“ప్రసవింతురు బావగారు పదిదినములలోన్”
రవి : “ప్రసవింతురు బావగారు పదిదినములలోన్” – ఎలానో రాఘవ గారు చెబుతారు
విశ్వామిత్ర : వారు సరే; రాఘవగారున్నారా ఇక్కడ?
రవి : మరుగేల, రా, ఓ రాఘవా!
మిస్సన్న : దండకారణ్యంలో ఉన్నారేమో
కామేశ్వరరావు : అతనింకా పురిటినొప్పులు పడుతున్నట్టున్నారు 🙂
వసంత్ కిషోర్ : అంతఃపురంలో ఉన్నట్టుంది !
శ్రీపతి : రాఘవగారికి కొంత సమయం పడుతుందిత… ఈలోపు కానివ్వమంటున్నారు
విశ్వామిత్ర : రాఘవ గారు – పదిదినముల ముందే busyగా ఉన్నట్టున్నారు ఈ లోపు మిగతావారివి వింటామండి – మీ అనుమతి ఐతే రవిగారూ
రవి : సరే, ఈ లోపు శిరీష్ గారు, ప్రసవింపజేయడం మీ వంతు
చదువరి : అవధరించండి..
కం ||
బుసకొట్టే డెడ్లైనట
వెసపెట్టిరి డెలివరింప వినుమిది యన్నా!
పసిబిడ్డౌ ప్రాజెక్టును
ప్రసవింతురు బావగారు – పది దినముల లోన్
రవి : పాపం :))
కామేశ్వరరావు : హహహ… “డెలివరింప” ప్రయోగం భలే ఉంది!
వసంత్ కిషోర్ : వ్వావ్!
విశ్వామిత్ర : ముందు వరించటం , అక్కడినుంచి డెలివరించటం – పదాల డెలివరీ లో మీరు సిద్దహస్తులు
గన్నవరపు నరసింహమూర్తి : చాలా బాగుంది
రవి : ఎలాగైనా బావగారికి గర్భస్రావం జరుగకుండా చూసేబాధ్యత శిరీష్ గారిదే!
చదువరి : 🙂
శ్రీపతి : గర్భ స్రావం కాదులెండి గానీ పసిబిడ్డౌ ప్రాజెక్టు – “నెలతక్కువ వెధవా’ అనిపించుకునే అవకాశం ఉందేమో…
నచకి : పూరణకి మంచి ఆలోచన
కామేశ్వరరావు : నా అనుభవంలో ప్రాజెక్టులు ఎప్పుడు “నెల తప్పుతాయి” కాని “నెల తక్కువ” కావు.
గన్నవరపు నరసింహమూర్తి : సాఫ్ట్ వేరు కష్టాలు !
విశ్వామిత్ర : నెలతక్కువ ప్రాజెక్టులను – సాకుతుంటే ( maintain) ఉంటాయి తిప్పలు
రాఘవ : పెద్దలందరూ నన్ను మన్నింతురుగాక… ప్రస్తుతానికి కొంచెం హడావుడిలో ఉన్నాను.
చదువరి : “నెల తప్పుతాయి” కాని “నెల తక్కువ” కావు. — అదరహో!
నచకి : కామేశ్ జీ! 🙂
రవి : కామేశ్వరరావు గారూ, పుట్టిన తర్వాత – ఉపయోగించేవాడికి “నెలతక్కువ” విషయం అవుపిస్తుందేమోనండి.
శ్రీపతి : అదే కదా ఆర్కిటెక్టు మహాశయులకూ ఐ.టీ.మేనేజరుకూ తేడా… తొమ్మిది నెలలు పట్టే గర్భాన్ని కూడా తొమ్మిది మంది చేత సాయం పట్టించేసి నెలరోజుల్లో చేసేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తాం, వీలైతే ఒకట్రెండు ప్రయత్నాలు కూడా చేసేసి.
కామేశ్వరరావు : శ్రీపతిగారు 🙂
విశ్వామిత్ర : ఇది అందరినీ ఆకట్టుకున్న సమస్య అనుకుంటా – వివిధములైన పూరణలు వచ్చినట్టున్నాయి
నచకి : నేనెంత ప్రయత్నించినా మా బావగారు ప్రసవించలేదు, విశ్వామిత్రా! 🙁
రవి : విశ్వామిత్ర గారూ, అలా అన్నిపిస్తుంది కానీ నిజానికి కాదండి.
కామేశ్వరరావు : అధ్యక్షులవారు ఇంకెవరి చేతనయినా ప్రసవింప జేస్తారా?
