మతాల స్వరూపాలు

మతభావనలు, మనిషికీ నరవానరానికీ తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే భావించవచ్చు. ప్రాథమికస్థాయిలో, సముదాయాలుగా గుహల్లో తలదాచుకుని, వేటాడుతూ బతికిన ఆదిమానవులకు ఆహారసేకరణ అన్నిటికన్నా ముఖ్యమైన వ్యాపకంగా ఉండేది. ఏదైనా జంతువును మాటువేసి చంపగలిగినప్పుడు వారికి ఆ జంతువుపట్ల కృతజ్ఞతాభావం కలిగేదేమో. తమ కడుపులు నింపి, తమ ప్రాణాలు కాపాడిన ఆ ప్రాణి తమను భవిష్యత్తులోకూడా 'కరుణించాలని' వారు కోరుకోవడంలో ఆశ్చర్యంలేదు. ప్రాంతాన్నీ, తెగనీబట్టి ఒక్కొక్క జంతువు ఆదిమానవులకు పూజనీయంగా తయారయింది. ఇప్పటికీ పాతపద్ధతులను విడనాడని చాలా ఆటవికతెగలకు చిహ్నాలుగా టోటెమ్ జంతువులు కనిపిస్తాయి. వారు వాటిని ఆరాధిస్తారు. తమ తెగకు వాటిని గుర్తుగా భావిస్తారు.
 

తరవాతి దశల్లో ఇటువంటివాటి విగ్రహాలను తయారుచేసి పూజించడంకూడా మొదలయింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇలా ఒకొక తెగకీ ఒకొక జంతువు ప్రతినిధి కావడం, ఈ తెగలమధ్య పోటీలు పెరిగి కొట్లాటలు జరగడం ఆరంభమయింది. ప్రాచీనమతాలలో ఒకటైన యూదుమతంలోనూ, ఆ తరవాత వచ్చిన ఇస్లాంలోనూ ఈ విగ్రహారాధనను గర్హించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పది దైవశాసనాలను తీసుకొచ్చిన మోసెస్ అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా భగవంతుడనేవాడికి రూపం ఏదీ ఉండదని చెప్పవలసివచ్చింది. ఎందుకంటే ఎటువంటి రూపాన్ని ఆమోదించినా కొందరికి సంతోషమూ, తక్కినవారికి ఆగ్రహమూ కలిగే ప్రమాదం ఏర్పడింది. నిత్యమూ చిహ్నాల పేరుతో కయ్యాలకు కాలుదువ్వే తెగలన్నిటినీ ఏకం చెయ్యడానికి 'నిరాకారుడైన' భగవంతుణ్ణి నిర్వచించడం తప్ప మరో మార్గం లేకుండాపోయింది.
 

మన దేశంలోనూ ఇటువంటి పరిస్థితులే ఉండేవి. కాని పురోహిత, అర్చక, ఋత్విజుల వర్గాలు ఈ సమస్యను మరొక పద్ధతిలో పరిష్కరించినట్టుగా తెలుస్తోంది. ఉదాహరణకు శివుడినో, పశుపతి నాథుణ్ణో ఆరాధించేవారు సర్పాలను ఆరాధించేవారితో పోట్లాడకుండా ఉండడానికి పాములను శివుడి మెడలో వేశారు. అలాగే ఎద్దును శివుడికి వాహనం చేశారు. ఈ విధంగా విడిగా ఉన్న తెగలను ఏకం చేసే ప్రయత్నాలు ప్రాచీనకాలంలోనే విజయవంతంగా జరిగాయి. మరొకవంక ఆదిశక్తిని స్త్రీరూపంలో పూజించే సంప్రదాయం, శివుడితో వైరం పెట్టుకోకుండా ఆమెను శివుడి భార్య అన్నారు. రానురాను ఈ కుటుంబం మరింత విస్తరించడంతో వినాయకుణ్ణి (ఏనుగును ఆరాధించే తెగ) వాళ్ళ కొడుకుగా పేర్కొన్నారు. దక్షిణాదిలో ఎప్పటినుంచో ఆరాధిస్తున్న వేల్ మురుగన్ (కుమారస్వామిని) మరొక కుమారుడన్నారు. హిందూసంప్రదాయంలో పాతనమ్మకాలను త్యజించడం అనేది ఎప్పుడూ, ఎక్కడా జరగదు. ప్రాచీనకాలపు నమ్మకాలన్నిటికీ ఏవో భాష్యాలూ, వివరణలద్వారా కొనసాగించడమే కనబడుతుంది.
 

