వికృతి నామ సంవత్సరాది సందర్భంగా పొద్దు రెండు కవిసమ్మేళనాలను నిర్వహించింది. ఒకటి వచన కవితా సదస్సు కాగా రెండోది ఛందోబద్ధ పద్యకవిత్వ సదస్సు. పూర్తిగా అంతర్జాల మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులలో కవులు ఎంతో ఆసక్తితో పాల్గొని కవిత్వ ధారలు కురిపించారు.
వచన కవుల సమ్మేళనం: వచన కవుల సదస్సును పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతి కుమారి గారు నిర్వహించారు. ఈ సదస్సు ఫిబ్రవరి 16 న మొదలై మార్చి 10 వరకూ జరిగింది. కవులు తమ స్వీయ కవితలను ఈమెయిళ్ళ ద్వారా పంపారు. కవిత్వంలోని క్లుప్తత, అనువాద కవిత్వం వంటి అంశాలపై చర్చలు కూడా జరిగాయి.
పాల్గొన్న వారు
- పెరుగు రామకృష్ణ
- చావా కిరణ్
- స్వాతీ శ్రీపాద
- జాన్ హైడ్ కనమూరి
- హేమ వెంపటి
- సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
- కత్తి మహేష్ కుమార్
- బొల్లోజు బాబా
- దామోదర్ అంకం
- ఎం ఎస్ నాయుడు
- ఆత్రేయ కొండూరు
- రాకేశ్వరరావు
———————————–
పద్య కవుల సమ్మేళనం: పద్య కవుల సమ్మేళనం కొత్తపాళీ గారి ఆధ్వర్యంలో 11 మంది పద్యకవులతో జరిగింది. మార్చి 3 న సన్నాహకాలతో మొదలై మార్చి 13 వతేదీ శనివారం నాడు జరిగిన సభతో విజయంతంగా ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటలపాటు రసోల్లాసంగా జరిగిన ఈ సభలో కింది కవులు, రసజ్ఞులు పాల్గొన్నారు.
సభాధ్యక్షుడు: నారాయణస్వామి (కొత్తపాళీ)
పాల్గొన్న కవులు:
- లంకా గిరిధర్
- భైరవభట్ల కామేశ్వరరావు
- ఫణి ప్రసన్న కుమార్
- పుష్యం
- రాఘవ
- రాకేశ్వరుఁడు
- రవి
- సనత్ కుమార్
- విశ్వామిత్ర
- శ్రీరామ్
- చదువరి
ప్రేక్షకులు:
కొత్తపాళీ గారు ఎప్పటిలానే ఈ సభను కూడా ఆద్యంతమూ చక్కగా నిర్వహించారు. ముందుగా వారిచ్చిన సమస్యలు:
————————————————-
సమస్యలు
- ఓటది నాయిష్టమనుచు వోటరు పలికెన్
- రాట్నము చేతబట్టుకొని రాక్షస కృత్యము చేసినాడహో
- గరికయొ గడ్డియొ మెసవి గైకొనవచ్చు గవిత్వ సంపదల్
- కుసుమములెల్ల జిత్తమున కోరికలై మురిపాలు గ్రోలగా
- లావొక్కింతయు లేదు … ఈ మాటలతో మొదలు పెట్టి పోతన ఛాయ కనబడకుండ రాయండి
- ఎదుటన్నిల్చె సహస్రభోగములు మేలేసేయు వ్యాపారముల్
- కుందేళులు రెండు వచ్చి కుచముల గరచెన్
- వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్
- రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్
- దారను విడనాడ సుఖము తథ్యమగును
- అక్షప్రౌఢిమ మీర ఆ శకుని లంకాధీశుతో బోరెడిన్
- ఒకటి ఒకటి కూడి ఒకటెయగును
- పేరు గొప్పకాని ఊరు దిబ్బ
దత్తపదులు:
- బీరు, విస్కీ, రమ్ము, జిన్ను – గాంధేయవాదం గొప్పదనం
- పిల్ల, జెల్ల, ఇల్లు, గుల్ల – ఒకో పదం ఒకో పాదంలో. ఆదర్శ దాంపత్యం
- మాసు, బాసు, కింగు, కేడీ – మన్మథుని గురించి
- కోతి, నాతి, రీతి, జ్యోతి – ఒక్కొక్క పాదంలో అదే వరసలో
- గిల్లీ, దండా, అష్టా, చెమ్మా – వసంతకాల వర్ణన
- మాలిక, తూలిక, చాలిక, పోలిక – ఉత్పలమాల మొదటి పదాలుగా వాడుతూ
- కూడలి, హారం, జల్లెడ, పొద్దు – బ్లాగుల ప్రశస్తి గురించి సీసం
- నవాబు జవాబు కవాతు తవాయి
వర్ణనలు
- ద్రౌపది – 3-5 పద్యాల్లో
- మీరొక రైల్లో వెళ్తున్నారు. ఎదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళీద్దరూ కనీసం పరిచయస్తులు కూడా కాదు, కానీ ఆ అబ్బాయి కళ్ళల్లో ఆ అమ్మాయి పట్ల ఆరాధన. బయటికి చెప్పలేడు. ఇదంతా మీ కళ్ళకి కనిపిస్తోంది. వర్ణించండి.
ఆనువాదాలు
Robert Frost
Nature’s first green is gold,
Her hardest hue to hold.
Her early leaf’s a flower;
But only so an hour.
Then leaf subsides to leaf.
So Eden sank to grief,
So dawn goes down to day.
Nothing gold can stay.
William Wordsworth – on Westminster Bridge
Earth has not anything to show more fair:
Dull would he be of soul who could pass by
A sight so touching in its majesty:
This city now doth, like a garment, wear
The beauty of the morning; silent, bare.
