మృతజీవులు – 19

– కొడవటిగంటి కుటుంబరావు

ఈ మాటకు చిచీకవ్ మండిపడ్డాడు. తనను గురించి ఎవరు ఏపాటి అలుసుగా గాని, మొరటుగాగాని మాట్లాడినా అతను సహించలేడు. అవతలివాడు ఘరానామనిషి అయితేతప్ప, తనతో స్వతంత్రంగా మాట్లాడటం కూడా అతనికి ఇష్టం లేదు. అందుచేత ఇప్పుడతనికి చాలా కోపం వచ్చింది.

“సరే పోనీ, ఏమైనా కుక్కలను కొనుక్కో. రెంటిని అమ్ముతాను. -వాటిని చూస్తే నీ రోమాలు నిక్కబొడుచుకోవలిసిందే నన్నమాట! మంచి మీసాలు; వాటి వంటి మీది బొచ్చు బ్రష్ అనుకోవాలిసిందే; వాటి పక్కటెముకలు పీపాలాగ వర్ణనాతీతం; వాటి పాదాలు మెత్తగా, పొంకంగా ఉంటాయి – అవి నడిస్తే నేలమీద గుర్తులు కూడా పడవు.”

“ప్రమాణపూర్తిగా నిన్ను ఉరితీసి ఉందును. నిన్ను అవమానించడానికని ఇంత కుండపగలేసి చెప్పడం లేదు, స్నేహితుడుగా మాత్రమే చెబుతున్నాను.” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

చిచీకవ్ గంభీరంగా “దేనికైనా హద్దుండాలి. నీ చమత్కారం ఈ విధంగా చూపదలిస్తే బారకాసుల్లో చూపడం మంచిది. వాళ్ళను ఊరికే ఇవ్వడం ఇష్టం లేకపోతే అమ్మవచ్చు” అన్నాడు.

“అమ్మటమా! నేను నీ సంగతి ఎరుగుదునే, నువ్వు లుచ్ఛావి. నువు నాకు ఎక్కువ ఇయ్యవు, నాకు తెలుసు”

“ఛీ, భలేవాడివే మొత్తానికి! వాళ్ళు నీకెందుకు పనికొస్తారు చెప్పు, వాళ్ళేమన్నా రత్నాలా ఏమన్నానా?”

“అదుగో చూశావా? ఆ మాట అంటావని నాకు ముందే తెలుసు!”

“ఇదేమిటోయ్ నీలో ఇంత పిసినిగొట్టుతనం ఉందా! నిజంబడితే నాకు వాళ్ళని ఊరికే ఇచ్చెయ్యాలి.”

“సరే అయితే విను. నేను పిసినిగొట్టును కానని రుజువు చెయ్యటానికిగాను వాళ్ళను యివ్వటానికి డబ్బుతీసుకోను. నా మగ గుర్రాన్ని కొనుక్కో, వాళ్ళను కొసరు కింద ఇచ్చేస్తాను.”

“చాలా బాగుంది, ఆ మగ గుర్రాన్ని ఏం చేసుకొనేది?” అన్నాడు చిచీకవ్, ఈ బేరం చూసి నివ్వెరపోతూ.

“ఏం చేసికుంటావా? దాన్ని నేను పదివేలిచ్చి కొన్నానని నీకు తెలుసుగా, దాన్ని నాలుగువేలకు అమ్ముతాను.”

“కాని దాన్ని ఏం చేసుకునేది? నేను గుర్రాలను ఉత్పత్తి చేసేవాణ్ణి కాదే!”

“కొంచెం ఆగు, నువు సరిగా గ్రహించటం లేదు; మూడువేలు రొక్కం ఇచ్చి మిగతాది తరవాత ఇయ్యి”

“కాని నాకు నీ గుర్రం అక్కర్లేదు, దాని కడుపు చల్లగుండ!”

“సరే గోధుమ రంగు ఆడగుర్రం తీసుకో.”

