కొడవటిగంటి కుటుంబరావు గారి కాల్పనిక, కాల్పనికేతర రచనలన్నీ పుస్తకాలుగా వచ్చాయి. కానీ ఆయన చేసిన అనువాదాలు మాత్రం పాఠకులకు అందుబాటులో లేవు. యాకొవ్ పెరెల్మాన్ రాసిన “నిత్యజీవితంలో భౌతికశాస్త్రం” పుస్తకానికి ఆయన చేసిన అనువాదం తెలుగువారెందరికో సైన్స్ పట్ల అమితాసక్తిని కలిగించింది. అది (అప్పటి) సోవియెట్ రష్యాలో ప్రచురితమైన తొలి తెలుగు అనువాదం కూడా అని కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు తెలియజేస్తున్నారు. నికొలాయ్ గొగోల్ రాసిన “The Dead Souls” నవలను కొ.కు. గారు మృతజీవులు అనే పేరుతో అనువదించారు. అది 1960లో విశాలాంధ్రలో వచ్చింది. తర్వాత అది పుస్తకంగా కూడా వచ్చినప్పటికీ ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు.
ఆ అనువాదం ఈమాట లో నాలుగు భాగాలు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ అనువాదాన్ని 25/6/2007 నుంచి పొద్దులో ధారావాహికగా అందించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం. ఈ అనువాదాన్ని పొద్దులో కొనసాగిస్తామని కోరిన వెంటనే అంగీకరించి అనువాద ప్రతిని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో కొనసాగించడానికి అంగీకరించిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
గొగోల్ గురించి:
నికొలాయ్ గొగోల్ రాసిన ఓవర్ కోటు కథ, మృతజీవులు నవల, రివైజర్ నాటకం జగత్ప్రసిద్ధి పొందాయి. ఓవర్ కోటు (దాదా హయత్ చేసిన తెలుగు అనువాదం సాహిత్య నేత్రంలో వచ్చింది) రష్యన్ సాహిత్యాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే టాల్‍స్టాయ్, డోస్టొయేవ్ స్కీ, తుర్గేనెవ్ తదితరులు “మేమంతా గొగోల్ ఓవర్ కోటు లో నుంచి వచ్చినవాళ్ళమే” అనేవాళ్ళట!
“Gogol’s relaxed, decsriptive narrative gives us a good idea of mid-19th century Russia.” – కొడవటిగంటి రోహిణీప్రసాద్ (‘మృతజీవులు’ నవల గురించి)
(బొమ్మలు: ఎన్వికీ నుంచి)
Amazing Idea! will look forward to it.
కొ.కు రచన అందిస్తున్నందుకు పొద్దుకు కృతజ్ఞుణ్ణి.
–ప్రసాద్
http://blog.charasala.com
ఇటువంటి ఉత్తమ ప్రయత్నాలు చేస్తున్నందుకు పొద్దు నిర్వహకులకు కృతజ్ఞతలు.
It’s really a good and well appreciated effort from PODDU to publish such good stories from world famous Authors.
I am looking forward to the next episode of “MRUTHA JEEVULU” eagerly.
-Vijay.