కందం గురించి తెలుఁగు పద్యకవులకు చెప్పడమంటే తెలుగువాడికి గోంగూరపచ్చడి గురించి చెప్పడమన్నంత దోషం. అంచేత ఉపోద్ఘాతాలు అవీ లేకుండా ఓ రెండు కందపద్యాలను ఆస్వాదించి “ఆహా” అనుకుందాం.
మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతరపరిమళమై
మగువ పొలుపు దెలుపు నొక్క మారుతమొలసెన్.
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతరపరిమళమై
మగువ పొలుపు దెలుపు నొక్క మారుతమొలసెన్.
అది పెద్దన గారి ఘుమాయింపు.
అడిగెద నని కడు వడి జను
నడిగిన దను మగుడ నుడుగ డని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.
నడిగిన దను మగుడ నుడుగ డని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.
ఇది పోతన గారి గుబాళింపు.
ఇటువంటివి మీరూ రుచి చూసి ఉంటారుగా. ఆ రుచి (సౌందర్యము)ని మాకూ తెలుపండి. తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన కందపద్యం ఒకదాని గురించి వివరించండి. పద్యార్థం వివరించడంతో పాటు, ఆ పద్యం ఎందుకు నచ్చింది? ఆ వెనుక కథాక్రమంబెట్టిది? మొదలైన వివరాలను అందించండి.
కవులకు మాత్రమే కాక, శారదావిజయోల్లాసం పాఠకులకున్నూ ఈ ఆహ్వానం అందిస్తున్నాం. మీ రచనలను editor@poddu.net కు పంపండి. హామీపత్రం మరువకండి.
వచ్చిన స్పందనలలో మెచ్చిన వాటిని పొద్దులో ప్రచురించడం జరుగుతుంది.
‘పద్యాద్యం’ …. ఏమిటి ఈ పదానికి అర్ధం?
వెంకట్ రావు గారూ
“పద్యార్థం” అని ఉండాలి.టైపింగులో పొఱబాటు.ఇప్పుడు సరిచేశాము.నెనర్లు.