస్తాను.
రవి: : ఊ కానివ్వండి, సభ మనందరిదీనూ
కామేశ్వరరావు: ఇంకా ఇద్దరి అనుభవాలున్నట్టున్నాయి కదా
రాఘవ:ఈ పద్యాలు ఇప్పుడే వ్రాసాను. గుణదోషాలు చూచుకోలేదు.
రాఘవ:
తన కుమారునకు నెవరు తగునని
తను తలఁచెనో యామెయు సుతుఁడు గలిసి
తాను చూడ వచ్చిన చిత్రంపుచోటు కదియ చిత్రమునుఁ జూడవచ్చిరి చిత్రముగను
రాఘవ:సభికులకు నా పూరణ ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి! 🙂
ఆ.వె||
సాయమడిగె సుతుని సఖియ వచ్చి
సినిమఁ జూడగ వలయును చీటీలు రెంటికై
తండ్రిమనసు కొనెను తనధనమున
ఆ.వె||
సఖునికడకు వేగఁ జనుచుఁ జనుచు
థ్యాంక్యు అంకులనఁగఁ దబ్బిబ్బు పడడొకో
తండ్రి మామగారు తానె కనుక!
మిస్సన్న: రాఘవగారూ భేష్
రవి: : రాఘవగారూ సుతుడి రోలు ఎవరండి? :))
రాఘవ:సుతుడి రుబ్బుఱోలు ఇంకా ఎవరూ లేరు 🙂
నచకి: వావ్, సూపర్ తమ్ముడా!
కామేశ్వరరావు: మరీ సంసారపక్షంగా ఉంది 🙂
విశ్వామిత్ర: )
వసంత్ కిషోర్:: బావుంది
రాఘవ:సంసారపక్షంగా ఉంది కనుకే మామగారు టిక్కెట్టు కొనిచ్చాడు
రాఘవ::)
గన్నవరపు నరసింహమూర్తి: రాఘవగారూ చాలా బాగుంది
కామేశ్వరరావు: అమ్మాయిలకి టికెట్లు కొనే అనుభవాలు కుఱ్ఱాళ్ళ కన్నా పెద్దలకే ఎక్కువ ఉన్నట్టున్నాయి 🙂
రాఘవ:అంతే కదా మఱి
రవి: : ఈ పెద్దాళ్ళున్నారే …చిచ్చీ …
గన్నవరపు నరసింహమూర్తి: వయస్సు లేక అనుభవాలు ఎలా వస్తాయి ?
జ్యోతి: రవినువ్వు మరీను ,, పెద్దవాళ్లంటే మడికట్టుకుని, కృష్ణారామా అనుకోవాలా??
రాఘవ:రవిగారూ, గన్నవరపువారూ, … 🙂
కామేశ్వరరావు: మూర్తిగారు, ఇలాంటి అనుభవాలతోనే మీకు తలపండిపోయినట్టుంది
నచకి: )
గన్నవరపు నరసింహమూర్తి: రవిగారూ ఈ సమస్య యిచ్చి మాకు కిర్రెక్కించారు.
వసంత్ కిషోర్:: సరే ! నేను మొదలు పెట్టేదా
రవి: : సరే క్యూలో వసంత్ కిషోర్ గారు చాలా సేపు నుంచోబెట్టాం
రవి: రండి
మిస్సన్న: ఏదో అన్నాం గదా అని మాకే టెండర్ పెడితే యెలాగండీ
వసంత్ కిషోర్:
ఉ ||
పండుగ నాడు ! వేడె, నను – పల్కుల తియ్యని తేనె లొల్కుచున్
గుండెలు ఝల్లనంగ, నొక – కోమలి ! రెండు టికెట్లు తీసితిన్
పండెను పండుగంచు , కడు – బాళిని ,భ్రాంతిని , మంద హాసమున్ !
ఉ ||
విందులు చేసి కొందు మిక – వేడుక దీర , విరామ మందునన్ !
బంధము హెచ్చెనేని , మన – భాగ్యము పండును; నిశ్చయమ్మికన్ !
చెందెను , నా మనంబు , తన – చిత్తము వచ్చిన రీతి నంతటన్ !
ఉ ||
మంటలు రేగ సాగె , మది – మాయ మయెన్ ,మరి మందహాసమే !
వెంటనె ,థాంక్సు జెప్పి , తను – వేగమె వెళ్ళిన ! నిర్వికారతన్
ఇంటికి సాగి పోతి నిక – ఇచ్ఛయె చచ్చెను ! మంద భాగ్యుడన్ !
తుందిలుడు = పెద్ద పొట్ట గలవాడు( నాకు చాలా వికారంగా కనిపించాడు )
జ్యోతి: బాళి,,,, అనగా నేమి
గన్నవరపు నరసింహమూర్తి: పద్యాలలో సరదా ! కిశోర్ గారు సినిమా మనిషి. చూడండి ఎంత మంచి పూరణో !
