కవికృతి-౪

కవికృతి మూడవ భాగం లోని కవితలపై పవన్ కుమార్ గారి సమీక్ష
———————–

స్వాతీ శ్రీపాద -నీకు తెలుసా కవితపై..

ఉపమానాలే కవిత్వం కాదు, ఉపమానం కవితకు ఉత్ప్రేరకం కావాలే కానీ అది కవితకూ పాఠకుడికి మధ్య అడ్డు రారాదు. ఈ ఉపమానాల దొంతరల కింద పడి నలిగిపోతున్న కవితను బయటికి తీస్తే హృద్యంగా ఉంటుంది.

—————————————–

కత్తి మహేష్ కుమార్ కవితపై..

తర్కం కవిత్వం కానేరదు. భావావేశం ఉన్న చోట తర్కం వెనక్కి పోతుంది. కవైన వాడు యాంత్రిక జీవితాన్ని బయటికి తోసి తర్కాన్ని తుంగలో తొక్కి కవిత్వ సృజన చేస్తాడు.

నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
సమ సాంద్రత నీళ్ళని
కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది
ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది

— “నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు” అని భావావేశంతో మొదలెట్టి ఆ తర్వాత ఎంతో కష్టమైన సైన్సు, మాథ్సు,క్లాసుల్లోకి తీసుకెళితే ఎలా? రొమాంటిక్ సినిమా అని ప్రకటించి యాక్షన్ సినిమా కి తీసుకెళ్ళినట్టు (టైటానిక్ అని టెర్మినేటర్ 2 చూపినట్టు).

చాలా చెక్కేసి, తప్పకుండా తీసేయాల్సిన పంక్తులు తీసేస్తే కవిత ఇది:

నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
సమ సాంద్రత నీళ్ళని
కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది

నువ్వెళ్ళిపోయిన చర్య
నన్ను జఢుణ్ణి చేసిందేగానీ
ప్రతిచర్యకు పురికొల్పలేదు

తర్కం తెలిసిన మెదడు
మనసు పోకడకు
హేతువు కోరింది
నీ శూన్యాన్ని…
కనీసం కొలిచైనా
సాంత్వన పొందే
దారి వెదికింది

నీ చితి మటలు ఎగసాయి
ఆ కాల్చేవేడిని చల్లారుస్తూ
నాకళ్ళ మబ్బులు కమ్ముకున్నాయ్
వర్షించే కళ్ళతొ
అర్థనగ్నంగా
నేను కూర్చునే ఉన్నాను

ఇంకా కాస్త సాన బడితే మంచి కవితవుతుంది.

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

4 Responses to కవికృతి-౪

  1. “నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు
    సమ సాంద్రత నీళ్ళని
    కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది
    ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది”

    నాకు నచ్చింది. ఆర్కిమెడిస్ సూత్రంతో మంచి కవిత వ్రాయొచ్చని నిరూపించారు. సైన్స్ విద్యార్థి బాగా ఆస్వాదిస్తాడు ఈ కవితను.

  2. #tel challa bagundi… kaka pothe science pariganam kooda undali mari kavitam lotu teliyalantee….#tel

  3. కొడవళ్ళ హనుమంతరావు says:

    పవన్ కుమార్ గారు, కవిత భావావేశం నుండి కష్టమైన సైన్సులో కెళ్ళినందుకు అభ్యంతరం చెప్పారు. నాలుగేళ్ళ క్రితం, రచ్చబండలో, తెలుగు కవితల్లో సైన్సు ప్రస్తావన చాలా తక్కువంటూ ఓ టపా రాశాను. దాంట్లో ప్రస్తావించిన WH Auden కవిత, “The Common Life,”లో భాగం చదవండి:
    What draws
    singular lives together in the first place,
    loneliness, lust, ambition,

    or mere convenience, is obvious, why they drop
    or murder one another
    clear enough: how they create, though, a common world
    between them, like Bombelli’s

    impossible yet useful numbers, no one
    has yet explained. Still, they do
    manage to forgive impossible behavior,
    to endure by some miracle

    conversational tics and larval habits
    without wincing (were you to die,
    I should miss yours).

    గణితం చదువుకున్నవాళ్ళు కూడా Bombelli’s numbers అంటే బహుశా వెతుక్కోవాల్సి రావొచ్చు. కాని అవేంటో తెలుసుకున్న తర్వాత అవి ఇక్కడ చక్కగా ఒదిగాయని ఒప్పుకోరా?

    కొడవళ్ళ హనుమంతరావు

  4. గరికపాటి పవన్ కుమార్ says:

    హనుమంత రావు గారు,

    నా అభ్యంతరం సైన్సు లోకి వెళ్ళినందుకు కానీ సైన్సు పదాలను ఉపయోగించినందుకు కాదు, కవితలలో ఎన్నైనా సైన్సు పదాలను ఉపయోగించచ్చు “అవసరమైతే”. మనకందరికీ తెలిసిన విషయం ఆలోచన ఉన్న చోట ఆవేశం ఉండదని. కవిత పాఠకుడిని ఆలోచింపచేస్తే , ఆ అలోచనలు పాఠకుడిలో ఉన్న ఉద్వేగాన్ని పక్కకి నెట్టి వేరే ఏ విషయం మీదకైనా తీసుకెళ్తే ఆ కవిత తప్పు దారి పట్టిందనే నా ఉద్దేశం. ఇక అర్థం కాని పదాలంటారా అవి ఏ కవితలోనైనా ఉంటాయి. పోతన గారి భాగవతంలో అర్థం కాని పదాలను నిఘంటువులను చూసి అర్థం చేసుకున్నట్టే సైన్సు పదాలు కూడా. ఒక రకంగా చుస్తే కవి చదవని విషయమూ ఉండకూడదు. నాకు తెలిసి తమ వృత్తికి సంభాదించని విషయాలను (కవులకు తమకు కాని విషయాలనేవి ఉండవు ) కూడా చాలా మంది కవులు పదాల కోసమని చదవడం మనకి తెలుసు.

    ఇక పొతే సైన్సు కవిత్వం అని ఒకటి ప్రాచుర్యంలో ఉంది. మన శాస్త్రీయ గ్రంథాలు పూర్వం ఛందస్సులోనే వచ్చేవి, మరి అదంతా కవిత్వమేనా?

    ఇట్లు
    గరికపాటి పవన్ కుమార్

Comments are closed.