“నాకు ఆడగుర్రమూ వద్దు”

“దాన్నీ, బూడిదరంగు గుర్రాన్ని కలిపి రెండువేల కిస్తాను”

“నాకు గుర్రాలు అక్కర్లేదు”

“వాటిని అమ్ముకో. సంతలో పెట్టావంటే మూడింతలు ధర వస్తుంది”

“మూడింతలు వచ్చే పక్షంలో వాటిని నువే అమ్ముకోరాదూ?”

“నాకు లాభం వస్తుందని తెలుసు. నువు లాభం పొందాలని నా ఉద్దేశ్యం”

చిచీకవ్ అతనికి ధన్యవాదాలు తెలిపి, తనకు గోధుమ రంగు గుర్రంగాని, బూడిదరంగు గుర్రంగాని అవసరం లేదని ఖచ్చితంగా చెప్పేశాడు.

“సరే పోనీ, ఏమైనా కుక్కలను కొనుక్కో. రెంటిని అమ్ముతాను. -వాటిని చూస్తే నీ రోమాలు నిక్కబొడుచుకోవలిసిందే నన్నమాట! మంచి మీసాలు; వాటి వంటి మీది బొచ్చు బ్రష్ అనుకోవాలిసిందే; వాటి పక్కటెముకలు పీపాలాగ వర్ణనాతీతం; వాటి పాదాలు మెత్తగా, పొంకంగా ఉంటాయి – అవి నడిస్తే నేలమీద గుర్తులు కూడా పడవు.”

“కాని నాకు కుక్కలు దేనికి? నేను వేటగాణ్ణి కాను”

“నీ దగ్గర కుక్కలుంటే నాకు చాలా బాగుంటుంది. పోనీ నీకు కుక్కలు వద్దకపోతే, నా బేరన్ ఆర్గన్ కొనుక్కో. అది అద్భుతమైన ఆర్గన్. సత్యప్రమాణంగా చెబుతున్నాను, పదిహేను వందల రూబుళ్ళు పోసి కొన్నాను. తొమ్మిది వందలిచ్చేసి తీసుకో.”

“ఈ సంగీతపు తిత్తిని నేనేం చేసుకోను. జర్మను లాగా వీధులంట తిరుగుతూ అడుక్కునేదా?”

“ఇది జర్మనులు పట్టుకు తిరిగే బేరన్ ఆర్గను అనుకున్నావు కాబోలు. ఇది ఆర్గన్. దాన్ని సరిగ్గా చూడు. భేషయిన చెక్క. మరోసారి చూపిస్తాను రా!” అంటూ నజ్‌ద్ర్యోవ్ చిచీకవ్ జబ్బ పట్టుకుని పక్కగదిలోకి వెళ్ళాడు. బేరన్ ఆర్గన్‌ను తాను ఎరుగుదునంటున్నప్పటికీ అతనికి వెళ్ళక తప్పలేదు. ఆ పాట మళ్ళీ వినకా తప్పలేదు.

“దీన్ని కొనటం నీకిష్టం లేకపోతే, నీ బండి యిచ్చి, మూడు వందల రూబుళ్ళియ్యి, బేరన్ ఆర్గనుతోపాటు చచ్చినవాళ్ళందరినీ తీసుకుపో”

“ఇంకా నయం! తరవాత నాకు బండి ఎలా?”

“నీకింకో బండి ఇస్తాలే. బండి ఉండేచోటికి రా, చూపిస్తాను. కాస్త రంగు వేయించావంటే భలే బండి”

“ఛీ వీడికి సైతాను పూనింది!” అనుకున్నాడు చిచీకవ్. ఏమయినా సరే తనకు బళ్ళూ, బేరన్ ఆర్గన్లూ, కుక్కలూ, పీపాల్లాంటి పక్కటెముకలున్నా సరే, మెత్తని పొంకమైన కాళ్ళున్నవయినా సరే, అక్కర్లేదనడానికి తీర్మానించుకున్నాడు.

