2009 మే గడి ఫలితాలు

మే నెల గడిని నింపి పంపిన వారు – వెన్నెల_డిబి, jyothi, రాధిక, వేణు, సుజాత(మనసులోమాట), BK, ఆదిత్య, వెంకట్ దశిక, కామేశ్వర రావు, స్వరూప కృష్ణ, మైత్రి, సంచారి, కంది శంకరయ్య గార్లు. వీరిలో రాధిక ఒక తప్పుతో, కామేశ్వరరావుగారు రెండు తప్పులతో పూరించారు. వర్ణక్రమ దోషాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని సరిచూసుకుంటే సరిగ్గా నింపినవాళ్ళ సంఖ్య పెరుగుతుంది.

వివరణలు:
1 శ్రద్ధాత్రయ విభాగ యోగం: శ్రధ్ధావాన్ లభతే జ్ఞానం అని కదా గీతా వాక్యం. మూడు శ్రధ్ధలంటే శ్రద్ధాత్రయ, అయినా ఎవరి గీతెలా ఉందో అనడం ద్వారా భగవద్గీతలో అధ్యాయం అని సూచించాం.
8 భాకర్: భాకర్ అంటే జొన్న రొట్టి. మహారాష్ట్రీయుల కిష్టమైనది. ఈటీవీ సుమన్ స్నేహితుడు ప్రభాకర్ అని చెప్పక్కర్లేదుగా.
10 చిలక: మాటలు ముద్దుగా తిరిగి పలికితే చిలక పలుకులంటాం కదా.
11 జిగిలి: జిగిలి అంటే చిక్కని కాంతి.
12 రణం: గోపీచంద్ సినిమా.
13 ణంగ: వృత్తపద్యం గణంలేకుండా అవ్వదుగా.
15 నార: చచ్చేముందైనా ఆనారాయణుడిపేరు స్ఫురిస్తుందని బంధువులు నార చూపిస్తే ఓ పిసినారి పీచు అన్నాడట.
16 కవి: భారవి ప్రవృత్తి పరంగా కవే గా.
17 త ణ గ ము: తణగము అంటే నీళ్ళుమోయడానికి వాడే తోలుసంచీ.
18 జిలేబీ: చుట్టలు చుట్టలుగా ఉండేదిదేగా.
22 తీతా: అందాలరాముడిలో అల్లు ని రాజబాబు తీతా -తీసేసిన తాసిల్దారు అని ఏడిపించే వాడు
24 తలుపు చెక్క: తమలపాకుతో తను ఒకటిస్తే తలుపు చెక్కతో నేరెండిచ్చా అని మోటు సరసం.
27 గోర్కి: అమ్మ అనగానే గుర్తొచ్చే రచయిత మాక్సిం గోర్కీ.
28 లోకలే: ఇక్కడివాళ్ళే అంటే లోకలే అని.
29 నకనక: కలవారి కోడలై న కనక మాలక్ష్మిలో ఇంత ఆకలి బాధ ఉందా? ప్రస్ఫుటపరిచిన అక్షరాలు చూడండి.
30 లేపనము: ప్రవరాఖ్యుడిని కష్టాల్లో పడేసిన జెల్లీ పాద లేపనము
33 సిసి: ఇంజను కెపాసిటీని, ఇంజెక్షన్ కెపాసిటీని సిసి లలో చెప్తాం కదా.
34 లుక: ఎలుక చేసే శబ్దం కాదిది, రెట్టిస్తే – అంటే లుకలుక – అంటే పురుగులు చేసే సందడి అని.
36 లుసుకుమారు: మంచికుమారులు – సుకుమారులు – కొడుకుల కాలు నెత్తిమీదకొచ్చింది అంటే లు ముందుకొచ్చిందని.
38 తీద్ధాం: ఇక్కడినుండి తీసేయమన్నారని చెప్తే తీద్దాం అని మామూలుగా చెప్పకుండా తీద్ధాం అని వత్తి చెప్పడం.
39 గునపం: గుండెల్లో గునపాలు గుచ్చడం అని కదా ప్రయోగం.
42 రుతంమా: మారుతం – అక్షరాలు తారుమారయ్యాయి.
44 కంది: కంది పప్పు అంత తేలికగా ఉడకదు కదా. కందడం అంటే చర్మం నలుపయిపోవడం అని కూడా.
45 కబళము: పూర్వం ముష్టివాళ్ళు ఓ ముద్ద అడిగే వారు. ఇప్పుడో చిల్లరడుగుతున్నారు.
46 స్టావి: మైక్రోసాఫ్ట్ వాళ్ళ కొత్త ఓయెస్ విస్టా. తికమక పెడ్తోందంటే తిరగేయమని.
48 వానపాము లు: వెర్మీకంపోష్ట్ చేయడానికి వానపాములనుపయాగిస్తారు.
51 ఎవరూ నీవారు కా రు: ఎవరూ నీవారు కారు, ఎవరూ నీతోడు రారు. ధర్మదాత సినిమాలో ఘంటసాల పాటయిది.
52 కరివి: కరి అంటే ఏనుగు అని. కోతి అని కూడా అర్ధం.

