నరుడు

sudheer.JPG

యునిక్ స్పెక్ (Unique Speck) పేరుతో సుధీర్ రాసే తెలు’గోడు’ బ్లాగు తెలుగు బ్లాగులోకానికి సుపరిచితం. ఆయన కలానికి బహుపార్శ్వాలున్నాయి. అది ఒకవైపు సున్నితమైన భావాలనూ పలికించగలదు, మరోవైపు చేదునిజాలను విప్పిచెప్పనూగలదు. ఆయన కవితల్లో ఒదగని భావాలు అరుదు. రచనల్లో వాసి తగ్గకుండా విరివిగా రాయగలగడం ఆయన ప్రత్యేకత. సుధీర్ రాసిన ‘నరుడు’ కవితను పొద్దు పాఠకుల కోసం అందిస్తున్నాం.

నరుని నాళ్ళు ఎన్నని?
తలచిన చాలు వాడొకనాడు!
మరణమన్నింటికీ ముగింపని
ఎన్నడెరుగునో వాడు!

ప్రతి పొద్దులో ఒక హద్దుని చేరగ
శక్తి యుక్తులను సమీకరించి
ఏదో సొంతం చోసుకోవాలని
కాలంతో కలియబడుతూ
కోరికలకంతం కనుగొనాలని
అనుక్షణం పరితపిస్తూ
జీవితం స్వర్గధామమవ్వాలని
నిద్దురలోనూ నెమ్మదిలేని మది కోరిక

నరుని నాళ్ళు ఎన్నని?
తలచిన చాలు వాడొకనాడు!
మరణమన్నింటికీ ముగింపని
ఎన్నడెరుగునో వాడు!

-సుధీర్ కొత్తూరి (http://uniquespeck.blogspot.com)

About సుధీర్ కొత్తూరి

యునిక్ స్పెక్ (Unique Speck) పేరుతో సుధీర్ రాసే తెలు’గోడు’ బ్లాగు తెలుగు బ్లాగులోకంలో మంచి ప్రాచుర్యం పొందింది.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

One Response to నరుడు

  1. radhika says:

    మంచి కవిత.మంచి సందేశాన్ని చిన్ని కవితలో సరళం గా చెప్పారు.

Comments are closed.