మృతజీవులు – 13

చిచీకవ్ మొహమాటపడరాదని నిశ్చయించుకున్నట్టు అదివరకే తెలుసుకున్నాంగద, అందుచేత అతను టీ కప్పు తీసుకుని, అందులో ఇంటి కాపుసారా కొంచెం పోసుకుని ఈ విధంగా సంభాషణ సాగించాడు:

“మీ గ్రామం చాలా బాగుందమ్మా. ఇందులో ఎంతమంది ఉంటారు?”

“భగవంతుడి నిర్ణయాన్ని గురించి గునిసి లాభంలేదు… వాళ్ళను నా కిచ్చెయ్యండి, నస్తాస్య పెత్రోవ్న”.

“ఎవరినండి?”

“ఆ చచ్చిపోయిన వాళ్ళనే”

“ఎలా ఇచ్చేదీ?”

“అదెంతపనీ? పోనీ కావలిస్తే అమ్మండి. నేను డబ్బిచ్చుకుంటాను.”

“కొంచెం తక్కువగా ఎనభయ్యండి. కాని, రోజు లేమీ బాగా లేవు, ఏం చెప్పను? కిందటేడు కూడా పంటలు పాడయాయి” అన్నది ఇంటావిడ.

“కమతగాళ్ళు దృఢంగానే కనిపిస్తారు. వాళ్ళ ఇళ్ళు కూడా గట్టిగానే ఉన్నాయి. అన్నట్టు తమ పేరడగడం మరిచాను… రాత్రి అంత పొద్దు పోయి వచ్చి…”

“కరబోచ్క”.

“చాల సంతోషం. తమ సొంత పేరు? తండ్రి పేరు?”

“నస్తాస్య పెత్రోవ్న”

“నస్తాస్య పెత్రోవ్నా? చాల మంచి పేరు. మా పెద్దమ్మ, మా అమ్మ అక్క, పేరు నస్తాస్య పెత్రోవ్న”.

“మరి మీ పేరు? మీరు పన్నులు వసూలు చేసే అసిసరనుకుంటాను?”

“కాదండమ్మ. పన్నుల అసిసరు ఎంతమాత్రమూ కాదు, ఊరికే సొంతపని మీద తిరుగుతున్నాను”, అన్నాడు చిచీకవ్ మందహాసం చేస్తూ.

“అయితే మీరు వర్తకులన్నమాట! ఎంత పొరపాటయిందీ, నా దగ్గర ఉన్న తేనెను ఆ బేరగాడికి చౌకగా ఇచ్చేశాను. ఒకవేళ మీరు తీసుకుని ఉండేవారేమోనండీ”.

“మీ తేనె నేను కొని ఉండను.”

“అయితే ఏం కొనేవారు? నారా? కాని, మరి నా దగ్గర నార చాలా కొంచమే ఉంది; ముక్కాలు మణుగు కంటే ఉండదు.”

“నేను కొనేది మరోటండమ్మా! మీ వద్ద ఉండే కమతగాళ్ళెవరైనా చచ్చిపోయారా?”

ముసలావిడ నిట్టూర్చి, “పద్దెనిమిది మందండి! మంచివాళ్ళు; అందరూ పనిచేసేవాళ్ళే. ఈ మధ్య కొందరు పుట్టారు. కాని వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటీ? అంతా పిల్లకారు. మరి అసిసరు వచ్చి, మనిషికింత చొప్పున పన్ను కట్టమన్నాడు. ఒకవంక కమతగాళ్ళు చచ్చినా, వాళ్ళు బతికున్నట్టే పన్ను అచ్చుకోవాలి. కిందటివారం నా కమ్మరివాడు కాస్తా తగలబడిపోయాడు. మంచి తెలివిగలవాడు, తాళాలపనికూడా చేసేవాడు.”

“ఇళ్ళు కాలాయండీ?”

