Tag Archives: పద్యం
మే గడి సమాధానాలు
సరైన సమాధానాలు పంపినవారు:
తప్పుల్లేకుండా: బి. కామేశ్వర రావు
ఒకటి రెండు తప్పులతో: సత్యసాయి, స్వాతి కుమారి
మూడు నాలుగు తప్పులతో: కొత్తపాళీ, శ్రీరామ్
అసంపూర్తిగా పంపిన వారుః చిట్టెళ్ల కామేష్, చరసాల ప్రసాద్
ప్రయత్నించినవారందరికీ అభినందనలు!
ఏప్రిల్ గడి – వివరణ
ఏప్రిల్ గడికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతగా అభిమానించి, ఆదరించిన పాఠకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడిని ఎంతగానో అభిమానించి, అందరినీ ప్రోత్సహించిన కొత్తపాళీగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గడిమీద చాలా పెద్ద ఎత్తులో చర్చలు జరిగాయి. కొన్ని చర్చలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యంతోను, ఆనందంతోను ఒళ్ళు పులకరించింది. ఈ గడి మూలంగా – వరూధిని కథ, పుష్ప లావికలు, అనిరుద్ధుని కథ, మాంధాత గురించి కొన్ని చర్చలు జరగడం – గడి కూర్పర్లగా మాకు చాలా ఆనందానిచ్చింది.
మూడురోజుల పాటు అహోరాత్రాలు కష్టపడి గడి తయారుచేస్తే గంటలో పూరించి పంపించారు సత్యసాయిగారు. సుమారుగా అన్ని కరెక్టుగా పంపినవారు కూడా చాలామందే ఉన్నారు. మీ సత్తా చూస్తూంటే, అసలు ఆధారాలే అవసరం లేనట్లుంది!!
గడి తయారుచేయడంలో ఇంకా తప్పటడుగులేస్తున్న మమల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు, జరిగిన ఒక పొరపాటుని సహృదయంతో అర్ధం చేసుకొన్నందుకు కూడా మేం మీకందరికీ ఋణపడి ఉంటాం. మీ ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తాం – మీ అంచనాలకి తగ్గకుండా గడి స్థాయిని ఇలాగే ఉంచడానికి కూడా మా శాయశక్తులా కృషి చేస్తాం.