గ్యాస్ కొట్టండి

jyothi.bmpఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.

————–

వేసవి సెలవులు. పిల్లలందరూ అందరి ఇళ్ళలో గోల గోల చేస్తున్నారు. ఓ రోజు మా కాలనీలో ఒక విచిత్రమైన పోటి పెట్టారు. ఒక ఖాళీ గ్యాస్ సిలిండరు తెచ్చి పెట్టి అందరిని తాము కోసిన కోతలుగానీ,చెప్పిన అబద్ధాలు , బడాయిలు, కొట్టిన గ్యాసు కాని చెప్పమన్నారు. ఇది విచిత్రమైన సిలిండరట. ఇలా చెప్పిన గ్యాసుతో మెల్లిగా నిండుతుందంట. ఎవరైతే ఎక్కువ, అదరగొట్టే గ్యాస్ కొడతారో,లేదా కోతలు కోస్తారో వారికే ఈ సిలిండరు ఇవ్వబడుతుంది. అది ఖాళీ అయ్యాక తిరిగిచ్చేయాలి.

ముందుగా ఒక గృహిణి వచ్చింది…మరేనండి, మావారు నేను చెప్పిన మాట జవదాటరండి. జీతం రాగానే నా చేతికిచ్చి తన ఖర్చులకోసం మాత్రమే తీసుకుంటారు. నేను ఎంత ఖర్చు పెట్టినా ఏమనరు. మా ఇంట్లో అందరు నేను చెప్పిందే వేదం అంటారు. ( వాళ్ళాయన పచ్చి తాగుబోతు.సగం జీతం తాగుడు, అప్పులకే పోతుంది. సగం జీతంలోనే ఇల్లు గడవక మళ్ళీ అప్పులు. అంతా గోల గోల సంసారం)

ఇంజనీరింగు విద్యార్ధి…నేను చాలా సీరియస్సుగా చదువుకుంటాను. బుద్ధిగా ఉంటాను. మంచి ఉద్యోగం సంపాదించాలి కదా.నాకు కాలేజీలో మంచి పేరుంది . జూనియర్స్ అందరు నన్ను ఎంతో గౌరవిస్తారు. డౌట్లన్నీ అడుగుతారు. (వీడస్సలు పుస్తకం ముట్టడు. పరీక్షలముందు ఆల్ ఇన్ వన్ కొనుక్కుని బట్టీ పడతాడు. ఎవరిని అడిగినా బండ బూతులు తిడతారు )

పనిమనిషి రాములమ్మ .. మరేనండి. నేను ఎవరింట్లో నన్నా పని పట్టుకున్నానంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి. నలుగురున్న ఇల్లైతేనే చేస్తాను. జీతం ఐదొందలు. దసరాకి కొత్త చీర, నాలుగు పాత చీరలు , ఆదివారం పని చేయం. అందరు ఇంట్లోనే ఉంటారుగా చేసుకుంటారు. మేము కూడా ఇంట్లో టీవీలో సినిమాలు చూడొద్దేంటి. నెలకు రెండు సినిమాలు చూసే అలవాటు పనికి రాము. జ్వరం వస్తే కూడా పని చేయం. జీతం కట్ చేయొద్దు. అది బాలేదు ఇది బలేదు. అని అనొద్దు. మాట పడేదాన్ని కాదు.

క్లర్క్ శర్మ… మేము చాలా నిజాయితీగా పని చేస్తాము. తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి కదా! ఏ పనైనా టైమ్ మీద పూర్తి చేస్తాము అయినా అందరూ మమ్మల్ని అపార్ధం చేసుకుంటారు.ఎంతైనా ప్రభుత్వోద్యోగులంటే అందరికీ అలుసే మరి..(సీట్లో కనిపించేది నెల మొదటిరోజు , ఎదైనా ఇన్స్పెక్షన్ ఉంటే . వెళ్ళేది పదకొండింటికి బయటపడేది నాలుగింటికే. ఇంట్లో చిట్టీల బిజినెస్ నడిపిస్తాడు మిగిలిన సమయంలో. ఆఫీసులో వచ్చే జీతం ,గీతం సరిపోదతనికి.