“దేవుడి దయవల్ల అది మాత్రం లేదండి. అది మరింత నష్టమై ఉండేది; అతను ఉట్టిపుణ్యానికే అంటుకున్నాడండి. తెగతాగేసరికి లోపల మంట ప్రారంభమైంది. అతని ఒంట్లో నుంచి నీలం రంగు మంట వచ్చింది. రగులుకుని రగులుకుని బొగ్గయిపోయాడు;అంతకంటె ఇంకేమీ చెప్పలేను. ఎంతో తెలివైన కమ్మరి. ఇప్పుడేమయిందీ? గుర్రాలకు లాడాలు వేసేవాళ్ళు లేరు, నేనెక్కడికీ కదలటానికి లేకుండా పోయింది.”

“అంతా విధి నిర్ణయమమ్మా!” అన్నాడు చిచీకవ్ నిట్టూర్చుతూ. “భగవంతుడి నిర్ణయాన్ని గురించి గునిసి లాభంలేదు… వాళ్ళను నా కిచ్చెయ్యండి, నస్తాస్య పెత్రోవ్న”.

“ఎవరినండి?”

“ఆ చచ్చిపోయిన వాళ్ళనే”

“ఎలా ఇచ్చేదీ?”

“అదెంతపనీ? పోనీ కావలిస్తే అమ్మండి. నేను డబ్బిచ్చుకుంటాను.”

“అదెలా? నాకు నిజంగా మీ రనేది అర్థం కావటం లేదు. వాళ్లను భూమిలోంచి తవ్వుకు పోవాలనుకోవటం లేదు గద?”

ముసలావిడ అయోమయంలో ఉన్నదని చిచీకవ్ గ్రహించి, తనకు కావలసిందేమిటో వివరించక తప్పదనుకున్నాడు. ఈ అమ్మకం కేవలం కాగితం పైన మాత్రమే జరుగుతుందనీ, వాళ్ళు బతికి ఉన్నవారి కింద పేర్కొనబడతారనీ అతను సంగ్రహంగా చెప్పాడు.

“మరి వాళ్ళు మీకెందుకు పనికివస్తారూ?” అని ఆవిడ అతనికేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది.

“అదంతా నా గొడవ”

“వాళ్ళు చచ్చారని మీకు తెలుసుగా”

“బతికున్నారని ఇప్పుడెవరన్నారూ? వాళ్ళు చచ్చిపోయారు గనకనేగా మీకు నష్టం కలిగిందీ? వాళ్లకు మీరు పన్నిచ్చుకుంటున్నారుగా? మీకా శ్రమా, ఖర్చూ లేకుండా చేస్తాను; తెలిసింది గాదూ? ఇదంతా చెయ్యటమే గాక, మీదుమిక్కిలి పదిహేను రూబుళ్ళు కూడా ఇచ్చుకుంటాను. ఇప్పుడు తెలిసిందిగా?”

ముసలావిడ సంకోచిస్తూ, “నాకు గొడవగా ఉంది. అసలు నేను చచ్చినవాళ్లను ఎన్నడూ అమ్మలేదు.”

“అవునుమరి. అసలు మీరు అమ్మితేమటుకు కొనేవాళ్ళెవరు? వాళ్ళవల్ల ఎలాటి ప్రయోజనం గాని ఉండవచ్చునని మీరుగాని అనుకోవటం లేదు గద?”

“లేదు; నేనలా అనుకోవటం లేదు. చచ్చిన వాళ్ళవల్ల ప్రయోజనమేమిటి? వాళ్ళు ఎందుకూ పనికిరారు. వాళ్ళు చచ్చిపోయారే అనే నా బాధ.”

“ఈవిడకు బుర్ర ఉన్నట్టు లేదు” అని తనలో అనుకుని, చిచీకవ్ పైకి, “చూడండమ్మా, మీరే న్యాయం ఆలోచించుకోండి. వాళ్ళు బతికి ఉన్నట్టే లెక్కగట్టి పన్నులిచ్చుకుని మీరు నష్టపోతున్నారా…” అన్నాడు.

“అయ్యొ బాబూ! చెప్పకండి, ఆ కిందటి వారమే అసిసరుకు బహుమానాలు గాక, నూటయాభై రూబుళ్ళిచ్చుకున్నాను.” అన్నది ముసలావిడ అతన్ని ముగించనివ్వకుండా.

