ఆగండి! ఈ ఆవరణలో జాగ్రత్తగా అడుగులు వేయండి.
భళ్ళుమని మృత్యు ఘోషలన్నీ అసరిగమల్తో మీ మీద దాడి చేస్తాయి.
ఎవరెవరో ఈ గోడల్లోంచి గుండెలు బాదుకుంటున్నారు.
ముక్కు మూసుకోండి. ఈ తెల్లని గోడల్లోంచి చావు కంపు కొడుతోంది.
డాక్టర్లు చావు కబుర్లని మెళ్ళో వేసుకుని అటూ ఇటూ పరిగెడుతున్నారు.
యిటు జరగండి.
స్ట్రెచర్లోంచి యెవరో బిగ్గరగా అరుస్తూ చేతులు చాస్తున్నారు.
సెలైన్ బాటిల్లోంచి రాలే వొక్కో బొట్టూ
చావు లోకాలకి ఒక్కో మెట్టూ కడుతోంది.
రిసెప్షన్ లో క్యాష్ కౌంటర్ రాకాసి నాలుకల్ని చాస్తోంది.
పరుపులపై పరచిన దుప్పట్ల మీద జీవితాలు
మరకలుగా మారుతున్నాయ్.
మీరు యేమీ అడక్కండి.
కన్సల్టెంట్ డాక్టర్ ఖర్మ యోగం అప్పచెబుతాడు.మీరు మాట్లాడరాదంటాడు.
రౌండ్స్ కొచ్చిన ప్రతీ ట్రెయినీ డాక్టరూ పెదవి విరుస్తున్నాడు.
నర్సులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడల్లా నవ్వుల్ని అతికించుకుంటున్నారు.
కౌంటర్లో నిలబెట్టి ఒంట్లోని ఒక్కో కండనీ కోసి బిల్లులుగా చెల్లేసి ముఖాన కొడుతున్నారు.
పడక మంచాలన్నీ పాడెలాగ మూల్గుతున్నాయ్ .
ఇక్కడ దీనులు మూకుమ్మడిగా దాడి చేసే అపనమ్మకాల్ని కన్నీటి ఆసిడ్లతో కడిగేసికుంటున్నారు.
ఆర్తనాదాలనన్నిటినీ కడుపులో దిగమింగుకుంటున్నారు..
పరామర్శకుల హృదయాలు బిక్కుమంటో నరాల్ని దారాలుగా ముడేసుకుంటున్నాయి.
పంటి బిగువున గట్టిగా బిగపట్టిన ఆనవాళ్లు యేవో అలలు అలలుగా తేలుతున్నాయ్.
యిప్పుడు ప్రార్థన చేయండి.
యిక్కడ మనిషికీ నమ్మకానికీ యెప్పుడూ యుద్దమే !
మహ్మదూ-యేసూ-రాముడూ-
మెయిన్ గేటు దగ్గిరే ఆగిపోయారు.
పిలవరేం!
అప్పుడప్పుడూ పరామర్శలు కొన్ని క్షణాల్ని బ్రతికిస్తున్నాయ్ .
అయ్యో! యేం చేస్తున్నారేం! ?
యెవరినీ కదపకండి.
యిక్కడి దుఖమంతా లుంగలు చుట్టుకుని
మీ నరాల్లోకి ఎగబాకి మీ నిద్రారాత్రులన్నీ అల్లకల్లోలమవుతాయ్.
వుండండి! ఎఱ్ఱబల్బు వెలిగింది.
హుష్ ! సైలెన్స్
. . .
. . .
స్కానింగ్ అయిపోయింది .
సారీ గుండె ఆగిపోయింది.
బిల్లులు కట్టండి.
బిచాణా ఎత్తేయండి.
పేషెంట్….నెక్స్ట్!
కవి స్వపరిచయం: వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా ఆయన అక్షరాలు తిలక్కి కనబడితే – నాకు మాత్రం తెలుగు అక్షరాల వెంబడి పరుగులు తీయటం ఎంతో ఇష్టం. పట్టా తీసుకుంది ఇంజనీరింగ్ లో(’99).ప్రస్తుత ఉద్యోగం ADE (APGENCO). ఇష్టంగా చదివేది సాహిత్యం. సంతృప్తిగా రాసుకునేది కవిత్వం ( http://sridharchandupatla.blogspot.com/). నిజాల కోసం చరిత్రని (http://theuntoldhistory.blogspot.com/) వెతికే పనిలో పడ్డ్డాను ప్రస్తుతం ( తత్త్వ శాస్త్రమన్నా, దోస్తోయేవ్ స్కీ అమాయక హీరో కలలన్నా ఇంకా చలం ( http://chelam.blogspot.com/) అన్నా తెలుగు అక్షరమన్నావల్లమాలిన అభిమానం.
It doesnot sound like kavitha, anyway nice effort, better luck next time
ఆసుపత్రుల కాసుల బాగోతాన్ని గురించి కవితలో చెప్పిన పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది.
Health is social responsibility. The governments are conveniently are getting away from the responsibility and people are not rising against this, hence the emergence and development of corporates in health. Let the shareholders flourish at the cost of public health. The government’s imposition of rules in the corporates pertaining the health of poor is only an eyewash. Now the corporates sponsored health insurance will ensure health only to the people with money. Let the concept of social medicine perish in the hands of the corrupt politicians who think americanization and globalization are synonimous and the doctors who are thinking the profession not as service but converting themselves as money spinning machines. The poet should have studied more of the corporate hospitals and the poem naturally would have been wonderful. Mr. Sridhar, keep writing with your social study. Against what Mr.anonymous says, kavitha does not need any hard and fast rule or the sound of one’s liking, only your agonized response to a phenomenon matters.
Hatsoff sir…mana desham lo corporate hospitals teerunu kallaku kattinattu chupincharu…thanks for your fire on corporate hospital….
Ganesh cinema lo oka dialogue untundhi…
‘pedavadiki jabbucheste chave saraina mandaaa””
Anil
Thank U Sir, I shall be reverting quickly.