రవి : సరే రాఘవ గారు వచ్చేలోపు నా పూరణ కూడా పనిలోపనిగా కానిస్తాను
కం ||
పసజూపెను భోజనమున
నసలే పెనుగొప్ప బొజ్జ, యటపై నతిగా
పసిగొన్న వాఁడు! ఇకనేం!
ప్రసవింతురు బావగారు పదిదినములలోన్.
కామేశ్వరరావు : మరోమారు మా భుజాలు… సారీ, బొజ్జలు తడుముకొంటిమి!
గన్నవరపు నరసింహమూర్తి : తిండి తగ్గించ మంటున్నారు. ఈ సమస్య భారతములో కూడా వచ్చింది !
నచకి : నా భోజనమిప్పుడే అయింది… కనుక అదేదో నన్నే అన్నట్టుగా ఉంది. 😀 (కాకపోతే నాకు పెనుగొప్ప బొజ్జ కాదు కదా, చిరుబొజ్జయినా లేదు ప్రస్తుతం!)
శ్రీపతి : నచకి !! అన్నట్టుగా కాదు కన్నట్టుగా !!
కామేశ్వరరావు : నా భోజనమింకా కాలేదు, అయినా నన్నే అన్నట్టుగా ఉంది!
నచకి : సనత్ గారూ 🙂
కామేశ్వరరావు : మూర్తిగారు, మీకిలాంటి సమస్యలు లేవని నాకు తెలుసులెండి 🙂
శంకరయ్య : అలా వెళ్ళి ఇలా వచ్చాను. ఈలోగా రెండు పూరణలు …. చదువరి గారి పూరణ ప్రశంసనీయం. రవి గారి పూరణ హాస్యస్ఫోరకంగా ఉంది.
పుష్యం : రవి గారూ , మనం భోజనాలనుండి లేవాలేమో?
రవి : అవును తప్పదు.
రవి : ఓ మారు అలా వర్ణనల వరకు వెళ్ళొద్దాం.
నచకి : అవశ్యం
రవి: కింది బొమ్మను వర్ణించేపని సనత్ గారిది (ఈ బొమ్మను http://www.ravivarma.org/plog-content/images/raja-ravi-varma-paintings/peoples-and-portraits/raja_ravi_varma_24.jpg వద్దనుండి సంగ్రహించాం)
రవి : “ఎదురు చూపుల పడతి” – అనుకోండి.
శ్రీపతి : అవశ్యం… అవధరించండి.
ఉ ||
నల్లని ఆకసంబుపయి నాట్యమొనర్చెడి మేఘమాలికా
వల్లరి యందు గ్రుంకులిడు వారిజ మిత్రుడు నీవటంచు నా
ఉల్లము నందెవో చిలిపి ఊహలు రేగెను సాంధ్య రాగమై
చల్లని గాలిలో హృదయచక్షులు నీకయి వేచి జూడగా !!
కం||
మనసున మనసై మనమే
మనెదమ్మని మాటనిచ్చి మరచితివేమో
మనుజేంద్రా మునికాంతను
మనువాడుట నీదుధర్మ మరయగ లేవా?
శా||
నీవే నాథుడవంచు నిన్ను మదిలోనే నిల్పి, నీ తోడిదే
జీవమ్మంచు తలంచి నీకొరకు నే చింతించితిన్ ! నమ్మితిన్
నీవాగ్దానమునోయి ! నీ వలన నే నీళ్ళాడితిన్నింతకున్
నీవంశాంకురమందు ప్రేమ గొనలేవో ! నీకు మోమాటమో !!
కం ||
హేమంతపు శుభ వేళల
సీమంతము జేతురంట శీఘ్రము గా నీ
సామంతుల తో రాగదె !
ధీమంతా ! శ్రేష్ఠ గుణనిధీ ! దుష్యంతా !!
శ్రీపతి : చిత్ర కవిత్వం అన్నారు కనుక ఇందులో ప్రత్యేకతను కనిపెట్టగలరు (ఖడ్గబంధం చిత్రం చూడండి – పొద్దు)
పుష్యం : చిన్నప్పుడు టూరింగు టాకీసులో రాయి మీద కూర్చుని సినిమాలు చూసేవాళ్ళం. మీ ప్రారంభం చూసి, ఈవిడది ఆ సీనేమో అనుకున్నాను 🙂
గన్నవరపు నరసింహమూర్తి : వర్ణన చాలా బాగుంది,
నచకి : సీమంతానికి సామంతులను ఆహ్వానించి రాజపత్ని అనిపించుకుంది! 🙂
వసంత్ కిషోర్ : చాలా బావుంది !