“చూశారాండమ్మా! ఇక చూచుకోండి, మీరు అసిసరుకు బహుమానాలివ్వనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ పన్ను ఇక నేను కడతాను – మీరు కట్టరు. పన్నులన్నీ నేనే కట్టుకుంటాను. విక్రయం ఖర్చులు కూడా నేనే భరిస్తాను, తెలిసింది కదూ?”

ముసలావిడ ఆలోచించింది. ఈ వ్యవహారం లాభసాటిగానే ఉన్నట్టు కనిపిస్తున్నది, కాని అసాధారణంగానూ, అసహజంగానూ ఉండటం చేత కొనేమనిషి తనను ఎక్కడ మోసగిస్తాడోనని ఆమెకు చెడ్డ భయం పట్టుకున్నది. అతను ఎక్కడినుండి ఊడిపడ్డాడో కూడా తెలియదాయె, అపరాత్రి వేళ దిగాడు కూడాను.

“ఏమండమ్మా? ఏమిటిమరి? బేరం ఖరారేనా?” అని చిచీకవ్ అడిగాడు.

“చెడ్డ ఒట్టండీ, నేనెన్నడూ చచ్చినవాళ్ళను అమ్మి ఎరగను. ఆ కిందటేడు ఇద్దరు బతికున్నవాళ్ళను, ఆడపిల్లలను, ప్రటోపవన్ కు అమ్మిన మాట నిజమే. ఒక్కొక్కతెకూ నూరేసి రూబుళ్ళు తీసుకున్నాను. కొన్నవాడూ సంతోషించాడు. మంచి పనిమంతురాళ్ళూ, బల్లమీద పరచే నాప్కిన్లు కూడా నేయగలరు.”

“ఛీ! ఎలా చంపుకుతిన్నది, పాపిష్టి ముసలిముండ!” అనుకుంటూ, కాస్సేపు సేదతీర్చుకుని అతను తనపెట్టె తెరిచాడు.

“మరి ఇది బతికున్నవాళ్ళ వ్యవహారం కాదు, నాకు కావలసింది చచ్చినవాళ్ళు.”

“ఏమో ఇదంతా చూడగా నాకు నష్టం వచ్చేలాగుంది. ఒకవేళ మీరు నన్ను మోసగిస్తున్నరేమోనండి… వాళ్ళకింక ధర వస్తుందేమో.”

“చూడండమ్మా… మీరన్నదానిలో అర్థమేమన్నా ఉందాంట! వాళ్లకి ధరేమిటి? మట్టేగదండీ. వాళ్ళు మట్టి అయిపోయారు. తెలిసింది కాదూ? ఎంత పనికిమాలిన వస్తువన్నా తీసుకోండి, గుడ్డపీలికను తీసుకోండి – దానికి కూడా విలువ ఉన్నది, గుడ్డపీలికలు కొని వాటితో కాగితం తయారు చేస్తారు. కాని నేనడిగేది బొత్తిగా ఎందుకూ పనికిరానివి. మీరే చెప్పండి; వాటివల్ల ఏమిటి ఉపయోగం?”

“అందులో అబద్ధం ఏమీ లేదు. వాళ్ళు ఎందుకూ పనికిరారు. నేను సంకోచించే దెందుకంటే వాళ్ళు చచ్చిపోయారే అని.”

‘ఛీ, వట్టి కొయ్య బుర్ర’, అనుకున్నాడు చిచీకవ్, ఓర్పు లేకుండా పోతూ. ‘ఇటువంటి మనిషితో ఎలా సమాధానానికి రావటం? చిర్రెత్తించేస్తున్నదే పాడుముండ!’ అతని జేబులోంచి చేతిరుమాలు పైకిలాగి నుదుటిమీది చెమట అద్దుకున్నాడు. నిజానికి చిచీకవ్ కు కోపం రావటం లేదు; ఎంతేసి పెద్దమనుషులూ, రాజ్యవేత్తలూ కూడా బేరం దగ్గర కరబోచ్క లాగే ప్రవర్తిస్తారు. అయితే అతని బుర్రలోకి ఒక అభిప్రాయం ప్రవేశించాక, దానికి తిరుగు ఉండదు. మనం ఎంత సహేతుకమైన వాదనలు చేసినప్పటికీ, గోడకు తగిలిన రబ్బరు బంతుల్లాగా అతనికి దూరంగా పోతాయి.

