కూర్పరి మాట:
ఈసారి(ఏప్రిల్ 2009) గడి కొంచెం వెరైటీగా ఇచ్చాను. ఇందులో ఒక కీలక పదం తక్కిన వాటితో సంబంధం లేనిది ఉంది. దానికి ఆధారం కూడా విడిగానే ఉంది. అది గడిలో మొదటి వరుసలో నింపవలసిన పన్నెండక్షరాల పదం. కాబట్టి అసలు గడి 11×12 అన్నమాట. కీలక పదంలో ఒకో అక్షరమూ, ఆ columnలో ఏదో ఒక నిలువులోనో అడ్డంలోనో ఉన్న పదంలో లోపించిన అక్షరం అవుతుంది. నిలువు పదంలో అక్షరం లోపిస్తే అది ఆ పదంలో ఎన్నో అక్షరమైనా అయ్యుండవచ్చు. అడ్డంలో లోపిస్తే మాత్రం అది మొదటి అక్షరమే అవుతుంది (కొంత సులువుగా ఉండేందుకు). ఉదాహరణకి కీలక పదం “గోరొంక గూటికే చేరావు చిలక” అయితే, మొదటి columnలో ఏదో ఒక నిలువులో క్లూకి “గోమేధికము” అనే పదం సమాధానం కావచ్చు. కాని అక్కడ నాలుగక్షరాలే ఉంటాయి. అంచేత “గో” అన్నది కీలక పదంలో మొదటి అక్షరంగా వేసుకొని, “మేధికము” అన్నది నిలువు పదంలో వేసుకోవాలి. అలాగే మిగతా అక్షరాలు.
– కామేశ్వర రావు
కీలక పదానికి ఆధారం:
భక్త కవిరాజు చింతించింది కేవలం దీనికోసమా!
2009 ఏప్రిల్ గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి
పాత గడులు
- 2009 మార్చి గడి, సమాధానాలు
- 2009 ఫిబ్రవరి గడి, సమాధానాలు
- 2009 జనవరి గడి, సమాధానాలు
- 2008 డిసెంబరు గడి, సమాధానాలు
- 2008 నవంబరు గడి, సమాధానాలు
- 2008 అక్టోబరు గడి, సమాధానాలు
- 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు
- 2008 ఆగస్టు గడి, సమాధానాలు
- 2008 జూలై గడి, సమాధానాలు
- 2008 జూన్ గడి, సమాధానాలు
- 2008 మే గడి, సమాధానాలు
- 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
- 2008 మార్చి గడి, సమాధానాలు
- 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
- 2007 డిసెంబరు గడి, సమాధానాలు
- 2007 నవంబరు గడి, సమాధానాలు
- 2007 అక్టోబరు గడి, సమాధానాలు
- 2007 ఆగష్టు గడి, సమాధానాలు
- 2007 జూలై గడి, సమాధానాలు
- 2007 జూన్ గడి, సమాధానాలు
- 2007 మే గడి, సమాధానాలు
- 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
- 2007 మార్చి గడి, సమాధానాలు
అయ్యా, గడి లో దత్త పదులూ, సమస్యా పూరణలూ, పద్య పాదాలు కూడానా……
“మంచిపని చేసిన వాళ్ళకి హిందీ పుస్తకం ఇవ్వాలా?”
మీకే చెల్లు
29 అడ్డం కొప్పాక కాదండీ – ఏటికొప్పాక.
15 నిలువు – పూరిగుడిసైనా కత్తిలా ఉంటుంది :))
ఊదంగారూ, నెనర్లు. మీకిష్టమైన పద్యం కూడా ఉంది చూసారో లేదో!
రౌడీగారికి ఎప్పుడూ కత్తి మీదే దృష్టి 🙂 వేసంకాలం కదా, కొప్పాకలోని ఏరు ఎండిపోయింది!
LOL Kameswara Rao gaaru
ఎంతయినా రౌడీని కదా, కత్తులంటే ఇష్టం :))
కొప్పాక అని అనకాపల్లికి తాడికి మధ్యలో ఒక చిన్న ఊరు ఉంది. అక్కడేమీ తయారవ్వవు
నెట్ లో నాకొక సమస్య వచ్చింది. ఎవరైన తీర్చ గలరా…..
౧.గడి ని ప్రింట్ తీసుదుందామంటే రావడం లేదు.
