గాలి

-కెక్యూబ్ వర్మ

వీస్తున్న గాలి
వాసన ముక్కు పుటాలను తాకి
ఎదలో రొద పెడుతోంది.

ప్రశ్న వెన్నంటే ప్రశ్నల సాలె గూడులో౦చి
బయట పడలేని తనం.

తెగిపడిన శిరస్సుల ముందు
ఖాళీ చేతులతో మోకరిల్లలేను
కనుగుడ్ల ఖాళీ స్థలంలో ఇప్పుడు
ఏదో విద్యుల్లత

పద్మ వ్యూహం నుండి
బయటపడే మార్గం ఉమ్మనీరులో
ఈదిన నాడే నేర్చిన వారి
బిగి కరచాలనం,
చిరునవ్వుతో కదనోత్సాహం,
మృత్యు ఘంటికల కొసలు తెంపే
రణన్నినాదం.

సన్నని గాలితిమ్మెరతో పాటు
సయ్యిన చెవిపక్కగా దూసుకుపోయిన
బాణం గుసగుస
సాయుధుణ్ణి చేస్తోంది.

కె.కె.కుమార వర్మ గారు విజయనగరం జిల్లా, పార్వతీపురం పట్టణంలో వుంటున్నారు. అది కళింగాంధ్ర ప్రాంతం. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖలో గ్రామాభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. విరసం సంస్థలో 12 ఏళ్ళుగా సభ్యుడిగా వుంటున్నారు. శివారెడ్డి, ఆశారాజుల కవిత్వమంటే బాగా ఇష్టం. ప్రస్తుతం బ్లాగుల్లో వివిధ అంశాల పట్ల తన స్పందనను రాస్తున్నారు

About కెక్యూబ్ వర్మ

కె.కె.కుమార వర్మ గారు విజయనగరం జిల్లా, పార్వతీపురం పట్టణంలో వుంటున్నారు. అది కళింగాంధ్ర ప్రాంతం. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖలో గ్రామాభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నారు. విరసం సంస్థలో 12 ఏళ్ళుగా సభ్యుడిగా వుంటున్నారు. శివారెడ్డి, ఆశారాజుల కవిత్వమంటే బాగా ఇష్టం. ప్రస్తుతం బ్లాగుల్లో వివిధ అంశాల పట్ల తన స్పందనను రాస్తున్నారు
This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

4 Responses to గాలి

  1. ఉష says:

    “చెవిపక్కగా దూసుకుపోయిన
    బాణం గుసగుస
    సాయుధుణ్ణి చేస్తోంది”

    ఇది మీదైన బాణి, వర్మ గారు.

    కానీ, ఒక ప్రశ్న..

    “పద్మ వ్యూహం నుండి
    బయటపడే మార్గం ఉమ్మనీరులో
    ఈదిన నాడే నేర్చిన వారి
    బిగి కరచాలనం.
    చిరునవ్వుతో కదనోత్సాహం.”

    ఇక్కడ నాకు ఏదో గొలుసుకట్టు తెగినట్లుగా ఉంది. “కరచాలనం” తర్వాత కామా ఉండాలా?

  2. అవును ఉషగారూ, అక్కడ డాట్స్ 3 పెట్టి తరువాత ఈ వాక్యం రాసా. నే వుంచిన డాట్స్ ఫుల్ స్టాప్ లలా వచ్చేసాయి. మీ స్పందనకు ధన్యవాదాలు…

  3. satyan says:

    mee kavita baagundi. mukhyamgaa sheershika gaali. atu tarvaata saayudhunni chaestaondi anna vaakyam arthavantamgaa vunnayi.

  4. satyan says:

    mee kavita baagindi varma gaaru.

    mukhyamgaa sheershika gaali. aa tarvaata marao vaakyam
    -saayudhunni chaestaondi-. ikapaotae ee kavitalao naaku nachchina padaalu chalaanae vunnai. for example

    ummaneeru,padmavyooham,chirunavvu, mrutyu ghantikalu,vudyullata, kadanaotsaham…. ilaa ilaa ee ilalao.

Comments are closed.