చిచీకవ్ నుదురు తుడుచుకున్నాక ఆవిడను మరొక ధోరణిలో దారికి తెద్దామనుకున్నాడు.

“ఏమండమ్మా, మీరు నా మాటలు అర్థం చేసుకోకుండా ఉండటానికైనా ప్రయత్నిస్తున్నారు, లేదా ఏదో ఒకటి మాట్లాడాలని అయినా మాట్లాడుతున్నారు. మీకు పదిహేను రూబుళ్ళ నోట్లిస్తున్నాను – బోధపడిందా? అది డబ్బేగద. కావాలంటే రోడ్డుమీద దొరకదు గద. మీరు తేనెను ఎంతకు అమ్మారు చెప్పండి?”

“పూడ్ (మణుగు) పన్నెండు రూబుళ్ళు చేసి అమ్మాను.”

“పాపం మూటగట్టుకుంటున్నారండమ్మా, మీరు పన్నెండు రూబుళ్ళ ధరకు అమ్మలేదు.”

“ఒట్టు, అలాగే అమ్మాను”

“సరే చూడండి. అది ఒక వస్తువు -తేనె. మీరు దాన్ని ఒక ఏడాది పాటు ఎంతో శ్రమదమాలు పడి పోగు చేసి ఉండాలి, ఎన్నో తేనెటీగలను చంపి ఉండాలి, చలికాలమంతా వాటికి నేలమాగళిలో మీరే ఆహారం పెట్టి ఉండాలి. మరి చచ్చిపోయినవాళ్ళు ఈలోకానికి చెందినవాళ్ళు కూడా కారే. వాళ్ళ కోసం మీరేమీ శ్రమ పడలేదు, వాళ్ళను ఈ లోకం నుంచి తీసుకుపోయి మీకు నష్టం కలిగించాలని దేవుడు నిర్ణయించాడు. తేనె విషయంలో అంటే మీరు పడిన శ్రమకు ప్రతిఫలంగా పన్నెండు రూబుళ్ళు తీసుకున్నారు. కాని ఈ విషయంలో ఊరికినే, ఉట్టుడియంగా, పన్నెండు గాదు, పదిహేను రూబుళ్ళు వస్తున్నాయి, అవి కూడా వెండి కాదు, నీలం రంగు నోట్లు”

ఇంతా విడమర్చి చెప్పినాక ముసలావిడ తప్పకుండా సరేనంటుందని చిచీకవ్ అనుకున్నాడు.

“నేను అనుభవం లేని విధవరాలిని. తొందరపడడం మంచిది కాదు, బేరగాళ్ళు రాబోతారు, వాళ్ళ నడిగి ధరలు ఎలా ఉన్నదీ తెలుసుకుంటాను.”

“సిగ్గుచేటండమ్మా, సిగ్గుచేటు. మీరేమంటున్నారో కాస్త ఆలోచించండి. వాళ్ళను ఎవరు కొనబోతారు? ఎవరికిగాని వాళ్ళవల్ల ఏం ప్రయోజనం?”

“ఏమో, ఒకవేళ వాళ్ళతో కూడ ఏదన్నా పని ఉండవచ్చునేమో..” అంటూ ఆవిడ మధ్యలో ఆగి, దీనికి అతను ఏమనేస్తాడేమోనని భయపడుతూ, నోరుతెరుచుకుని అతనికేసి చూసింది.

“చచ్చినవాళ్ళతో పనా? ఇంకా నయం! మీ కూరమళ్ళలో దిష్టిబొమ్మలుగా పెట్టి పిచ్చికలను భయపెడదామనా ఏం?”

