అక్టోబరు గడి – వివరణలు:
అక్టోబరు గడికి సమాధానాలు పంపినవారు:
ఒక తప్పుతో: భైరవభట్ల కామేశ్వరరావు, కొత్తపాళీ, శ్రీరామ్.
నాలుగు తప్పులతో: జిజ్ఞాసి.
అందరికీ అభినందనలు!
సంపాదకీయంలో పేర్కొన్నట్లే ఈ నెల (నవంబర్) గడికి గడువు (భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 7వ తేదీ రాత్రి 12 గంటలు) లోపల సరైన సమాధానాలు పంపిన వారిలో ఒకరికి 500 రూపాయలు విలువచేసే పుస్తకం ఒకటి AVKF ద్వారా పంపిస్తాం. ఒకరికంటే ఎక్కువమంది సరైన సమాధానాలు పంపినట్లైతే బహుతి విజేతను లాటరీ ద్వారా నిర్ణయిస్తాం. పొద్దు పత్రిక నిర్వాహకులు, గడి కూర్పరి, వారి కుటుంబసభ్యులు బహుమతికి పరిగణించబడరు.
బహుమతి విజేత పుస్తకాన్ని అందుకున్న నాటినుంచి నెలరోజుల లోపల ఆ పుస్తకంపై సమీక్షరాసి పొద్దుకు పంపవలసి ఉంటుంది.
1 స |
* |
2 వా |
3 తా |
4 పి |
గ |
ణ |
5 ప |
తిం |
6 భ |
7జే |
హం |
ర |
* |
8 త |
గు |
నా |
* |
* |
తం |
* |
9 జ |
గం |
* |
9 స్వ |
రం |
* |
* |
10 క |
న |
11 కాం |
గి |
* |
12 న |
ట |
13 న |
తి |
* |
14 ళం |
* |
పా |
* |
చ |
* |
15 క |
* |
* |
డు |
* |
16 చిం |
తా |
17 మ |
ణి |
* |
నం |
* |
18 న |
19 గు |
20 మో |
ము |
21 కో |
తా |
* |
ణి |
* |
22 ఆ |
* |
23 ఏ |
క |
వీ |
ర |
* |
24 పా |
కు |
* |
25 ప్ర |
26 వ |
రు |
27 డా |
* |
న |
* |
* |
28 చూ |
లు |
* |
* |
29 వా |
డ |
గా |
లి |
* |
రు |
* |
* |
పు |
* |
30 హిం |
31 దో |
ళం |
* |
లం |
* |
32 గా |
చి |
33 న |
34 పా |
లు |
35 వ |
స |
బూ |
* |
* |
* |
36 అ |
ను |
రా |
గ |
ము |
* |
రా |
* |
37 చు |
బు |
38 కం |
* |
40 ద |
గా |
* |
* |
* |
41 ఆ |
ళి |
* |
లు |
* |
42 చి |
వ |
ర |
కు |
మి |
గి |
లే |
ది |
2 జీర్ణమంత్రం మూకదొరా దండాలయ్యా (3+4+3) – వాతాపి గణపతిం భజేహం (వాతాపి జీర్ణం అనే జీర్ణ మంత్రమున్నది కదా)
8 రాముడు-భీముడు లో మామగారితో రేలంగి వేడికోలు సరసం (3) (తగునా) తగునా ఇది మామా పాట నుంచి
9 ఒక్కరిటు జరిగినా చాలు అందరికీ చాలేంత చోటు (2) జరగం లోంచి ర జరిగితే మిగిలేది జగమే కదా?
10 భాషకి అక్షరమెంతో, పాటకి ఇదీ అంతే (2) – స్వరం
11 శుద్దసావేరి తల్లి బంగారు (4) – శుద్ధ సావేరి, కనకాంగి రాగానికి జన్యం
13 ఎటుచూసినా ఒకటేనట. నమ్మింపజూసేది వాస్తవం కాదట (౩) (నటన )
17 అంత చింతలేల విదుషీమణీ అంతా నాటకమేనని మాకెరికేలే – (4) చింతామణి నాటకం
19 చిర్నవ్వుల కోదండపాణి ముఖారవింద దర్శనం కోసం ఆభేరికెంత ఆరాటమో (4) నగుమోము కనలేని నా జాలి తెలిసి అనే ఆభేరిలో త్యాగరాజ కృతి
22 ప్రగల్భాలు పలికేవాళ్ళూ, ప్రభుత్వమూ కూడా చేసేదిదేనా? (2) కోత
24 విశ్వనాధవారితో ఇదే చిక్కు – కథలో ఇద్దరు వీరులు, పేరు మాత్రం… (4) (ఏకవీర)
25 మొదల్లేని వేపాకు (2) పాకు
26 ఊరికే పంతాలకిపోయుండకపోతే స్వారోచిషమనువుకి తాతయ్యుండవలిసినవాడే కదా? మీరేమంటారు? (4) (ప్రవరుడా)
30 అచ్చతెనుగులో మలయమారుతం (4) (వాడగాలి) – వాడగాలంటే మలయమారుతం
31 మనసులోగుట్టుతెలుసుకోడానికి త్యాగయ్య రిషభాన్నెందుకు పరిత్యజించడం? (3) (హిందోళం) – హిందోళంలో రిషభముండదని శంకరాభరణం సినిమా చూసినవాళ్లందరికీ తెలిసిందే, హిందోళంలో మనసులోని మర్మము తెలుసుకో అనే త్యాగరాజ కృతొకటి ఉంది.