స్థానిక ఎమ్.ఎల్.ఏ … నా వార్డు ప్రజలే నాకు దేవుళ్ళండి. వాళ్ళ కోసం నా ఇంటి,ఫోను తలుపులు ఎప్పుడూ తెరిచేవుంటాయి. ఎప్పుడైనా ఏ సమస్య ఐనా నాకు చెప్పండి . వెంటనే స్పందించి ఆ సమస్య తీరుస్తాను. ఇది నా వాగ్ధానం. (ఏడిసినట్టుంది . అసలు ఎలక్షన్లప్పుడు, ఎదన్నా సన్మానం చేస్తామన్నప్పుడు తప్ప మళ్ళీ కనపడడు.)

ఇలా కొంతమంది గ్యాస్ కొట్టారు. సిలిండరు సగమే నిండింది. ఇక మీరు మొదలెట్టండి.ఎవరి గ్యాసుకు సిలిండరు నిండుతుందో వారికే అది సొంతం. ఖాళీ అయ్యాక సిలిండరు ఇచ్చేయాలండి మరి. హైదరాబాదులో గ్యాస్ సిలిండరు కెంత తిప్పలు పడాలో తెలిసిందే కదా! డబ్బులెట్టి బంగారం కొనడం సులువేమో గాని సిలిండరు దొరకడం అంత కష్టం.

-వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com)

About వలబోజు జ్యోతి

అచ్చమైన తెలుగింటి గృహిణి ని.. కాలక్షేపానికి అంతర్జాలానికి వచ్చి బ్లాగులు మొదలెట్టాను. నేర్చుకోవాలనే తపనతో మొదలైన ఈ పయనం ఇప్పుడు తెలుగులో మొదటి వంటల వెబ్సైట్ దగ్గర ఆగి ఉంది. అప్పుడప్పుడు పత్రికలలో రచనలు చేస్తుంటాను. నాకు తెలిసిన ప్రతి విషయం నాకిష్టమైన తెలుగులో చూడాలి, రాయాలి అనుకునే భాషాభిమానిని.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

12 Responses to గ్యాస్ కొట్టండి

  1. radhika says:

    రోజుకు నా బ్లాగుకు 500 మంది అతిధులు వస్తారు.వచ్చే ఏడాది ఉత్తమ బ్లాగ్ అవార్డ్ నాకే ఇస్తారట.నా కవితల్ని సిరివెన్నెల,వేటూరి..ఇలాంటి ప్రముఖులెందరో మెచ్చుకుంటున్నారు.ఇప్పటివరకు తెలుగు బ్లాగుల్లో అత్యధిక పోస్టులు చేసింది నేనే.ఈనాడు,వార్త,ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో నా బ్లాగు గురించి మోత మోగిపోతుంది.[సిలిండర్ నిండిందా?తీసుకుపోనా?]

  2. నా తరువాత వచ్చిన వాళ్ళ సమయం వృధా కానీకూడదని ముందుగానే చెబుతున్నా.

    ఇందాకే నేను కొట్టిన గ్యాసుకి సిలిండర్ నిండి పోయింది. నేనే విజేత నని అందరూ చెప్పేశారు. రాధిక గారు కూడా నాకు సహాయపడ్డరు సిలిండర్ ని నా కారులో పెట్టడానికి. మరి నే వెళ్ళొస్తా.

    ఈ సారి పొయ్యి కూడా తీసుకొస్తే దాన్ని లైటర్ లేకుండా మండిస్తా. నా తరువాతోళ్ళను మండించినట్టు.


    సిలిండర్ విహారి 🙂

  3. jyothi says:

    వచ్చే ఆదివారం మా ఇంట్లో కె.ఎ.పాల్ మరియు వై.ఎస్.ఆర్ సమావేశమవుతున్నారు. ఇద్దరితో మాట్లాడి సయోధ్య కుదిరిద్దామని నేనే పిలిచా! చంద్రబాబుగారు ఫోన్ చేసి ఈ ఐడియా ఇచ్చారు. పాల్ గారు బుష్ ని తోడు తెచ్చుకుంటున్నారు.వై.ఎస్.ఆర్ గారు బొత్స తో వస్తున్నారు. పాత్రికేయులకు ప్రవేశం లేదు. అస్సలు ఎవరికీ తెలీదు.నేను ఈ సమావేశ వివరాలు ఫోటోలు రాయడానికి సుధాకర్‍ను పిలిచా.

    నాకూ గ్యాస్ సిలిండరు కావాలి. బుక్ చేస్తే నాలుగు రోజుల్లో ఇస్తానన్నాడు. సచ్చినోడు వారమైంది ఇంకా ఇవ్వలా.