“ఓయి జగదీశ్వరా! మీవి ఎలాంటి అఘాయిత్యం మాటలు!” అన్నది ముసలావిడ తనమీద సిలువ వేసుకుంటూ.

“వాళ్ళతో మీకేం పని ఉండబోతోంది? కావలిస్తే వాళ్ళ అస్తికలూ గోరీలూ అన్నీ మీరే ఉంచుకోండి. మార్పిడి అంతా పత్రంలోనే ఏమంటారు మరి? ఏం చేద్దామని? అటోఇటో తేల్చండి.”

ముసలావిడ మళ్ళీ యోచించింది.

“మీ ఉద్దేశ్యం ఏమిటి, నస్తాస్య పెత్రోవ్న?”

“ఏం చెయ్యాలో నా కేంపాలు పోవటం లేదు. ఇదంతా ఎందుకు, నార అమ్మేస్తాను, కొనుక్కోండి”

“నారా! తస్సదియ్య, నేనింకోటి అడుగుతూంటే, నాకు నార అంటగట్టాలని చూస్తున్నారా? నార, నారే, మరొకసారి వచ్చినపుడు నార కూడా కొంటాను. ఇంతకూ ఏమంటారు, నస్తాస్య పెత్రోవ్న?”

“అయ్యయ్యో, ఇటువంటి విడ్డూరమైన అమ్మకం నేనెలా చేసేది!”

చిచీకవ్ ఓర్పు దీనితో పూర్తిగా అడుగంటిపోయింది. అతను కోపోద్రేకంతో కుర్చీని నేలకేసి కొట్టి, ఆవిడను సైతాను వాత పడమన్నాడు.

సైతాను పేరు వినేసరికి ముసలావిడకు ముచ్చెమటలు పోశాయి.
“అమ్మో వాడిపేరెత్తకండి, వాణ్ణి దేవుడు రక్షించ! ఆ కిందటి రాత్రల్లా నాకు కలలో సైతానే. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాక, అదృష్టం చూసుకుందామని పేకముక్కలు తీశాను; అందుకు శిక్షగా ఈశ్వరుడు వాణ్ణి పంపి ఉంటాడు. వాడు భయంకరంగా ఉన్నాడు; వాడి కొమ్ములు మా ఎద్దు కొమ్ములకన్న కూడా పొడుగున్నాయి.”

“ఇంకా నయం, డజన్ల కొద్దీ సైతానులు కనపడవలసింది; లేకపోతే ఏమిటి? పోనీ పాపం కదా అని మీకు సాయపడదామనుకున్నాను; పేదది దారిద్ర్యం అనుభవిస్తున్నదే అనుకున్నాను… మిమ్మల్నీ, మీ గ్రామాన్నీ మహమ్మారి ఎత్తుకుపోనీ, నాకేం?”

ముసలావిడ అతనికేసి బెదిరి చూస్తూ, “ఎంత ఘోరమైన మాటలంటున్నారు!” అన్నది.

“ఏం చెయ్యను; మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియటం లేదు. మీ ధోరణి చూడబోతే – నీచంగా పోల్చాననుకోకండి – గడ్డిమేటులో కుక్కవంతుగా ఉన్నది. అది తినదు, ఇంకొకరిని తిననివ్వదు! మీ దగ్గర ఎన్నో సరుకులు కొందామనుకున్నాను. అందుకంటే, నాకు సర్కారు కంట్రాక్టులున్నాయి…”

ఇది అతను యధాలాపంగా, నిరుద్దేశ్యంగా ఆడిన అబద్ధమే అయినా, అద్భుతంగా పనిచేసింది. సర్కారు కంట్రాక్టులనేది నస్తాస్య పెత్రోవ్నను మంత్రం లాగ ఆకట్టింది. ఆవిడ ఇంచుమించు బతిమాలే దానిలాగా, “మీరెందుకలా ఆగ్రహించుకుంటున్నారు. మీది ఇంత కోపిష్టి స్వభావమని ముందే తెలిస్తే మీకసలు ఎదురే చెప్పకపోదును”, అన్నది.

