తెలుగు వికీపీడియా – రవి వైజాసత్య

రవి వైజాసత్య – తెలుగు నెజ్జనుల్లోకెల్లా అత్యంత ప్రముఖుల్లో ఒకరు. తెలుగు వికీపీడియా అనగానే జ్ఞప్తికి వచ్చే మొట్ట మొదటి వ్యక్తి ఈయనే! వికీపీడియాకు నేటి కళా, శోభా రావడానికి ప్రధాన కారకుడు! తెలుగు వికీకి ఓ స్థాయిని ఊహించి, సాధించిన వ్యక్తి. కొత్త వికీపీడియనులను ప్రోత్సహిస్తూ, వారు మంచి వ్యాసాలు రాయడానికి మార్గ దర్శకుడయ్యాడు. తెలుగు వికీపీడియాలో ఇప్పుడు ఉన్న నిర్వాహకులు, అధికారులు అందరూ ఆయన తయారు చేసినవారే!

వైజాసత్య తన బ్లాగులో మంచి మంచి జాబులు రాస్తున్నారు. ప్రపంచ రాజకీయాల పట్ల ముఖ్యంగా అమెరికా పాత్ర పట్ల ఆయనకు కొన్ని విస్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. సోమాలియా గురించి ఆయన రాసి ఇచ్చిన చిన్న వ్యాసాన్ని అతిథి శీర్షికలో మీకందిస్తున్నాం.

అన్నట్టు, తెలుగు వికీపీడియాలో.. వైజాసత్య వైజాసత్య లాగానే కనిపిస్తాడు కానీ వైజాసత్య కాడు, గమనించారా?

———————————-

మా తరువాతి ప్రచురణ: జనవరి 5 వ తేదీన ఓ ప్రముఖ రచయిత రాసిన పుస్తకాన్ని సమీక్షిస్తున్నాం.

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.

4 Responses to తెలుగు వికీపీడియా – రవి వైజాసత్య

  1. jyothi says:

    yes this is true, he also made me write me in telugu wikipedia …and helping me day to day how to write and edit the articles there. i thank him a lot..

  2. తెవికీవాల్మీకి అని ఆయనకు మరో పేరుంది 🙂
    “కనిపిస్తాడుగానీ కాదు గమనించారా” – లేదండీ, ఏమిటి సంగతి!?

  3. రానారె, జ్యోతి మీ అభిమానానికి కృతజ్ఞతలు.
    నేను మొదట్లో తెలుగులో రాయడానికి ఇన్‌స్క్రిప్టు ఉపయోగించేవాన్ని. కొత్తగా తెలుగు టైపు చేయడం నేర్చుకుంటూ తెలుగు వికిపీడియాలో వైజాసత్య అని తెలుగు సభ్యనామము సృష్టించుకోవడములో ఒక తప్పు దొర్లింది. దాన్నీ ఆ తరువాత చాలా రోజులకు కానీ నేను గమనించలేదు. ఇప్పుడైనా కనుక్కోగలరా అదేంటో?

  4. తెలిసిందయ్యా ఆ తప్పు ..
    vai~maasatya అని రాశారు. అది నిజానికి vaijAsatya అని వుండాలి.
    ఎలా కనుక్కున్నానని ఆస్చర్యమా? “నిఖిలే” కి జిందాబాద్!

    –ఫ్రసాద్
    http://blog.charasala.com

Comments are closed.