Tag Archives: పద్యం
పోతన కవిత్వ పటుత్వము
__ శ్రీ తాపీ ధర్మారావు (పరిశోధన, 1954) “ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు. సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి … Continue reading
పద్యకవిసమ్మేళనంలో పాల్గొనని పద్యసుమాలు
వికృతి ఉగాది పద్యకవిసమ్మేళనంలో సమయాభావం వలన సమర్పించలేకపోయినవి, సంబంధిత కవులు ఆ సమ్మేళనంలో పాల్గొనలేకపోవడం చేత సమర్పించలేకపోయినవీ అయిన కొన్ని మంచి పద్యాలను కొత్తపాళీ గారు ఎంచి పంపించారు. వాటిని ఇక్కడ సమర్పిస్తున్నాం. ————————– దత్తపది: మాలిక, తూలిక, పోలిక, చాలిక -ఉత్పలమాల నాలుగు పాదాల్లోనూ తొలిపదాలుగా ఉపయోగిస్తూ సందీప్: మాలిక కూర్చి నీ సిగన … Continue reading
వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – ఐదవ భాగం
కొత్తపాళీ:: కనీసం ఇంకో రెండు అంశాల్ని రుచి చూద్దాము. వర్ణనకి ఇచ్చిన రెండో అంశం, ఒక దృశ్యం. అదిలా ఉంది. మీరొక రైల్లో వెళ్తున్నారు. ఎదురుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళీద్దరూ కనీసం పరిచయస్తులు కూడా కాదు, కానీ ఆ అబ్బాయి కళ్ళల్లో ఆ అమ్మాయి పట్ల ఆరాధన. ఫణి గారి వర్ణనా … Continue reading
వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – నాల్గవ భాగం
కొత్తపాళీ:: ఈసారి ఇచ్చిన సమస్యల్లో కవులందర్నీ బాగా ఉత్తేజితుల్ని చేసి, చాలా చర్చకి కారణమైనది ఈ సమస్య – రాణ్మహేంద్రవరమ్ము చేరెను రత్నగర్భుని చెంతకున్ విశ్వామిత్ర:: ముందు చేరింది కవులో వస్తువులో తెలియదు గానీయండి కవులకూ కవితా వస్తువులకు కూడా నిలయంట కొత్తపాళీ:: గిరిధర కవీ మీరు వేళ్ళు కదిలించి చాలా సేపయినట్టుంది, మీ పూరణ … Continue reading
వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – మూడవ భాగం
కొత్తపాళీ:: బాగుంది. ఒక దత్తపది వేసుకుందాం .. మాలిక, తూలిక, చాలిక, పోలిక – ఉత్పలమాల మొదటి పదాలుగా వాడుతూ.. ముందుగా చదువరి గారి పూరణ. చదువరి:: ఒక్క క్షణం.. ఉ. చదువరి గొంతులో ఈ పద్యం వినండి “మాలికలెన్నొ యుండ గజమాలను నా గళసీమ వేసి, నే తూలి కథాకళించ గని తుళ్ళుచు నవ్వితె … Continue reading
వికృతి ఉగాది పద్యకవితా సదస్సు – రెండవ భాగం
వికృత నామ ఉగాది పద్య కవితా సదస్సు రెండవభాగంలో మూడు సమస్యలకు రసభరిత పూరణలు చోటు చేసుకున్నాయి. వీటితో పాటు కవుల చమత్కార సంభాషణలు కూడా! Continue reading
వికృతి నామ ఉగాది పద్యకవితా సదస్సు – మొదటి భాగం
కొత్తపాళీ: అందరికీ పెద్దవారు, ఆచార్యులు, చింతా రామకృష్ణారావు గారు చక్కటి గణపతి ప్రార్ధన పద్యం పంపారు. ఉ: శ్రీ గణ నాయకా! వికృతిఁ జేర్పను వచ్చెదొ? విశ్వతేజ! రా వేగమిటున్. ప్రభా కలిత విశ్వ పరిజ్ఞత కావ్య జాల స ద్యో గుణ సద్విధమ్ మలర; దుర్గుణ బాహ్య మహత్వమొప్ప; రో జూ గనరా! కృపన్ … Continue reading
విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – మూడవ అంకము
{కొత్తపాళీ}: ఈ తడవ, మామూలుగా అవధానాల్లో ఉండే సమస్య, వర్ణన, దత్తపదులే కాక, ఒక కొత్త అంశాన్ని చవి చూద్దాం .. అది అనువాదం. రెండు సంస్కృత పద్యాలు, రెండు ఆంగ్ల పద్యాలూ ఇచ్చాను అనువాదానికి. మొదటిది, తెలుగు వారికి అత్యంత పరిచయమైన శ్లోకం, పెళ్ళి శుభలేఖల్లో తరచూ ప్రచురిస్తుంటారు. వాల్మీకి రామాయణంలో జనక మహారాజు … Continue reading
విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – రెండవ అంకము
పాఠకమహాశయులకు నమస్కారం. విరోధి ఉగాది సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో పొద్దు తరఫున నిర్వహించబడిన కవిమ్మేళనము మొదటిభాగాన్ని ఆస్వాదించారని ఆశిస్తూ ఈ రెండవభాగాన్ని సమర్పిస్తున్నాం. ఇందులో ప్రతిభావంతమైన సమస్యాపూరణలు, ఆశువుగా దుష్కరప్రాసలతో చెప్పబడిన సరసమైన కందాలు, గిరిగారు చెప్పిన ఒక పిట్టకథ మీ కోసం … {కొత్తపాళీ}: గిరిధరా! సమస్యా పూరణం మీతో మొదలు పెడదాం… కన్యను … Continue reading
విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – మొదటి అంకము
ఏడాది క్రిందట సరదాగా మొదలైన ఈ సంరంభం ఈ ఉగాదితో సంప్రదాయంగా మారుతోంది. ఈ సభలో ఇరవైమందికి పైగా కవులు పాల్గొన్నారు. చమత్కార భరితమైనవీ, దుష్కర ప్రాసలతో కూడినవీ, ఎటూ పొంతన లేకుండా దుర్గమంగా అనిపించేవీ అయిన సమస్యలు, కవుల సృజనాత్మకతని సవాలు చేసే దత్తపదులూ, ఊహాశక్తికి గీటురాళ్ళైన వర్ణనలూ .. ఈ అంశాలు సాధారణంగానే ఉండగా, ఈ సభలో అనువాదమని ఒక కొత్త అంశము ప్రవేశ పెట్టాము. Continue reading