“కోపం కూడా ఎందుకు? ఈ బేరమంతా కలిసి ఒక మురిగిపోయిన కోడిగుడ్డు విలువ చెయ్యదు, ఈ భాగ్యానికి కోపం కూడానా ?”

“సరే అలా అయితే పదిహేను రూబుళ్ళ నోట్లకు వాళ్ళను మీకు అమ్మేస్తాను! అయితే ఒకటి, మీరు ఆ కంట్రాక్టులన్నారే, నావద్ద ధాన్యం గాని, పిండిగాని, మాంసంగాని కొనేప్పుడు నన్ను మోసగించకండి బాబూ”.

“ఎందుకు మోసగించుతానండమ్మా? ఎన్నడూ చెయ్యను.”, అంటూ అతను తన మొహాన దిగగారే చెమటను తుడుచుకున్నాడు. అమ్మకం వ్యవహారం పరిష్కారం చెయ్యటానికీ, ఇతర విషయాలు చూడటానికీ బస్తీలో ఆమెకు తెలిసిన లాయరుగాని, ఆమె తరపున వకాలతా పొందదగిన మిత్రుడుగాని ఉన్నాడా అని అడిగాడు.

“దానికేం భాగ్యం! పెద్ద ప్రీస్టు ఫాదర్ కిరిల్ కొడుకు కోర్టు గుమాస్తాయేగా!” అన్నది ముసలావిడ. అయితే అతనికి వకాలతా ఇస్తూ ఒక ఉత్తరం రాసివ్వమని చిచీకవ్ అడిగి, పని తెమలటానికి గాను తానే రాసిపెడతానన్నాడు.

ఈలోపల ముసలావిడ తనలో, “ఇతను సర్కారు తరపున నా దగ్గర ఉండే పిండీ, పశువులూ తీసుకుంటే బాగుణ్ణు, ఇతన్ని ఎలాగయినా మంచి చేసుకోవాలి. నిన్నటి బాపతు మిగిలిపోయిన తడిపిండి ఉన్నది. నేనువెళ్ళి ఫితీన్యతో అట్లు వెయ్యమని చెబుతాను. గుడ్లతో మడత అట్లు వేయమంటే బాగుంటుంది. మావాళ్ళు వాటిని బాగా చేస్తారు;దబ్బున అవుతాయి కూడాను” అనుకున్నది.

ఈ పనులన్నీ చేయించటానికీ, వీలయితే ఇంకా ఇతర వంటకాలు కూడా జత చేయించటానికీ ఆవిడ లేచి వెళ్ళిపోయింది. ఈలోపల తనపెట్టెలోనుంచి అవసరమైన కాగితాలు తీసుకునేటందుకు చిచీకవ్ తాను కిందటి రాత్రి నిద్రపోయిన డ్రాయింగ్ రూములోకి వెళ్ళాడు. ఈ గది అదివరకే తుడిచి శుభ్రం చేసి ఉన్నది. ఈకల పరుపులన్నీ అవతలకు వెళ్ళిపోయాయి. సోఫాకు ఎదురుగా బల్లమీద భోజనపు ఏర్పాట్లు చేసీ ఉన్నాయి. అతను తన పెట్టెను ఎత్తి ఆ బల్లమీద పెట్టి కాస్సేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకంటే, నదిలో మునిగినట్టుగా అతని ఒళ్ళంతా చెమట ప్రవాహాలే; అతని షర్టు మొదలుకొని కాలి తొడుగులదాకా ఒంటిమీది బట్టలన్నీ తడిసి ముద్ద అయాయి.

“ఛీ! ఎలా చంపుకుతిన్నది, పాపిష్టి ముసలిముండ!” అనుకుంటూ, కాస్సేపు సేదతీర్చుకుని అతను తనపెట్టె తెరిచాడు.

ఈపెట్టె వైనం గురించీ, దీని లోపలి పంపిణీ గురించీ కొందరు పాఠకులు తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారని కథకుడికి గట్టి నమ్మకం. అలాగే వారినెందుకు తృప్తిపరచగూడదూ?

-కొడవటిగంటి కుటుంబరావు

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.