నోరూరించే ఆహ్వాన పత్రిక

jyothi.bmpఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా.

జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com/ .

——————–

ఈ నెలలో ప్రేమలు, పెళ్ళిళ్ళు, పెళ్ళిరోజులతో మన బ్లాగులోకం కళకళ లాడుతోంది.అందుకే ఈ ప్రత్యేకమైన పెళ్ళి పత్రిక.

sweets.jpg

శ్రీరస్తు *********** శుభమస్తు *********** అవిఘ్నమస్తు

వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక

స్వస్త్రిశ్రీ చాంద్రమాన శ్రీ వ్యయనామ సo|| ర ఫాల్గుణ బ|| నవమి ఆదివారము తేది 25.2.2007 ఉ|| గం|| 10.17 ని|| లకు రోహిణీ నక్షత్ర యుక్త మేషలగ్న పుష్కరాంశ సుముహూర్తమున

మా కనిష్ట పుత్రుడు

చి|| మసాలాదోసె

కు

చి||ల||సౌ|| బంగాళదుంపఖుర్మా

తో

(మ||రా|| శ్రీమతి & శ్రీ టొమాటో శర్మగారి ద్వితీయ పుత్రిక)

వివాహము జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు.కావున తామెల్లరు బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి,మాచే నొసగబడు భోజన తాంబూలాదులు స్వీకరించి మమ్మానందింప చేయ ప్రార్ధన.

కల్యాణ వేదిక:
పులిహోర ఫంక్షన్ హాల్, రవ్వలడ్డు రోడ్,
బాదుషా ఊరు, జాంగ్రీ జిల్లా, జామూన్ రాష్ట్రం

విందు:
26.2.2007 సోమవారం
చక్రపొంగలి గార్డెన్స్, సమోసా రోడ్
మైసూర్పాక్ ఊరు, జిలేబి జిల్లా, పూతరేకు రాష్ట్రం

ఇట్లు
శ్రీమతి వడ శర్మ
శ్రీ ఇడ్లీ శర్మ

(శ్రీమతి & శ్రీ పూరీ శర్మ,శ్రీమతి & శ్రీ దోసె రెడ్డి,మరియు బంధుమిత్రుల అభినందనలతో)

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

2 Responses to నోరూరించే ఆహ్వాన పత్రిక

  1. radhika says:

    పెళ్ళికి భోజనానికి మధ్య అంత దూరం పెట్టేసారేమిటండి.అన్ని రకాల పేరులు చెప్పి ఊరించి ఇలా చేయడం ఏమి బాగోలేదు.అయినా మీ వంటల బ్లాగులోనే కాకుండా ఇలా అన్నింటిలోను రకరకాలు పెట్టేసి మా జిహ్వను పరీక్షించడం మీకు భావ్యమా జ్యోతి గారూ…..

  2. ఇదేంటండీ జ్యోతి గారూ, వధువు తండ్రి ఎవరో ఇంగ్లీషు వాడి లాగున్నాడు, పక్కనేమో శర్మ ని పేరు పెట్టుకుని? ఇక వధువు పేరేమో ముస్లిము పేరు లాగుంది. :-))

Comments are closed.