Tag Archives: సమీక్ష
కాలాన్ని నిద్రపోనివ్వను
ఆచార్య ఎన్.గోపి రాసిన “కాలాన్ని నిద్రపోనివ్వను” కవితాసంపుటిపై స్వాతికుమారి సమీక్ష ఇది: ————- పోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటితో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి … Continue reading
అతడు అడవిని జయించాడు – డా.కేశవరెడ్డి
అతడు అడవిని జయించాడు – ఒక రాత్రిలో ఓ మనిషి చేసిన జీవన పోరాటం; డా. కేశవరెడ్డి రాసిన నవలిక. అప్పుడే ఈనిన ఓ పంది, పుట్టిన పిల్లలని (సలుగులు) తినేందుకు దాడులు చేసే నక్కలు, తన పందినీ, దాని పిల్లలనూ కాపాడుకునేందుకు పోరాటం చేసే ముసలివాడు.. ఇవీ పాత్రలు, ఇదే కథ! నేపథ్యం – … Continue reading
తెలుగు జాతీయవాది – అంబానాథ్
రిపబ్లిక్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ను అన్యాయంగా ఆక్రమించుకుని హిందీ దేశం అధికారం చెలాయిస్తోంది. తమదో ప్రత్యేక జాతి అని కూడా తెలుసుకోలేక తెలుగువారు హిందీ దేశానికి సామంతులుగా బతుకుతున్నారు. తెలుగువారు మేలుకుని తమ జాతీయతను గుర్తించి హిందీ దేశం నుండి విడివడి స్వతంత్ర ప్రతిపత్తితో జీవించాలి. కొత్తగా ఉంది కదా? తెలుగుజాతీయవాది (http://telugujaatheeyavaadi2.blogspot.com/) బ్లాగు … Continue reading
దర్గా మిట్ట కతలు
సుధాకర్ – ఒక ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఆయన రాసే తెలుగు బ్లాగు శోధన 2005వ సంవత్సరానికి భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. … Continue reading
‘చుక్కపొడిచింది’ సమీక్ష
– త్రివిక్రమ్ ఈ కథలసంపుటిలో పాలగిరి విశ్వప్రసాద్ రాసిన పది కథలు, ఒక వ్యాసం ఉన్నాయి. ఈ పది కథల్లో స్త్రీ పురుష సంబంధాల్లోని భిన్న పార్శ్వాలను చూపే కథలు, ఆర్థిక సమస్యలు, మానవసంబంధాల్లోపలి ఆర్థిక సంబంధాలను విప్పి చూపే కథలు, మనుషుల ప్రవర్తన గురించిన కథలు , భూస్వామ్యభావజాలంతో నిండిన రాయలసీమ గ్రామాల్లో దళితులెలా … Continue reading