పొద్దు పొడిచే వేళ విజ్ఞులైన పాఠకులకు స్వాగతం! తెలుగులో సరికొత్త ఆన్‌లైను పత్రికకు సాదర స్వాగతం!
తెలుగులో చక్కటి ఆన్‌లైను కంటెంటు అందించాలనే ఆశయంతో పొద్దును వెలువరిస్తున్నాం. ఆన్‌లైనులో తెలుగు రచయితలకు కొదవ లేదు. ఎన్నో చక్కటి బ్లాగులు, వికీపీడియా వ్యాసాలు రాస్తున్నారు. పాఠకులూ విస్తృతంగానే ఉన్నారు. ప్రజ్ఞావంతులైన వివిధ రచయితల రచనలను ఒకచోట చేర్చి పాఠకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నాన్ని సంకల్పించాం.
మా ఈ ప్రయత్నాన్ని సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ..
– పొద్దు (editor@poddu.net)
ఈ పొద్దు ప్రతి పొద్దు పొడవాలని ఆశిస్తూ..దీవిస్తూ..ప్రార్ధిస్తూ
‘పొద్దు’ తెలుగు సాహిత్యానికి బంగారు చెవిదుద్దు కావాలి!
All the very best !!
ఇదొక చక్కని ఆరంభం.
మన కూడలి లాగే ఇది కూడా ఎంతో ఎదగాలని నా ఆకాంక్ష.
దీనికి RSS సౌలభ్యం ఉంది కాబట్టి ఎంతో మంది చదివే అవకాశం ఉంది.
ఒక చక్కని పని ప్రారంభించారు. మీకు, మీ సహచరులందరికీ మా శుభాకాంక్షలు.
మురళీ వలివేటి
తెలుగుదనం.కో.ఇన్
telugudanam.co.in
ఈ ‘పొద్దు’ పొడవడానికీ, గడవడానికీ కారణభూతమైన సారథుల పేర్లకోసం వెతికా. మీరేమైనా కాస్త బయట పెట్టగలరా?
అన్నట్ట్లు వారికి నా అభినందనలు.
మంచి ప్రయత్నం.
హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.
శుభోదయం
–ప్రసాద్
http://blog.charasala.com
Sir,
The site PODDU is very good creation
of wide topics in telugu language and its
literature.
I would like to send few articles in telugu to publish in your site. Please indicate me the type of Font you require and whic format. I can send word *RTF file in Hemalatha Font of CDAC, PUNE please
give the feedback.
P L K Sastry
శుభారంభం… అభినందనలు…
అక్షరాల విడితి (size) ని కాస్త తగ్గిస్తె ఈ పొద్దు తొలి పొడుపు కన్నా అందంగా కనిపిస్తుందని నా (కేవలం నా) అభిప్రాయం
ఈ పొద్దు మన బ్లాగులోకానికి కొత్త తొలి పొద్దు.
ఈ పొద్దు కావాలి అందరికి ముద్దు.
చెరిపెయ్యాలి సరి హద్దు.
ఇక అకాశమే దీనికి హద్దు.
ఇక మళ్ళీ చెప్పాలా “ఇక తిరిగి చూడొద్దు”
**** *** ***
ఈ పొద్దు ప్రతిపొద్దూ తీసుకురావాలి
జాజ్యాల మైన తెలుగు వెలుగుల రేఖలు
అవి ప్రసరించాలి…దానిచే ప్రవహించాలి ఘనీభవిస్తున్న మాతృ భాష….
గల గలా గోదారిలా.
నిండైన జీవ నదిలా.
విహారి
http://vihaari.blogspot.com