2009 మార్చి గడి ఫలితాలు

సరిగా పూరించినవారు: కామేశ్వర రావు
ఒక్క తప్పుతో: కంది శంకరయ్య, వెన్నెల, స్వరూప కృష్ణ, గోకుల్
రెండు తప్పులతో: ఆదిత్య

వీరికి పొద్దు అభినందనలు తెలుపుతోంది.

X 1వే
2టూ
రి
3సుం
4 5 6రా 7మూ
ర్తి X
8త్యా
X కీ X 9దో

మా
వి
X డో
X 10
11
12ది
X 13నె

ము
X X 14

X గు
15రా
తి
X 16రు
సుం
X X 17పా

కం 18లో నా

X 19పు
లు
దు
నా
X రి
X X 20పా
యి
ను
X క్కి
X లు
X 21గా
జా
X X 22యి
ది
23
24లం
టి
X X 25
ది
తా

26ము
X మా
X 27
పు
28రం
X
X
X ని
X మా
29పం
X 30రా
గం
X 31వి


తా

ము X
చి
X
X 32మో
డు
X
X త్ని
X 33
34తం
35
ము
X 36కా
పు
X X X 37ధో
నీ
X
X 38పే
లు
X 39డు
ము
వు
లు
X షి

అడ్డం:
1. వేటలో తెర చాటుగా ఓ అందాలరాముడు.(10) – వేటూరిసుందరరామమూర్తి

9. మావేనని కీరదొరసానులు కోరే పండ్లు(4) – దోరమావి

11. తెలంగాణంలో అది మీరిప్పుడుంటున్నది.(2) -గది

13. నేర్పరి ఎంచని మిష.(3) – నెపము
14. పుటుక్కున పోయేముందు చాలామందికి వచ్చేదేమిటో కొంచెం సోచాయించు.(2) – జర
15. ఏ నాతి నడిగినా చెబుతుంది నాటి కోట కట్టుడంతా ఎక్కువగా ఇదేనని(2) – రాతి
16. ఓ చిరు చిత్రంలో దాగున్న ఫీజు. వాస్తవంగా చెల్లించండి.(2) – రుసుం
17. పుడక ముక్కుకు లేదు, మరెక్కడుంటుందబ్బా! …?(5) – పానకంలోనా
19. పున మొదలైనవి కదిలిపోయాయి.(4) – పులుదునా (పునాదులు)
20. పాపాయి పొట్టలో ఉన్నదేనోయి.(2) – పాయి (పాలు)
21. ఈ మధ్యధరా జాగాలో ఎప్పుడూ అనీజీయేగా?(2) – గాజా
22. వ్యవహారంలో అది ఒక ..లే(2) – యిది
23. శిరమును తాకితే సరిపోదు నాయనా, నూనె రాయాలి. స్నానమెలా చెయ్యాలో తెలీదా? (3) – తలంటి
25. ఫస్ట్ లాక్ పడితే చివర తట్టుకోలేము.(5) – ఆదితాళము
27 ఉప్పు పోలికనుండునదే. కాపురమంత పొడుగు లేదు.(3) – కపురం (కపురమే కప్పురం)
30. తీసేకొద్దీ సాగివచ్చే సప్తస్వరసాగరజం(2) – రాగం (సప్తస్వరాల సాగరం నుండి పుట్టినది)
31. హరుడయినా హతాశుడై విహరించక తప్పలేదీ సెగతో.(6) – విరహతాపము
32. చేతులెత్తి నమస్కరించడంలో ముడుచుకొన్న మొరటు(2) – మోడు (కైమోడుపు, చేతులు ముడుచుకోవడం)
34. అడ్డంగా వాదిస్తే గుంపుచేరడం విడ్డూరంకాదు(3) – తండము (తండము అంటే సమూహము. అడ్డంగా వాదించడం వితండము)
36. అమెరికాలో పోలీసోళ్లందరిదీ ఒకటే కులం.(2) – కాపు (కాప్స్ అంటారు కదా పోలీసులను)
36. చౌకే పే ఛక్కా ఉతకనీ అని కదా ఆ పేరు పెట్టింది.(2) – ధోనీ (ధో అంటే ఉతుకు అనికదా హిందీలో)
37. హెడ్ క్వార్టర్సులో చెల్లింపులు. తేడా వస్తే గొరుగుడే. (2) – పేలు. పేనుకొరకడమంటే వెంట్రుకలు రాలి మళ్ళీ మొలవకపోవడం.
38. విభక్తులు చెప్పమంటే ముడుపులు చెల్లిస్తావా? సరిగా మొదలెట్టు(4) – డుమువులు

నిలువు:

