చెప్పినట్లుగానే ఓ కొత్త శీర్షిక, ఓ కథ, ఓ సమీక్షతో మీ ముందుకొచ్చాం.
నెట్లోనూ, బయటా వెలుగులోకి వచ్చే కొంగొత్త విషయాలను పొద్దులో ప్రచురించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ వివిధ అనే విభాగాన్ని మొదలు పెడుతున్నాం. ప్రముఖ నెజ్జనుడు సుధాకర్ ఈ శీర్షికను నిర్వహిస్తారు.
స్వాతికుమారి కవయిత్రిగా సుపరిచితులు, సుప్రసిద్ధులు. మార్పుకోసం ఆమె ఈసారి కాలాన్ని నిద్రపోనివ్వను అనే కవితా సంపుటిని సమీక్షిస్తున్నారు.
ఈ సారి చావా కిరణ్ ఓ కథను చెబుతున్నారు. టీ టవర్స్ కథలో మనలను కొన్ని శతాబ్దాల పాటు ముందుకు తీసుకెళ్తున్నారు. శుభప్రయాణం!
వచ్చే శనివారానికి మరో కొత్త శీర్షిక, ఓ బ్లాగు సమీక్షను మీ ముందుకు తెస్తాం!
–పొద్దు
పాత పొద్దు కన్నా ఈ కొత్త పొద్దు అందం గా కనిపిస్తుంది.ఇంకొక చిన్న సలహా.సైటు చూడడానికి మరీ సాదా గా వుంది.సైటు మకుటం లో ఏమన్నా చేరిస్తే బాగుంటుందేమో?