నిలువు

1 శ్రవణం: నవవిధభక్తుల్లో శ్రవణం ఒకటి. వినిపించుకోవచ్చుగా అని సూచించాం.
2 త్రచి: ఇక్కడెలా ఉన్నా అంటే తిరగబడిందని.
3 యలనా గ: ఎలనాగ అంటే అందంగా ఉన్న అమ్మాయి. అమ్మాఏ అని ఏ బదులు య అని వాడామని సూచించాం.
4 వికరము: వికారం అని కాక వికరం అని రాయాలని ఆఫీలింగుకూడా దీర్ఘంగా రాలేదు అని సూచించాం.
5 గజిబిజి: సందడి – బిజీ బిజీ – వెరసి గజిబిజి.
6 యోగి: ఒక యోగి ఆత్మ కథ పరమహంస పరమానందగారు రాసిన పుస్తకం.
7 గంలి: లింగం -శివాలయంలో కనిపించేదే. అనుస్వారం జారిపోయి తిరగ బడి గంలి అయింది
8 భారవి: తండ్రి మెచ్చుకోలేదని చంపబోయిన సంస్కృత పండితుడు భారవి – కిరాతార్జునీయం కర్త.
9 కర్ ణం: కర్ణం – అంటే చెవి, రేఖాగణితంలో మూలలని కలిపే రేఖ.
14 గతతార్కికసిద్ధాంతం: గతితార్కికసిధ్ధాంతం – పాతబడిందని గత వాడాం.
19 లేత మనసులు: కుట్టిపద్మిని బాలనటిగా ముద్దుగా వేసినసినిమా
20 బీలు: హడావిడిగా తిరిగేవాళ్ళని బిజీ బీ అంటాంకదా.
21 చక్కనమ్మ: చక్కనమ్మ చిక్కినా (చేతికి), చిక్కకపోయినా అందమే కదా.
22 తీగోనసితీరువఎ: ఎవరుతీసిన గోతిలో వారే పడతారని కదా – మరీ ఇంత …తుగా తవ్వితే, ‘తీ’ సిన వాళ్ళే తలకిందులుగా పడతారు అనడం ద్వారా చివర తీ వస్తుందని సూచించాం.
23 లేలేలే: లేలేలే… లేలేలే… నారాజా అన్న ఎల్లారీశ్వరి పాట మరచిపోలేదుగా.
25 పుట్ట: వల్మీకం (పుట్ట) లో తపస్సు చేసుకున్నాడు కాబట్టి వాల్మీకికాపేరుట.
28 లోకలుగు: దగ్గరలోఉన్నా(లోకలు) , ఎలకింటి (కలుగు) కెళ్ళి వేలెట్టమంటే భయం కలుగుతుందిగదా
32 పలు: పలు వరుస తిన్నగా లేదంటే మీకు నవ్వెలా వస్తోంది -నవ్వు అని ఇచ్చి పళ్ళకి సంబంధం ఉన్న పదం అని సూచించాం. .
33 ముకు: లక్ష్మణుడు ముక్కు కోసేసిన తర్వాత శూర్ఫణఖకి ముకు మిగిలింది
36 కనకం: కీర్తీ, కాంతా, కనకం .
38 మారుబలుక: మారుబల్క కున్నావేమిరా – మామనో రమణ. అన్నది శ్రీరంజనిలో త్యాగయ్యగారి కృతి
41 పందివారు: పందివారు అంటే నాకుతెలియదుకానీ – ఆకాశవాణి ధరవరలలో ఇది తప్పక చెప్పేవారు.
42 పాముచెవి: బాగా వినికిడి ఉంటే పాముచెవులతో పోలుస్తారు కదా
44 మాస్టారూ: చిరంజీవి వేసిన సినిమా మాస్టారు. ప్రస్తుతం జనాలు పాఠాలు నేర్పారాయనకి
46 కము: పలు తో కలిస్తే మాట్లాడం అనే కదా
48 వినీ: నీవి తిరగేస్తే వినీ,
50 నకా: కాన అంటే అడివి.
51 పారు: దేవదాసుకి ప్రియమైనది పారు కదా

