రవి: గీతాంజలికి సంగీతం కూర్చినది కూడా ఠాగూర్ గారే అనుకుంటాను? రబీంద్రగీత్ అంటే అదేనా?
కామేశ్వరరావు: అవును. రవీంద్రసంగీత్ అన్నది రవీంద్రుడు తయారు చేసిన ఒక ప్రత్యేకమైన బాణీ.
నచకి: ఆ ఝరిణి మీరు వేస్తే రాదు లెండి… స్వతహాగా జాలువాఱినట్టే ఉంది! 🙂
పుష్యం(ఆశువు)
ఆ.వె ||
నిద్ర ముంచుకొచ్చె – నేత్రమందు
గుడ్డునైటు చెప్పి – నడ్డి వాల్చుచునుంటి
రేపు కలుసుకొందు – లీవు ఇకను
రవి: బావుందండి. శ్యాం గారూ, ఇక్కడా కడుపులో ఎలుకలు పరుగెడుతున్నయ్. చివరి పూరణ విని మొదటి తడవ సభకు ముక్తాయింపు.
రవి: ఈ రోజు మొదటి తడవ సభకు ముక్తాయింపుగా మిస్సన్న గారి ఖరవైభవము – "గాడిద బూడిద ఆడది బోడిది" అన్న మాటలతో విందాం.
నచకి: శుభరాత్రి శ్యామ్ గారూ!
మిస్సన్న: మంచి రాత్రి సారూ
కామేశ్వరరావు: అలాగే నాక్కూడా ఇందాక చెప్పిన జంతువులన్నీ పరిగెడుతున్నాయ్ కడుపులో.
రవి: సరేనండి..
నచకి: రాకేశ్వరులవాఱేరీ, ఈసారి పెద్దగా చప్పుడు చేయలేదు, అరసున్నాలు విసఱలేదు?
పుష్యం: రాకేశుడు ఇప్పుడే మంచమెక్కాడు, మా ఇంట్లో..
రవి: మిస్సన్న గారూ, మీదే ఆలస్యం
మిస్సన్న:
ఖర నామ వత్సర వైభవము
సీ ||
మావి కొమ్మల పైన ఠీవిగా నూగాడి – దర్పంపు గానాల తనరె పికము
పండుటాకుల జీర్ణ పాత వస్త్రం బూడి – దవనమ్ము చిగురు వస్త్రమ్ము దాల్చె
వాసంత కన్యక వ్యాహ్యాళి కేతెంచె – నడయాడ దిక్కుల నడుమ నగుచు
సిరిమల్లె విరిబోడి దిరిసెన పూబోడి – గుసగుస లాడుచు గునిసె రేయి
గీ||
ఖరమ! రావమ్మ ధాత్రికి! వరము లిమ్మ!
శాంతి వాసంతచంద్రికాఛవులు నిండ
తీవ్ర వాదంపు తిమిరమ్ము తెల్లబోయి
భార తావని విడనాడి పారిపోవ!
నచకి: తీవ్ర వాదంపు తిమిరమ్ము తెల్లబోయి -> బాగుంది మాస్టారూ!
శ్రీపతి: కరతాళధ్వనులు… 🙂
కామేశ్వరరావు: మంచి తూగుతో చాలా బాగా సాగిందండి సీసం!
రవి: చప్పట్లు!
కామేశ్వరరావు: దత్తపదాలని కూడా చక్కగా విరిచారు!
వసంత్ కిషోర్ : భళి ! భళీ !
గన్నవరపు నరసింహమూర్తి: వసంత వైభవము మాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. క్రితవారములో మొండి చెట్లు ఇప్పుడు చిగురులతో అందంగా ఉన్నాయి
గన్నవరపు నరసింహమూర్తి: చాలా బాగుంది మిస్సన్న మహాశయా !
నచకి: పండుటాకుల జీర్ణ పాత వస్త్రం బూడి – దవనమ్ము చిగురు వస్త్రమ్ము దాల్చె -> అందమైన ఊహ, బూడిద యింత అందంగా ఉండచ్చా!
మిస్సన్న: ధన్యవాదాలండీ
రవి: శాంతవాసంతచంద్రికాఛవులు – ప్రబంధస్థాయిలో ఉంది.
నచకి: ఛవులు నిండ -> అదేవిటో,నేను భోజనం చేసాక కూడా నాకు "చవులు" కనిపించాయి మొదట! 🙂
నచకి: అలాంటి సమాసం వేయరే అనుకుంటూ చూసే దాకా ఛవులు తెలియలేదు.