“నీకు బండీ, బేరన్ ఆర్గనూ, చచ్చినవాళ్ళూ, అన్నీ ఇచ్చేస్తున్నాను చూసుకో” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“నాకు అక్కర్లేదు” అన్నాడు చిచీకవ్ మళ్ళీ.

“ఎందుకు అక్కర్లేదూ?”

“అక్కర్లేదు గనకనే, అంతకంటే ఏమీ లేదు”

“భలేవాడివే మొత్తానికి! స్నేహపూర్వకంగా నీతో వ్యాపారం చెయ్యటానికి లేదన్నమాట… నువు నిజంగా… వట్టి దగాకోరువని నిన్ను చూసే తెలుసుకోవచ్చు!”

“నీ మొహం నాకెన్నడూ కనిపించకుండా ఉన్నట్టయితే బాగుండిపోయేది” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

వ్యవహారం ఇలా విక్జటించినప్పటికీ వారిద్దరూ రాత్రి భోజనం కలిసే చేశారు. అయితే ఈసారి తాగటానికి రకరకాల సారాలు లేవు. ఉన్న పైప్రస్ సారా ఒకటీ ఎంత పుల్లగా ఉండాలో అంత పుల్లగా ఉంది. భోజనం అయినాక నజ్‌ద్ర్యోవ్ చిచీకవ్‌ను ఒక పడకగదిలోకి తీసుకుపోయి, “ఇదిగో నీ పక్క, గుడ్‌నైట్ చెప్పను” అన్నాడు.

“నేను వెర్రిబాగుల వాణ్ణనుకుంటున్నావా ఏమిటి? నువ్వే ఆలోచించు, నాకు బొత్తిగా పనికిరానివాటిని నేనెందుకు కొనాలి?”

“నువ్వేమీ చెప్పనక్కర్లేదు. నీ సంగతంతా నాకు తెలుసు. నువు పరమనీచుడివి. నేనొకటి చెబుతాను చూడు. కావలిస్తే పేకముక్క పందెం వేసుకుందాం, ఒక్కముక్క మీద చచ్చిన కమతగాళ్లందరినీ పందెం కాస్తాను, బేరన్ ఆర్గన్ను కూడానూ.”

“పేకముక్క మీద పందెం కాయటమంటే సందిగ్ధంలో పెట్టటమేగా?” అన్నాడు చిచీకవు, నజ్‌ద్ర్యోవ్ చేతిలో ఉన్న పేకకేసి క్రీగంట చూస్తూ, పేకముక్కలకు ఏదో జరిగినట్టూ, వాటిమీద ఉండే చుక్కలు కూడా అనుమానాస్పదంగానే ఉన్నట్టూ అతనికి తోచింది.

“సందిగ్ధం దేనికీ? అటువంటిదేమీ లేదు. అదృష్టం నీ పక్షాన ఉంటే ఒడుచుకుంటావు. అంతే! ఎంత అదృష్టం! ఎంత అదృష్టం! అంతా నీదే!” అంటూ అతను ప్రోత్సహించ యత్నించాడు. “ఆ దిక్కుమాలిన తొమ్మిది ఉన్నదంతా పోగొట్టుకున్నాను! అది నన్ను ముంచేస్తుందని అప్పుడే అనుకున్నాను. కళ్ళు సగం మూసుకొని, నీ తాడుతెగ, నువు నన్ను ముంచేస్తావు. నన్ను ముజంచేస్తావేమో అనుకున్నాను.”

నజ్‌ద్ర్యోవ్ ఈవిధంగా మాట్లాడుతుండగా పర్ఫీరి ఒక సీసా తీసుకువచ్చాడు. అయితే చిచీకవు తాగటానికీ, పేకాడటానికీ కూడా బొత్తిగా నిరాకరించాడు.

“ఎందుకాడవూ?” అన్నాడు నజ్‌ద్ర్యోవు.

“నాకిష్టం లేదుగనకా! అసలు నాకు చీట్లాటంటే యెప్పుడూ అంత ఇష్టం లేదు.”

“ఎందుకు లేదూ?”

