చిన్నితెర చిరునవ్వులు

jyothi.bmp

ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా.

జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com .

——————-

* టి.వి సీరియల్స్ వల్ల లాభం ?
పగలూ, ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలో నేర్చుకోవడం.
* టి.వి సామెత. కామెంట్ ప్లీజ్?
చూపించేవాడికి చూసేవాడు లోకువ.
* మరీ విడ్డూరమంటే ?
చీ పాడు సీరియల్ ఎంత సాగదీస్తున్నారో అని తిట్టుకుంటూనే మిస్సవకుండా టి.వి సీరియల్ని చూస్తూనే వుండటం.
* ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుండటంకు నేటి పేరడి?
తెలుగు టి.వి సీరియల్
* మూలిగే నక్క మీద తాటిపండు పడటమంటే?
రాన్రాను ప్రేక్షకాదరణ కోల్పోతున్న దూరదర్శన్ ని పే చానల్ గా మార్చాలనుకోవడం.
* ఏరాయితో కొట్టుకున్నా ఒకటే అనడానికి నిదర్శనం?
సినిమాలోని పాటలు సినిమాగా వస్తే, ఆ సినిమా పేర్లతోనే టి.వి సీరియల్స్ రావడం.
* టి.వి సీరియల్స్ వల్ల ప్రయోజనం?
భర్తలు ఆఫీసు నుండి ఎంత లేటుగా వచ్చినా భార్యలని మేల్కొని వుండేటట్లు చేస్తాయి.
* బుల్లి తెరకు సెన్సారు చురక?
చట్టబద్ధమైన హెచ్చరిక టి.వి అతిగా చూడటం కళ్ళకు హానికరం అనే క్యాప్షన్ ఇకపై ప్రతీ చానెల్ వారూ విధిగా వెయ్యాలని నిబంధన పెట్టడం.
* అల్ప సంతోషి?
టి.వి వాళ్ళేసే అడ్వర్టైజుమెంట్ల వల్లయినా నా అర్ధాంగి నాకింత అన్నం వండి పెడుతుందని తృప్తి పడేవాడు.
* టి.వి పిచ్చి బాగా వున్న వ్యక్తి?
మీ దైనందిన కార్యక్రమం ఎలా మొదలౌతుందని అడిగితే భక్తిరంజనితో మొదలై మిడ్ నైట్ మసాలాతో ముగుస్తుంది అంటాడు.
* టి.విలో న్యూస్ రీడర్లు వార్తలు చదవడం పూర్తికాగానే పెన్ను జేబులో ఎందుకు పెట్టుకుంటారు?
మా రాత ఇంతేనని చెప్పడానికి.
* వెండితెరకి బుల్లితెరకి తేడా?
వెండితెర నిండా అంగాంగాల మోహం,బుల్లి తెర నిండా కుట్రల వ్యూహం.

* వట్టిగొడ్డుకు అరుపులెక్కువ అంటే?
బాగోని సినిమాకోసం టి.వి లో పదేపదే ప్రకటనలివ్వడం.

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

8 Responses to చిన్నితెర చిరునవ్వులు

  1. చాలా బాగుది.

  2. చాలా బాగు౦ది.హాస్య౦ బాగా ప౦డి౦చారు.

  3. బావున్నాయి…మీ సరదా కబుర్లు

  4. radhika says:

    ఇక్కడ కూ డా అదరగోట్టేసారు.ప్రతి ఉదయాన్ని చిరునవ్వులతో మోదలపేట్టేలా చేసే మీ పోస్ట్ లు నాకు చాలా నచ్చుతాయి.

  5. బాగా నవ్వించినాయి

  6. ఇది అదిరిన్ ది.

    టి.వి పిచ్చి బాగా వున్న వ్యక్తి?
    మీ దైనందిన కార్యక్రమం ఎలా మొదలౌతుందని అడిగితే భక్తిరంజనితో మొదలై మిడ్ నైట్

    విహారి
    http://vihaari.blogspot.com

  7. అదేంటిది ఒక కాపీ చేస్తే ఇంకోటి వచ్చింది
    నాకు నచ్చింది ఇది

    * అల్ప సంతోషి?
    టి.వి వాళ్ళేసే అడ్వర్టైజుమెంట్ల వల్లయినా నా అర్ధాంగి నాకింత అన్నం వండి పెడుతుందని తృప్తి పడేవాడు.

    విహారి

  8. నాకు బాగా నచ్చిందిది. “* టి.వి సీరియల్స్ వల్ల ప్రయోజనం?
    భర్తలు ఆఫీసు నుండి ఎంత లేటుగా వచ్చినా భార్యలని మేల్కొని వుండేటట్లు చేస్తాయి.” ఇంకా “* వట్టిగొడ్డుకు అరుపులెక్కువ అంటే?
    బాగోని సినిమాకోసం టి.వి లో పదేపదే ప్రకటనలివ్వడం.”
    సామేతలకు సామేతలు, నవ్వుకు నవ్వూ!
    సరదా సరదా…

    –ప్రసాద్
    http://blog.charasala.com

Comments are closed.