నచకి: బంధము హెచ్చెనేని , మన – భాగ్యము పండును 😉
వసంత్ కిషోర్:: బాళి = సంతోషము
మిస్సన్న: పాపమ్ తాతగారు
జ్యోతి: మరి వీళ్లందరికి టికెట్ డబ్బులన్నా ఇస్తున్నారా లేదా అమ్మాయిలు..:)
గన్నవరపు నరసింహమూర్తి: మిస్సన్నగారి విలన్ సన్నము, కిషోర్ గారి విలన్ తుందిలుడు!
కామేశ్వరరావు: జ్యోతిగారు, మీరు మరీ అంత అమాయకుల్లా మాట్లాడకండి! 🙂
నచకి: అధ్యక్షులవాఱు అలా యిప్పించలేదు, జ్యోతిగారూ!
జ్యోతి: )
మిస్సన్న: అమ్మాయి డబ్బులిస్తే ఇంక థ్రిల్లేం ఉంటుందన్డీ
వసంత్ కిషోర్:: అమ్మాయిలు డబ్బులిస్తారా ప్రాణాలు తీస్తారు గాని
రవి: తుందిలుడు = పెద్ద పొట్ట గలవాడు (నాకు చాలా వికారంగా కనిపించాడు) – స్వభావోక్తి అలంకారమా? విరోధాభాసా?
మిస్సన్న: నిజం
కామేశ్వరరావు: కిశోర్జీ, మీకు బాగా మండినట్టుంది!:)
గన్నవరపు నరసింహమూర్తి: విరోధ భావమే
జ్యోతి: అబ్బాయిలైనా, అంకుల్సైనా, తాతలైనా అమ్మాయిలంతా ఇంతేనంటారు.. 🙂 వాళ్లవెంట ఉన్న అబ్బాయిలను ఎంతలా తిడుతున్నారో…:)
వసంత్ కిషోర్:: విరోధాభాసమే
గన్నవరపు నరసింహమూర్తి: తాతలం గాని సన్యాసులం కాదుగా !
రవి: 🙂 ఆఖరున నచకి గారు మిగిలారు.
రవి: నచకిగారూ మీ టికెట్ల వ్యవహారం తెమల్చండి
నచకి: సరే…
కం ||
దండిగ యున్న జనమందు తప్పించుకు "యే
మండీ, టికెట్లు తె"మ్మని
పండంటి పడుచు యడిగెను, భళి, యేం ఛాన్సో!
కం ||
భామామణి వంక జూసి బ్రాడ్ స్మైలిస్తూ
"ఏమీ ప్రాబ్లమ్ లేదులె,
ఈ మేనేజరు నెఱుగుదు, …ఈజీ!" అంటూ
కం ||
ప్రక్కన యువకుడికి యిచ్చి "రా, డియ"రంటూ
ఠక్కున దిఱిగి చెప్పెను
"అక్కఱలో సాయపడిరి, అంకుల్, థాంక్యూ!"
వసంత్ కిషోర్:: బ్రాడ్ స్మైలిస్తూ – భలే బావుంది !
రవి: : ఈ నాయకుడు యూత్ కెక్కువ, అంకుల్ కు తక్కువ లాగున్నాడు
విశ్వామిత్ర: )
కామేశ్వరరావు: రవీ 🙂
రాకేశ్వరుఁడు: "అక్కఱలో సాయపడిరి, అంకుల్, థాంక్యూ!" అని ఛందస్సులో చెబితే ఇంకా బాధగాననిపిస్తుంది.
మిస్సన్న: సింపుల్ గా తెమిల్చేశారు.
నచకి: "తిడితే తిట్టావు గాని తాళంలో తిట్టు" అన్నారు పెద్దలు
రవి: : రాకేశ్వరరావు గారి కన్ను ఱ మీద పడింది!
గన్నవరపు నరసింహమూర్తి: నచకి గారు ఎక్కువ బాధ పడినట్లు లేదు
కామేశ్వరరావు: వారికిది అలవాటేనేమో 🙂
నచకి: ప్రక్కన భార్య లేకుండా సినిమాకి వచ్చాడంటే యూత్‌కి ఎక్కువ, అంకుల్‌కీ తక్కువ అయితే మంచిదనిపించింది. అనుభవరాహిత్యం తప్పించి మఱేమీ కాదు, అధ్యక్షా!
వసంత్ కిషోర్:: బ్రాడ్ మైండేమో
నచకి: అబ్బే, పక్కకెళ్ళి బరువుగా బాధపడ్డాను ("ఐతే..!" సినిమా డవిలాగు)
రవి: : పోనీలెండి ఈ నాయకుడి ధైర్యం చూస్తే మరో అటెమ్ఫ్ట్ చేసేటట్టున్నాడు. దిగ్విజయీభవ అని ఆశీర్వదిద్దాం
నచకి: ఈ పద్యాల్లో చెప్పిన ముక్కల్లో మేనేజర్ దగ్గఱికి వెళ్ళి టికెట్లు తీసుకోవటం ఒక్కటే నాకు అలవాటైన పని, కామేశ్వరరావుగారూ!