ఆర్యభాషీయులు క్రీ.పూ. 1400-1200 ప్రాంతాల సింధునది ప్రాంతాలకు వచ్చినప్పుడు వారు ఆరాధించినది తమ ప్రాణాలు కాపాడే అగ్నినీ, ప్రకృతిదేవతలైన వరుణుడినీ, సూర్యుడినీ (మిత్రుడు) మాత్రమే. ఆ తరవాత వీరి ప్రాధాన్యత తగ్గింది. ఆర్యభాషీయులకు సమకాలికులుగా మన దేశానికి వచ్చి, ఏవో అభిప్రాయభేదాల కారణంగా తిరిగి వెళ్ళిపోయిన ఇండోఇరానియన్ భాషీయులు ఋగ్వేద కాలానికి చెందిన పార్శీ మతగ్రంథం జెంద్ అవెస్తా రాసుకున్నారు. అందులో అసుర శబ్దానికి చాలా గౌరవం ఉండేది. సృష్టికర్తను అహురమజ్ద అనేవారు. వారికి దైవ అనే శబ్దం పాపిష్టిది. మన దేశంలో స్థిరపడ్డవారు మాత్రం ఈ పదాలకు వ్యతిరేకార్థాలు ఆపాదించుకున్నారు. జెంద్ అవెస్తాలో మహనీయుడుగా పేరు పొందిన జొరాస్టర్ (జరతుష్ట్ర) కశ్మీరుకు చెందినవాడనీ, అతన్నే మనవాళ్ళు వశిష్ఠుడంటారనీ కొందరి అభిప్రాయం.
 

ఆర్యభాషీయులు మన దేశంలో స్థిరపడ్డాక వారికి ఇంద్రుడు గొప్ప దేవత అయాడు. కాని కొంతకాలానికి వేటమీదా, ఏరుకుతినడంమీదా మాత్రమే ఆధారపడిన ఆ ప్రజలు ముందు పశుపాలననూ, ఆ తరవాత వ్యవసాయాన్నీ వృత్తిగా స్వీకరించారు. ఆ దశలో ఇంద్రుడి ప్రాభవం తగ్గి 'గోపాలుడైన' కృష్ణుడికీ, 'హలధరుడైన' బలరాముడికీ ఆదరణ పెరిగింది. అంతేకాక అడుగడుగునా ఇంద్రుడు కృష్ణుడి చేతిలో పరాభవం చెండడం చూస్తాం. ఇదంతా అప్పటి సమాజంలో తలెత్తిన మార్పులకు ప్రతిబింబంలాగా అనిపిస్తుంది. క్రీ.పూ.2400 ప్రాంతాల మొదలైన సింధునాగరికత నాటినుంచీ ఉన్న శివుడి ఆరాధన మటుకు కొనసాగింది.
 

అతిప్రాచీనదశలో హిందూదేవతలమధ్య తలెత్తిన విభేదాలు ఏనాడో సమసిపోయాయి. మళ్ళీ క్రీ.శ. ఎనిమిదోశతాబ్దం తరవాత వైదిక, అర్చకవర్గాలకు మాత్రమే పరిమితంగా ఉండిన భగవదార్చనకు ప్రజాస్వామిక లక్షణాలు ఏర్పడ్డాయి. క్రైస్తవమతంలో ఆ తరవాత జరిగిన పెనుమార్పులన్నీ మనదేశంలో ఎప్పుడో మొదలయాయి. వీరశైవులుగానూ, వైష్ణవులుగానూ బ్రాహ్మణేతరులు చాలామంది అధికసంఖ్యలో దేవతార్చనలు మొదలుపెట్టారు. కేవలం సంస్కృత మంత్రాలేకాక హిందీ, తమిళం, కన్నడం, తెలుగువంటి స్థానికభాషల్లో భక్తిగీతాలూ, పాటల రచన జరిగింది. పురాణాల అనువాదం జరిగింది. సమాజంలో అంతకంతకూ జరుగుతూవచ్చిన మార్పులు మతస్వభావాలను కూడా ప్రభావితం చేశాయి.
 

ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఇప్పటికీ ఏ మతంలోనైనా ప్రార్థన చేసే పద్ధతి ఆటవికదశనే తలపిస్తుంది. ఎక్కువగా దేవుడి పేరు తలుచుకోవడమే చూస్తాం. అది పిలుపే. ఎన్నో సార్లు పిలిస్తేగాని పట్టించుకోని సాటిమనిషిని పరిగణించినట్టే భక్తులు ప్రవర్తిస్తారు. సామాజిక కారణాలవల్ల తలెత్తిన జీవితసమస్యల పరిష్కారానికై 'ఆకాశంవేపు' చూడడం మనుషులకు అలవాటయింది. అలాంటి ప్రయత్నాలవల్ల ఫలితం ఉంటుందా అనే ప్రశ్నని పక్కనపెడితే దానివల్ల చాలామందికి మనశ్శాంతి కలుగుతుందనే విషయంలో సందేహమేమీ లేదు. పట్టణంలోని వ్యవస్థ సరిగా లేదని అధికారులకు విన్నవించుకున్న పద్ధతిలోనే భక్తులు ప్రవర్తిస్తారు. అతని 'దయ' ఉంటే పరిస్థితులు చక్కబడతాయి. లేకపోతే లేదు. మన బాధ్యతల్లా విన్నవించుకోవడమే!
 

ఇదంతా మతభావనలను వెక్కిరించడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. సంగతేమిటంటే తక్కిన విషయాల్లో చాలా తెలివిగా ప్రవర్తించేవారుకూడా మతం విషయంలో హేతువాదవైఖరిని విడనాడతారని మనం గమనించవచ్చు. అంతేకాక తాము స్వయంగా పరిష్కరించుకోగల ఎటువంటి సమస్యకూ వారు 'దైవసహాయం' కోసం ఎదురుచూడరు. తెలియనివీ, అస్పష్టంగా అనిపించేవీ, చిక్కుముడిలాగా తమనను సవాలుచేసేవీ అయిన కష్టాలు ఎదురైనప్పుడే ఈ భక్తి వెల్లడవుతుంది.
 

మనిషికి అనాదిగానూ, అనుభవపూర్వకంగానూ అలవడిన కార్యకారణసంబంధం మతం విషయంలో బలంగా పనిచేస్తుంది. 'ఎవరో ఒకరు తిప్పకపోతే' తారలచుట్టూ గ్రహాలూ, అణువులోని న్యూక్లియస్‌చుట్టూ ఎలక్ట్రాన్లూ ఎలా తిరుగుతాయి? ఏదైనా 'తనంతట తానుగా' ఉనికిలోకి వస్తుందనే భావనను చాలామంది జీర్ణించుకోలేరు. ఏ భగవంతుడు ఏ వర్క్‌షాప్‌లో కూర్చుని అన్నిటినీ సృష్టిస్తాడో ఎవరికీ తెలియనప్పటికీ అలాంటిదేదో జరుగుతుందని జనం నమ్ముతారు.
 

మనిషికన్నా శక్తివంతుడైన ఒక పాతకాలపు భగవంతుణ్ణి ఆమోదించలేని పాశ్చాత్యులు ’ఇదిగో పులి అంటే అదిగో తోక' అన్న పద్ధతిలో గ్రహాంతరజీవుల గురించీ, ఫ్లయింగ్ సాసర్ల గురించీ వదంతులు లేవనెత్తుతారు. తమతమ సంస్కృతీసంప్రదాయాలనుబట్టి తమను చుట్టుముట్టిన బాధలనుంచి విముక్తి ఎలా పొందాలో తెలియక జనం రకరకాలుగా భ్రమలకు లోనవుతారు. మరణించిన తరవాత ఏమవుతుందో తెలియక అయోమయానికి లోనవడం మరొక ఇబ్బంది. తక్కిన కీటకాలూ, జంతువులూ, సాధారణప్రజలేకాక కోట్లమంది జీవితాలను ప్రభావితం చేసిన 'యుగ పురుషులు' సైతం చనిపోయాక నామరూపాలు లేకుండాపోతారని తెలిసినప్పటికీ 'మరణాంతర జీవితం' గురించిన ఆశలు మనుషుల మనసుల్లో బలంగా పాతుకుని ఉంటాయి.
 