33 ఈనగాచి నక్కలపాలు చేస్తే ఈ జంబుకాలెలా కనిపిస్తాయి? (5) (గాచినపాలు) ఈనగాచినక్కలపాలు లోంచి, నక్కలు పోతే మిగిలింది గాచినపాలే కదా?
36 వాగ్ధాటి కోసం వస పోస్తే బూకరించి ఊరుకుంది (3) (వసబూ)
37 ఎన్ని రాగాలు నేర్చినా, ఈ రాగం ఒంటపట్టకపోతే జ్ఞానోదయం కాదని త్యాగరాజ ఉవాచ, ఒకటి నిలువు సాక్షిగా(5) (అనురాగము), అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు అని సరస్వతి రాగంలో త్యాగరాజ కృతినాధారంగా.
38 బతిమాలడానికి ప్రియుడికైతే గడ్డం పట్టుకోవాలి, మరి ప్రియురాలికైతే?(3) (చుబుకం)
40 ఈ సోదరుల కోసమే జగన్నాధ రధచక్రాలని భూమార్గం పట్టించడం (2) (దగా)
42 బుచ్చీ, ఆఖరుకేంబాపుకొన్నావయ్యా బాబూ?(4+4) (చివరకు మిగిలేది)
1 పురాణాల్లో ఈమె బ్రహ్మ మానసపుత్రిక కావొచ్చుగాని, సంగీతంలో మట్టుకు బృహస్పతి కుమార్తె (4) (సరస్వతి) – కర్ణాట సంగీతంలో సరస్వతి రాగం వాచస్పతి రాగానికి జన్యం, వాచస్పతి అంటే బృహస్పతి.
2 కీలు తెలిస్తేగాని ఇది పెట్టడం సాధ్యంకాదు మరి (2) (వాత) – కీలెరిగి వాత పెట్టాలి కదా?
3 ఇలాంటి దురలవాటును మధ్యలో ఆపేసినా మంచిదే (2) (తాగు), తాగుడు ని మధ్యలో ఆపేస్తే తాగు వస్తుంది కదా?
4 ఈ శూలపాణి వృత్తి రీత్యా వైద్యడైనప్పటికీ, ఆంధ్రదేశంలో పేరెన్నికగన్న సంగీత శాస్త్ర కళానిధి (5) (పినాకపాణి) – పినాకపాణిగారు సంగీత శాస్త్రంలో పేరెన్నిక గన్న గొప్ప లక్ష్య లక్షణవేత్త, నేదునూరి, నూకల చిన సత్యనారాయణ, బాలమురళి వంటి వారికి గురువు, కాని వృత్తి రీత్యా ఈయన వైద్యుడు.
5 ఆకసాన విహరించేది తోకముడిచింది (3) (పతంగి) – పతంగిక లో క పోయింది కదా మరి.