౨. గడి ని కొంత వరకు నింపి దాచుకొని… తిరిగి నింపదామనుకుంటే గతంలో వచ్చినట్లు నేను నింపిన పదాలు కనబడడంలేదు. గడి అంతా ఖాళిగా వస్తున్నది
భాస్కరనాయుడు గారు,
మీరు గడి ప్రింట్ తీసుకోవాలంటే print screen చేసి సేవ్ చేసుకోవాలి. అలాగే మీరు గడి సగం పూర్తిచేసి పదాలు దాచుకోవాలంటే గడి పేజిలోనే చేసినంతవరకు దాచు అనే ఆప్షన్ ఉంటుంది చూడండి..
Eatikoppaka lo brhamdamga tayaru avutai
Etikoppakalo avutaayi – Koppaakalo kaadu kadaa :))
నిజంగానే ఈసారి గడి వెరైటీగా ఉంది.
41(అడ్డం) కీలకపదం తో సహా అన్నీ వచ్చేసాయి. ఒక్క 9 నిలువు తప్ప. దీనికి ఎవరైనా క్లూ ఇచ్చి ఆదుకోండి, ప్లీజ్ ..
శంకరయ్య గారూ,
8 అడ్డంలో “కంటే” బదులు “కన్నా” అని పెట్టుకోండి. తిరగబడ్డ 9 నిలువు వచ్చేస్తుంది :)) ఎంతయినా మన భారతీయులు కనిపెట్టింది కదా!
9 నిలువు గుఱించిన తెలివి నాకు శూన్యమండీ!
శంకరయ్యగారు, రాఘవగారు,
పొద్దుగడి కోసం స్లిప్పుల సర్వీసు ఉందిగా, అక్కడ ఎన్నో స్లిప్పులు…
http://jvalaboju.blogspot.com/
మలక్ పేట్ రౌడీ గారూ, రాఘవ గారూ, ధన్యవాదాలు. మీరిచ్చిన క్లూతో గడి పూర్తిచేసి పొద్దున్నే పొద్దుకు పంపించాను.
జ్యోతి గారూ, పై ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుందామని పొద్దు తెరిస్తే మీ వ్యాఖ్య ఇప్పుడే కనిపించింది. అలాంటి స్లిప్పుల సర్వీసు ఉన్నట్టు ఇప్పటిదాకా తెలియదు. అయితే ఆ బ్లాగులోకి వెళ్తే అక్షరాలు విడివిడిగా ముక్కలు ముక్కలైనట్లు కనిపిస్తున్నాయి. ఏమీ అర్థం కావటం లేదు.ఈ సమస్య నాకు మరికొన్ని బ్లాగులతో కూడ వస్తోంది. కొన్ని బ్లాగుల్లో అక్షరాలు సరిగానే కనిపిస్తున్నాయి. దయచేసి ఈ సమస్యకు ఏదైనా పరిష్కారాన్ని సూచించండి.
జ్యోతిగారూ, ఒకసారి చూసాక గడిని పూర్తిజేసి పంపించేదాక నేను ఆగలేకపోయానండీ. ఇప్పుడు నేను కేవలం ఉప్పందించటానికే వచ్చా 🙂
శంకరయ్య గారు మీ సమస్యను ఇక్కడ అడగండి. పరిష్కారం తప్పక లభిస్తుంది..
http://groups.google.com/group/telugublog?pli=1
మొన్న యదాలాపంగా గడి నింపదామని గడి కోసం చూస్తె ఒక కొత్తగడి ప్రత్యక్ష మైంది. ఈనెల రెండు గడులిచినట్టున్నారని దాన్ని ప్రింటు తీసుకొని కొన్ని గడులను పూరించాను. అందులో మొదటి గడి “తాపి ధర్మారావు” గురించి వున్నది. నిన్న ఆ గడి కోసం వెతికితే మరలా అది కనబడలేదు. దీని ఆంతర్యం ఏమిటో తెలిసిన వారు తెలుపగలరు.
భాస్కరనాయుడు గారూ,
తాపీ ధర్మారావు గడికి రెండుసార్లు వచ్చారు (జూన్ 2007, జూన్ 2008). మీరు చెప్పినదానిబట్టి చూస్తే మీరు చూసిన గడి జూన్ 2007 దనిపిస్తోంది.
త్రివిక్రమ్ గారు… నిజమేనండోయ్… ఆ గడి జూన్ ౨౦౦౭ నాటిది. ఏది నొక్కితే అది వచ్చిందో…. కాని కొత్త గదికున్న అన్నివివారాలు …..చివరి తెది మయ్ ౭ అని ఇలా అన్ని వున్నయ్. ఆయి పూయిన గడులను తొలిగిస్తే లేదా వాటి స్తానం మారిస్తే నా లాంటి వారికి వెసులుబాటుగా వుంటుంది.