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

10 Responses to 2009 మే గడి ఫలితాలు

  1. vennela_db says:

    nenu kooda rendu thappule chesanu kadandi. 1 addam sraddha ki dheergam pettaledu. 52 addam karivi badulu kapivi ani poorinchanu

  2. 52 అడ్డం – కపి అంటే కోతి ఏనుగు రెండర్థాలు ఉన్నాయి. కాని నాకు తెలిసి కరి అంటే కోతి అన్న అర్థం లేదు. మరోసారి చూస్తారా?
    44 – మరీ “మాష్టారూ” అని రాసినా మార్కు కోసెయ్యాలా మాస్టారూ? 🙂

  3. మరీ ఇంత స్ట్రిక్ట్ గా పేపర్లు దిద్దుతారా?? అస్సలు బాలేదు..:(

  4. సంచారి says:

    1. అలాంటప్పుడు యోగమే యోగం అని 1 క్లూలో వుండకూడదేమో.
    2. కందడం అంటే చర్మం ఎరుపెక్కడం. నల్లబడ్డం (కమిలిపోవడం) కాదు.
    3. ఇప్పుడేమో ఓన్లీ కాపర్స్ అని ఇంగ్లీషులో క్లూ తప్పుదోవ పట్టిస్తుంది. ఇది మంచి క్లూ కాదు. సమాధానం వేరే భాషలో వుంటే అది సూచించడానికే ఆ భాషను క్లూలో వాడతారు.
    4. కరి అంటే కోతి అని అర్థం లేదే.

    ఇంత చేస్తున్న మీరు, గడి నిర్మాణం సిమ్మెట్రికల్ గా ఎందుకు చేయటం లేదు?

  5. కరి అంటే కోతి అని ఒక ముద్రిత బ్రౌణ్యం లో ఉంది. త్రివిక్రమ్ గారు ఈ విషయం లేవనెత్తాక మరోమారు సరిచూసా.
    పేపర్ వీజీగా ఇచ్చా కదా అని స్ట్రిక్ట్ గా పేపర్లు దిద్దా. కామేశ్వరరావు, రానారే గార్లలా ముప్పుతిప్పలు పెట్టట్లేదుగా 🙂
    అందరూ మంచి సూచనలిచ్చారు. ముందు ముందు పాటిస్తా.

  6. అలా అయితే మరి రెండూ (కరివే, కపివే) రైటే అవ్వాలికదా? ఊఁ…ఊఁ…ఒక్క మార్కైనా కలపరా…ఊఁ…ఊఁ 🙂
    కిందటిసారి నేనూ చాలా సులువుగానే ఇచ్చానండీ, ఈసారి గడికూడా సులువుగానే ఉంది (నాకొకటి మాత్రం రాలేదు, మరొకటి అనుమానం). పైపెచ్చు స్లిప్పుల సర్వీసు ఉండనే ఉంది!

  7. ఈగడులు నేను చూడ్డం ఇదే మొదలు. నేను ఇవేవీ చెయ్యలేనని తెలిసిపోయింది. కానీ ఒక్కమాట పైన చక్కనమ్మ చిక్కినా అందమే (21)అన్నసామెతలో చిక్కడం అంటే సన్నబడడం అన్న అర్థంలో వాడతాం మాప్రాంతంలో.