6 ఇదికూడా మన సంగీతంలో ఒక సంప్రదాయమే (3) (భజన)
7 దీని మోత వినబడితే ప్రసాదానికి పిలుపొచ్చినట్టే. (3) (జేగంట)
12 చూడగా ఇది కాంతల కంటికింపు గొలిపేది (3) (కాంచనం)
14 ప్రేమలో పడ్డానికి ఈ రెండూ ఉంటే చాలు: గుప్పెడంత హృదయమూ, పిడికలంత … (3) (నడుము)
15 పాటలో లయ చెదిరి, ఇది కూడా తిరగబడ్డట్టుంది (2) (తాళం)
16 ముప్పైఆరు నిలువు విషాదరాగమా, అంచాత సయించదుటే, చూడగా బోతే అచ్చంగా విరుద్దం (4,3) (కనకన రుచిరా) (కనకన్+అరుచి అని విడగొట్టితే వచ్చిన తిప్పలు మరి, ఇది వరాళి రాగంలో త్యాగరాజ కృతి, పంచరత్నాలలో ఒకటి)
17 గోపన్న పుణ్యమా అని, సీతమ్మవారికి మిగిలిన ఆభరణమిదొక్కటే (3) (చింతాకు) (సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా అని రామదాసు ఎకౌంటు పుస్తకాలు ఒప్పచెప్పాడు కదా మరి)
18 రతనాల వీణదండె, తిలక్ రాసిన ఓ కథపేరు (5) (మణిప్రవాళం) (ప్రవాళం అంటే వీణదండె)
20 గర్వం ఎక్కువై నీల్గితే ఇలాగే తలక్రిందులౌతారు (2) (వీగు)
21కాడిబరువు మోసేది: కొలిస్తే మూర, తలిస్తే? (2) (మోర)
22 కోవాపాలు లో ఇమిడింది తియ్యదనంకాదు (3) (కోపాలు)
23 జనులు నాలుక్కాలాల పాటు చల్లగా ఉండాలంటే, రైతన్న మరో రెండుకాలాలు ఎక్కువే శ్రమపడాలి… (4) (ఆరుగాలం)
27 ఎండాకాలంలో ఇది తింటే ఒ.కె, కాని తగిల్తేనే కష్టం (2) (వడ)
28 హల్లో, బార్బరా స్ట్రైసాండ్ పెళ్లిల్ల పేరయ్యగా నటించిన హాలివుడ్ సంగీతరూపకం పేరేమిటండీ? (2) (డాలి), హల్లో డాలి అనే హాలివుడ్ సినిమా ఆధారంగా.
29 ఇవి కలవకపోతే ప్రేమ పుట్టదు, ఇవి జరగకపోతే పెళ్ళి కుదరదు (3) (చూపులు)
31 ఎంత సింహమైనా అనవసరంగా దీనికి పాల్పడదు కదా? (2) (హింస)
32 ఇదేం చిత్రం – ఒక్కడైతే పిల్లలని ఎత్తుకు పోతాడట, మరి ఇద్దరుంటే మాత్రం పిల్లలాడుకొనే ఆట (4) (దోబూచులు)
33 నూనే తీసే యంత్రంలో పత్రం పడ్డది.. (4) (గానుగాకు)
34 మగడు ఆభరణమొకటివ్వగ, ముదిత మెల్లగ నవ్వగ (2) (నగ)
35 ఇది కూడా శంకరాభరణమే (2) (పాము)
36 పెళ్ళికొడుకుల బృందం పాడేదీ విషాద రాగంట (3) (వరాళి)
37 ఈ అమృతాన్ని పెదవులతో తేలిగ్గా గ్రోలండి (3) (అదర) – అధరంలో ఒత్తు పీకేస్తే మరి తేలికైనట్టేకదా?
39 చెప్పుకొన్న కథలన్ని చేరుకొనే చోటు (2) (కంచి)
41 ఆఖరిగడికాధారం మొదటిదే (2) (ఆది) (నిలువు 1 ఆధారం ఒక నది పేరును సూచిస్తున్నందున ‘నది’ని కూడా సరైన సమాధానంగానే పరిగణించాం.)
15 అడ్డం ఆధారం తప్పుదోవ పట్టిస్తోందనిపిస్తోంది. ఆధారం కూడా సరిగా కుదరలేదని అనిపిస్తోంది.
41 నిలువుకి శ్రీరాం పంపిన నది అనే సమాధానం కూడా సరైనదే (సరస్వతి నది కూడా కదా). కాబట్టి, ఆయన ఆల్ కరెక్టుగా పంపినట్టే లెక్క.
8 అడ్డం – రాముడు భీముడు అన్న కొత్తపాళీగారి సవరణ కూడా, ఇద్దరు మిత్రులు తప్పు.
సంపాదకులు సమాధానాలలో ఈ సవరణలు చెయ్య మనవి.
–సిముర్గ్
సిముర్గ్: “41 నిలువుకి శ్రీరాం పంపిన నది అనే సమాధానం కూడా సరైనదే ”
సమాధానాలు సరిచూసేటప్పుడు 41 నిలువుకి “నది”ని సరైనదిగానే పరిగణించాం. కానీ శ్రీరామ్ పూరణలో 5 నిలువు తప్పు.
8 అడ్డం సవరించాం.