“లేదు గనకనే” అన్నాడు చిచీకవ్ భుజాలు నిర్లక్ష్యంగా ఎగరేసి.

“నువు చాలా అల్పుడివి”

“ఏం చెయ్యాలి? దేవుడు నన్నలా పుట్టించాడు.”

“నువు వట్టి వాజవు! మొదట్లో నిన్ను చూసి ఏమో పెద్దమనిషి వనుకున్నాను, కాని నీకు ప్రవర్తించటం ఏమీ తెలీదు. నీతో స్నేహంగా మాట్లాడటానికి వీల్లేదు… నీలో చిత్తశుద్ధి లేదు. నువు పచ్చి సబాకవిచ్‌వి, దుర్మార్గుడివి!”

“ఎందుకు నన్నలా తిడుతున్నావు? పేకాడకపోతే అది నా తప్పా? నీకు అల్ప విషయాలు కూడా గొంతు పట్టుకుంటాయి గనక ఆ చచ్చిపోయిన వాళ్ళను మటుకు నాకు అమ్ము”

“అమ్ముతాను, కనిపెట్టుకునుండు! ఇంకా నేను వాళ్ళను నీకు ఊరికే ఇచ్చేద్దామనుకున్నాను, కాని ఇప్పుడసలివ్వను! పెన్నిధులిచ్చినా ఇవ్వను. నువు జేబులు కొట్టేవాడివి, దొంగవు. ఇకనుంచీ నీకూ నాకూ సంబంధం లేదు. పర్ఫీరి, నువు పోయి మన గుర్రాలవాడితో ఇతని గుర్రాలకు గింజలు పెట్టవద్దని చెప్పు., వట్టి ఎండుగడ్డి వెయ్యమను.”

ఇలాటి పరిణామం జరుగుతుందని చిచీకవ్ కొంచెం కూడా అనుకోలేదు.

“నీ మొహం నాకెన్నడూ కనిపించకుండా ఉన్నట్టయితే బాగుండిపోయేది” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

వ్యవహారం ఇలా విక్జటించినప్పటికీ వారిద్దరూ రాత్రి భోజనం కలిసే చేశారు. అయితే ఈసారి తాగటానికి రకరకాల సారాలు లేవు. ఉన్న పైప్రస్ సారా ఒకటీ ఎంత పుల్లగా ఉండాలో అంత పుల్లగా ఉంది. భోజనం అయినాక నజ్‌ద్ర్యోవ్ చిచీకవ్‌ను ఒక పడకగదిలోకి తీసుకుపోయి, “ఇదిగో నీ పక్క, గుడ్‌నైట్ చెప్పను” అన్నాడు.

నజ్‌ద్ర్యోవ్ వెళ్ళిపోయాక చిచీకవ్ మనస్థితి చాలా కలత చెందింది. ఇక్కడికి వచ్చి కాలం వృథా చేసుకున్నందుకు తనను తాను తిట్టుకుని తనలో తాను చాలా అసంతృప్తి చెందాడు; కాని నజ్‌ద్ర్యోవ్‌తో తన పని చెప్పేసినందుకు తనను తాను మరింత తిట్టుకున్నాడు. తన వ్యవహారం లాంటిది చప్పున నజ్‌ద్ర్యోవ్‌కు తెలియనివ్వటం అమాయకత్వం, పిల్లలు చేసేపని… నజ్‌ద్ర్యోవ్ వట్టి పనికిమాలిన వెధవ, వాడు అబద్ధాలు సృష్టించగలడు. అతిశయోక్తులు చెప్పగలడు, ఎటువంటి కట్టుకథలైనా ప్రచారం చెయ్యగలడు. వాటి మూలాన లేనిపోని అపవాదులు బయలుదేరవచ్చు… ఏనీ బాగాలేదు, ఏమీ బాగాలేదు. “నేను వట్టి మూర్ఖుణ్ణి” అనుకున్నాడతను.