  8. సంచారి గారూ,

    1. అలాంటప్పుడు యోగమే యోగం అని 1 క్లూలో వుండకూడదేమో.

    ‘యోగం’ అనేది సమాధానంలో ఉండే పదమే కదా? ఆధారంలో ఉంటే తప్పేమిటి?

    2. కందడం అంటే చర్మం ఎరుపెక్కడం. నల్లబడ్డం (కమిలిపోవడం) కాదు.

    కందడం అంటే ఎరుపెక్కడం, నల్లబడ్డం రెండూ. బ్రౌణ్యంలో చూడండి – నల్లబడ్డమనే ఉంటుంది.

    3. ఇప్పుడేమో ఓన్లీ కాపర్స్ అని

    పూర్వం ఏమనేవాళ్ళో చెప్పాక దాన్నే ఇప్పుడేమంటారో కూడా చెప్పారు ప్రొఫెసర్ గారు!

    మీరడిగినట్లు సిమెట్రికల్ గడులు అందించడానికి ప్రయత్నిస్తాం.

  9. సంచారి says:

    నాకు తెలిసినంత వరకూ (ఎక్కువ కాదు కానీ, న్యూయార్క్ టైంస్, ట్రిబ్యూన్ వగైరా యు.ఎస్ పత్రికల గడుల్లో. నేనెప్పుడూ క్రిప్టిక్ గడులు యూ.కే టైపువి చేయలేదు) సాధారణంగా సమాధానం వేరే భాషలో ఉంటేనే క్లూలో ఆ భాష వాడతారు. అలాగే, క్లూలో అబ్రివియేషన్ లేదా పొడి అక్షరాలు ఇస్తే సమాధానం అలానే ఉన్నట్టు.

    అంటే, క్లూ నిర్మాణానికి సమాధానానికి ఒక లింకు వుంటుంది. సో, కాపర్సు అని క్లూలో వుంటే సమాధానం ఇంగ్లీషులో అనుకోవచ్చు. అలానే కాపర్సు అంటే పెన్నీలు కాబట్టీ, అవి డబ్బులు కాబట్టీ ప్రస్తుతం బిచ్చగాళ్ళు డబ్బులే అడుగుతున్నారు అని అర్ధం వస్తుంది. ఐతే ఇది కబళం అనే సమాధానానికి ఎలా సంబంధించింది? ఆన్‌లైను బ్రౌణ్యం లో ఇలా వుంది:

    http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=kabaLam&table=brown

    యోగం గురించి – ఈ క్లూ నేను తప్పుగా రాశాను కాబట్టీ మీరు చెప్పిందే రైటని అంటాను. (కాకపోతే అవి మూడుంటే (డే) యోగం అని వుంటే బాగుండేదేమో అని అనుకున్నాను.

    యలనాగ సాయి గారి తప్పు కాదేమో. పొద్దులో అమ్మాయే అని క్లూలో వుంది. అమ్మాఏ అని లేదు.

    బ్రౌణ్యమే కాకుండా మిగతా నిఘంటువులు కూడా చూసుకొని, నానార్ధాలు వుంటే క్లూలో ఉద్దేశిస్తే బాగుంటుంది. నా ముందు స్పందన ఉద్దేశం గడి నిర్వాహకులు తెలిసి మరీ తప్పుదోవ పట్టించే క్లూలు ఇస్తున్నారని కాదు. పొరపాటుగా చేస్తున్నారేమో అని. క్లూ కష్టంగా వుండవచ్చు కానీ కావాలని తప్పుదోవ పట్టించేదిగా వుండకూడదని ఆచారం.

    నా ఉద్దేశం శాయిగారినీ మిమ్మల్నీ విమర్శించడం కాదు. ఎలానూ ఇంత కష్టపడుతున్నారు కదా, ఇప్పటికే ఆచరణలో వున్న ప్రమాణాలను పాటిస్తూ గడి చేస్తే బాగుంటుందేమో అని. అంతే.

  10. sonu says:

    karayt gaa chasaru

Comments are closed.