కామేశ్వరరావు: చవులూరించే పూరణకదా మరి 🙂
శ్రీపతి: గమ్మత్తుగా ఉంది భావం, పూరణ. 🙂
నచకి: నిజమే, కామేశ్ గారూ 🙂
రవి: మనసు నిండింది, ఇక కడుపు నిండాలి – ఈ పూటకు!
మిస్సన్న: చవులూరే భోజనం చేద్దాం
గన్నవరపు నరసింహమూర్తి: మాకు నిద్ర పడాలి
శ్రీపతి: మళ్ళీ కలుద్దాం స్వస్తి
రవి: ఇక సభాసదులు ఆనతిస్తే, ఈ పూట సభకు మంగళం పలికి, తిరిగి సాయంత్రానికి కలుద్దాం.
నచకి: స్వస్తి!
మిస్సన్న: సుఖ నిద్ర అస్తు
కామేశ్వరరావు: అవునండి. చక్కని పూరణలతో మొదటిభాగం సంపూర్ణమయింది. మళ్ళీ సాయంత్రం (అమెరికాలో పొద్దున్న) కలుద్దాం.
నచకి: రెండో విడతకి నేను లేచి ఉంటానో లేదో తెలియదు… రాలేకపోతే అధ్యక్షులు, సదస్యులు మన్నించాలి.
రవి: సాయంత్రం గిరిగారు, రాఘవగారు విజృంభించాలి.
మిస్సన్న: సెలవు
కామేశ్వరరావు: మన్నింపులుండవ్, రావలసిందే 🙂
రవి: 🙂
కామేశ్వరరావు: కావలిస్తే వేకప్ ఎలారం పెట్టుకోండి.
వసంత్ కిషోర్ : సెలవు
గన్నవరపు నరసింహమూర్తి: సెలవు
రవి: కామేశ్వరరావు గారు ఒక్కసారి చెబితే వందసార్ల పెట్టు. అసలే ఆకలిమీద ఉన్నామిక్కడ భారద్దేశంలో
నచకి: (ఆశువు)
ఎర్లీ మార్నింగ్ సెవెనా
సర్లే లేద్దామనినను సాధ్యం కాదే
ఫర్లా ఎట్లో వస్తా
కామేశ్వరరావు:
కామేశ్వరరావు: అనండి 🙂
నచకి: 🙂
నచకి: ప్రాసతో కొట్టుమిట్టాడుతుంటే మంచి బిస్కెట్టిచ్చారు!
వసంత్ కిషోర్ : సర్లే సారూ ఓకే—
రవి: పర్లేదిక ఔననండి పండిత వర్యా!
కామేశ్వరరావు: శుభం. ప్రస్తుతానికిది కామానే, ఫుల్స్టాప్ కాదు. మళ్ళీ కలుద్దాం. సెలవ్.
నచకి: నా శాయశక్తులా కృషి చేస్తాను… వస్తే నాకే మంచిది. ఇంకా కుంచెం చాలా బోల్డు నేర్చుకోవాలి :-
నచకి: 🙂
రవి: విశ్రాంతి!
నచకి: (ఆశువు)
కం ||
కవులందఱికీ సెలవిక
చవులూరించేటి పద్యసౌరభమాలల్
సెవెనుకు మఱి కొన్నింటిని
చెవులారా విందు, నిపుడు సెలవని యందున్!
నచకి: చవులూరించేటి పద్యసౌరభమాలల్ -> చవులూరించేటి పద్యసౌష్ఠవ రుచులన్
నచకి: పూర్తి చేయండి అధ్యక్షా!
రవి:
రవి: ఊహూ..మామూలు రుచులే తలపుకొస్తున్నాయండి. భోజనాల సమయం
నచకి: శుభం! 🙂 కైమోడ్పులతో అనేసారుగా! ఇక సెలవ్ మఱి!!
నచకి: శుభం! 🙂 కైమోడ్పులతో అనేసారుగా! ఇక సెలవ్ మఱి!!
నచకి: సనత్ గారూ, కామేశ్వరరావుగారూ, సెలవు!
రవి: 🙂 కడుపు అలా అనిపించిందండి. సెలవ్! శుభరాత్రి మీకు.
=========మొదటి విడత సభ సమాప్తం. మలి విడత సభ వివరాలు రాబోవు భాగాల్లో చదవండి.========