Category Archives: సంపాదకీయం

క్షణికమ్

-రానారె “ఆస్వాదించడంతో పాటే అభినందించడమూ నేర్చుకోవాలి. బహుశా నాకిది చిన్నప్పణ్ణించీ కచేరీలకి వెళ్ళడం వల్ల కొంత అలవాటైంది అనుకుంటా. కచేరీ జరుగుతూ ఉండగానే … భలే, శెబాష్ అంటూ ఉండటం, కచేరీ ఐపోయాక, పాడిన వారి దగ్గిరికి వెళ్ళి నచ్చిందని చెప్పడం .. మా అమ్మ నవ్వేది .. ఒరే అంత పెద్ద గాయకులైన ఆయన … Continue reading

Posted in సంపాదకీయం | Tagged | 27 Comments

|| ఇస్రో విశ్వస్య రాజతీ ||

ఎర్రటి బాణం ఆకాశానికి గురిపెట్టి ఉంటుంది. అది ఆ సంస్థ చిహ్నం. అచ్చు ఆ బాణంలాగే లక్ష్యమ్మీదే దృష్టి కేంద్రీకరించి వారి రాకెట్ నిలబడి ఉంటుంది. అది ఎక్కుపెట్టిన రామబాణం. శ్రీహరికోటలోని లాంచ్‌ప్యాడే కోదండం. ధనుర్విముక్తశరం లాగా నభోమండలాన్ని చీల్చుకుంటూ అది దూసుకుపోతుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మంత్రించిన బ్రహ్మాస్త్రం అది. చెప్పిన … Continue reading

Posted in సంపాదకీయం | 9 Comments

ఉగాది సంపాదకీయం

-స్వాతికుమారి “ఈ నెలలో ఐదు శుక్రవారాలొచ్చాయి.” “ఈ మంత్ లో ఫయివ్ ఫ్రైడేస్ ఉన్నాయి” అని కాకుండా పై విధంగా ఏ చదువుకున్న తెలుగువాడైనా అంటే ఆశ్చర్య పోవటమో, ముసిముసిగా నవ్వటమో, అలా అన్న వ్యక్తితో కొంచం చనువుంటే “are you alright?” అని మేలమాడ్డమో వీటిల్లో ఏదో ఒకటి తోటి తెలుగువాడి ప్రతిస్పందనగా ఎదురయ్యే … Continue reading

Posted in సంపాదకీయం | 11 Comments

భూమాత పరి’తాపం’

గ్రీన్‌హౌస్ వాయువులు లేందే మనం భూమ్మీద బతకలేమట. సూర్యుడి నుండి వేడి వచ్చినట్టే వచ్చి తిరిగి వెనక్కి రోదశిలోకి పోతుంది. ఈ గ్రీన్‌హౌసు వాయువులు ఆ శక్తిని పట్టుకుని ఆపి, తిరిగి భూమికి పంపి, వేడిని నిలబెడతాయి. బానే ఉంది.., అయితే ఇప్పుడేఁవిటీ?

అతి సర్వత్ర వర్జయేత్.

ఆ వాయువులు ఎక్కువైపోతున్నాయట. ఎక్కువైపోయి ఉండాల్సిన దానికంటే భూమి వేడెక్కిపోతోందట. లోకఁవంతా గోలెడుతోంది. పొద్దూ గొంతు కలిపింది. పొద్దు సంపాదకుడు త్రివిక్రమ్ రాసిన సంపాదకీయంలో భూమాత తాపం పెరిగిపోతున్న వైనం చెప్పి, దానికి విరుగుడుగా మనమేం చెయ్యాలో కూడా చెప్పారు. చూడండి. Continue reading

Posted in సంపాదకీయం | 4 Comments

సంపాదకీయం

ఉగాది వస్తోందని, కోయిల ముందే కూస్తోంది. రాబోయే ఉగాది సాహితీ సందడికి గాను తమ తమ పాళీలు నూరమని బ్లాగరులకు, ఇతర రచయితలకు చెబుతున్నారు పొద్దు సంపాదకుడు దేవరపల్లి రాజేంద్ర కుమార్, తమ సంపాదకీయంలో. Continue reading

Posted in సంపాదకీయం | 1 Comment

వార్షికోత్సవ వేళ..

గత సంవత్సరం డిసెంబరు నెల మొదటివారంలో ప్రారంభమైన పొద్దుకు ఏడాది నిండి, రెండో యేట అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సంవత్సరకాలంలో పొద్దు సాధించిన ప్రగతి, అలాగే ఈ పత్రికను పెట్టినప్పుడు మాకు మేం నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని మేం ఎంతవరకు అందుకోగలిగాం అనే అంశాలను స్పృశిస్తూ ఒక సింహావలోకనం: పొద్దు ఎందుకు పెట్టాం? బ్లాగరులలో … Continue reading

Posted in సంపాదకీయం | 12 Comments

కొ. కు. గారి అనువాద నవల “మృతజీవులు”

కొడవటిగంటి కుటుంబరావు గారి కాల్పనిక, కాల్పనికేతర రచనలన్నీ పుస్తకాలుగా వచ్చాయి. కానీ ఆయన చేసిన అనువాదాలు మాత్రం పాఠకులకు అందుబాటులో లేవు. యాకొవ్ పెరెల్మాన్ రాసిన “నిత్యజీవితంలో భౌతికశాస్త్రం” పుస్తకానికి ఆయన చేసిన అనువాదం తెలుగువారెందరికో సైన్స్ పట్ల అమితాసక్తిని కలిగించింది. అది (అప్పటి) సోవియెట్ రష్యాలో ప్రచురితమైన తొలి తెలుగు అనువాదం కూడా అని … Continue reading

Posted in సంపాదకీయం | 4 Comments

స్వాగతం!

పొద్దు పొడిచే వేళ విజ్ఞులైన పాఠకులకు స్వాగతం! తెలుగులో సరికొత్త ఆన్‌లైను పత్రికకు సాదర స్వాగతం! తెలుగులో చక్కటి ఆన్‌లైను కంటెంటు అందించాలనే ఆశయంతో పొద్దును వెలువరిస్తున్నాం. ఆన్‌లైనులో తెలుగు రచయితలకు కొదవ లేదు. ఎన్నో చక్కటి బ్లాగులు, వికీపీడియా వ్యాసాలు రాస్తున్నారు. పాఠకులూ విస్తృతంగానే ఉన్నారు. ప్రజ్ఞావంతులైన వివిధ రచయితల రచనలను ఒకచోట చేర్చి … Continue reading

Posted in సంపాదకీయం | 13 Comments