మనకు కనబడే ప్రపంచం గురించి వాస్తవిక, భౌతికవాదదృక్పథం అలవరుచుకోవటానికి ఎవరూ వేదాంతులు కానవసరంలేదు. మనం బడిలో చదువుకున్న విజ్ఞానాన్ని సరిగా అవగాహన చేసుకుంటే చాలు.

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

21 Responses to మతాల స్వరూపాలు

  1. Rohiniprasad says:

    మీకు ప్రస్తుత వైజ్ఞానిక పరిశోధనలూ, పరిశీలనలూ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియాలి. Serious research goes on on historical subjects of importance internationally.
    ఎవరో పెద్దమ్మలనూ, తెలిసీతెలియని రాజకీయాలతో ఆవేశకావేషాలకు గురైనవారినీ దృష్టిలో పెట్టుకుని విషయాలను వివరించడంలో అర్థంలేదు.
    ఆర్యులు మనదేశపువారా, పశ్చిమంనుంచి వచ్చారా అనేది చరిత్రకారులు తేల్చవలసిన విషయం. అయినప్పటికీ వారేది చెప్పినా ఏదో ఒక వర్గం చప్పట్లు కొట్టడమో, రాళ్ళు రువ్వడమో చేస్తారు.
    ఆవేశాలకు లోనవకుండా చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోగోరేవారికి ఏదైనా చెప్పాలంటే ఏదో ఒక వర్గానికి బలం చేకూరుతుందనో, మరో వర్గానికి కోపం వస్తుందనో మానెయ్యాలా? నేనేమీ రాజకీయపార్టీ పెట్టి ప్రజలను రెచ్చగొట్టటంలేదుకదా? నేను రాసేవి మీకు నచ్చితే చదవండి, లేకపోతే ఏవో పిచ్చిరాతలని వదిలెయ్యండి. ఎవరు ఏం రాయాలో కట్టడిచెయ్యడం మంచిదికాదు.
    కొన్ని వేల ఏళ్ళుగా పాడిందేపాట విన్నాంకదా? కాస్త సైన్స్ రచనలకు కూడా స్థానమివ్వండి. నచ్చకపోతే తెగనాడుతూ మరొక వ్యాసం రాయండి. నేను రాసినది అసంపూర్తిగా అనిపిస్తే ఇతరత్రా సమాచారం సేకరించి (విమర్శించి) పని పూర్తిచెయ్యండి. మిమ్మల్ని వెతకమన్నాను కనక మీరడిగిన వివరాలు నాకూ దొరుకుతాయి. నేను ఇతరత్రా చాలా పనులమీద ఉంటాను. అందుచేత మీరడిగిన ప్రతి సందేహాన్నీ సవివరంగా తీర్చలేను.

  2. Rohiniprasad says:

    మతభావనలు కూడా కేవలం భావనలేననీ, నాడీమండలం ఎదిగిన ప్రాణులకు తప్ప (ఇతరత్రా విజయం సాధించిన ఏకకణజీవులకు-for example) వర్తించవనీ మన ‘జ్ఞానులకు’ తెలియదు. అందుకని ప్రతిదాన్ని గురించీ anthropocentricగానే ఆలోచిస్తారు. Consciousness లేని విశ్వాన్ని వారు ఊహించుకోనైనాలేరు.
    ఈ విషయంమీద నేను చాలా వ్యాసాలే రాశాను.
    దేవుళ్ళని నిరూపించలేమనీ, అదంతా అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుందనీ చాలామంది నమ్ముతారు. దేవుడూ, మతాలూ అన్నీ మనుషుల మెదళ్ళలోనే ఉంటాయి. Status quo కొనసాగి సమాజంలో పీడకశక్తులు బలపడడానికి దోహదపడుతూ ఉంటాయి. In reality గొప్ప ఆధ్యాత్మికభావాలు కలవారికీ, బుడబుక్కల జోస్యం నమ్మేవారికీ తేడా ఏమీ ఉండదు.