Ships, towers, domes, theaters, and temples lie
Open unto the fields, and to the sky;
All bright and glittering in the smokeless air.
Never did sun more beautifully steep
In his splendor, valley, rock or hill;
Ne’er saw I, never felt, a calm so deep!
The river glideth at his own sweet will:
Dear God! the very houses seem asleep;
And all that mighty heart is lying still!
(ఈ కింది రెండు సంస్కృత మూలాలు నాగమురళిగారికి ధన్యవాదాలతో)
చాటువు
నపుంసకమితి ఙ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మన:
తత్తు తత్రైవ రమతే హతా: పాణినా వయం ||
కుమారసంభవం నించి శివుని వర్ణన
భుజఙ్గమోనద్ధజటాకలాపం కర్ణావసక్తద్విగుణాక్షసూత్రం
కణ్ఠప్రభాసఙ్గవిశేషనీలాం కృష్ణత్వచం గ్రంథిమతీం దధానం ||
సర్పంతో తన జటలను కట్టుకొని ఉన్నాడు. చెవిపైన రెండు పేటలుగా రుద్రాక్ష మాలను ధరించి ఉన్నాడు. ఆయన కంఠం నుంచి నీలిమలు ప్రసరించడం చేత మరింత నల్లనైన కృష్ణ జింక చర్మాన్ని ధరించి వున్నాడు.
కిఞ్చిత్ప్రకాశస్తిమితోగ్రతారై
ర్భ్రూవిక్రియాయాం విరతప్రసఙ్గై:
నేత్రైరవిస్పందితపక్ష్మమాలైర్
లక్ష్యీకృత ఘ్రాణమధోమయూఖై: ||
ఉగ్రములైన ఆయన కంటి పాపలు స్తిమితములై కొంచము ప్రకాశిస్తూ ఉండగా (అర్ధ నిమీలిత నేత్రాలు అన్నమాట) భ్రూ చలనము లేని రెప్పల స్పందన లేని ఆయన కళ్ళు అధోముఖంగా కాంతులు ప్రసరిస్తూ ఆయన ముక్కును తమ లక్ష్యంగా చేసుకున్నట్టుగా ఉన్నై.
అవృష్టిసంరంభమివాంబువాహ మపామివాధారమనుత్తరఙ్గం
అంతశ్చరాణాం మరుతాం నిరోధాన్నివాతనిష్కంపమివ ప్రదీపం ||
వాన అలజడి లేని మేఘం లాగా, తరంగాలు లేని సముద్రం లాగా ఉన్నాడాయన. తన అంతర్వాయువులను (ప్రాణములను) నిరోధించడంచేత గాలి లేక నిశ్చలంగా ఉన్న దీపం లాగా ఉన్నాడు.
——————————————-
అంతర్జాలంలో జరిగిన ఈ కవిసమ్మేళనాల విశేషాలను వివరంగా పొద్దు పాఠకులకు సమర్పిస్తున్నాం. ఈ వ్యాసాల్లోని మొదటి భాగాలు ఉగాది పర్వదినాన మీకోసం.
పై సమస్యలను పూరించే ఆసక్తి గల పాఠకులు తమ పూరణలను పొద్దు (editor@poddu.net) కు పంపవచ్చును. ప్రచురణయోగ్యమైన వాటిని వ్యాసాలతోపాటు అనుబంధంగా ప్రచురిస్తాం.
పైన రాకేశ్వరరావు అని వ్రాసి క్రిందఁ రాకేశ్వరుండు అన్నారే 🙂 పద్యకవిసమ్మేళనానికి నేనుద్ధేశించిన పేరు రాకేశ్వరుఁడు, కానీ ఆంగ్లంలో వ్రాయవలసివచ్చి రాకేశ్వరుణ్డు అని వ్రాసాను।
నరసింహారావు గారి బ్లాగులు।
🙂 పేరు మార్చాం చూడండి. నరసింహారావు గారి బ్లాగు లింకు ఇచ్చాం. నెనరులు.
ఎప్పుడు జరిగేదో ప్రకటిస్తే మేమూ ప్రేక్షకుల్లా వచ్చేవాళ్లం కదా 🙂 (సరె, ఎక్కడ జరుగుతుందో కూడా తెలియాలనుకోండి)
@ సూర్యుడు. మీరు గత ఏడాదీ ఇదే మాట అన్నారు. అందుకని ఈ సారి ప్రత్యక్ష సభ జరగడానికి మూడు వారాలు ముందుగానే నా బ్లాగులో ఆహ్వానం ప్రకటించాను మీ వంటి వారి కోసమనే.
@కొత్తపాళీ:
నేనది చూడలేదండి. మళ్లీ వచ్చే సమ్మేళనానికి వీలైతే 🙂
నమస్కారములతో,
సూర్యుడు
‘రవి’ గాంచనిచో కవి గాంచున్
(సూర్యుడి గారి వ్యాఖ్యకు స్పందన.)
పైనున్న ప్రశ్నపత్రంలోనించి కవులెవరూ ఆంగ్లపద్యాల అనువాదానికి పూనుకోకపోవడం నాక్కొంచెం ఖేదం కలిగించిన మాట నిజం, గత ఉగాది సభలో షెల్లీ ఒజిమాండియాసు పద్యానికి మంచి అనువాదాలొచ్చిన నేపథ్యంలో.
అది ఈ పొద్దు తీరిపోయింది. యాదృఛ్ఛికంగా కంటబడిన ఈ చక్కటి అనువాదంతో. మీరూ చూస్తారని .. ఇదిగో ఇక్కడ.