శ్రీపతి : 🙂
నచకి : ఒక ప్రత్యేకత నేను గ్రహించాను: ఈవిడ ఖాళీగా కూర్చోవటమెందుకని మొదట సినిమాకెళ్ళింది. 😀
శ్రీపతి : హ హ్హహ్హా
కామేశ్వరరావు : రాజపత్ని కాబట్టి కత్తితో కబురంపినట్టుంది!?
చదువరి : పెళ్ళాన్ని మర్చిపోవడం శ్రేష్ఠ గుణమని గ్రహించాను.
పుష్యం : ‘కత్తి’ లాంటి పద్యం 🙂
కామేశ్వరరావు : చదువరిగారు, 🙂 మీ ఆవిడ పక్కన లేరా?
శ్రీపతి : చదువరిగారూ…. 🙂
చదువరి : 🙂
నచకి : చదువరి గారు కూడా శ్రేష్ఠగుణనిధి అయిపోయారేమో అప్పుడే! 😀
శ్రీపతి : కబురెట్టలేదు , ఖబడ్దారంది… కడుపుచేయటానికి లేని మొహమాటం, భార్యనని ఒప్పుకోడానికా అంది.. 😉
శ్రీపతి : ఖాన్ తో గేమ్స్ ఆడితే శాల్తీల్లేచిపోతాయంది… కత్తిలా
నచకి : కత్తిలా కాదు లెండి, కత్తితో!
కామేశ్వరరావు : అవును సభక్తికంగా కాక “విభక్తికంగా” చెప్పింది!
పుష్యం : knifeల గురించి మాని మనం wifeల గోష్టిలో పడ్డట్టున్నాము 🙂
నచకి : మన గోష్ఠిలో ప్రసవం తఱువాత సీమంతం జఱిగిందండోయ్!
గన్నవరపు నరసింహమూర్తి : వివాహము తర్వాత
శ్రీపతి : అంటే అది లీగలూ, ఇది ఇల్లీగలూను.
కామేశ్వరరావు : ప్రసవం మగవారికి, సీమంతం ఆడవరికీ జరిగింది 🙂
రాకేశ్వరుఁడు : ముందు మొగుడు నా పెండ్లాము పిల్లవాఁడూను అని ఒప్పుకుంటేగా తరువాత అత్తవారు శ్రీమంతం చేసేది. ఇది బెదిరింపా లేదా ఓ అబల కనే కలా?
శ్రీపతి : అదేదో చిత్రం భళారే విచిత్రం సినిమాలో లాగ
కామేశ్వరరావు : శకుంతల అబలేమిటీ సబలే
గన్నవరపు నరసింహమూర్తి : జన్యు నిర్ధారణ ఉందిగా ! దుష్యంతా !
శ్రీపతి : మెడకాయ మీద తలకాయున్నోడెవడైనా ‘కత్తి’ మీద సాము చేస్తాడుటండీ…
రాకేశ్వరుఁడు : క్షమించాలి సీమంతమఁట బ్రౌణ్యం ప్రకారమ్
నచకి : రాకేశ్వరా, నేనూ చాలా కాలమిలాగే వైష్ణవప్రిల్లిని మ్ర్యావ్ మ్ర్యావ్‌మనిపించాను
కామేశ్వరరావు : వసంత కిశోర్ గారు, దీనికి మీ పూరణ వినిపించండి. ఇది అధ్యక్షులవారి ఆదేశమే, నా చెవిలో ఊదారు.
వసంత్ కిషోర్ : తప్పకుండా !
పని జూసు కొస్తానని పట్న మెళ్ళిన బావ,కాబోయే భర్త కబురంపాడు గాదని , రోజూ ఊరి చివర చెరువు గట్టున ఎదురు చూస్తూ కనబడిన వాళ్ళందరినీ మా బావ ఎక్కడైనా కనుపించాడా ? అని అడుగుతూ
నన్ను మరచె నేమొ – నా రాజు , నాబావ
చూడ చక్కని వాడు – చూచి మూడు నెలలు
ఏడ బోయెనొ నేడు ! – ఎరుగ నైతి !
నిముస మైన విడచి – నిలువ జాలని వాడు !
తోడు నీడయు వాడె – జోడు వాడె !
చిన్న తనము నుండి – చెలిమి జేసిన వాడు !
ఏడ బోయెనొ వాడు ! – ఎరుక లేదు ! !
ఏడ నుండె బావ – ఎదురు చూపులు జూచి !
కళ్ళు కాయ గాచె – కాన రయ్య !
మరువ కండి స్వామి – మల్లి నా పేరండి !
మరచి బోకు డయ్య – మల్లి మాట !
పట్న మెళ్ళెను వాడు – పని కోసమై నాడు !
గర్వ మసలు లేదు ! – కరుణ మెండు !
కాల మయ్యె బరువు ! – క్షణ మొక యుగమాయె !
