క’వికృతి’ (ఉగాది వచన కవి సమ్మేళనం) – ౧

వికృతి నామ సంవత్సరాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన వచన కవి సమ్మేళనం లోని కవితలను పాఠకులకు అందిస్తున్నాము. ఈ కవితలపై మీ సద్విమర్శలనూ, విశ్లేషణలనూ ఆశిస్తున్నాం. ఏందుకంటే వీటిపై పత్రిక ఎడిటింగ్ లేకుండా నేరుగా ప్రచురిస్తున్నాం. ఇక పాఠకులే ఎడిటర్లూ,విమర్శకులూ, విశ్లేషకులూ అన్నీ!

కవితాగానం

శబ్ద ఖననాన్ని కోరుకుంటున్నా..!
-పెరుగు.రామకృష్ణ, నెల్లూరు

డిజిటల్ డోల్బీ ఊయలలొ పురుడు పోసుకుని
ఏడువేల ఓల్టుల సమ్మోహన శబ్ద తరంగాల మధ్య
ఇప్పుడు మనం తప్పటడుగుల్లోనే వున్నాం..
గుండె డమరుకం పగిలి ఊగిసలాటల్లో ఉడుకుతుంది దేహం

శరీరం చిగురించదు
ప్రశాంత సముద్రంలో నావలా
బ్రతుకు ఊసులాటల్లేవు
శబ్ద రొదల్లో మనిషి గుండె పుండై పూసి
శిరసు లేని మొండెమై తిరుగుతుంది

శబ్ద సమూహమే అంతా
నిశ్శబ్దాన్ని మాయం చేస్తూ
మనిషి శబ్ద సమూహాన్ని విడవడం లేదు
పర్యావరణాన్ని నడిరోడ్డుపై హత్య చేస్తున్న
శబ్ద ఖననాన్ని కోరుకుంటున్నాడు
ప్రశాంతతను మరచి పోతున్నాడు

పాదాలకు అబ్బిన నాట్యం..
పదాల భుజాల మీద రాకాసి ధ్వనై కూర్చుంది
ఇప్పుడు అక్షరం కూడా నిశ్శబ్దం కోల్పోయి అలజడి చేస్తోంది
ఒక పురాతన స్వప్నం పునరాలోచనమౌతుంది నాకు
పిట్టలేని లోకాన్ని చూస్తున్న నేను
శబ్ద రహిత ప్రపంచాన్ని వెదికాను
కనుచూపుమేరలో లేదు

ఎందుకంటే..
శబ్ద రహిత మానవుడిప్పుడు కరువయ్యాడు కనుక
మనిషి లోపల కూడా శబ్దమే ధ్వనిస్తుంది కనుక…!

*Wishing for the burial of noise..!*

Delivered in the digital Dolby cradle
Amidst 7 KV enchanted sound waves
We are still toddlers now
The heart, Shiva’s drum, broken, oscillates the boiled body
Doesn’t break into fresh leaf
No small talk now as in a boat in the quiet sea
Boiling, man wanders like a headless torso
Silence disappeared as though by magic
Man is not able to escape the hubbub of din
Wishes to inter the killing noise
That is murdering environment openly in broad day light
He is forgetting calm and peace and the dance his feet imbibed
Noise becoming an ogre sits on the shoulders of the word
Now even the alphabet, having lost its silence, is agitating
I relive an ancient dream
Watching a world without fauna
I searched for a noise-free world
Nowhere within sight now

Since –
There is the dearth of a noiseless man

Since
Even within man it’s only noise that rings and rumbles

Telugu Original: Perugu Ramakrishna

English rendering:Dr. V.V.B. Rama Rao, Newdelhi

~~~~~~~~

పొద్దు నిర్వహించిన పూర్వ కవిసమ్మేళనం విశేషాలు చదవండి.

—————————————–

బొమ్మ శ్రేయస్సు

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

6 Responses to క’వికృతి’ (ఉగాది వచన కవి సమ్మేళనం) – ౧

  1. నిశ్శబ్ద సంగీతాన్ని ఆస్వాదించడం తెలిసినప్పుడే ఈ కవిత లోతు తెలుస్తుంది. చక్కటి కవిత! కవి గారికి అభినందనలు!!
    తవ్వా ఓబుల్ రెడ్డి.

  2. ఉష says:

    శబ్దకాలుష్యాన్ని బాగా చూపారు. శబ్ద రహిత మౌనలోకాల్లో సంచరించే వారికి తెలిసేదీ కవితాత్మ.

    ఈ ఆలోచనల్లో గుర్తుకొచ్చిన శబ్దకల్తీ వూసిది.. జపాన్ లో కొన్ని పక్షుల తమ స్వతః సిద్ద కూతలు మరిచిపోయి టివీ శబ్దాలని అనుకరిస్తున్నాయట. బహుశా అవి జన వాసాల్లో గూళ్ళు కట్టుకొనటం ఒక కారణం కావచ్చు. ప్రకృతి రూపు రేఖలు, నిమయనిష్టలు కలుషితమైపోతున్న కాలం కదా ఇది మరి.

  3. మొదటి చరణంలో ఉన్న ఆంగ్ల పదాల్ని మినహాయిస్తే పద్యం చాలా బావుందనిపించింది తొలి చదువులో. కొంచెం ఆలోచించిన మీదట అక్కడ ఆ ఆంగ్ల పదాలు కర్ణకఠోరంగా ఉండడం కూడా శిల్ప రీత్యా పద్యం చెప్పదల్చుకున్న విషయానికి తోడ్పడి శబాషనిపించింది. కవిగారికి అభినందనలు.

  4. విశ్వామిత్ర says:

    సమ్మేళనం తో పాటే విశ్లేషణ శోభ నివ్వదేమో. పైగా ఇది మీరు ఓ పండగ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన సమ్మేళనం.

  5. lrkkosuri says:

    thelugu koila desa desaala patalu vini sabda samudranni nirasinchinattu vundi ramakrishna garu meepoem.chaala kottaga rasaaru.mimmalnerigina naku mee ee poem chaala kottaga anipisthondi…subhakankshalu…kosurodu.

  6. Thank u my friends for valuble comments on my poem…

Comments are closed.