ఏప్రిల్ 2010 గడి
ఈసారి గడి పూరణలు అతి తక్కువగా వచ్చాయి. బహుశః గడికి వేసవి సెలవుల గాడ్పు తగిలినట్లుంది. గడిని ఉత్సాహంగా నింపి పంపినవారు ఆర్కేడి, కొడీహళ్లి మురళీమోహన్ , భమిడిపాటి సూర్యలక్ష్మి, మాచర్ల హనుమంత రావు, శుభ , విజయ జ్యోతి గార్లు. వీరిలో నాకు తెలిసి చాలామంది ఈమధ్య గడి పూరించడం మొదలెట్టినవారే. అందుకని తప్పొప్పుల మీమాంస చేయదల్చుకొలేదు. కానీ అతి తక్కువ తప్పులతో పూరించిన శుభగారికి ప్రత్యేక అభినందనలు. స్లిప్పుల సర్వీసున్నా కూడా తక్కువ పూరణలు రావడం శోచనీయం.
అడ్డం ఆధారాలు
క్రమ సంఖ్య |
అడ్డం పదం | ఆధారం |
1 |
వామదేవుడు | ఈయన కూడా దశరధుడి పురోహితుడే. ఎడం వైపు అనడం వల్ల వామ అని సూచనిచ్చాం |
4 |
ధ నవ తి | చక్కనైన నవధతి చిన్నమ్మ(లక్ష్మి.. పెద్దమ్మ జ్యేష్ఠాదేవి) కూతురు అన్న ఆధారంలోనే పదం ఉంది |
8 |
రుమ | అంటే ఉప్పు బట్టీ. సుగ్రీవుడి పెళ్ళాం పేరు కూడా అదే. |
9 |
పోనిలు | పోనీలు అంటే పొట్టిగుర్రాలు .. వెళ్ళు (పో), ఆగు (నిలు) అని దోసందుగా అనడం వల్ల పోనిలు అని రాయాలి |
10 |
వారాహి | ఈవిడ వైష్ణవి, ఇంద్రాణి మొదలైన సప్తమాతృకలలో ఒకరు. హి.. హి.. హి.. అని చివరలో పెట్టి సూచించాం. |
11 |
కబీరు | తారకబీరుని తాగమని గోప్యంగా అన్నకి (గోపన్న) ఉపదేశించినాయన |
13 |
కవుల్దారీ | పొలంలేకపోతే కౌలు (కవులు) కు తీసుకోవచ్చు. కవిత్వం చెప్పగలిగిన వారు కవులు. |
14 |
వాణీవిలాసము | నంది తిమ్మన్న రాసిన కావ్యం. |
15 |
రో | దీని అర్ధం చేబదులు |
16 |
గురు | పెద్ద. కాలేజీ కుర్రాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాసూ అని, గురూ అని కూడా సంబోధించుకుంటారు కదా |
18 |
వీసె | వీడు 25600 గురిగింజలెత్తు .. సెనగగింజలనలేదు నయం. |
20 |
నిట్రాడ | నిలువుగా ఉండేది … ఎవరైనా మాటా మంతీ లేకుండా నుంచుని ఉంటే ఏంటీ నిట్రాడలా నుంచుని ఉన్నావు అని అంటారు. |
23 |
సమరాంగణ | సాహితీ సమరాంగణ సార్వభౌముడనికదా బిరుదు. కావ్యం రాయడం లోనూ, కత్తి దూయడం లోనూ సమర్ధుడు. |
26 |
పవనము | తోట (వనం) లోంచే వచ్చింది పవనమే కదా |
28 |
అహహ | నవ్వు కి అక్షరరూపం ఇదేకదా |
30 |
ధన్కోకఫ | ఫన్ కి ఓ కథ .. ఇంగ్లీషోడు తమాషా (ఫన్) కి ఓకధ చెపితే … |
31 |
చతురంగబలాలు | యుధ్ధం లో వాడేవి ఇవేకదా |
34 |
కారు | కారు మబ్బులు .. ఆకాసంలో మబ్బులతో సావాసం చేసినా కారు కదలాలంటే పెట్రోలు |
35 |
స్కారు | స్కార్ అంటే మచ్చే కదా.. దెబ్బ తగిలితే మచ్చ పడుతుందిగా …. |
36 |
వలలు | వలేయడం అంటే తెలుసుకదా. |
39 |
నవతరంగాలు | పాతకెరటాలిక్కడస్సలు మిగలలేదు అన్నీ కొత్తవే .. కొత్త కెరటాలివే కదా |
42 |
రుదితము | అంటే ఏడుపు .. ఎంత విదితంగా చెప్పినా ఏడుపే ఏడుపు |
45 |
వీరరమ | ఝాన్సీ దేవిలా మరలాగ యుధ్ధం చేయగల లక్ష్మి(రమ ఈవిడకింకో పేరు).. |
46 |
సం | ఇది ఉప సర్గం. |
47 |
రసిక | రసిక రాజా! తగువారము కామా. అన్న పాట గుర్తుంది కదా |