వసంత్ కిషోర్:: మొత్తం మీద అలవాటే
కామేశ్వరరావు: ఇంతకీ నాకో అనుమానం. ఇందరినీ టిక్కెట్లడిగినది ఒకే అమ్మాయా, వేర్వేరు అమ్మాయిలా? 🙂
విశ్వామిత్ర: )
జ్యోతి: కామేశ్వరరావుగారు, వేర్వేరు అమ్మాయిలనుకుంటానండి.
నచకి: "నన్ను అడిగిన అమ్మాయి నన్ను మాత్రమే అడిగింది" అనుకుంటే ఒక సంతోషం. "నన్ను మాత్రమే మోసం చేసిందా?" అనుకుంటే ఒక బాధ!
జ్యోతి: ఏ చోట చూసినా అమ్మాయిలంతా ఇంతే అని డిసైడ్ అయ్యారుగా
వసంత్ కిషోర్:: ఒకే అమ్మాయి వేర్వేరు రోజుల్లో
రవి: : ఒకే అమ్మాయి తుందిలుణ్ణి, సిక్స్ పేక్ గాణ్ణీ, యూత్ ను సెట్ చేసిందంటే ఆ అమ్మాయి మహాజాణ!
మిస్సన్న: )
నచకి: కానీ ఒకే అమ్మాయైతే మాత్రం యిదేదో సైడ్ బిజినెస్‌లా ఉంది, బ్లఫ్ మిస్ట్రెస్స్!
గన్నవరపు నరసింహమూర్తి: అధ్యక్షా మీరు చెప్పండి ఒక్క అమ్మాయా ఎక్కువ మందిని హైరు చేసారా !
రవి: : అధ్యక్షులకు సమస్య ఒక్కటే తెలుసు.
వసంత్ కిషోర్:: అయ్యా సమస్యలోనే ఉంది ఒక జవ్వని అని
కామేశ్వరరావు: సరే ఇక అమ్మాయి(ల) గోల వదిలి ముందుకు నడుద్దామా?
రవి: : సరే ఇందాకట్నుంచి కామేశ్వరరావు గారిని నారదులావహించినట్టు కనబడుతుంది.ఆయనతో ఒక పూరణ చేయిద్దాం
ధృఢసత్వంబునఁ జీమ తుమ్మెనహహా! దిగ్ధంతులల్లాడగన్.– ఎలా?
నచకి: (ఆశువు)
ఎందఱు ఉన్నా గానీ
కొందఱికే సాధ్యమౌను కొంపలు ముంచే
చిందులు యీ పద్ధతి నే
మందురు అధ్యక్షులు, ఇపుడట్లంటేహా?
కామేశ్వరరావు: )
కామేశ్వరరావు: "దృఢసత్త్వంబున"కి నా పూరణ
మ ||
రి ఢమద్ధ్వానముతోడ గుఱ్ఱునిడ, దూరెన్ ఘ్రాణవల్మీకమున్
దృఢసత్వంబున చీమ, తుమ్మె నహహా! దిగ్దంతులల్లాడగన్
తృఢితంబై ఘనవృక్షముల్ దెగిపడన్ దేవారి తానంతటన్
రవి: : ఏంటి? ఘ్రాణవల్మీకమా? 🙂
వసంత్ కిషోర్:: అద్భుతం ! కరతాళ ధ్వనులు !
విశ్వామిత్ర: ఘ్రాణవల్మీకమున్ – 🙂
కామేశ్వరరావు: అందుకేగా చీమ దూరింది 🙂
మిస్సన్న: అద్భుతం ! కరతాళ ధ్వనులు !
శ్రీపతి: అద్భుతం ఈ పూరణ.
గన్నవరపు నరసింహమూర్తి: చక్కని పూరణ ! కామేశ్వర రావు గారూ !
కామేశ్వరరావు: కృతజ్ఞతలు
శ్రీపతి: ఢ ప్రాస, అందునా ప్రాసాక్షరం ముందు సరళాక్షరం… అబ్బో మంచి పూరణ
రవి: రాఘవగారొచ్చారా? రాఘవగారూ మీరూ వినిపించాలి
పుష్యం: అద్భుతం, మొదట్లో డ-ఢ కి ప్రాస కుదురుతుందను కున్నాను.. మీ పూరణ చూసేదాకా
మిస్సన్న: సంపూర్ణ రామాయణంలో సీను గుర్తు వస్తోంది
కామేశ్వరరావు: డ, ఢ లకి ప్రాస ఎక్కడా చూడలేదు, కాబట్టి కుదరదనే అనుకుంటాను.
నచకి: నేను కూడా అలా కుదఱకపోయేసరికి యీ పూరణకి చేతులెత్తేసాను. 🙁
పుష్యం: శబ్ద సారూప్యం ఉందికాబట్టి, మనం వాడడం మెదలెట్టొచ్చేమో
నచకి: ఘ్రాణవల్మీకమున్ 🙂
రవి: ఉన్నారా? అసలున్నారా?
రవి: రాఘవగారు లేకపోతే మరో పూరణకెళ్ళిపోదారి.
