Category Archives: వ్యాసం
’రమల్’ ప్రశ్నశాస్త్రం-3
రమల్ వ్యాసశృంఖలలోని మూడో భాగం చదవండి.
’రమల్’ ప్రశ్నశాస్త్రం-2
రమల్ ప్రశ్నాశాస్త్రం వ్యాసాల వరుసలో రెండవ భాగం ఇది.
అస్తిత్వ ఉద్యమాల స్వరం అఫ్సర్ – 4
అఫ్సరూసుల్లో నాలుగో భాగం చదవండి.
విజయంలో ఒక్కోమెట్టూ .. మొదటి భాగం
ప్రముఖ నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షకులు యండమూరి వీరేంద్రనాథ్ గారితో పొద్దు జరిపిన ముఖాముఖి మొదటి భాగం
‘సౌందర్యం క్షణికమైనా, క్షణం అసత్యం కాదన్న’ నమ్మకంతో శరత్కాల తృణ పత్రాలు రాల్చిన విషాదాక్షితల్ని చూసి మనసు తడి చేసుకున్న భావుకుడు..
తొలికలల తెల్లచీరకు కాటుకచీకటి వంటి నల్లంచుని కలనేసిన స్వాప్నికుడు…
గోదారి ఒడ్డున దగ్గుతో గడిపిన ఒంటరి రాత్రుల ప్రేరణతో సోమయాజినీ, ఊహించకుండా వచ్చిపడ్ద అపనిందల ఉపద్రవం నుంచి ’లేడిస్ హాస్టల్’ నీ కల్పించి ఎదురుదెబ్బల్ని ఎదుగుదలకు నాందిగా వాడుకున్న కార్యశూరుడు…
మనిషి మనుగడకు ముఖ్యావసరమైన డబ్బుకి సాహిత్యంలో స్థానం కల్పించినవాడు…
విజయ శిఖరాల్ని అధిరోహించడానికి ఒక్కోమెట్టునీ అక్షరబద్ధం చేస్తూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకొమ్మని రెండుతరాల్ని మెత్తగా మందలించినవాడు..
వేలమందిచేత లక్షల తెలుగు పుస్తకాలు కొనిపించి చదివించినా, అయాన్ రాండ్ నీ, అబ్సర్డ్ కథనాన్నీ సామాన్య పాఠకుల స్థాయికి చేర్చినా, తనదైన శైలితో ఏదో సాధించాలన్న కసిని ఎందరిలోనో రగిల్చినా… ఆయనకే చెల్లిన విషయాలవి.
ఎన్ని చెప్పుకున్నా, ఎంతగా మనం అనుకున్నా… ఇవన్నీ ఆయన వ్యక్తిత్వాన్ని నిర్వచించటానికి కొన్ని పేలవమైన ఉపమానాలు, ఉదాహరణలు మాత్రమే…
మరి తనగురించి తాను ఏమంటారో… ఆ వీరేంద్రజాలికుని మాటల్లోనే…
కథాకథనం – 1
తొలి ప్రయత్నంలోనే కథ రాయాలంటే అందరూ రాయలేరన్నది వాస్తవం. అలా రాయగలిగిన వారుంటే వారేదో ఆకాశం నుండి ఊడిపడ్డవారు కారు. మొదటిదెంత వాస్తవమో రాయడం పుట్టుకతో వచ్చేదనడం అంత అవాస్తవం. కథలు దాదాపు ఎవరైనా రాసుకోవచ్చునేమో, అందరూ ఎవరికి వారు పాడుకున్నట్టు. కానీ – మంచి కంఠం, నిశితమైన రాగజ్ఞానం, తాళజ్ఞానం ఉన్నవారు పాడినప్పుడే ఇతృలు వినగలుగుతారు. అలానే పదిమందికి పట్టే విధంగా (లేదా పదికాలాలు నిలిచేవిధంగా) రాయాలంటే అలా రాసేవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.
రమల్ – 1
“కాలోహ్యయం నిరవధిః” – కాలం ఒక నిరంతరము,నిరవధికము అయిన ప్రవాహం. ఈ ప్రవాహంలో కనుమరుగు అయిన సాంస్కృతిక, సంప్రదాయ శకలాలెన్నో. మరుగున పడిన అలాంటి ఒకానొక శాస్త్రం గురించి సవివరంగా శ్రీధర్ గారు తెలియజేస్తున్న వ్యాసపరంపర ఇది. పొద్దు పాఠకులకు ప్రత్యేకం. Continue reading
సామాన్యుడి సాహిత్య చర్చ
ఓ నాలుగు అర్థం కాని పదాలు గొలుసుకట్టుగా వ్రాస్తే కవి. ఓ పురాణపాత్రకు నూతనభాష్యం చెబితే పండితుడు. ఓ కొత్తవాదం పట్టుకొచ్చి నలుగురిని ఎగదోస్తే అది సాహిత్యం. ఈ ధోరణులు, వాటి కథాకమామీషూ సామాన్యుడికి అర్థం కావటం లేదు. అతడికి ’ఏదో’, ’ఎక్కడో’ లోపించిందని అనిపిస్తోంది.ఆ లోపించిన దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాడిలా…
సత్యాన్వేషణ – రెండవ భాగం
“మానవుడు ఆర్థికజీవి. ఆర్థిక పరిస్థితులే అతని దృష్టిని నిర్ణయిస్తున్నాయి. అతని దృష్టి మారాలంటే ఆర్థిక పరిస్థితులు మారాలి. సంఘం రెండు వర్గాలుగా చీలి ఉంది – ధనవంతులు, బీదవాళ్ళు. వాళ్ల దృష్టిని వాళ్ల పరిస్థితి నిర్ణయించింది.” – త్రిపురనేని గోపీచంద్ రాసిన సత్యాన్వేషణ రెండో భాగం చదవండి.
Continue reading
సత్యాన్వేషణ – మొదటిభాగం
సత్యాన్వేషణపై త్రిపురనేని గోపీచంద్ రాసిన వ్యాసాన్ని ఆయన జయంత్యుత్సవ సందర్భంగా ప్రచురిస్తున్నాం.