  4. venkat says:

    నిన్న చిరంజీవి ఫోను చేసారు. నేను చాలా బిజీ అంటే కూడా వినకుండా “వెంకటూ, నువ్వు తెలుగు సినిమాని మార్చి పారేసావుపో! ఇకనుంచి నన్ను నేను మోసం చేసుకోకుండా నాకు నచ్చిన సినిమాల్లోనే నటిస్తాను. ఫాన్సు లైట్స్ గురించి పట్టించుకోను. నువ్వు చెప్పినతర్వాతే సినిమాయొక్క ప్రాముఖ్యత తెలిసింది. ఇన్నాళ్ళూ నన్ను నేను మోసం చేసుకుని నటించాను. ఇకనుంచి అలా చేయనని మాటిస్తున్నా” అని తన బాధ వెళ్ళబోసుకునారు.ఈ రొజు బాలయ్య అపాయింట్మెంట్ కావాలని అడిగాడు. అలాగే జునియర్ NTR, నాగ్, వెంకీ వీళ్ళందరూ మారిపోవడానికి కారణం 24fpsలో నా రాతలేనంట. ఎక్కడ చూసినా అదే డిస్కసన్.

  5. vamshi says:

    naa girinchi em cheppalandi..naaku goppalu potam peddaga nachadu… puttinapudu nenu 4kgs weight telusa..asalu edavaledata.. ikkada thella pillalanni naaa venta padutunna nenu valla vanka kannethi kooda choodanu… raamudu, karnudu , tarvata sri nenu … adiginavaariki ledanakunda ichesta ..unte .. okadu oka thella pilla cheyi patti laagadani aa pilla naaku complaint chesindi… nenu kottina kottudiki vaadiki 3.5 years bed rest telusa;;.. inka ila chala chesanu.. maa oorlo cheruvu nene tavvanu … oka sari karuvu neellu levani prajalu ibbandi paduthunte 3 days lo cheruvu kattesa… ila okata renda.. maa ooru poi adagandi.. raja la choosukuntaru mimmalni..

  6. జ్యోతి గారు

    ఒక సిలిండర్ ని నాకు ట్రాన్స్‌ఫర్ చేస్తారా…నాకు ఇక్కడ గ్యాసు లేదు….కాపురం పెట్టాలంటే..గ్యాసుకావాలి కదా….

    అనిల్ చీమలమఱ్ఱి

  7. swathi says:

    జ్యొతి గారూ! నేను రాసిన వ్యాసం మీ పేరు తో వేసేసుకున్నారు. సిలిండర్ ఐనా నాకివ్వాలి కదా!
    కొంపతీసి పేలి పోయిందా ఈ గ్యాస్ కి. 🙂

  8. ssv says:

    తొందరలో గవర్నమెంట్ రిజర్వేషన్లను తీసేస్తుందట, అన్నీ చోట్ల మెరిట్ కే ప్రాధాన్యమట. ఎమ్.పి అవడానికి కనీసార్హత పోస్ట్ గ్రాడ్యుయేషను అట. బందు చేసి, ఒక ఎమర్జెన్సీ కేసు లో మరణానికి కారణమయిన ఫలానా పార్టీ నాయకుడికి రెండు లక్షలు జరిమానా, ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష

  9. sunil says:

    aaha…naaku chaala santhosamga undi…naa sishyulandaru ila nenu nerpina sodhi ane vidyani upayoginci ila amoolyamina gas cylinder nu sontham chesukuntuntey kallalo neellu tirugutunnayi….

  10. lakshmi says:

    ii samvatsaram prapanchasundarini nenega.
    enni bahumatulo.. enni prakaTanalo..enta Dabbo..
    aa DabbaMtA peTTi samAjaseava cheastA.anaadhalanu chearadiistA,chaduvu cheppistA.
    eyidsu roegulaku seava cheastA.

  11. శ్రవణ్ says:

    ఇవ్వాళ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి హృదయపూర్వకంగా పలకరించుకున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరుతాయని విలేఖరులకు మాట ఇచ్చారు.

  12. Shilpa says:

    Asalu meku telusa nenne Gas Cylender ni kani peetanu. Gas ella tayaru chestharo nenne cheppanu, vallu aa mechanism ni vadukuntunnaru.

Comments are closed.