విశ్వామిత్ర: లోపల పాములన్నాయని భయపడిందేమో – జొప్పడటానికే దృఢసత్వంబు అవసరమైంది 🙂
కామేశ్వరరావు: ఊదంగారు, 🙂
రవి: ఇందాక సినిమా జవ్వనితో కాక ఇప్పుడు భామామణి
రవి: ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితో– మిస్సన్న గారూ కానివ్వండి
మిస్సన్న:
కం ||
ఫస్ట్ క్లాస్ జాబ్ ఫారి నందు, ఫాదరు కికపై
లాస్ట్ క్లేశము! మార్యేజై,
ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితో.
కామేశ్వరరావు: ఫస్ట్ క్లాసుగా ఉంది!
వసంత్ కిషోర్:: మిస్సన్నగారు ఇంగ్లీషులో కందం వ్రాయడంలో సిద్ధహస్తులు
రవి: : లాస్ట్ క్లేశము! కానీ అతనికి క్లేశము మొదలైంది కదండి?
విశ్వామిత్ర: ఫాదర్ కి లాస్ట్ క్లేశము, ఈతడికి ఫస్ట్ క్లేశము
రాఘవ::)
నచకి: )
వసంత్ కిషోర్:: )
రాఘవ:ఫస్ట్ క్లాసులో ప్రయాణమో ఏమో కానీ తలపండిపోయి… లాస్ట్ క్లేశం కాస్తా పలితకేశం అయ్యి కూర్చుంటుంది. 🙂
మిస్సన్న: అలాగే కానీండి
మిస్సన్న: )
రాఘవ:మీరు అలాగే కానీండి అంటే సరిపోదండీ.
కామేశ్వరరావు: ఇంకా ఎవరెవరు ప్రయాణమయ్యారు భామామణితో?
రవి: : సనత్ గారూ, రాఘవగారూ, నచకిగారూ ఇదే వరుసలో పూరణలను ఆలాపించండి.
రాఘవ:రామ రామ అదేం ప్రశ్నండీ కామేశ్వరరావుగారూ!!
రవి: : సనత్ గారు లేకపోతే రాఘవ గారు, నచకిగారూ
రాఘవ:దేని పూరణ అధ్యక్షా?
మిస్సన్న: ఇది అన్యాయమండీ కొత్త గృహస్తు.
రవి: : ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితో
శ్రీపతి: నేను ఉన్నాను
కామేశ్వరరావు: నా ఉద్దేశం ఇంకా ఎవరెవరు పూరించారనండి 🙂
రాఘవ:అలా ఐతే ఇబ్బంది లేదు 😀
శ్రీపతి:
కం||
ఫస్ట్ క్లాసున పయన మయ్యె భామా మణితో
జస్ట్ ! క్లైవ్ లాయెడ్ ఫ్రీగా
హోస్ట్ క్లాజును వాడుకొనుచు హుబ్లీ రైల్లో
మిస్సన్న: ఓకే మన్నించాలి
వసంత్ కిషోర్:: భలే బావుంది !
రవి: హుబ్లీకి హనీమూనా? ఎవరండి ఆ అరసికుఁడు?
కామేశ్వరరావు: "హోస్ట్ క్లాజ్" అనగానేమి?
రాఘవ:హుహుహుబ్లీకి బెస్ట్ క్లైమేట్ ట్రిప్పు… సరే. క్లైమాక్స్ ఏమిటీ?
మిస్సన్న: జస్ట్ బెస్ట్ !
నచకి: హుబ్లీ నుంచి వస్తున్నాడేమో లెండి, అధ్యక్షా!
రాఘవ:కిరణన్నయ్యా, ఇంకా నయం. హుబ్లీ అన్నది ట్రైన్ పేరు అన్నావు కాదు! 🙂
వసంత్ కిషోర్: అంతే అయ్యుంటుంది
నచకి: నువ్వంటావని ఆగాను, తమ్ముడా! 🙂
కామేశ్వరరావు: శ్రీపతిగారు రైలెక్కి వెళిపోయారా ఏమిటి?
విశ్వామిత్ర: ఆ భామామణి "Just" భామామణి అని సారాంశం
కామేశ్వరరావు: నచకిగారు మీ పూరణ వినిపించండి.
నచకి: తప్పకుండా… వినుడు
కం||
బీస్ట్ క్లాసది క్యాటిలుకని బిలిచె థరూరే –
లీస్ట్ క్లాస్ నా రేంజ్‌కిదె"యని
ఫస్ట్ క్లాసున బయనమయ్యె భామామణితో!
కామేశ్వరరావు: పాపం థరూర్ మీద పడ్డారేం? 🙂
నచకి: మఱో పూరణా ఉంది… వినిపించమందురా?అందులో ఎవఱి మీదా పడలేదు! 😀
వసంత్ కిషోర్:: బీస్ట్ అంటే
నచకి: బీస్ట్ అంటే క్యాటిల్ కానిది… నిజమే. కానీ, కవిసమయం అనుకోండి కిశోరా!
