కృష్ణదాసకవిరాజు – తన బ్లాగు(http://krsnadasakaviraju.rediffblogs.com/)లో 2004 మే లోనే తెలుగులో రాయడం మొదలుపెట్టిన ఈయన మనకు తెలిసినంతవరకు తెలుగులో మొట్టమొదటి బ్లాగరి. మరో విశేషమేమిటంటే కృష్ణదాసకవిరాజు అనేది ఒక ప్రముఖ తెలుగు బ్లాగరి కలం పేరు. ఫోటో చూస్తున్న మీకు ఆ విషయం వేరే చెప్పనక్ఖర్లేదనుకుంటున్నాం! 🙂
== సత్యా పదం ౧ ==
ఆడనే ఆడక, తందానతానలు మరి మరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీ మరీ.
కమలము చేబూని, విలాసము కలవాడై
కమలాక్షి వనుచు, విలాసవతివనుచు
అమల హృదివనుచు, కళావతివనుచు
రమామనోహర వల్లభుడననుచు,
ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ
అరుగుచూపవే అలసి ఆగినారేమో!
నీరివ్వవే, దప్పికతో ఆగినారేమో!
దారిచూపవే, దారితప్పినారేమో!
సిరిపతి కేమి తక్కువలే అయినా,
ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ
వెన్నెల రాజు వచ్చినాడు పైన,
కన్నెల రాజు ఇంకేల ఉన్నాడో,
వన్నెల దొరసాని సొగసులు చూడక,
ఇన్ని ఇక్కట్లేలనో, పాట్లేలనో మరి!
ఆడనే ఆడక, తందానతానలు మరిమరి
ఈడకేలొచ్చెనో అడగవే చెలీ, మరీమరీ
-కృష్ణదాసకవిరాజు (http://krsnadasakaviraju.rediffblogs.com/)
నిజంగా మొదటి బ్లాగు వీరిదేనా? సరే… ఆ అలోచన పై దృష్టి కేంద్రీకరించేటట్లు చేయగలిగినందుకు అభినందనలు. అయితే ఈ విషయంలో ఇప్పటికే బ్లాగులు రాస్తున్న వారు తమతమ అభిప్రాయాలను రాస్తే బాగుంటుందేమో!
అహ్హా! చావా కిరణ్.
మొదటి తెలుగు బ్లాగరికి నా అభినందనలు… బ్లాగుల్లో తెలుగు రాయడం 2004 లోనే ప్రారంభమయిందా? నాకింత వరకూ ఈ విషయం తెలియదు!!!
ఇంతకీ పై కవిత ఏలా ఉన్నదొ ఏవరూ ే ప్పలెదు.
సత్యాపదం రేండు వ్రాయాలా వద్దా ః)
చావా కిరణ్ గారా?గ్రేట్ . నాకు 4 వ ఖండిక బాగ నచ్చింది.సత్య పధం 2 కోసం ఎదురుచూస్తుంటాము.
భలే భలే, తోలి తేలుగు బ్లాగరి శుభాభినందనలు
ఓ స్నేహితుని కోరికపై చిన్న వివరణ
అసలేం జరిగినదంటే :
ఈ రోజు కృష్ణులంగారు రుక్మిణీ దేవి గారి దగ్గర, స్టైలుగా (విలాసంగా) ఓ కలువ పువ్వు పట్టుకోని నాలుగు మంచి మాటలు చెపుతారు – నువ్వు చాలా అందముగా ఉన్నావు అని, నీ కనులు కలువ రేకులు అని, నీ మనసు కూడా చాలా మంచిదని ఇంకా ఇంకా –
వీటిని విన్న సత్యాదేవిగారు చెలి మోసేస్తారు, దానితో టెంపరేచరు పెరిగిపోతుంది.
ఆడనే = అక్కఢనే
ఈడకేలొచ్చెనో = ఇక్కఢికి ఎలా వచ్చెనో
====
ఇంకా లోగుట్టు ఏమిటంటే
మొదట పల్లవిలో అక్కడనే ఉండక ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అడుగుతుండి కోపంగా, కాని తరువాత నాలుగు లైన్లలో అక్కడ శ్రీవారు ఏమి ఏమి పొగిడినారో చెపుతుండి, ఇంఢైరెక్టుగా నేను అమ్తకంటే తక్కువా అన్నట్టు చూస్తుండి.
—
తరువాత తిట్టినట్టు కనిపిస్తూనే మర్యాదలు చేస్తుంది.
ఆసనం సమర్పయామి
ఆర్ఘ్యం సమర్పయామి
దారి చూపమంటుంది కానీ లోపలికో బయటకో చెప్పదు.
అతను లక్ష్మీ పటి జాగ్రత్తగా చూడమని చెలితో ఇంఢైరెక్టుగా చెపుతుంది.
—-
పైన చంద్రుడు వచ్చినాడు, ఈ కన్నెలరాజు ఇంకా వన్నెచిన్నెల దొరసానిని చుడక ఇలా కష్టాలు పఢతాడేమి అని అడుగుతుండి. ఆ వన్నె చిన్నెస సొగసరి తనే అని మాత్రం చెప్పదు. (నేను కూడా చెప్పలేడు 🙂 )
—-
అవును, 2003-2004 లో నేను రచ్చబండలో చావాకిరణ్ గారి పోస్ట్లు ద్వారా ఆయన తెలుగు బ్లాగుకి వెళ్ళి అప్పటినుండి ఆయన బ్లాగు చూస్తున్డేదాన్ని. యూనికోడ్ గురిన్చి, తెలుగు బ్లాగు గురిన్చి కిరణ్గారి పోస్టులవల్లనే నేను ఇప్పుడు తెలుగులో వ్రాయగలుగుతున్నాను.
కవిగారిచ్చిన సన్నివేశ వివరణ చదివాక కవిత అర్థమైంది.
తెలుగులో బ్లాగులు రాయొచ్చని నాకు తెలిపింది చావా చలువే.