  3. “నావంటి అవివేకులకు వేదాంతం బోధించేవారందరికీ నా మనవి ఒక్కటే.”
    నెనరులు.

  4. విష్ణుభొట్ల లక్ష్మన్న says:

    నేను చాలా ఏళ్ళ క్రితం ఈ దేశానికి (అమెరికా) వలస వచ్చే ముందు ఒక పెద్దాయన ఇచ్చిన సలహా ఏమిటంటే మతము, రాజకీయాల గురించి ఎవ్వరితో ఘర్షణ పడవద్దని. నా ఇన్నేళ్ళ అమెరికా జీవితంలో నా అమెరికా స్నేహితులు ఎప్పుడూ ఈ రెండు విషయాల పై చర్చలకు దిగి ఘర్షణ పడ్డ సందర్భాలు లేవనే చెప్పాలి. అందుకు విరుద్ధంగా కొన్నేళ్ళు ఫ్రాన్స్ లో గడిపిన నా అనుభవంలో నేర్చుకున్నది ఏమిటంటే స్నేహితులతో కూడా నీ ఇష్టం వచ్చినట్టు వాదించు. కాని, స్నేహితుల్ని మాత్రం దూరం చేసుకోకు.

    ఐతే ఈ వ్యాసకర్త చెప్పిన విషయాలు కోంచెం open mindతో చూడాలని అనిపిస్తుంది. ఎవరి నమ్మకాలని తప్పుపట్టట్లేదు ఈ వ్యాసం. ప్రపంచ చరిత్రలో అనేక దేశ, కాలాల్లో ఒక సంస్కృతి, భాష, లిపి, సంగీతం, ఎలా పుడతాయో మతం కూడా అలాగే పుడుతుంది అన్నది సత్యమే అని అనిపిస్తుంది నాకు. నమ్మకం చాలా బలమైనది. అందువల్లే సున్నిత విషయాలైన మతము, రాజకీయాలలో నమ్మకాలను ఎవరైనా ప్రశ్నిస్తే స్పందన కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వేదాంతము, పురాణాలు, వేదాలు, మన సంస్కృతికి మూలమైన అనేక విషయాలు తెలియని వ్యక్తి కాదు ఈ వ్యాసకర్త.

    అంతర్జాతీయంగా ఏ రంగంలోనైనా “పరిశోధన” జరిగినపుడు కొన్ని సార్లు మన పాత నమ్మకాలని మార్చుకోటం తప్పని సరి అయ్యింది. అందుకు ఉదాహరణలు ఎన్నో!

    తెలుగులో ఇలాంటి విషయాలపై వ్యాసాలు రావటం మనం సంతోషపడవలసిన విషయం. ఇక్కడ చెప్పిన విషయాలను ఆమోదించమని నా అభిమతం కాదు. ఆలోచించమని నా కోరిక. ఏ విషయంలో అయినా ఆరోగ్యకరమైన ప్రశ్నా ధోరణి ప్రోత్సాహనకు అర్హమే!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. Rohiniprasad says:

    http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2010/sep/16/main/16main7&more=2010/sep/16/main/main&date=9/16/2010
    ‘పరలోకం’ గురించిన ‘విద్యాధికుల’ నమ్మకాలకు (పై వార్తలోని) వికృతరూపమే చదువుకోనివారి భయంకరవిశ్వాసాలకు కారణం అవటంలేదని గట్టిగా చెప్పగలమా?

  6. * * * నా వ్యాఖ్య సైన్సు గురించిన వ్యాఖ్యకానీ, సైన్టిఫిక్ వ్యాఖ్యకదని పాఠకులు గుర్తించాలని విజ్ఞప్తి * * *
    నా వాదన వినిపించడం కోసం, సైన్సుని స్థూలంగా రెండు భాగాలుగా విభజిద్దాం. ఒనగూర్జే ప్రయోజనాలననుసరించి, వివరించే వస్తువిషయాలననుసరించి. ఒక విభాగంలో, ఫిసికల్ సైన్సెస్, రెండవ విభాగంలో, అలోచనలని అర్ధంచేసుకోవడానికి ఉపకరించేవి, అంటే, తత్వశాస్త్రం, సాంఘికశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, ఇత్యాదులు. ఈ రెంటిమద్యకొన్ని అంశాల్లో స్పష్టమైన విభాజన ఉండాల్సిన ఆవశ్యకత లేదు, నేను సైన్సు అని పేర్కొంటున్నప్పుడు, రెండవ విభాగానికి సంబంధించినవాటి గురించి మాట్లాడుతున్నానని గమనించాలి.