కామేశ్వరరావు: అలాగే, తొందరగా.
గన్నవరపు నరసింహమూర్తి: కనీసము ఇక్కడ కిడ్నాపింగులు మోసాలు లేవను కొంటా ! ప్రియుడు వచ్చే లోపల ట్రయిను కదిలింది
నచకి:
కం ||
బెస్ట్ క్లాసేదని యడిగిన పీనాసికి హై
కాస్ట్ క్లాషయి ఏ.సీ. విడి
ఫస్ట్ క్లాసున పయమనయ్యె భామామణితో!
నచకి: (రాఘవుడు వచ్చినట్టున్నాడు?)
కామేశ్వరరావు: బాగుంది:)
నచకి: అధ్యక్షులవాఱికి పునస్స్వాగతం
వసంత్ కిషోర్: బావుంది !
నచకి: అధ్యక్షులవాఱికి పునస్స్వాగతం
రవి: క్షమించాలి. నీలితెఱలు ఛేదించుకుని వచ్చాను
కామేశ్వరరావు: రాఘవులది ఎక్కీదిగే ప్రయాణమైపోయింది 🙂
విశ్వామిత్ర: 🙂
మిస్సన్న: 🙂
కామేశ్వరరావు: అధ్యక్షా, తదుపరి పూరణతో వజ్రాన్ని చీల్చుదామా?
రవి: విశ్వామిత్రగారితో ఒక్కమారు
రవి: ప్రవరాఖ్యుని స్థానంలో శ్రీకృష్ణుడు లేదా మరో దక్షిణనాయకుడు ఉంటే, వరూధినికి "ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో…" పద్యానికి మారుగా మరే సమాధానం/సన్నివేశం లభించి ఉండేది ఊహించి వ్రాయండి.
రవి: పై సమస్యకు విశ్వామిత్రులు దక్క ఎవరూ సాహసించలేదు
రవి: ఆయనను వేదికమీదికి ఆహ్వానిద్దాం
కామేశ్వరరావు: సరే, మీకా వర్ణన కడు ప్రియమైనదిలా ఉంది 🙂
రవి: మీ వర్ణన (పెద్దన గారిది) కదండీ. 🙂
విశ్వామిత్ర: 🙂
కామేశ్వరరావు: విశ్వామిత్రా దంచెయ్యండి
విశ్వామిత్ర: చూడండి
రాఘవ: అంతరాయానికి చింతిస్తున్నాను
విశ్వామిత్ర:
శా ||
యంచుల్‌మోవగ కౌగిలించి యధరంబాసింప హా!సుందరీ
యంచున్ నాయకుడా కృశాంగిని తదీయాంసద్వయంబంటి ర
మ్మంచున్‌లాచెనమర్త్యకున్నొసఁగగాఢాలింగనామాన్యతన్
రవి: రెండవ పద్యం లాగించండి.
విశ్వామిత్ర: రవిగారూ ఇక్కడ ఆపుదామ్ , ఇది క్షణికం కదా
విశ్వామిత్ర: చివరి పాదంలో మాన్యతన్ ఎందుకన్నానో పెద్దనగారు చెబుతారు
గన్నవరపు నరసింహమూర్తి: విశ్వామిత్రుల వారి పూరణ దంచేసారు !
కామేశ్వరరావు: నాకేదో సమస్య ఇచ్చారు విశ్వామిత్రులవారు?
రాఘవ: చాల బాగుందండీ విశ్వామిత్రులవారూ.
వసంత్ కిషోర్: చక్కగా వుంది !
రవి: సృష్టికి ప్రతిసృష్టి విశ్వామిత్రుల వారి పేటెంటు
మిస్సన్న: సుందరంగా ఉంది
నచకి: సలక్షణంగా సాగింది పద్యం
కామేశ్వరరావు: పద్యం అద్భుతం. ఆ ప్రహేళికేదో మీరే విప్పండి
విశ్వామిత్ర: నాది గట్టిగా ఒక పాదమే అని మిత్రులు గుర్తించాలి 🙂
రవి: మీ పాదంలోనే కదండి మాన్యత కల్పించినది?
శ్రీపతి: పద్యం చాలా బాగున్నది…
విశ్వామిత్ర: ముందు పద్యంలో వరూధిని కౌగిట గారవింతువో అంటుంది కదండీ
రాఘవ: ఇలా గారవించాడంటారు
విశ్వామిత్ర: 🙂
కామేశ్వరరావు: ఓహో! బాగుంది. సరసమైన సమాధానం 🙂
రవి: ఓహో అలాగన్నమాట? ముందు వెనుకలు చూసుకోవాలి అంటారు?
శ్రీపతి: మ్మంచున్‌లాచెనమర్త్యకున్నొసఁగగాఢాలింగనామాన్యతన్ – ప్రబంధాలను మరిపించేట్టుంది ఈ పూరణ
నచకి: నేనింకా "మాన్య? తనూ హీరోయినే!" అనుకున్నాను.