అతనికి సరిగా నిద్రపట్టలేదు. ఏవో చిన్నచిన్న పురుగులు అతన్ని తెల్లవార్లూ కుట్టుతూనే ఉన్నాయి. “సైతాను మిమ్మల్ని పట్టా! నజ్‌ద్ర్యోవ్‌ను పట్టా!” అని వాటిని తిడుతూ తెల్లవార్లూ అతను ఒళ్ళంతా బరుక్కుంటూనే ఉన్నాడు. అతడు తెల్లవారుఝామునే లేచి దుస్తులు వేసుకుంటూనే గుర్రలశాలకు పోయి సేలిఫాన్‌తో వెంటనే బండినీ గుర్రాలనూ సిద్ధం చెయ్యమన్నాడు. అతను తిరిగి వస్తూండగా నజ్‌ద్ర్యోవ్‌కు కనిపించాడు. అతను డ్రెసింగ్‌గౌను వేసుకుని పైపు నోట్లో పెట్టుకుని వున్నాడు.

నజ్‌ద్ర్యోవ్ అతన్ని స్నేహపూర్వకంగా పలకరించి రాత్రి సుఖంగా నిద్ర పట్టిందా అని అడిగాడు.

“ఒక మాదిరిగా” అన్నాడు చిచీకవ్ ఉదాసీనంగా.

“ఏమోయ్, నాకు మటుకు తెల్లవార్లూ ఎలాంటి పీడకలలు వచ్చాయంటే చెప్పటానిక్కూడా అసహ్యంగా ఉంది. నా నోట్లో ఒక సైనికుల శిబిరం ఉన్నట్టనిపించింది. ఏమనుకున్నావో, నన్ను చావబాదినట్టు కల వచ్చింది. ఒట్టూ! నమ్ముతావో నమ్మవోకాని, నన్ను కొట్టింది ఎవరో తెలుసా? కాప్టెన్ వత్స్యేలుయేవ్ కువ్షిన్నికోవ్.”

“అవును, నిన్ను నిజంగా చావబాదితే బాగుండేది”? అనుకున్నాడు చిచీకవ్.

“ఒట్టు! చాలా బాధపెట్టింది కూడాను! నిద్రలేచేసరికి తాడుతెగ, నిజంగానే ఏవో కుడుతున్నాయి. గోమార్లో ఏమో అనుకుంటాను. సరే నువుపోయి దుస్తులు వేసుకో, నేనిప్పుడే వస్తున్నాను. దొంగముండాకొడుకు నా మేనేజరును కాస్త సతాయించాలి”

ఒళ్ళు కడుక్కుని డ్రెస్సు వేసుకొనేటందుకు చిచీకవ్ తనగదికి వెళ్ళాడు. ఆ తరవాత అతను భోజనాల గదిలోకి వెళ్ళేసరికి టీ ఫలహారాలు బల్లమీద అన్ని ఏర్పాట్లూ ఒక రమ్ సీసాతో సహా సిద్ధంగా ఉన్నాయి. కిందటి రోజు మధ్యాహ్నమూ రాత్రీ జరిగిన భోజనాల ఎంగిళ్ళ జాడలింకా ఉన్నాయి, గది వూడ్చినట్టు కూడా లేదు. బల్లపైన పరిచిన గుడ్డమీద కూడా రొట్టె తుంపులూ పొగాకు నుసీ వున్నాయి. మరి కాస్సేపటికి యింటి యజమాని వచ్చాడు. అతను పైన వేసుకున్న డ్రెసింగు గౌను అడుగున వేరే దుస్తులేమీ లేవు. బయటికి కనిపించే రొమ్ము మీద గడ్డ లాంటిది పెరిగివున్నది. చేతిలో పైపు పట్టుకుని, టీ తాగుతూ వుండగా అతన్ని చూస్తే.. ఏ చిత్రకారుడైనా – చక్కగా దుస్తులు వేసుకుని నున్నగా తలదువ్వుకున్న మనుష్యులను ఏవగించుకునే రకం చిత్రకారుడు – బొమ్మ గీసి ఉండును.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.