    రెండవ విభాగంలో సైన్సు ప్రధానంగా అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించేది, మనసు, మెదడు, ఆలోచనలని. ఇద్దరు లేదా అంతకుమించిన మనుషుల మధ్య ఆలోచనల స్పందన – ప్రతిస్పందనలని. ఈ క్రమంలో అభివృద్ధి చేయబడిన నమూనాలు & తత్వాలు (models & doctrines) అతిసూక్ష్మీకరించబడిన ప్రపంచానికే వర్తిస్తాయి (utterly simplified representation of dynamic interaction between the mind and environment in which it exists.). ఆ నమూనా పరమ సత్యం అని చెప్పడానికి వీల్లేదు. ఒక ఉపయుక్తమైన నమూనా గామాత్రమే పరిగణించాలి (there is no right/true model, but only a useful one). అంతేకాదు, ఇక్కడ సైన్సు ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది (Science always plays the catch-up game and causality can be established under severely restricted circumstances. The moment you measure the environment that you wanted model, it would have changed already). ఇటువంటి పరిస్థితి మొదటివిభాగంలో వస్తు విషయాలకి అంతగా ఎదురుకాదు. నమూనా Goodness-of-fit విషయంలో, మొదటి విభాగపు శాస్త్రాలకి 95% శాతం పైబడడం ఆవశ్యకత,, రెండవ విభాగపు శాస్త్రాలకి, 70% రావడం కూడా గగన కుశుమం. ఈ వ్యత్యాసం ఎందుకొచ్చిందంటారు? ఇంతకుముందు సైన్సు “బొక్క బోర్లా పడింది/పడుతుంది” అని పేర్కొనడానికి కారణాలు ఇవి. అంతే కాని హేళనచేసి, చంకలు గుద్దుకోడానికి కాదు. ఇక మతం ఆవశ్యకతని సమర్ధిస్తే, కొత్త మందులు కనిపెట్టే వృత్తిని నమ్మకూడదా? ఈ requirement for mutual exclusivity ఎందుకో నాకర్ధంకాదు.

    దొంగస్వాములగురించి, మొదలగువాటి గురించి, ప్రస్తావించారు. దీనికి కారణం ఎవరు? మతమా? మతాన్ని దుర్వినియోగం చేసినవాళ్ళా? బలహీనలతలని అవకాశంగా తీసుకున్నవాళ్ళా? నకిలీ నోట్లు ముద్రిస్తారు. అంటే తప్పు డబ్బుదా? పోనీ ఈ అర్ధశతాబ్ధంలోనే సృష్టించబడ్డ ఇంటెర్నెట్టు తీసుకుందాం. ఫిషింగ్, ఆన్ లైను ఐడెంటిటీ తెఫ్ట్లు, పెడోఫైలిసమ్, వీటన్నికి ఇంటెర్నెట్టు కారణం అందామా?

    అకృత్యాలు మతంవల్ల మాత్రమే సంభవించవనీ అర్ధమైతోంది కదా? పోనీ అలాకాదనుకున్నా పరిష్కారం మతాన్ని రూపమాపడమా? మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? పర్యవశానాలేంటి. శ్రీరాంగారు అలా ఆవేదన పడడానికి కారణం, మతం కన్నా, ప్రత్యామ్నాయం, పర్యవసానాలని సూచించకుండా, కత్తిసాముగరిడీ విద్యాయుధాలని ప్రజలందరి చేతిలో పెట్టే open-minded, open-ended articles వల్ల జరిగే నష్టం గురుంచే అని నా అభిప్రాయం.