రాఘవ: నచకిచకిచలు! 😛
విశ్వామిత్ర: మర్పించేటట్టు కాదు తలపించేటట్టు
కామేశ్వరరావు: అది మాత్రమెంత కాదు!
రాఘవ: విశ్వామిత్రులవారూ, మీ తరువాతి పద్యాలు?
రవి: నచకిగారు సినిమా బయట టికెట్ల వద్ద ఇందాక దెబ్బతిని కూడా సినిమా హీరోయిను అంటున్నారు
విశ్వామిత్ర: 🙂
నచకి: పొరబడ్డారు… నేను క్యూ కడ ప్రేక్షకపాత్ర మాత్రమే 😉 అందుకనే ప్రథమ పురుషలో సాగలేదు ఆ పద్యం. 🙂
రవి: సరే విశ్వామిత్రులవారు సిగ్గుపడుతున్నారు, ఇక వజ్రసమస్యకు వెళదాం
నచకి: ముక్కుపచ్చలారలేదు! (కర్చీఫ్ మర్చిపోయాను!!) అప్పుడె అంకుల్‌ని చేసెయ్యకండి మహాప్రభో! 😀
విశ్వామిత్ర: రాఘవగారు – మిగతాది వెండితెర పైన 🙂
రవి: వసంత్ కిషోర్గారిని ఆహ్వానించబోతున్నాము
రాఘవ: ఊఁ 🙂
వసంత్ కిషోర్: అలాగే ! అవధరించండి !
రవి: వజ్రము చీలిపోయినది వారిజ పత్రము సోకినంతటన్ – ఇది సమస్య.
వసంత్ కిషోర్: గరుత్మంతుని ఆహారాన్ని అలంకారముగా దాల్చిన ఈశ్వరుని స్థిర సంకల్పముతో ,నిశ్చల భక్తితో,ధ్యానించి బాలుడైనమార్కండేయుడు, ఇంద్రుడూ మొదలైన సమస్త దేవతలు చూస్తుండగా యముని మీద విజయం సాధించెను గదా :
ఉ||
వజ్ర సమానమౌ సరళి – బాలుడు; నిశ్చల భక్తి బూని , యా
వజ్రి, సమస్త దేవతల – పాలున, కాలుని గెల్చెనే గదా !
వజ్రము చీలిపోయినది – వారిజ పత్రము సోకి నంతటన్ !
గన్నవరపు నరసింహమూర్తి: కిశోర్ జీ చాలా బాగుంది !
రవి: భళా!
కామేశ్వరరావు: చక్కని ఊహ!
శ్రీపతి: బహు చక్కగా ఉన్నది పూరణ
నచకి: ఆహా!
మిస్సన్న: కిశోర్ మహోదయా చాలా బాగున్ది.
వసంత్ కిషోర్: మిత్రులకు ధన్యవాదములు !
రాఘవ: వజ్రపు తుండు ఖాదనము పాటన దాల్చిన వాడు — కొంచెం వివరించండి.
వసంత్ కిషోర్: గరుత్మంతుని ఆహారాన్ని అలంకారముగా దాల్చిన ఈశ్వరుని
రవి: వజ్రపుతుండు – అంటే గరుత్మంతుడాండి?
వసంత్ కిషోర్: వజ్ర తుండుడు=గరుత్మంతుడు
రాఘవ: ఓహో వజ్రతుండుడు అనా? నాకు తట్టలేదు సుమండీ!
రవి: బావుందండి
నచకి: క్రొత్త విషయం తెలిసింది
గన్నవరపు నరసింహమూర్తి: కిశొర్ గారి దగ్గఱ క్రొత్త పదాలు దొరుకుతాయి
వసంత్ కిషోర్:: మిత్రులకు ధన్యవాదములు !
రవి: మిస్సన్నగారు రెండు విధాలుగా పూరించారు. మొదటి పూరణ చెప్పాలి
మిస్సన్న: తప్పకుండానండీ
ఉ||
వజ్రపు టుంగరమ్ము గొనె, వచ్చిన ప్రేయసి కిచ్చె, నామెయున్
వజ్రము మెచ్చి ముద్దిడగ వత్తిడి కయ్యది చిట్లి పోయె నా
వజ్రము చీలిపోయినది వారిజ పత్రము సోకినంతటన్!
వసంత్ కిషోర్:: చక్కగా వుంది !
మిస్సన్న: అధ్యక్షా మీరడింగిది ఇదేనా
వసంత్ కిషోర్:: ముద్దులో అంత శక్తి ఉందా
గన్నవరపు నరసింహమూర్తి: మిస్సన్నగారూ బాగుంది. ఇక తను చుంబన అంటే భయపడాలి !
కామేశ్వరరావు: కిశోర్ గారు, 🙂
మిస్సన్న: వజ్రంలో అంత గట్టిదనం ఉంది.
పుష్యం:ముద్దుగుమ్మ ఇవ్వ, ముద్దునందుకూడ – అంతశక్తి వచ్చు, ఆర్య వినుడి 🙂
మిస్సన్న: మూర్తి గారూ ఇదీ బాగున్ది.
