Category Archives: ఇతరత్రా
కథావసంతం 2011 – ఉగాది కథలపోటీ ఫలితాలు
పొద్దు పత్రిక అంతర్జాలంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలో కథలకు సంబంధించి పోటీని నిర్వహించడం ఇదే మొదటిసారి. తెలిసిన రచయితలను అడిగి రాయించుకోవడమూ, అభిమానంతో మరికొందరు తామే పంపడమూ మాత్రమే ఇప్పటిదాకా అలవాటు. మరి పోటీ ఎందుకు? తెలిసినవాళ్లందరికీ ఉగాది కథలకోసం ఆహ్వానాలు పంపితే సరిపోతుందిగా అనుకున్నాం మొదట్లో. ’తెలియని రచయితల్ని తెలుసుకోవచ్చుగా!’ అన్నారొకరు; ’నిజమే కొత్తవారితో పరిచయమూ, జాలం బయటి జనంతో అనుబంధమూ’ కలిసొస్తాయనిపించింది.
తానా 2011 జ్ఞాపిక కోసం రచనలకు ఆహ్వానం
తానా 2011 జ్ఞాపిక సంపాదక బృందం ఇలా తెలియజేస్తోంది.
నివాళి
అనుబంధాలు
ఋణానుబంధాలు
రమణీయానాందాలు
నేత్రానంద సినీ కావ్యాలు
అన్నిటినీ మనకిచ్చేసి
తేట తెలుగు పట్టుగొమ్మల మీద ఆజన్మాంతమూ బుడుగాటల కోతికొమ్మచ్చులాడి..
కన్నీళ్లని చక్కిలిగింతలుగా మార్చగల రసవిద్యని మాత్రం తనతో అట్టేపెట్టుకుని
అమాంతంగా, అందర్నీ వదిలేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయిన
ముళ్ళపూడి వెంకట రమణ గారికి
పొద్దు అశృనివాళి..
ఉగాది కథలపోటీ
ఖరనామ సంవత్సర ఉగాది సందర్భంగా పొద్దు కథలపోటీని నిర్వహిస్తోంది. ఆ పోటీకి సంబంధించిన వివరాలను చదవండి.
వంగూరి ఫౌండేషన్ వారి ఉగాది రచనల పోటీ
వంగూరి ఫౌండేషన్ వారు తమ ఉగాది రచనలపోటీ గురించి పంపిన ప్రకటన
—————————————————————————–
కథానిలయం వార్షికోత్సవం
శ్రీకాకుళంలో కారామాస్టారు నెలకొల్పిన కథానిలయం పద్నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే ఈ ఉత్సవానికి ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు వివినమూర్తి గారు పంపిన ఆహ్వాన పత్రాన్ని ఇక్కడ జోడించాం. కింద ఉన్న లింకును నొక్కి ఆహ్వాన పత్రాన్ని దించుకోవచ్చు.
కథానిలయం వార్షికోత్సవానికి ఆహ్వానం
Continue reading
కనిపించిన మౌనం
జడివాన చైతన్యంలో
జలకమాడిన తటాకం
గట్టుతో చెప్పిన గుసగుసలు
ఆవిరైపోతున్న ఆరోప్రాణంకోసం
పొంగిన పాల గుండెలో
నీటిబొట్టు చిందించిన చిర్నవ్వులు
ముకుళించిన మూఢభక్తికి
ముద్దరాలైపోయిన గుడిగంట
జగన్మాత క్రీగంటి చూపులతో సయ్యాటలు
పక్షిరెట్ట తెల్లదనంతో
తృప్తిపడ్డ బుద్ధవిగ్రహంలా
అలజడితీరం దాటిన ఏకాంతనావలో
మిణుకుమంటున్న దీపశిఖ…
ప్రవాహంలో విరిసిన పూర్ణచంద్రిక
ఎవరు జేసిన కర్మ …
కుక్క చేసేపని కుక్క చెయ్యాల, గాడిద చేసేపని గాడిద చెయ్యాలని పాత సామెత.
ఈ సామెత వెనకున్న కథ మనకందరికీ తెలిసిందే. తరతరాలుగా మనం వింటూ వచ్చినదే.
చాకలివారికీ గాడిదజాతికీ మధ్య బంధం తెగే కాలం దాపురించింది కాబట్టో యేమో, వివరంగా చెబుతున్నాడు.
ఆంద్రె బాజిన్, మందిమన్నియమ్ -2, కవితలు
ప్రసిద్ధ సినిమా విశ్లేషకుడు ఆంద్రె బాజిన్ గురించి వెంకట్ సిద్ధారెడ్డి గారు తెలియజేస్తున్నారు. తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారి పుస్తకం లోని భాగం, “మందిమన్నియమ్-2” కూడా సమర్పిస్తున్నాం. అలాగే అసూర్యంపశ్య గారి కవిత, కల, కొత్త ఝాన్సీ లక్ష్మి గారి కవిత, పాట ను కూడా సమర్పిస్తున్నాం. మధురాంతకం రాజారామ్ రచనల సమీక్ష త్వరలో మీకందించబోతున్నాం. … Continue reading