Author Archives: త్రిపుర

About త్రిపుర

త్రిపుర అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (RVTK Rao). 2-9-1928 న గంజాం జిల్లా పురుషోత్తమపురంలో(ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది) జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీషు లిటరేచర్ చదువుకున్నారు. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా మదనపల్లి, జాజ్ పూర్, బర్మా ఇంకా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాల్లో పని చేసారు. రిటైరై గత ఇరవై యేళ్ళుగా విశాఖపట్నంలో ఉంటున్నారు. "త్రిపుర కథలు" అనే కథా సంకలనం, "బాధలు - సందర్భాలు", "త్రిపుర కాఫ్కా కవితలు" కవితా సంకలనాలు, segments అని ఆంగ్ల కవితలు (వీటిని వేగుంట మోహనప్రసాద్ తెలుగులోకి అనువదించారు) పుస్తకాలుగా వచ్చాయి. అనితర సాధ్యమైన రీతిలో మనిషి అంతరపు లోతుల్ని చిత్రించి కేవలం పదిహేను కథలతో తెలుగు కథకి ఒక కొత్త Dimension తెచ్చిన కథకుడు త్రిపుర. కథలో autobiographical elements తో పాటు ఒకరకమైన confession ఉండాలని బలంగా నమ్ముతారు. తను రాసిన కథల్లో "భగవంతం కోసం", "జర్కన్" తనకి ఇష్టమైనవట. మదనపల్లిలో ఉండగా త్రిపుర జిడ్డు కృష్ణమూర్తికి పెర్సనల్ శిష్యుడు కూడా!

జర్కన్

“ఇది పసుపూ కాదు, ఆకుపచ్చా కాదు. మిరిమిట్లు గొలపదు. అంగుళం పొడవు, నాలుగు ముఖాల అందం దీనివి. ఎన్ని వస్తువులు పారేశాను? ఇచ్చేశాను. ఇది మాత్రం ఇంకా ఇప్పటికీ నాదగ్గర ఉంది. ఉపయోగం లేదు. దీని ఖరీదు తెలీదు నాకు. విలువ?” -త్రిపుర కథ చదవండి.. Continue reading

Posted in కథ | Comments Off on జర్కన్