వసంత్ కిషోర్: వజ్రం చీలింది గదా
మిస్సన్న: ఇది ఇంకా బాగున్ది.
రవి: మిస్సన్నగారూ, మీ పూరణ అయిందనుకుంటాను
రవి: అంతరాయానికి క్షమించాలి
మిస్సన్న: అయిందండీ
రవి: చివరిగా మరో దుష్కర ప్రాస చూద్దాం
రవి: విస్ఫోటంబున దైవ శక్తి వెలుగున్ విద్వన్మనోజ్ఞంబుగా – నచకి గారూ, మీ వంతు
నచకి: చిత్తం
శా ||
విస్ఫుల్లింగ కణాదులే వెడలగన్ పేర్మిన్ కణాద్యావళిన్ (రియాక్షన్లలో)
విస్ఫోటంబున దైవశక్తి వెలుగున్ విద్వన్మనోజ్ఞంబుగా
విస్ఫారంబగు విశ్వవీథిని మహావిస్తార భారంబదై
వసంత్ కిషోర్: అద్భుతం ! కరతాళ ధ్వనులు !
గన్నవరపు నరసింహమూర్తి: దుష్కర ప్రాసలను మిత్రులంతా బాగా పూరించారు. చాలా బాగుంది
నచకి: ప్రపంచంలోని పదార్థం (matter) అంతటికీ భారం (mass) అన్నది "హిగ్స్ ఫీల్డ్" అన్న దాని వలన వస్తుందని, ఆ ఫీల్డ్ అన్నది హిగ్స్ బోసాన్ అన్న కణం (particle) వలననీ నమ్మిక. ఆ హిగ్స్ బోసాన్ ఉందని తెలుసు, దాని ప్రభావం తెలుసు… కానీ దాన్నిప్పటి దాకా ఎవఱూ చూడలేదు. ఆ కారణం వలనేమో దాన్ని దైవకణం (God particle) అంటారు. బిగ్ బ్యాంగ్‌లో పుట్టిన ఆ దైవకణం కోసం వెదుకులాట సాగుతోంది.
మిస్సన్న: అణువులూ అరమాణువులూ ఆర్బిటాళ్ళూ ఢీకొట్టడం బాగుంది.
రవి: అత్యద్భుత పూరణండి
రాఘవ:ఢాం ఢాం పూరణ 🙂
కామేశ్వరరావు: మరోమారు సైన్సు పాఠం! బాగుంది.
కామేశ్వరరావు: "ఆస్ఫాలించెడు యే" – "ఆస్ఫాలించెడు నే" అని ఉండాలి
నచకి: దిద్దినందుకు నెనర్లు, కామేశ్ గారూ!
కామేశ్వరరావు: లేదా "ఆస్ఫాలించెడి యే" అన్నా సరిపోతుంది
నచకి: రెండోది చులాగ్గా అర్థమవుతుంది. అదే ఖాయం చేసుకుంటాను.
సవరించినపూరణ:
శా ||
విస్ఫుల్లింగ కణాదులే వెడలగన్ పేర్మిన్ కణాద్యావళిన్ (రియాక్షన్లలో)
విస్ఫోటంబున దైవశక్తి వెలుగున్ విద్వన్మనోజ్ఞంబుగా
విస్ఫారంబగు విశ్వవీథిని మహావిస్తార భారంబదై
కామేశ్వరరావు: సైన్సుకీ దేవుడికీ బాగానే ముడిపెట్టారు 🙂
నచకి: ఇంత రసవత్తరంగా, రెండు విడతలుగా సాగిన సభకు సరైన ముగింపు. 🙂
పుష్యం:Sceintology?? 🙂
రవి: సభకు తుదిగా ఆధునిక కవుల కవితాసక్తి –
రవి: వీరణము తోరణము ధారణము ప్రేరణము. మాటలలో ఉత్పల మాలలో – గన్నవరపు మూర్తి గారి ద్వారా విందాం
గన్నవరపు నరసింహమూర్తి:
ఉ||
మండిత వీణ రావములు మౌక్తిక సంధిత తోరణంబులౌ
చండిక ప్రేరణమ్మిడును శారద చెల్వము ధారణమ్మునున్
పాండితి ప్రజ్వరిల్లగను పద్యము లల్లరె మిత్ర పుంగవుల్ !
నచకి: చండిక ప్రేరణమ్మిడును శారద చెల్వము ధారణమ్మునున్ ->లెస్సఁ బలికితిరి!
వసంత్ కిషోర్: శభాష్ ! మూర్తీజీ !
రవి: పొద్దు వారి గడువు పూర్తయింది
గన్నవరపు నరసింహమూర్తి: ఇది మా గురువులు శంకరార్యులు వారి స్ఫూర్తితో
మిస్సన్న: మూర్తి గారూ శివుని నాట్యమ్ దిన్చేశారు
రవి: పద్యములల్లిరి మిత్రపుంగవుల్ అనుకోవాలి! చివర్న వచ్చింది కాబట్టి
శ్రీపతి:చాలా బాగున్నది పూరణ
గన్నవరపు నరసింహమూర్తి: ధన్యవాదములు అందఱికీ !