2. హలో! రెండు తాళం చెవుల ఏకవచనం మాటల సినిమా వంటిది.(2) – టూకీ
3. ఓ పసందయిన సుందరి కోసం కొట్టుకు చచ్చిన సోదరులు! ఎవరో హిందీలో వినిపించు (6) – సుందోపసుందులు (హిందీలో సున్(నా)దో)
4. దండలో పొట్టి దారములా పొట్టలో దాగిన భయము (3) – దరము (దరము అంటే భయము)
5. అమ్మా లక్షీదేవీ! (2) – రమా
6. గోవులొస్తున్నాయి జాగ్రత్తంటే సగమే విని ఆకులా వణుకుతావేమి!(2) – రావి (రావి ఆకులాగ వణకడమనేదొక పలుకుబడి. గోవులొస్తున్నాయి జాగ్రత్త రా.వి.శాస్త్రి రచన)
7. అంటే రెండ్రకాలూ కాదా! మరి?(4) – మూడోరకం
8. గరాజులో దాచకయ్యా రాఘవా, తనుగా తెలుగువాడిచ్చిన మకుటమిది.(6) – త్యాగరాజనుత
10. తమరే యిటు పల్కనగున అని వాపోతున్న అల్లుని నిష్టూరం(7) – తగునాఇదిమామా (రాముడూభీముడూ సినిమాలో రేలంగి, రమణారెడ్డిలకోసం ఘంటసాల, మాధవపెద్దిల పాట)
12. అసుర మాతిది.(2) – దితి (అసురుల మాత)
13. మానవులు కాదు, వారి వెంట్రుకలు (3) – నెరులు (నరులు కాదు నెరులు)
14. ఈ సమీకరణం జాన్తానై అంటే వాడు రాజకీయాల్లో పనికిరాడు (2) – జన
17. పారి-పొమ్మని హిందీలో చెప్పి వేడికి విరుగుడు వెయ్యడం ముక్కు తీరు తెలిసిన తెలుగువాడి పనే. (9) – పారిజాతాపహరణము (ముక్కుతిమ్మన కృతి. పారి-జా-తాప-హరణము అని విరుపు)
18. ఇదో రకం ఒప్పందం. కలంకారీ కళంత ప్రాచీనమైనది. ఇందులోనే అడ్డం 20 ఉంది.(3) – లోపాయి
19. పాతకథే కానీ దీన్ని ఆపోశన పట్టడమంటే మంచినీళ్లు తాగినట్టు కాదు. (7) – పుక్కిటిపురాణము
21. సూదులుగుచ్చే చెండు. ఇది నిండితేనే ఉగాది(2) – గాది (గుండు సూదులను జాగ్రత్తగా ఉంచేందుకు వాటిని గుచ్చి ఉంచేందుకు కుట్టిన చిన్న(గుడ్డ)మెత్త గాది. ధాన్యం నింపే గాదెను వ్యవహారంలో గాది అని కూడా అంటాం)
24. విశాలమైన గృహానికి, రావణాసురునికీ ఆంధ్రుల అనుసంధానం (2) – లంక (లంకంత యిల్లు అనే జాతీయం ఆధారంగా)
25. క్రీడలను వదిలేస్తే విశ్రాంతా?! పొడుపుకథ విప్పండి.(5) – ఆటవిడుపు
26. మొగుడు మౌనంగా ఉండిపోతే పెళ్లామేమౌతుంది?(4) – మునిపత్ని
28. బర్మా రాజధాని. పూర్వరంగం తెలిసిన తెలుగువారినడగండి.(2) – రంగం (రంగూన్ ను తెలుగువాళ్లు రంగం అనేవాళ్లు)
29. పంచబడినది, పంచ్ చేయబడినదీ కాదిది. కావాలంటే గోవునడుగు.(3) – పంచితం (గోమూత్రం)
32. ఇది అడ్డుపడితే పని జరగడం కష్టం. దీనికొక చిప్పకూడా ఉంటుంది.(3) – మోకాలు
33. డబ్బున్న బుద్ధిమతి.(3) – మనీషి (మనీష అంటే బుద్ధి, ప్రజ్ఞ అనే అర్థాలున్నాయి కదా! మనీషిలోని మనీయే డబ్బు)

35. చివర నుండి చివరకు తేరు చేరితే పరిసమాప్తమే(2) – కడ

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

3 Responses to 2009 మార్చి గడి ఫలితాలు

  1. Srilu says:

    33 నిలువు ‘మనీషి ‘ ఒక్కటే తప్పు రాశా మిగతావన్నీ కరెక్ట్ గానే రాశానే 😕

  2. నేను కూడ గడి నింపి పంపించాను. నాది కూడ ఒక్కటే తప్పు అది “మనీషి” కాని నాపేరు ప్రచురించలేదే? ఇదేదో నెట్ ప్రాబ్లం లాగుంది.

  3. శ్రీలు, భాస్కరనాయుడుగార్లకు – మీరన్నట్లు ఏదో సమస్య వున్నట్టుంది. క్షమించాలి, వేగులపెట్టెలో మీ పేర్లు కనబడలేదు. పూరణలు పంపినందుకు కృతజ్ఞతలు. ఈ నెల గడి చాలా కొత్తగా రూపొందించారు కామేశ్వరరావుగారు. మీరు ప్రయత్నిస్తున్నారనుకుంటాను.

Comments are closed.