Monthly Archives: March 2010

కవికృతి -౩

కత్తి మహేష్ కుమార్: నీ జ్ఞాపకాలతో బరువెక్కిన మనసు సమ సాంద్రత నీళ్ళని కళ్ళలో నింపి కన్నీళ్ళొదిలింది ఆర్కెమెడీస్ సూత్రాన్ననుసరించింది నువ్వెళ్ళిపోయిన చర్య నన్ను జఢుణ్ణి చేసిందేగానీ ప్రతిచర్యకు పురికొల్పలేదు న్యూటన్ సూత్రం తప్పిందా? లేక… నీలేమి శూన్యంలో సూత్రమే మారిపోయిందా! తర్కం తెలిసిన మెదడు మనసు పోకడకు హేతువు కోరింది నీ శూన్యాన్ని… కనీసం … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 5 Comments

కో హం

-హెచ్చార్కె ఏడుపు వస్తోంది ఎట్నుంచి ఎటో వెళ్తూ ఒక పాడువడిన పాకలో తల దాచుకున్నాను ఇక్కడెవరో నివసించిన, పిల్లల్ని కని పెంచిన, చనిపోయిన గుర్తులు నేను దేన్ని వెదుక్కుంటున్నాను? ఎక్కడ పోగొట్టుకున్న ఆశను? ఎట్నుంచి వచ్చానో ఎటు వెళ్తున్నానో తెలియనివ్వకుండా కళ్లను కబళించేంత కాటుక వంటి చీకటి దూరంగా బండ్లు వెళ్తున్న చప్పుడు బండి చక్రాల … Continue reading

Posted in కవిత్వం | 26 Comments

వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – నాల్గవ భాగం

కొత్తపాళీ:: ఈసారి ఇచ్చిన సమస్యల్లో కవులందర్నీ బాగా ఉత్తేజితుల్ని చేసి, చాలా చర్చకి కారణమైనది ఈ సమస్య – రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్ విశ్వామిత్ర:: ముందు చేరింది కవులో వస్తువులో తెలియదు గానీయండి కవులకూ కవితా వస్తువులకు కూడా నిలయంట కొత్తపాళీ:: గిరిధర కవీ మీరు వేళ్ళు కదిలించి చాలా సేపయినట్టుంది, మీ పూరణ … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 6 Comments

వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – మూడవ భాగం

కొత్తపాళీ:: బాగుంది. ఒక దత్తపది వేసుకుందాం .. మాలిక, తూలిక, చాలిక, పోలిక – ఉత్పలమాల మొదటి పదాలుగా వాడుతూ.. ముందుగా చదువరి గారి పూరణ. చదువరి:: ఒక్క క్షణం.. ఉ. చదువరి గొంతులో ఈ పద్యం వినండి “మాలికలెన్నొ యుండ గజమాలను నా గళసీమ వేసి, నే తూలి కథాకళించ గని తుళ్ళుచు నవ్వితె … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 4 Comments

రమాదేవి మళ్ళీ రమ్మంది

-సిముర్గ్ అక్కిరాజు భట్టిప్రోలు మంచి కథకుడుగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు. ఏడాదికో కథకి మించి రాయకపోవడానికి తన బద్ధకమే కారణమని అంటారుగాని, కథలు రాయడం అంత తేలికకాదని గుర్తెరిగినవారు. అంటుకొమ్మ, నందిని, గేటెడ్ కమ్యూనిటీ కథలతో, మనకున్న కొద్దిమంది సమకాలీన ‘మంచి కథకుల’ లిస్టులో చేరిపోయిన అక్కిరాజు లేటెస్టు కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” ఆంధ్రజ్యోతిలో … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

రమాదేవి ఎందుకు రమ్మంది (Author’s cut)

-అక్కిరాజుభట్టిప్రోలు “రమాదేవి ఎందుకు రమ్మంది?” మరోసారి అలోచనలోకి జారిపోబోయాడు రాజారావు. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కున్నాడో తనకే తెలీదు. సికిందరాబాదు ఇంకో పావుగంట దూరంలోకి వచ్చేసింది. కంపార్ట్ మెంట్ లో అందరూ మిడిల్ బెర్తులు మడిచేసి, సూట్ కేసులు బయటకు పెట్టి, పిల్లల కాళ్ళకి చెప్పులు లెక్క చూసుకుంటున్నారు. ఈ గొడవలో తన … Continue reading

Posted in కథ | 6 Comments

“రమాదేవి ఎందుకు రమ్మంది” – కథ వెనక కథ

“రమాదేవి ఎందుకు రమ్మంది” అనే కథ Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – రెండవ భాగం

వికృత నామ ఉగాది పద్య కవితా సదస్సు రెండవభాగంలో మూడు సమస్యలకు రసభరిత పూరణలు చోటు చేసుకున్నాయి. వీటితో పాటు కవుల చమత్కార సంభాషణలు కూడా! Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

క’వికృతి’ – ౨

ముందుగా కవికృతి మొదటి భాగంలో ప్రచురించిన కవితపై గరికపాటి పవన్ కుమార్ గారి విశ్లేషణ: భావాలు ఒద్దికగా వచనంలో ఇమడకపోవడం వలన ఈ కవిత పాఠకుడిలో అయోమయాన్ని నింపుతోంది ఉదా 1: డిజిటల్ డోల్బీ ఊయలలొ పురుడు పోసుకుని ఏడువేల ఓల్టుల సమ్మోహన శబ్ద తరంగాల మధ్య ఇప్పుడు మనం తప్పటడుగుల్లోనే వున్నాం.. పురుడు పోసుకొవడం … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

వికృతి నామ ఉగాది పద్యకవితా సదస్సు – మొదటి భాగం

కొత్తపాళీ: అందరికీ పెద్దవారు, ఆచార్యులు, చింతా రామకృష్ణారావు గారు చక్కటి గణపతి ప్రార్ధన పద్యం పంపారు. ఉ: శ్రీ గణ నాయకా! వికృతిఁ జేర్పను వచ్చెదొ? విశ్వతేజ! రా వేగమిటున్. ప్రభా కలిత విశ్వ పరిజ్ఞత కావ్య జాల స ద్యో గుణ సద్విధమ్ మలర; దుర్గుణ బాహ్య మహత్వమొప్ప; రో జూ గనరా! కృపన్ … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 5 Comments