కామేశ్వరరావు: అవును, ఇక్కడందరూ "పుం"గవులే ఉన్నారు 🙂
నచకి: కామేశ్ గారూ, శ్లేష మీ భాషని మఱో సారి నిరూపించారు! 🙂
కామేశ్వరరావు: 🙂
మిస్సన్న: వందనచందనాలు.
వసంత్ కిషోర్: అందఱికీ ధన్యవాదములు !
రవి: ఈ సభను ఇంత అద్భుతంగా నడిపించిన కవులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మిస్సన్న: వందన చందనాలు.
గన్నవరపు నరసింహమూర్తి: రవిగారుబాగానడిపించారు.
శ్రీపతి:సభను హృద్యంగా నడిపించిన సంచాలకులవారికీ, సదస్యులకూ మా శుభాకాంక్షలు
రాఘవ:శుభం
కామేశ్వరరావు: ఈ వేదికని కల్పించిన పొద్దువారికీ, వీవెనులకి ధన్యవాదాలు.
రవి: సభలో ఏదేని పొఱబాట్లు దొరలి ఉంటే క్షమించాలి.
వీవెన్: కామేశ్వరరావుగారూ, నెనరులు! 🙂
గన్నవరపు నరసింహమూర్తి: అందరికీవందనాలు,
శ్రీపతి:వీవెనులకు విశ్వామిత్రులవారు ఆశీస్సులను పద్యమాలిక గా అందించారు
నచకి: 5 గంటల పాటు సాహితీసభలో, సత్కవిసమూహంలో ఉన్నా సమయం సాగుతున్నట్టు అసలు తెలియలేదు. అధ్యక్షుల వాఱికీ, ఉపాధ్యక్షుల వాఱికీ, సదస్యులకీ పేరుపేరునా నెనర్లు! ఎన్నో విషయాలు నేర్చాను.
కామేశ్వరరావు: అధ్యక్షులు అనుజ్ఞ యిస్తే ఊదంగారు పంపిన పద్యంతో సభ ముగిద్దాం
రవి: తప్పకుండా,కానివ్వండి
కామేశ్వరరావు:
ఉ ||
దీవుల దూరదేశముల తీరుగ యున్నకవుల్ జతౌ గతిన్
తావును గూర్చెజాలమున దంతిసహస్రసమాళికిన్ వెసన్
వీవెను నామధేయునికి వేల్పులు జేయెర మేలునిత్యమున్
రాఘవ:భలే
శ్రీపతి:భేష్.. చాలా బాగున్నది.
రాఘవ:వీవెన్… నెనర్లు.
మిస్సన్న: శుభం భూయాత్!
వీవెన్: 🙂
నచకి: సముచితం! ఈ సభ విషయమే గాదు, లేఖిని వలన బాగుపడిన నా లాంటి వాళ్ళెందఱో!
రవి: వీవెన్కు,సభకు సరైన నెనర్లు
వసంత్ కిషోర్: శుభం
కామేశ్వరరావు: మిత్రులందరికీ మరోసారి వందనాలు. రాబోయే కొత్త ఏటికి శుభాకాంక్షలు.
నచకి: శ్రీ ఖరనామవత్సర ఉగాది శుభాకాంక్షలు!
కామేశ్వరరావు: మళ్ళీ దసరా పండక్కి కలుద్దాం
గన్నవరపు నరసింహమూర్తి: ధన్యవాదములు అందఱికీ ! శుభం !
రవి: మిత్రులందరికీ పొద్దు తరపున కృతజ్ఞతలు
రవి: మళ్ళీ దసరాకు కొత్త ఆలోచనలతో కలుద్దాం
కామేశ్వరరావు: ఆధ్యక్షత వహించిన రవికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు
నచకి: (ఆశువు)
వసంతవేళ సాగుతున్న పాండితీసభన్, భళీ
కసా పిసా మసా యనీ కవుల్ వాడి జూపగా
ప్రసారమున్ జేసినారు బాగుగాను ప్రొద్దులో
రసాభసల్ చేసి యున్న లైటు తీసుకోండికన్
కామేశ్వరరావు: స్వస్తి!
వీవెన్: అందరికీ సెలవ్!
కామేశ్వరరావు: నచకిగారు, లైటు తీసి పడుకొనే వేళే అయ్యిందిక్కడ 🙂
వీవెన్: )
నచకి: కామేశ్ గారూ, శుభరాత్రి! 🙂
నచకి: వీవెన్గారికీ, రవిగారికీ, మూర్తి గారికి కూడా శుభరాత్రి! శ్యామ్ గారూ, సత్భోజనమస్తు!
కామేశ్వరరావు: సరే మరి, సెలవ్. శుభం!
నచకి: అస్తు!
రవి: రాఘవగారు: మంగళాచరణం గావించాలి.
రవి: రామచంద్రాయ జనకరాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం !
రవి: స్వస్తి.
****