    మతాన్ని రూపుమాపినంత మాత్రాన, అకృత్యాలు మానవు,. అవి రూపాంతరం మాత్రమే చెందుతాయి. నా దృష్టిలోమతం అనేది, ఒక అధ్బుతమైన ఇన్వెంషన్. ఒకమూషికం యొక్క మదడుకి, రెండు ఎలక్ట్రోడులు తగిలించి, దాని గతిగమనాలని నిర్ధారించొచ్చు. ఇది state-of-the art. ఆరుబిలియన్ పైచిలుకు మనషుల మధ్య సమన్వయం సాధించడానికి మతం ఒక అద్భుతమైన సాధనం, ఒక నమూనా (model). సంభావ్యతాపూరక, కారక వస్తువిషయాలని అర్ధంచేసుకొనడానికి, తద్వారా నియంత్రణకు ఉపయోగపడే నమూనా. దీనివల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో, అంత దుర్వినియోగం కూడా జరుగుతుంది/తోంది. మతానికి, సైన్సు కి కూడా పరిమితులు ఉన్నాయి. మతం గాని, సైన్సుగాని, సర్వరోగనివారిణులు కాజాలవు. మతాన్ని, —- (మీ వాదాల పేర్లన్ని ఇక్కడ రాసుకోండి)— తో సంపూర్ణంగా replace చేస్తే, కొన్ని సమస్యలు తొలగిపోతాయి, కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. Instead, I choose best of the both schools of thought and it is at my discretion that I make the choice.

    చివరిగా, ఆలోచనలని జీర్ణంచేసుకొనే జీర్ణవ్యవస్థ, దాన్ని నియంత్రించే నాడీ వ్యవస్థ మనుషులందరిలోనూ ఒకేరీతిగా అభివృద్ధి చెందితే, అప్పుడు మతమొక్కటే కాదు, మెదడుకూడా ఉండూకమే (appendix).

    ** ఈ అంశం పై ఇదే నా ఆఖరి ప్రతిస్పందన. శెలవు.

  7. Rohiniprasad says:

    మతాలు బలపడినదశలో అంతకుపూర్వమే విపరీతంగా జనాదరణ పొందిన గ్రామదేవతలకు (సింహాచలం అప్పన్న, తిరపతి ‘యెంకన్న’ వగైరా) పౌరాణికదేవతల రూపాలు ఆపాదించబడ్డాయి.

  8. కే వి ఎస్ says:

    “మనకు కనబడే ప్రపంచం గురించి వాస్తవిక, భౌతికవాదదృక్పథం అలవరుచుకోవటానికి ఎవరూ వేదాంతులు కానవసరంలేదు. మనం బడిలో చదువుకున్న విజ్ఞానాన్ని సరిగా అవగాహన చేసుకుంటే చాలు.”
    వేదాంతులు, వేదాంతం, బైబిల్, ఖురాన్ మొదలైనవి చదవకుండా, ఎలా మనము చదువుకున్న విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి ? మనం చదివింది అంతా పరీక్షల కోసమే కదా? ఎంతో అభివృద్ది చెందినా అమెరికాలో కూడా మతానికి చాల ప్రాధాన్యం ఇస్తున్నారు కదా ? విజ్ఞానం చాల అభివృద్ది చెందినా , అది వినాశనానికి ఎందుకు వాడుతున్నాము. ఇటువంటి వినాసకరమిన బుద్ది నుంచి మానాన్ని కాపాడే శక్తి, మళ్ళీ ఏ భౌతిక విజ్ఞానానికి ఉన్నది?

  9. Rohiniprasad says:

    I may write something about these topics. The very idea of ‘purpose’ is very anthropocentric. Understanding of nature is quite complete. Religion is irrelevant except in the heads of several humans. Leave alone religion, even consciousness is irrelevant to nature. Just look at the cosmos.

  10. కే వి ఎస్ says:

    The challenge is .. What is correct understanding of nature, the purpose of life etc., We need to debate on this without bringing in religion..

  11. Rohiniprasad says:

    Sri KVS,
    All your questions can be answered. No one believes that USA is an ideal nation. One must have a correct understanding of nature, the purpose of life and death as selected by nature etc. All philosophies arise at specific stages of social development.

Comments are closed.