ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా.
జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com/
———————
ఒక సినిమా పాటకు అనుకరణ:
పోను పోనంటూనే పోరడూ పోరడూ
అమెరికా పోయిండే పోరడూ పోరడూ
వద్దు వద్దంటూనే గుంటడూ గుంటడూ
డాలర్ల వెనకురికే గుంటడే గుంటడూ || పోను ||
కంప్యూటర్లే బోగస్సని కుచ్చుటోపి పెడతాయని
కహానీలు ఇన్పించే పోరడు
కలల్లోన తేలిపోతు కోటికి పడగెత్తాలని
కొలంబియా పోయిండే పోరడూ
ఔనా అయ్యో పరేషాన్ అవుతాడే
పాపం పసివాడే పోరడూ || పోను ||
వున్నదేదో అమ్ముకుని ఊరినంత వదులుకుని
వర్జీనియా దారిపట్టే పోరడూ
దిమాఖంత ఖరాభైంది దిగులుచెంది దీనంగా
వీధులెంట తిరిగినాడే పోరడూ
ఔరా అతిగా ఆశపడి అల్లాడెనే
అమెరికాలో ఆంధ్రావాడే పోరడూ || పోను ||
-జ్యోతి వలబోజు (http://vjyothi.wordpress.com)
భలే ఉంది…అదే పాటలో మధ్యలో వచ్చే మాటలకు నా పేరడీ కూడా కలిపి పాడుకోండి!
ఏ ఊరి పిల్లడే ఈ పోరడు…
వైజాగు పట్నం..
బందరు పట్నం..
హనుమ కొండ..
గోలు కొండ..
అనంత పురం..
హిందూ పురం..
నిమ్మకూరు…
మామిడికుదురు…
హైదరా బాదు…
అదిలా బాదు…
కాకినాడ…
గుడివాడ…
కర్నూలూఊఊఊఊఊ…!
chala bagundi. naku home foods meeda msg. pampandi
namasthe jyothi garu.naa peru geetha madhuri.nenu bangalore lo untunnanu.mee paapam andhra poradu kavitha chala bagundi.nnaku mee vantala blog gurinchi msg pampandi.
best of luck
by
geetha madhuri