మే గడి కి నాకు నాలిగింటికి సమాదానాలు రావాలి. వాటిలో వీటికి క్లూ ఇవ్వగలరా. ఇరవై న్ మరియు ఇరవై ఐదు అడ్డం … ౧౭ నిలువు.
భాస్కర నాయుడు గారూ,
నాలుగింటికి క్లూలు కావాలంటూ మూడింటి గురించే అడిగారేం? ఇరవై న్ అన్నారు. వైన్ అంటే అంతిష్టమా? ఇక క్లూలు ….
20(అడ్డం) – కవిత్రయ భారతంలో ఎర్రన ఈ పద్యంతోనే ఆంధ్రీకరణ ప్రారంభించాడని కొందరు పండితుల నమ్మకం. ఆ పద్యం ప్రారంభం లోని మొదటి ఆరక్షరాలు. నైట్స్ ఆఫ్ శరత్కాలం.
25(అడ్డం) – లోకం మొత్తానికి.
18(నిలువు) – విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆక్టర్ శ్రీనివాస రావు ఇంటి పేరుకు ప్లూరల్ మూడక్షరాలలో మధ్య అక్షరం 41(అడ్డం) కీలక పదానికి వలస వెళ్ళగా మిగిలిన రెండక్షరాలు.
ఓకేనా?
జ్యోతి గారూ,
రాఘవ గారిని గురించి మీరు చిన్న పొరపాటు పడ్డారు. వారు 9 నిలువును గురించిన తెలివి నాకు ‘శూన్య ‘మంటూ క్లూ ఇచ్చారు. మీరు నిజంగానే వారికి తెలియదనుకొని నాతో పాటు వారికీ స్లిప్పుల సర్వీసు గురించి చెప్పారు. పాపం! వారెంత హర్ట్ అయ్యారో?
శంకరయ్యగారు…
“వైన్” ఇచ్చింది ముద్రారాక్షసుడు. బలే కనిపెట్టారే. నేనూ.. గమనించాను. కాని పంపిన తర్వాత. వెనక్కి తీసుకొని సరిదిద్దదామంటే నాకు చేతకాలేదు. బహుశ వీలుపడదనుకుంటా. ఎందుకంటే ’కాలుజారిన తీయవచ్చుగాని.. మాట జారిన తర్వాత తీయ నగునా’
మీరిచ్చిన క్లూ లకు నెనర్లు. నేనడిగింది 18 కాదు 17 నిలువు. బహుశ తెలుగు అంకెలు మిమ్ములను మాయచేసినట్లున్నయి. (20) ౨౦ అడ్డం మీరన్నట్టు వచ్చెసింది. (25) ౨౫ అడ్డం అంతు బట్టడం లేదు. వెంటనే స్పురిస్తే ’దాన్ని’ క్లు అని ఎందుకంటారు? సమాదానాలు వచ్చినవనుకున్న వాటిలోకూడ కొన్ని సందేహాలున్నయి. సమయం వుంది…మీరు వున్నారు…చూద్దాం
I am not able to fill gadi in telugu. I almost finish gadi on the paper but
are not able to fill on the net and send. This happend last month also, after I saw march samadhanalu I just got 2 wrong answers. Than I thought I would send.as I mentioned above that I am not able to figure it out. Can somebody help me in this issue? If not this gadi I will try for next gadi.
Thanks
Mythri గారూ, మీరు ఫైర్ ఫాక్స్ లేదా గూగుల్ క్రోం లాంటి బ్రౌజర్లు వాడుతున్నట్లైతే మీరు టైప్ చేసిన అక్షరాలు నేరుగా తెలుగులో కనిపిస్తాయి. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వాడుతున్నట్లైతే తెలుగులో కనిపించనప్పటికీ మీరు అలాగే పంపవచ్చు. గడి నింపేటప్పుడు ఏ తెలుగు అక్షరానికి ఏ ఇంగ్లీషు అక్షరాలు టైప్ చెయ్యాలో lekhini.org లో కుడివైపున ఉన్న టేబుల్ చూసి తెలుసుకోవచ్చు. తదుపరి గడి ప్రకటించేవరకూ ఈనెల గడి నింపి పంపవచ్చు.
1 నిలువు (1 అడ్డం కూడా ) 2 నిలువు ,4 నిలువు
25 అడ్డం , 12 నిలువు ,41 అడ్డం వీటికి ఎవరైనా క్లూలు ఇవ్వరా ప్లీజ్
అన్నీ వచ్చేసినట్టే కనబడుతోంది గడి పంపించేశాను:)