నిలువు ఆధారాలు
క్రమ సంఖ్య |
నిలువు పదం | ఆధారం |
1 |
వారుణవాహినిపధ కాలు | గంభీరంగా ఉన్నా సారా పధకాలే. ఇది అన్నగారి హయాంలో వచ్చిన సారా పధకం |
2 |
మమ | పూజలు చేయించేటప్పుడు పురోహితుడు మిమ్మల్ని మమ అనుకోమంటాడు..విన్నారు కదా |
3 |
వుపూబీలాగు | ఎ రోజ్ ఈజ్ ఎ రోజ్ .. విత్ వాటెవర్ నేమ్యూకాల్ అన్నారు కదా. కిందనించి పైకి రాసినా దాని పరిమళానికి ఢోకా లేదు |
4 |
ధనిక | అంటే అందమైన అమ్మాయని అర్ధం. ధమనికల్లో రక్తం పరుగెట్టించగల అందగత్తె. |
5 |
నలువురు | అంటే నలుగురే కదా. అవును… ఆనలుగురే. (4) |
6 |
తివారీ | ‘నేనెవరికి తండ్రిని’, ‘ఎవరికి ప్రియుడిని’ అని సందిగ్ధంతో రాష్ట్రం విడిచి పోయిన ఏలినవారు .. ఇంతకన్నా ఏం విడమర్చి చెప్పాలి |
7 |
సాహితీ | 23 అడ్డం లో అంతా చెప్పేసాం కదా |
11 |
కవి | ఈయన కవిత్వం చెప్తే చంపడానికి వేరే కత్తి కావాలా. |
12 |
రుసరుస | కోపానికి వ్రాతరూపం ఇదే |
17 |
మారాం | చిన్నప్పుడు మారాం చేస్తే ముద్దే కానీ పెద్దైనా మారకపోతే మారేంగే. |
18 |
వీణ | వాణికి వీణే కదా హస్తభూషణం |
19 |
అపోహలు | పోహా తినమంటే అపార్ధం (అపోహ) చేసుకుంటావేం (4) |
21 |
ట్రావన్కోరు | రాజభోగం కన్నా సంగీతభోగాన్నెక్కువ అనుభవించిన రాజావారి సంస్థానం .. ఇది వాగ్గేయకారుడు స్వాతితిరునాళ్ గారి సంస్థానం |
22 |
డనక | కాళ్ళు సరిగ్గా ఉంటే నడక బాగానే వచ్చుండేది ..లేవుకాబట్టి తిరగబడింది |
24 |
మస్కాచస్కా | ఈ ఉప్పు బిస్కట్లతో ఉబ్బేయచ్చని(మస్కా) చప్పగా చెప్పాడు ఆస్కారు |
25 |
గహరం | అంటే కట్టె. పొయ్యిలో కాల్చడానికి పనికి వచ్చేది |
27 |
ముఫక | పాపం తీవ్ర పడిశమనుకుంటా .. శ్లేష్మం కక్కడానికి తలకిందులైపోతున్నాడు ..అంటే కఫము ని తిరగేసి రాయాలని |
28 |
అబల | మంత్రాలు చదివితే ఆకలేయకపోవచ్చు.. బలం కూడా ఉండదుకదా … బల, అబల అనేవి విశ్వామిత్రుడు తాటకీ సంహారమప్పుడు రామునికి ఉపదేశించాడు |
29 |
హలాలు | హలాల్ చేయకుండా ఎర్రటి మాంసం తినరుకదా |
32 |
తురుష్కులు | తెలుగు లో టర్కీవారిని తురుష్కులు అనే అంటారు |
33 |
గవర్న రు | తివారీ గారు ఈ పదవిలోఉన్నప్పుడే కదా . పితృత్వపు కేసు, ఇంకారాసలీలల కేసులు వచ్చాయి |
37 |
తురం | తురగం అంటే గుర్రం. సగం గుర్రం తురం |
38 |
ఎముక | బాగా వాయించడాన్ని సున్నంలోకి ఎముక లేకుండా కొట్టడం అంటారు |
39 |
నర | మనిషి తాలూకు.. నరుడుకి సంబంధం ఉన్నది. నరకానికి కొద్దిగా తక్కువ |
40 |
వర | నరవర అంటే రాజు |
41 |
తమ | తమకం అంటే మత్తు. |
43 |
ది ర | గానుగ దిరదిర తిరుగుతోందంటాం కదా |
44 |
తసి | అంటే దట్టమైన నాఱు అని. |
అమ్మో! గడి పంపందే నయమైంది. సగం కంటే ఎక్కువ రాలేదు.ఎందుకో చాలామందికి ఈ గడి అర్ధం కాలేదు. స్లిప్పులు కూడా దొరకలేదు. ఇంకా గడి సమాధానాలు రాకుంటే పూర్తిగా ఎత్తేసారేమో అనుకున్నా. కొత్తగడి కూడా ఇవ్వలేదెందుచేతనో??
మీ పొద్దు చూసేదే గడి కోసం. చాలా బాగుంటుంది.