-కొత్త ఝాన్సీలక్ష్మి
. |
ఓ ఊహ నిజమైతే..
మౌనరాగాలు
మధురగానాలు
ఆహ్లాదభరితాలు
ఆమని సంకేతాలు
విరిసిన పారిజాతాలు
అమృతాభిషేకాల ఆనందవర్ధనాలు
ఓ నిజం తారుమారైతే..
ఈ మౌనరూపాలు
మనసంతా గాయాలు
శోకసంతప్తాలు సంవేదనాభరితాలు
చిట్లిన నరాలు
పెట్లిన గాజుపలకలు
గుండె గుబుళ్లు
బ్రతుకు నెగళ్లు
ఎగసిన గాలికి సాగే
రాలిన ఆకుల వలయాలు
అవినీతి అక్షయ తూణీరాలకు
వసివాడిన జీవన ప్రసూనాలు
ఓ ఊహాతీతం ఎదురైతే..
అంబర చుంబిత
ఆనంద పరవశ
దివిజ గంగా మందహాసం
పరిమళ సురభిళ గళం
ఆ ప్రణవనాదం
ఓ ప్రణయవేదం
విచలిత కాంతిపుంజం
విదళిత క్రాంత దర్శనం
సంభ్రమాశ్చర్య సంజనిత
వ్యక్తావ్యక్త విభ్రమం
|
—-
కొత్త ఝాన్సీలక్ష్మి గారు తన గురించి తాను ఇలా అంటున్నారు: “సామాన్య గృహిణిగా కాలం గడిచిపోయింది. ఒడిదుడుకుల జీవన పయనంలో ప్రశాంత తీరాల్ని వెతుక్కుంటున్న బాటసారిని. ఎపుడో వూహ తలుపు తట్టినపుడు ఈ కలం కాగితాన్ని పరామర్శిస్తుంది. సంగీత సాహిత్యాలంటే మక్కువ. మంచి పుస్తకం చదవాలనేది నా కోరిక.”
About కొత్త ఝాన్సీ
కొత్త ఝాన్సీలక్ష్మి గారు తన గురించి తాను ఇలా అంటున్నారు: “సామాన్య గృహిణిగా కాలం గడిచిపోయింది. ఒడిదుడుకుల జీవన పయనంలో ప్రశాంత తీరాల్ని వెతుక్కుంటున్న బాటసారిని. ఎపుడో వూహ తలుపు తట్టినపుడు ఈ కలం కాగితాన్ని పరామర్శిస్తుంది. సంగీత సాహిత్యాలంటే మక్కువ. మంచి పుస్తకం చదవాలనేది నా కోరిక.”
కవిత చాలా బాగుందండి.ఊహాతీతం లో కూడా రెండు కోణాలు చెప్పాల్సింది. ఊహకు అతీతం గా మంచి జరిగితే ఎలావుంటుందో చెప్పారు.చెడు జరిగితే ఎలా వుంటుందో కూడా చెప్పుంటే బాగుండేది.ఇంతకీ ఇంత ఎందుకు చెపుతున్నానంటే కవిత ఇంకాస్త చదవాలనిపించిందండి.:)
రాధికా,
మీరు అడిగింది కూడా పై కవితలో ఉంది. మరొక్కసారి చూడండి.
“ఓ నిజం తారుమారైతే..
ఈ మౌనరూపాలు
మనసంతా గాయాలు
శోకసంతప్తాలు సంవేదనాభరితాలు
చిట్లిన నరాలు
పెట్లిన గాజుపలకలు
గుండె గుబుళ్లు
బ్రతుకు నెగళ్లు….”
చాలా బాగుంది. మీ కలం నించి మరిన్ని కవితలు జాలువారాలి
థాంక్స్ స్వాతిగారూ.
mee kavitha chala bhgundandi
రాధిక గారికి,
కవిత మీకు నచ్చినందుకు సంతోషమండీ. మీకవిత్వం కూడ చాల బాగుంటుంది.మీరు చెప్పినట్లు ఊహాతీతం మరోలాఉంటే బాగుంటుందని అన్నారు.అప్పుడు మాటలు రాక మౌనమే శరణ్యం ఔతుందేమో
తెరిసా గారికి
కవిత గురించి మీ అభిప్రాయానికీ అభిలాషకూ ధన్యవాదాలు.నా పాట లో పొరపాటు దొర్లిందితెలియ చెప్పినందుకు నమస్కారములు
kalhra gaaruu many many thanks
ఔను ఝాంసీ లక్ష్మి గారూ , కొన్ని సందర్భా్ ల్లో మౌన మే శరణ్యం. నిజమే. అదే ఈ పద్యంలో బ్యూటీ. సిద్ధి లభించినప్పుడు మౌనం .. ఊహ నిజమైతే .. మౌన రాగం .. నిజం తారుమారైతే .. చివరకి చేతి గాజులు కూడా చిట్లుతూ తమ అసమ్మతిని తెలియజేస్తాయి .. అదే విప్లవం. పద్యం చాలా బావుంది. సాధారణంగా పట్టుకోవటానికి చేతికి దొరకని కొన్ని అనుభవాల్ని అలవోకగా మీ పదచిత్రాల్లో పట్టుకుంటారు.
Kavitha chaala baagundi.