ఏమి చేయుదు నేను ! – ఏది దారి !
భయము గలుగు చుండు ! – బాధ హెచ్చుచు నుండు !
బావ ఎక్కడ నున్న – భద్ర ముండు !
తోచ దేమియు నాకు – తోడెవ్వరును రారు !
ఏమి చేయుదు నేను ! – ఏది దారి !
భార మాయె, బ్రతుకు – బావ లేకున్నను
గోడు వినగ నెవరు – తోడు లేరు !
బావ తోడ , బ్రతుకు ! – బావ తోనే చితికి !
జాలి చూపి బావ – జాడ గనరె !
మరచి పోవుద మంటె – మరువ లేకున్నాను !
నిద్ర నైనను గాని – నిజము నైన !
గుర్తు వచ్చిన చాలు – గుండె నీరౌతాది !
ఏడ బోయెనొ నేడు ! – ఎరుగ నైతి !
మరిగి పోవుచు నుండె – మల్లి గుండెలు నేడు !
బావ లేనిది నేను – బ్రతుక జాల !
బిక్క మొగము తోడ – బేజారు పడుతున్న !
ఏడ బోయెనొ వాడు ! – ఎరుక లేదు !
బావ లేక పోతె – బ్రతికి ఫల మదేమి !
నీరు ముట్ట లేను – నిదుర పోను !
బావ రాక యున్న – బావియే బావౌను !
జాలి చూపి బావ – జాడ గనరె !
నచకి : బావ రాక యున్న – బావియే బావౌను !
నచకి : వాహ్! అసలు మొత్తం వర్ణన గేయరీతిలో అలతి పదాలో అందంగా సాగింది
కామేశ్వరరావు : బాగుందండి. మల్లేశ్వరి, ఎంకి ఒక్కసారే కనపడ్డారు నాకు!
శ్రీపతి : కిశోర్ గారూ…. 🙂
వసంత్ కిషోర్ : మల్లీశ్వరిని దృష్టిలో పెట్టుకొని వ్రాసినదే !
మిస్సన్న : అయ్యో వర్ణనల కెళ్ళిన ప్పటినుంచీ నేను గెంటి వేయ బడ్డాను
నచకి : మిస్సన్న గారూ, పునఃస్వాగతం!
చదువరి : చాల బాగుంది.
నచకి : మీరు మల్లీశ్వరి అంటే కత్రినా గుర్తొచ్చింది! హతవిధీ!
కామేశ్వరరావు : “బావ తోనే చితికి” – ఈ మాటలో మొత్తం ఈ వర్ణన ప్రాణమంతా దాగుంది!
వసంత్ కిషోర్ : ధన్యవాదములు !
మిస్సన్న : కిశోర మహోదయా మనోహరమైన బావా మరదళ్ల అనురాగం.
కామేశ్వరరావు : చాలా కాలంనుంచి నాకు సందేహం. “మల్లేశ్వరి”, “మల్లీశ్వరి” – రెంటిలో ఏది సరి?
వసంత్ కిషోర్ : అయ్యా ఇది భానుమతి మల్లీశ్వరి !
కామేశ్వరరావు : పాత సినిమాలో మల్లేశ్వరి అని వేసినట్టు గుర్తు.
నచకి : మల్ల_ఈశ్వరి కాదు కదండీ, మల్లి_ఈశ్వరి అనుకుంటాను యిక్కడ. కనుక సవర్ణదీర్ఘమే.
రవి : నచకి: :))
గన్నవరపు నరసింహమూర్తి : మరదలి అనురాగము, బావేమీ మాట్లాడడము లేదు. చాల బాగుంది
మిస్సన్న : మల్ల యోధురాలైన ఈశ్వరి మల్లేశ్వరి అయిఉంటుంది.
రవి : మల్ల ఈశ్వరి = గుణం కాదంటారు!
చదువరి : అయితే దుర్గామల్లేశ్వర స్వామి కాదన్నమాట – దుర్గా మల్లీశ్వరస్వామియే!
శ్రీపతి : ఆవిడకి నిజంగా మల్ల యుధ్ధం లో ప్రవేశమే ఉండి ఉంటే అట్లా కూర్చుని ఉంటుందా “నే తొడగొట్టి బిల్చెదను” అంటూ ఒక పద్యం వేస్కుని ఉండదూ !!
నచకి : మల్ల or మల్లె malla. (from మల్లము.) n. A shallow earthen vessel. (Brown)
శంకరయ్య : సనత్ కుమార్, వసంత్ కిశోర్ గారల వర్ణనలు మనోహరంగా ఉన్నాయి. ఇద్దరికీ అభినందనలు.
శ్రీపతి : ధన్యవాదాలు